library
-
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ!
చిన్నప్పుడు మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కల. ఉద్యోగం ఇంకాస్త పెద్ద కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కన్న ఆ రెండు కలల్ని నెరవేరనివ్వలేదు. మల్లవ్వ పెరిగి పెద్దదైంది. ఊరికి సర్పంచ్ గా కూడా పనిచేసింది. ఆమె కలలు మాత్రం కలలు గానే ఉండిపోయాయి. వాటిని సాకారం చేసుకోటానికి అక్టోబర్ 13న ఊళ్ళో ఒక లైబ్రరీని ప్రారంభించింది మల్లవ్వ.తను చదువుకోలేకపోవచ్చు. తను ఉద్యోగం చేయలేకపోవచ్చు. చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం.. వారికి పనికొచ్చే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను తెప్పిస్తోంది. వాళ్ళలో తనను చూసుకుంటోంది. లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయల్లో.. గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న 2000 రూపాయలను దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది అనే మాట మల్లవ్వ విషయంలో నిజమైంది. రుజువైంది. -
మీకు తెలుసా! ఆ ఊరికి లైఫ్ లైబ్రరీనే!
కరెంటు.. రోడ్డు.. మంచినీళ్ల వసతి .. గ్రామాభివృద్ధికి చిహ్నాలు! గ్రంథాలయం.. ఆ ఊరి చైతన్యానికి నిదర్శనం! ఈ డిజిటల్ వరల్డ్‌లో అలాంటి చైతన్యంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది పశ్చిమగోదావరి జిల్లాలోని కుముదవల్లి.. 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కందుకూరి విరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి చిరునామాగా నిలిచి! 1890వ దశకంలోకి వెళితే.. కుముదవల్లిలోని మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన తిరుపతిరాజుకు పుస్తక పఠనం అంటే ప్రాణం. దానికి కారణం.. ఆ ఊరికే చెందిన పడ్రంగి చిన్నమారాజు.అప్పట్లో ఆయన తన దగ్గరున్న 50 పుస్తకాలను తిరుపతిరాజు తండ్రి లచ్చిరాజుకిచ్చి లైబ్రరీ ఏర్పాటుకు సాయపడ్డారు. తిరుపతిరాజులో పఠనాసక్తిని కలిగించింది ఆ గ్రంథాలయమే. అందులోని పుస్తకాల వల్లే స్వాతంత్య్ర సమరం గురించి తెలిసింది ఆయనకు. అలా తను చదివిన విషయాలన్నీ తన ఊళ్లోని వాళ్లకూ తెలియాలని.. తమ ఊరూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనాలని తపించారు తిరుపతి రాజు.ఆ చైతన్యం తన ఊరి ప్రజల్లో రావాలంటే తన తండ్రి ఏర్పాటు చేసిన ఆ చిన్న లైబ్రరీని మరిన్ని పుస్తకాలు, పత్రికలతో అభివృద్ధిపరచాలని నిర్ణయించుకున్నారు. అలా 1897 నవంబర్ 28న ఆ ఊళ్లో చిన్న గుడిసె వేసి ‘కందుకూరి వీరేశలింగం కవి సవూజ గ్రంథాలయం’ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు కొనుగోలు చేయడానికి తిరుపతిరాజు తనకున్న ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ గ్రంథాలయాన్ని స్వయంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులే ప్రారంభించారు.గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న గ్రామస్థులు, అలనాటి పుస్తకాలుతిరుపతిరాజు.. కోరుకున్నట్టే స్థానికులు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయానికి వచ్చే పత్రికల్లో చదివి స్ఫూర్తిపొందారు. ఆ గ్రామం నుంచి దాదాపు 24 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అలా ఆ గ్రంథాలయం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. 1934లో గ్రంథాలయోద్యమానికీ పట్టుగొమ్మగా నిలిచింది కుముదవల్లి. ఈ లైబ్రరీ గురించి విరేశంలింగం పంతులు స్వదస్తూరీతో ఇక్కడి మినిట్స్ బుక్‌లో రాసి, చేసిన సంతకం ఇప్పటికీ భద్రంగా ఉంది. రూథర్‌ఫర్డ్ రాసిన అభిప్రాయమూ అందులో కనపడుతుంది.పూరిగుడిసె నుంచి పక్కా భవనం.. కాలక్రమంలో ఈ లైబ్రరీ పూరిగుడిసె నుంచి పెంకుటిల్లుగా, దాన్నుంచి అధునాతన వసతుల భవంతిగా మారింది. అక్షరాస్యత వ్యాప్తి, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, సహకార పరపతి సంఘం తదితర ప్రజోపయోగ అంశాలకు వైదికయింది. విజ్ఞాన గని.. ఇందులో.. ఎందరో మహామహులు రచించిన గ్రంథాలు, ప్రవుుఖుల చేతిరాత ప్రతులు వంటి అవుూల్యమైన అక్షర సంపద పోగై ఉంది.ఆత్మకథలు, వచనాలు, నవలలు, ఆధ్యాత్మిక, ఆయుర్వేదం, భారతి, ఆంధ్రపత్రిక, శారద, విజ్ఞానం, గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, బాల వ్యాకరణం, వేదాంతసారం వంటి 17 వేల పుస్తకాలు కనిపిస్తాయిక్కడ. కోస్తా జిల్లాలోని విద్యార్థులు తెలుగుభాష, చరిత్రపై పీహెచ్డీ చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, చిలకవుర్తి లక్ష్మీనర్సింహం, దుగ్గరాల బలరామకృష్ణయ్య, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డాక్టరు సి నారాయణరెడ్డి, నండూరి కృష్ణవూచార్యులు వంటి పెద్దలు ఈ గ్రంథాలయానికి వస్తూపోతూండేవారట.ప్రత్యేకతలెన్నో..పుస్తక పఠనాన్ని ఈ గ్రామస్థుల జీవనశైలోలో భాగం చేసిన ఆ గ్రంథాలయాభివృద్ధి కోసం కుముదవల్లి ఓ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అక్కడ ఎవరి పెళ్లి జరిగినా ఎంతోకొంత డబ్బును ఆ లైబ్రరీకి విరాళంగా ఇస్తూ! ఇప్పటికీ ఆ లైబ్రరీని దేవాలయంగా భావిస్తారు కుముదవల్లి వాసులు. పాదరక్షలతో లోనికి వెళ్లరు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్‌గా పెనుమత్స సూర్యసుగుణ సేవలందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతకనుగుణంగా ఆ లైబ్రరీలోని పుస్తకాల డిజిటలైజషన్ ప్రక్రియా మొదలైంది. – విజయ్‌కుమార్ పెనుపోతుల -
హైదరాబాద్ : చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత..నిరుద్యోగులపై లాఠీచార్జ్ (ఫొటోలు)
-
చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులపై లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ లైబ్రరీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై లాఠీ చార్జ్ ప్రయోగించారు.కాగా గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, గ్రూప్-2, డీఎస్సీ డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి ర్యాలీగా బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు యత్నించగా.. పోలీసులు లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. లైబ్రరీలోనే ఆందోళన కొనసాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని.. నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
దేశంలో లైబ్రరీ విలేజ్ ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?
పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెబుతుంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్వత లోయల మధ్య పుస్తక ప్రపంచం ఉంది. 17,500కు మించిన పుస్తకాల సేకరణ ఇక్కడ కనిపిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్త్యముని బ్లాక్‌లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్‌గా పేరు పొందింది. ఇందుకు ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. 2023, జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్‌ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థుల తమ తరగతులు ముగిసిన తర్వాత లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకూ వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. -
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది?
పుస్తకాలు చదవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందంటారు. పుస్తకాలు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయని కూడా చెబుతారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పుతాయి. అలాంటి పుస్తకాలకు నిలయం లైబ్రరీ. మరి ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడుంది? పుస్తకాలు మనిషికి మంచి మిత్రుని లాంటివని పెద్దలు చెబుతుంటారు. ఒంటరితనాన్ని పోగొట్టే దివ్య ఔషధం పుస్తకమేనని కూడా అంటారు. నచ్చిన పుస్తకాలను చదివేందుకు పుస్తకప్రియులు లైబ్రరీకి వెళుతుంటారు. కొంతమంది లైబ్రరీలో గంటల తరబడి ఉండేందుకు ఇష్టపడతారు. మన దేశంలో లైబ్రరీలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఉంది. దీనిని బ్రిటిష్ లైబ్రరీ అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 20 కోట్ల పుస్తకాలు, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 1973, జూలై ఒకటిన నెలకొల్పారు. ఈ లైబ్రరీ గతంలో బ్రిటిష్ మ్యూజియంలో భాగంగా ఉండేది. ఈ లైబ్రరీకి వెళ్లి ఎవరైనా అక్కడి పుస్తకాలు చదువుకోవచ్చు. -
అమెరికా లైబ్రరీ ఇంత బాగుంటుందా! అందులోనే..!
నా వాలెట్ లో అత్యంత విలువైన వస్తువు నా లైబ్రరీ కార్డు అని తెలుసుకున్నా ! : లారా బుష్ ( అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్ గారి సతీమణి ) నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నా మనసులో పదేపదే మెదిలిన ప్రశ్న ‘ అమెరికాలో ఉన్నదేమిటి ఇండియాలో లేనిదేమిటి ? ’ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించింది, చాలామంది మనవాళ్లయితే కూర్చున్న సీట్ ముందున్న టివీల్లో వరసగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ, అదే తెల్లవాళ్ళు ఎక్కువ మంది పుస్తక పఠనం చేస్తూ కాలక్షేపం చేయడం. పాశ్చాత్యులకున్నంత ‘ బుక్ రీడింగ్ ’ అలవాటు మనకు లేదనేది వాస్తవం. ఆ దేశంలోని గ్రంథాలయాలను చూసినప్పుడు కూడా ఇలాంటి తేడానే నాకు స్పష్టంగా కనబడింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ( 1971 ) నేను ఎక్కువగా వెళ్ళింది కోఠి సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం . ఆ తర్వాత కాలంలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ , ఆఫ్జల్ గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అప్పట్లో సెక్రటేరియట్ ఎదురుగా నున్న బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ వంటి వాటికి. వాటితో పోల్చుకున్నప్పుడు అమెరికాలోని ఏ చిన్న పట్టణానికి వెళ్లినా అక్కడ విశాలమైన భవనాల్లో, వేల పుస్తకాలతో , కూర్చొని చదువుకోడానికి అన్ని సౌకర్యాలున్న పబ్లిక్ లైబ్రరీలు చూడవచ్చు. అందులోనే జిరాక్స్ , wifi, చిన్నపాటి కేఫ్‌లు ఉండడం వల్ల బయటికి పోవాల్సిన అవసరం రాదు. ప్రతి లైబ్రరీలో పిల్లల కోసం ప్రత్యేక సెక్షన్ పెట్టడం విశేషం. ఎంతోమంది గృహిణులు తమ పిల్లలను లైబ్రరీలో దింపేసి నిశ్చింతగా షాపింగ్ వంటి పనులకు వెళ్ళిరావడం గమనించాను. అక్కడ పనిచేసే లైబ్రరియన్లు ఎంతో ఓపికతో మనకు కావలసిన పుస్తకం దొరకడం లేదంటే వచ్చి వెతికి పెట్టడం చూసాను. లైబ్రరీ సభ్యత్వ కార్డు ఉంటే చాలు పుస్తకాలు తీసుకెళ్లడం, డ్రాప్ బాక్స్ సౌకర్యం వల్ల వాటిని రిటర్న్ చేయడం సులభం. అక్కడి గ్రంధాలయ ఉద్యోగులు చేసే మరో అదనపు సేవ లైబ్రరీకి విరాళంగా వచ్చే పాత పుస్తకాలు అమ్మడం. లాస్ ఎంజెలిస్ టొరెన్స్ పబ్లిక్ లైబ్రరీలో నేనలా కొన్న పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవి Chronicle of the World (1988 edition, 1300 pages) ఆదిమానవుడి నుండి ఆధునికుల వరకు ప్రపంచ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు సంవత్సరాలవారిగా ఎన్నో ఫోటోలతో సహా వివరణలున్నది. Literature ( Reading Reacting Writting ) 1991 edition , 2095 pages. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా! అని Oxford , American Heritage వంటి డిక్షనరీలు కూడా కోనేశాను. ఒక్కో పుస్తకానికి నేను చెల్లించినవి 2-4 డాలర్లు మించలేదు. అవి కూడా ఇంట్లో నున్న చిల్లర నాణాలన్నీ తీసుకెళ్లి ఇచ్చినా విసుక్కోకుండా , లెక్కపెట్టుకొని తీసుకున్న లైబ్రేరియన్ లకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ సందర్బంగా కొన్ని బార్న్స్ అండ్ నోబెల్ వంటి ప్రైవేట్ పుస్తక విక్రయశాలలకు కూడా వెళ్లి చూసాను. కొనుగోలుదారులకు వాళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలు కూడా తక్కువేం కాదు, కొత్తకొత్త పుస్తకాలు అక్కడా కూర్చొని చదువుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టకపోవడం విశేషం. వాళ్ళ దగ్గర నేను కొన్నవి తక్కువ. ఎంపిక పేర చదివినవే ఎక్కువ. అయితే నాకు వచ్చిన చిక్కల్లా అమెరికాలో నేను అలా సేకరించిన పుస్తకాలను ఇండియాకు తేవడంలోనే. మనవాళ్లలో ఎక్కువ మంది లగేజీ బట్టలు, వస్తువులతో నింపేస్తారు కానీ.. పుస్తకాలు తీసుకురావడానికి ఆసక్తి చూపించరు. ఏం చేద్దాం మరీ.? వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్ అర్థమవ్వాలంటే మాత్రం..!) -
పుస్తక హననం
నేను గనక కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, అలెగ్జాండ్రియా లైబ్రరీని దర్శిస్తానంటాడు ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ . ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గ్రంథాలయం అని పేరు. వేలాది గ్రీకు, హీబ్రూ, మెసొపొటేమియన్ సాహిత్య స్క్రోల్స్, ప్రాచీన ఈజిప్టుకు చెందిన కళోపకరణాలు ఇక్కడ ఉండేవి. ఎరాటోస్తనీస్, ఆర్కిమెడీస్, యూక్లిడ్ వంటి గ్రీకు శాస్త్రజ్ఞులు దీన్ని సందర్శించారు. రెండు వేల ఏళ్ల కిందట ఇది వైభవోపేతంగా వర్ధిల్లిందనీ, దీన్ని క్రీ.పూ. 48–47 ప్రాంతంలో సీజర్ తగలబెట్టేశాడనీ చెబుతుంటారు. అయితే, తగలబడిందని నిర్ధారించడానికి చారిత్రక ఆధారాలు లేవనీ, మానవ జాతి పోగేసుకున్న సమస్త వివేకసారం మట్టి పాలైందని అనుకోవడంలో ఉన్న ఉద్వేగంలోంచి ఈ కథ పుట్టివుంటుందనీ చెబుతాడు బ్రిటిష్ లైబ్రేరియన్, రచయిత రిచర్డ్ ఓవెండెన్ . ఇప్పటి ‘పుస్తకం’ ఉనికిలో లేని ఆ కాలంలో నునుపు చేసిన చెట్ల బెరడుల రోల్స్ కాలక్రమంలో నశించడమే ఈ కథగా మారివుంటుందని మరో కథ. ఏమైనా, సమస్త విజ్ఞానం ఒక చోట రాశిగా పోగయ్యే గ్రంథాలయం అనే భావనను ఊహించడమే మానవ నాగరికత సాధించిన విజయం. ఆ గ్రంథాలయాలనే నేలమట్టం చేయడం ద్వారా శత్రువు మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయడం... అదే నాగరిక మానవుడి అనాగరికతకు తార్కాణం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచీ జరుగుతున్న ప్రాణనష్టం గురించి మీడియా మాట్లాడుతూనే ఉంది. కానీ గాజాలో కనీసం పదమూడు గ్రంథాలయాలకు ఇజ్రాయెల్ వల్ల నష్టం వాటిల్లింది. ఇందులో కొన్ని పూర్తిగా నాశనం కాగా, కొన్ని దారుణంగా దెబ్బతినడమో, అందులో ఉన్నవి దోచుకెళ్లడమో జరిగింది. నూటా యాభై ఏళ్ల గాజా చరిత్ర రికార్డులున్న సెంట్రల్ ఆర్కైవ్స్ ఆఫ్ గాజా, పాలస్తీనాలోని అరుదైన పుస్తకాల కలెక్షన్ కలిగివున్న గ్రేట్ ఒమారి మాస్క్, వేలాది పుస్తకాలకు నెలవైన డయానా తమారీ సబ్బాగ్ లైబ్రరీతో పాటు, గాజా యూనివర్సిటీ లైబ్రరీ, అల్–ఇస్రా యూనివర్సిటీ లైబ్రరీ కూడా దెబ్బతిన్నవాటిల్లో ఉన్నాయి. ‘‘ఆర్కైవ్ మీద ఆధిపత్యం లేకపోతే రాజకీయ అధికారం లేదు’’ అంటాడు ఫ్రెంచ్ విమర్శకుడు జాక్వెస్ డెరిడా. అందుకే గ్రంథాలయాలను దొంగదెబ్బ కొట్టడం అనేది చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. ప్రపంచానికే జ్ఞానకాంతిగా వెలుగొందింది భారత్‌లోని నలందా విశ్వవిద్యాలయం. 5వ శతాబ్దంలో గుప్తులకాలంలో ఇది నిర్మితమైంది. రత్నదధి, రత్నసాగర, రత్నరంజక పేరుతో మూడు తొమ్మిదంతస్థుల భవనాలుండేవి. ఖగోళం, జ్యోతిషం, గణితం, రాజకీయం, ఆయుర్వేదం, వైద్యం, కళలు, సాహిత్యం, వ్యాకరణం, తర్కం సంబంధిత అంశాలన్నింటికీ నెలవు ఇది. జైన తీర్థంకరుడు మహావీరుడు 14 వర్షాకాలాలు ఇక్కడ గడిపాడట! క్రీ.శ.1193లో భక్తియార్ ఖిల్జీ దీన్ని తగలబెట్టించాడు. దేశంలో బౌద్ధ ప్రాభవం క్షీణించడానికి ఇదీ ఓ కారణమని చెబుతారు. ‘‘గ్రంథాలయాల ద్వారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంది. కొన్నిసార్లు గ్రంథాలయాలను సాంస్కృతిక హనన పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారు. ఎన్నో ప్రజా, ప్రైవేటు లైబ్రరీలు మూర్ఖ దురాక్రమణదారుల వల్ల నాశనం అయ్యాయి’’ అంటారు పాత్రికేయుడు జానీ డైమండ్. బీజింగ్‌లో ఎనిమిదో శతాబ్దంలో నెలకొల్పిన హాన్లిన్ లైబ్రరీ ఒక విజ్ఞాన భాండాగారం. ఇందులో ఒక ముఖ్యమైన సోర్సు మింగ్ వంశపు చక్రవర్తి ఝూ డీ 1403లో ‘జాంగ్లే దాదియన్ ’ పేరుతో సిద్ధం చేయించిన ఎన్ సైక్లోపీడియా. వ్యవసాయం, నాటకం, భూగర్భశాస్త్రం, వైద్యం, కళ, చరిత్ర, సాహిత్యం లాంటి వాటితో కూడిన 22,000 విభాగాలు అందులో ఉన్నాయి. 1900వ సంవత్సరంలో మంటల్లో లైబ్రరీ తగలబడినప్పుడు ఆ ఎన్ సైక్లోపీడియా కూడా మసైపోయింది. వలసవాదులు, తిరుగుబాటుదారుల రూపంలో ఉన్న బ్రిటిష్ వాళ్లు, చైనీయులు దీనికి కారణం మీరంటే మీరేనని పరస్పరం నిందించుకున్నారు. అమెరికా జాతీయ గ్రంథాలయాన్ని 1814లో బ్రిటిష్‌వాళ్లు నాశనం చేశారు. అప్పటికి దాన్ని నెలకొల్పి నాలుగేళ్లే అయింది. సెనేటర్ల ఉపయోగార్థం 3000 వాల్యూములు అందులో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దెబ్బ తమ జాతి ఆత్మను గాయపరిచిందంటాడు అమెరికా చరిత్రకారుడు రాబర్ట్ డార్న్‌టన్ . అదే బ్రిటనీయులు 2003లో ఇరాక్ జాతీయ గ్రంథాలయాన్ని నాశనం చేశారు. పనామ్ పెన్ ్హ నగరంలోని జాతీయ గ్రంథాలయాన్ని 1967లో సర్వనాశనం చేయడం ద్వారా కంబోడియా నాగరికత మొత్తాన్నీ ‘ఖ్మేర్ రూజ్’ తుడిచిపెట్టింది. దేశ చరిత్రను మళ్లీ ‘ఇయర్ జీరో’ నుంచి మొదలుపెట్టించాలన్న మూర్ఖత్వంలో భాగంగా కమ్యూనిస్టు నాయకుడు పోల్ పాట్ సైన్యం నరమేధానికీ, సాంస్కృతిక హననానికీ పాల్పడింది. సుమారు లక్ష పుస్తకాలున్న, అప్పటికి యాభై ఏళ్ల పాతదైన శ్రీలంకలోని జాఫ్నా పబ్లిక్ లైబ్రరీని 1981లో సింహళ మూక కూడా అలాగే తగలబెట్టింది. ఒక గ్రంథాలయం ధ్వంసమైతే మనం ఏం కోల్పోయామో కూడా మనకు తెలియకపోవడం అతి పెద్ద విషాదం. ఒక గ్రంథాలయాన్ని నిర్మూలించడమంటే ఒక దేశ, ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం; గతపు ఘనతను పూర్తిగా నేలమట్టం గావించడం; అన్నీ కోల్పోయినా మళ్లీ మొదలెట్టగలిగే శక్తియుక్తులను నిర్వీర్యం చేయడం; చెప్పాలంటే ఇంకేమీ లేకుండా చేయడం, సున్నా దగ్గరికి తెచ్చి నిలబెట్టడం! అయినా గోడలు కూలితేనే, పుస్తకాలు కాలితేనే గ్రంథాలయం నాశనం కావడమా? వాటిపట్ల నిర్లక్ష్యం వహించడం మాత్రం నెమ్మదిగా నాశనం చేయడం కాదా? -
విజ్ఞాన సంపదను పంచడమే ‘కూరెళ్ల’ లక్ష్యం
రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు. నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు. విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్‌చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు. మాతృభాషను మరవొద్దు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. గవర్నర్చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. -
ఖమ్మం నగరంలో కుప్పకూలిన గ్రంథాలయం
-
మేడ్చల్, బాచుపల్లి ZPHSలో లైబ్రరీ ప్రారంభం
-
డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్‌ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్‌బండ్‌పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురంలో ‘బ్రౌన్’ శాఖ ఏర్పాటు చేయాలి
కడప కల్చరల్: డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో నిర్మించిన సీపీ బ్రౌన్ గ్రంథాలయం శాఖను అనంతపురంలోనూ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు సూచించారు. జానమద్ది అనంతపురం జిల్లాకు చెందినవారని, అందువల్ల అక్కడ కూడా బ్రౌన్ గ్రంథాలయ శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) జయంతిని పురస్కరించుకుని జానమద్ది 11వ వార్షిక సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవం ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రచయిత, ఆకాశవాణి విశ్రాంత అధికారి నాగసూరి వేణుగోపాల్‌కు జానమద్ది పురస్కారాన్ని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ప్రదానం చేశారు. స్వయంకృషి, సాహిత్యాభిలాష, సామాజిక దృష్టి జానమద్ది ప్రత్యేకతలని, భావితరాలకు వాటిని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జానమద్ది సాహితీసేవ భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ బ్రౌన్ గ్రంథాలయాన్ని సాహిత్యంతోపాటు కళానిలయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కవి యలమర్తి మధుసూదన ‘తెలుగు భాషా ప్రాశస్త్యం–పద్య వైభవం’పై స్మారకోపన్యాసం చేశారు. పురస్కార గ్రహీత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ తాను కడపలో పనిచేసిన సమయంలో బ్రౌన్ గ్రంథాలయం, జానమద్దితో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులను జానమద్ది సాహితీపీఠం తరఫున సన్మానించారు. విజయవాడ దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జానమద్ది సాహితీపీఠం ట్రస్టీ విజయభాస్కర్, కార్యదర్శి యామిని, డాక్టర్ వైపీ వెంకటసుబ్బయ్య, జానమద్ది కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. -
బిడ్డ జ్ఞాపకార్థం.. గుర్తుగా లైబ్రరీ..
నిర్మల్: అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ అర్ధంతరంగా దూరమైంది. తనలాగే సమాజానికి వైద్యసేవలందిస్తుందని డాక్టర్‌ను చేస్తే.. తానే ముందుగా వెళ్లిపోయింది. ఆ బిడ్డను మర్చిపోని తండ్రి ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన బిడ్డలా పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని, సామాజిక సేవలో భాగమయ్యారు. తన కుమార్తె ‘కావేరి’ పేరిట జిల్లాకేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు అప్పాల చక్రధారి అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేశారు. తన బిడ్డను తలచుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు సేవలందిస్తున్నారు. 2017 నుంచే గ్రంథాలయం.. జిల్లాకేంద్రంలోని డాక్టర్స్లైన్, తిరుమల థియేటర్ ఎదురుగా గల తన నివాసంలోనే 2017లో కావేరి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దినపత్రికలు, ఇతర పుస్తకాలతో పాటు పోటీపరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ వచ్చారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉంచారు. దాదాపు ఆరేళ్ల కాలంలో ఇక్కడ ప్రిపేరవుతున్న వారిలో పదులసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చక్రధారి చెబుతున్నారు. మరింత అధునాతనంగా.. తన కూతురు ఎప్పుడూ నిర్మల్‌లో అన్నిరకాల సౌకర్యాలతో ఆస్పత్రి, లైబ్రరీ ఇలా అన్నీ ఉండాలని కోరుకునేదని డాక్టర్ చక్రధారి పేర్కొన్నారు. ఆమె కోరిక మేరకే ఆస్పత్రి, కావేరి కుటీరాన్ని నిర్మించారు. ఈమేరకు అధునాతన లైబ్రరీని సిద్ధం చేశారు. ఏడాది క్రితం తన ఇంటిని పూర్తిగా కూల్చేశారు. అందులో ఉన్న లైబ్రరీని డాక్టర్స్లైన్లోనే వేరే భవనంలో కొనసాగించారు. అదేస్థానంలో అధునాతనంగా, పూర్తిసౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థులు, అభ్యర్థులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో తను ఉండాల్సిన ఇల్లు కంటే ముందే లైబ్రరీ భవనాన్ని పూర్తిచేయించారు. నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇవీ.. సౌకర్యాలు రాష్ట్రంలోనే పూర్తి ఉచితంగా అధునాతన సౌకర్యాలతో ఉన్న ఏకై క లైబ్రరీగా కావేరి గ్రంథాలయాన్ని చె బుతుంటారు. ఇందులో విశాలమైన గదుల్లో రీడింగ్ రూములున్నాయి. అన్ని దినపత్రికలు, పోటీపరీక్షల పూర్తి మెటీరియల్ ఉంది. పాఠకులు, అభ్యర్థులు కో రితే వెంటనే సంబంధిత మెటీరియల్ తెప్పించి ఇ స్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములు న్నాయి. మాక్‌టెస్టులు, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి హైస్పీడ్ ఇంటర్నెట్తో అధునాతన కంప్యూటర్ల గది ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాసుల కోసం ప్రత్యేకంగా ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. పాఠకులు, అభ్యర్థులు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్‌హాల్ నిర్మించారు. చాలా సంతృప్తినిస్తోంది నా బిడ్డ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థులు లబ్ధి పొందడం, ఉద్యోగాలు సాధించడం చాలా సంతృప్తినిస్తోంది. ప్రిపరేషన్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని అధునాతన సౌకర్యాలు కల్పించాం. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కొత్త మెటీరియల్ తెప్పిస్తున్నాం. – డాక్టర్ చక్రధారి, కావేరి లైబ్రరీ చైర్మన్ -
ఆ పుస్తకం 100 ఏళ్లకు.. లైబ్రరీకి తిరిగి చేరుకుంది!
లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు "ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ" అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది. కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది. (చదవండి: అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!) -
81 ఏళ్లకు లైబ్రరీకి చేరిన పుస్తకం.. 17వ పేజీలో ఏమున్నదంటే..
ఇటీవల ఒక లైబ్రరీకి ఎవరో ఒక పుస్తకాన్ని తీసుకురాగా అక్కడి స్టాఫ్ దానిని చూసి అవాక్కయ్యారు. ఆ పుస్తకం 81 ఏళ్ల క్రితం ఇష్యూ చేసినది కావడం విశేషం. సిబ్బంది ఆ పుస్తకాన్ని తెరవగా, అక్కడున్న విచిత్రమైన మెసేజ్ చూసి తెగ ఆశ్చర్యపోయారు. పుస్తకప్రియులు లైబ్రరీలకు వెళుతుంటారు. కొందరు అక్కడే కూర్చుని చదువుకుంటారు. మరికొందరు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకుంటారు. అయితే ఆ పుస్తకాలను రిటర్న్ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. అది దాటితై ఫైన్ విధిస్తారు. ఇటువంటి సందర్భాల్లో కొందరు తాము తీసుకువెళ్లిన పుస్తకాలను తిరిగి లైబ్రరీలో అప్పగించరు. ఇటీవల ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942,మార్చి 30 నాడు ఇష్యూ చేసినది కావడం విశేషం. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఉదంతం అమెరికాలోని వాషింగ్టన్లో గల ఎబర్డీన్‌లో చోటుచేసుకుంది. ఇది చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి! పాత సామానులలో దొరికింది లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్ నార్డాఫ్ అండ్ జేమ్స్ నార్మన్ హాల్ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ’’ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి తిరిగి వచ్చింది. ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని పేర్కొన్నారు. పేజీ నంబరు-17లో.. కిరో7 న్యూస్ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్ రాశాడు..‘‘ ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను’’ అని రాసివుంది. దీని అర్థం ఏమిటంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. లేటు ఫీజు విధిస్తే.. లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్లు(సుమారు రూ.40 వేలు) అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. బహుమతిగా భావించి.. ఆ పేస్బుక్ పోస్టులో లైబ్రరీ ప్రతినిధి.. ఈ ఉదంతం నుంచి మనం ఒక విషయం తెలసుకోవాలన్నారు.. ఒకవేళ మీ దగ్గర ఈ విధంగా లైబ్రరీ నుంచి తెచ్చిన ఏ పుస్తకమైనా దుమ్ము, ధూళి బారిన పడి ఉంటే, దానిని వెంటనే లైబ్రరీకి తిరిగి ఇవ్వండి. మేము వాటిని బహుమతులుగా భావించి, ఆ పుస్తకం తీసుకుని వెళ్లినవారికి ఎటువంటి ఫైన్ వేయబోమని తెలిపారు. చదవండి: నిలువెల్లా తగలబడటమంటే ఆమెకు సరదా! -
AP: జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’
మంగళగిరి(ఏపీ): అంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జూలై 5న ‘గ్రంథాలయం కోసం పుస్తకంతో నడక’ అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతా నిర్వహించాలని నిర్ణయించింది. అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య , సేవా, విద్యా , గ్రంథాలయ సంస్థల తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు కార్యాలయంలో ఆయనను కలసి కార్యక్రమానికి ఆహ్వానించారు. గ్రంధాలయాల డిజిటలైజషన్, ఆధునీకరణ, గ్రంధాల పఠనం పై మరింత అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం, అధ్యయనం చేయనున్నామని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -
120 మందికి.. ఒకే టాయిలెట్
నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది. సరిపోని గదులు వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం. – రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు నివేదించాం లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం -
ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 2, 3 తేదీల్లో కేరళలో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. కేరళలోని కన్నూరులో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు రావాలని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పంపారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3న సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. సమావేశాలను కేరళ సీఎం విజయన్ ప్రారంభించనుండగా, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు. -
గ్రంథాలయాల తీరు తెన్నులపై తానా ప్రపంచ సాహిత్య వేదిక చర్చ విజయవంతం
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 30న అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్లో నిర్వహించిన “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం - నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే 41వ సాహిత్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమణ్ళ శ్రనివాస్ ఈ సభను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా.అయాచితం శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలలో గ్రంథాలయరంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. విశిష్ట అతిథులుగా - అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం - గుంటూరు, వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణ; గాడిచర్ల ఫౌండేషన్ - కర్నూలు, అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర; శ్రీ రాజరాజ నరేంద్రాంద్ర భాషానిలయం - వరంగల్, కార్యదర్శి కుందావజ్ఞుల కృష్ణమూర్తి; సర్వోత్తమ గ్రంథాలయం - విజయవాడ, కార్యదర్శి డా.రావి శారద; శారదా గ్రంథాలయం - అనకాపల్లి, అధ్యక్షులు కోరుకొండ బుచ్చిరాజు; శ్రకృష్ణ దేవరాయ తెలుగు భాషానిలయం - హైదరాబాద్, గౌరవ కార్యదర్శి తెరునగరి ఉడయతర్లు; సీ.పీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం - కడప నిర్వాహకులు డా.మూల మల్లిఖార్జున రెడ్డి; విశాఖపట్నం ఫౌర గ్రంథాలయం - విశాఖపట్నం, గ్రంథాలయాధికారి ఎం. దుర్గేశ్వర రాణి; పౌరస్వత నికేతనం గ్రంథాలయం-వేటపాలెం నిర్వాహకులు కే.శ్రీనివాసరావు; గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం - రాజమహేంద్రవరం అభివృద్ధి కారకులు డా. అరిపిరాల నారాయణ తమ తమ గ్రంథాలయాల స్థాపన, వాటి చరిత్ర, వర్తమాన స్తితి, ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ సహకారలేమి, ఎదుర్కుంటున్న సవాళ్ళు, భవిష్య ప్రణాళిక మొదలైన అంశాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రహెద్ తోటకూర మాట్లాడుతూ - “తెలుగునాట నాటి గ్రంథాలయోద్యమం - నేటి గ్రంథాలయాల పరి(దు)స్థితి” అనే అంశంపై చర్చ ఈనాడు చాలా అవసరం అని, నేటి గ్రంథాలయాలే రేపటి తరాలకు విజ్ఞ్జాన భాండాగారాలని, వాటిని నిర్లక్ష్యం చెయ్యకుడదన్నారు. వాటిని పరిరక్షించి, పెంపొందించే క్రమంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపి అవసరమైన నిధులు సమకూర్చాలని తెలిపారు. దీనికి వివిధ సాహితీ సంస్థల, ప్రజల సహకారం, మరీ ముఖ్యంగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి ప్రవాస భారతీయల వితరణ లోడైతే అద్భుతాలు సృస్టించవచ్చని అన్నారు”. -
ఎట్టకేలకు తిరిగిచ్చారు.. 84 ఏళ్లకు గ్రంథాలయానికి చేరిన పుస్తకం
లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు. ఇంగ్లండ్‌లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్‌ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు. అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్‌లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది. -
Library On Trees: పుస్తకాలు కాసే చెట్లు!
చెట్లకు డబ్బులు కాస్తాయా! అంటారు. డబ్బులు కాదుగానీ పుస్తకాలు కాస్తాయి... అని సరదాగా అనవచ్చు. ఎలా అంటే... అస్సాంలోని జోర్హాట్ జిల్లాకు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడ్డారు. రకరకాల సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకసారి వీరి మధ్య గ్రంథాలయాల గురించి చర్చ జరిగింది. తమ చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ అయిపోగానే రోజూ ఊరి గ్రంథాలయానికి వెళ్లేవాళ్లు. లోపల పెద్దవాళ్లు న్యూస్‌పేపర్లు తిరగేస్తూనో, పుస్తకాలు చదువుకుంటూనో గంభీరంగా కనిపించేవారు. తాము మాత్రం ఆరుబయట పచ్చటిగడ్డిలో కూర్చొని బొమ్మలపుస్తకాలు చదువుకునేవారు. సరదాగా ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలామంది పిల్లలు సెల్ఫోన్ల నుంచి తల బయట పెట్టడం లేదు. పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు వారి దగ్గర కనిపించడం లేదు. చదివే అలవాటు అనేది బాగా దూరం అయింది. ‘మన వంతుగా ఏం చేయలేమా’ అనుకుంది మహిళాబృందం. అప్పుడే ‘ట్రీ లైబ్రరీ’ అనే ఐడియా పుట్టింది. ప్రయోగాత్మకంగా మారియాని గర్ల్స్హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు బాక్స్‌లు అమర్చి వాటిలో దినపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు పెట్టారు. స్పందన చూశారు. అద్భుతం. చెట్ల నీడన పిల్లలు పుస్తకాలు చదువుకుంటున్న దృశ్యం కన్నుల పర్వం! ‘పిల్లలకు, లైబ్రరీలకు మధ్య దూరం ఉంది. ఆ దూరాన్ని దూరం చేయడమే మా ప్రయత్నం. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా పఠనం అనేది మనకు ఎప్పుడూ అవసరమే. అది మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైనా దిపిల పొద్దార్. విశేషం ఏమిటంటే... జోర్హాట్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు ఈ ట్రీ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకొని, తమ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ‘ఈ ట్రీ లైబ్రరీ గురించి విని మా ఊరి నుంచి పనిగట్టుకొని వచ్చాను. నాకు బాగా నచ్చింది. పిల్లలను పుస్తకాల దగ్గరికి తీసుకురావడానికి అనువైన వాతావరణం కనిపించింది. మా ఊళ్లో కూడా ఇలాంటి లైబ్రరీ మొదలు పెట్టాలనుకుంటున్నాను’ అంటుంది భోగ్పూర్ సత్రా అనే గ్రామానికి చెందిన హిమంత అనే ఉపాధ్యాయిని. ఇక మజులి గ్రామానికి చెందిన నీరబ్ ఈ ‘ట్రీ లైబ్రరీ’ గురించి సామాజిక వేదికలలో విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ‘ఇలాంటివి మా ఊళ్లో కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాము’ అంటూ మంచి స్పందన మొదలైంది. మూడు నెలలు వెనక్కి వెళితే... పశ్చిమబెంగాల్లోని అలీపూర్దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్‌లోని చెట్లకు అరలు తయారు చేసి పుస్తకాలు పెట్టారు. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్‌తో మొదలైన ఈ ట్రీ లైబ్రరీ సూపర్ సక్సెస్ అయింది. ఇది పర్యాటక కేంద్రంగా మారడం మరో విశేషం! -
రాక రాక ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అయినా పుస్తకం రాదు, కుర్చీ ఉండదు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: రాకరాక ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫలితం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు. పోటీలో నెగ్గేందుకు పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వారికి కావాల్సిన పుస్తకాలు లభించక ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో లేక... మార్కెట్లో కొనుగోలు చేసే శక్తి లేక ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో చదువు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. సిద్ధమయ్యేదెలా.. వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనుండా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు ప్రతిరోజు 700 మందికి పైగా యువతీ, యువకులు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండడం, 2016–17కు ముందు సిలబస్ పుస్తకాలే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజా పుస్తకాలు లేకపోతే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాలని భావించగా గ్రంథాలయంలో పుస్తకాలు లేక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జూన్ నుంచి వరుసగా పరీక్షలు జరగనుండడంతో కావాల్సిన పుస్తకాలను వెంటనే తెప్పించే ఏర్పాటుచేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అసౌకర్యాలతో సహవాసం గ్రంథాలయంలో సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేక, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తుండడంతో ఉక్కపోత నడుమే అభ్యర్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇక బెంచీలు సరిపోకపోవడంతో కొందరు కింద కూర్చుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి కుర్చీలు తెచ్చుకుంటున్నారు. అలాగే, పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండడంతో క్యూ కట్టాల్సి వస్తోంది. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే తొలగించారు. అలాగే, పలు సందర్భాల్లో తాగునీటికి కూడా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లా గ్రంథాలయం ఎదుట ఆందోళన ఖమ్మం గాంధీచౌక్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు తెప్పించాలనే డిమాండ్‌తో మంగళవారం నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనకు దిగారు. గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడుతూ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోగా ఫ్యాన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దీనికి మరుగుదొడ్ల సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. కనీస వసతులు కూడా లేవు.. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. చుట్టాల ఇంట్లో ఉంటూ నిత్యం గ్రంథాలయానికి వస్తుండగా, లేటెస్ట్ పుస్తకాలు అందుబాటులో లేవు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్ కూడా లభించటం లేదు. దీనికి తోడు మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. – అశోక్, కల్లూరు అవసరమైన పుస్తకాలు తెప్పించాలి పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తెప్పించాలి. బయట పుస్తకాలు కొనే స్థోమత లేని వారే గ్రంథాలయానికి వస్తారు. కానీ ఇక్కడ అవసరమైన పుస్తకాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నాం. దీనికి తోడు ఇతరత్రా సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి. – సుజాత, కాకరవాయి, తిరుమలాయపాలెం మండలం చదవండి: పోటీ పరీక్షల కోసం.. నిరుద్యోగ యువతకు యాప్ -
పుట్టింటికి నడిచొచ్చిన పుస్తకం
మనకు కల ఒకటుంటుంది మన పని మరొకటుంటుంది బాధ్యతల బరువుంటుంది. తప్పక చేయాల్సిన విధి ఇంకొకటుంటుంది. ఇన్నింటి మధ్య కలను బతికించుకుంటూ వెళ్లాలనే తపన ఉంటే అది మమతా సింగ్ అవుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ వాసి మమత. అగ్రసర్ అనే గ్రామంలో పుట్టింది. చదువు, పెళ్లి రీత్యా ఏళ్ల క్రితమే ఊరు వదిలి నగరానికి చేరుకుంది. చదువు పూర్తయ్యింది. పెళ్లి అయ్యింది. ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలయ్యింది. పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలి. ఏం చేయాలి.. ?! ఆలోచనలు తెగలేదు. పుస్తకాలంటే తనకు ఇష్టం. పుస్తకం ఇచ్చిన జ్ఞానం అన్నింటినుంచి మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది అనిపించింది. ఆ పుస్తకాన్ని పుట్టిన ఊళ్లోని ప్రజలకు చేరువ చేయాలనుకుంది. ‘పుస్తకాల పురుగు’ అని స్నేహితులు అంటుంటే విని నవ్వి ఊరుకునేది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని తను పుట్టి పెరిగిన ఊరికి టీచర్‌గా వెళ్లడమే కాదు, అక్కడివాళ్లకు లైబ్రరీని కానుకగా ఇచ్చింది. వీటి గురించి మమతను కదిలిస్తే పుస్తకం తనకిచ్చిన గొప్ప జీవితం గురించి చెబుతారామె... ‘‘నా చిన్నతనంలో అమ్మ పుస్తకాలను పరిచయం చేసింది. పుస్తకాల మీద నాకున్న మక్కువ వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు సేకరించాను. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూసి, లైబ్రరీని ఏర్పాటు చేయచ్చు కదా అని నా ఫ్రెండ్ అన్నప్పుడు ఆ సలహా నచ్చింది. అది ఊళ్లో అయితే బాగుంటుందనిపించింది. నా దగ్గరున్న 1200 పుస్తకాలతో ఊళ్లో చిన్న లైబ్రరీని ప్రారంభించాను. సిగరెట్, మద్యం కోసం డబ్బు ఖర్చుపెట్టే జనం రెండు రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడతారని నాకు తెలుసు. అందుకే ఉచితంగా పుస్తకాలను అందుబాటులో ఉంచాలనుకున్నాను. ఇప్పుడు 4,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఏర్పాటు చేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు స్నేహితులు ఇచ్చారు. కంప్యూటర్ వంటి పరికరాలు మా కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే, ముందు ఈ ప్రక్రియ అంత సులభం కాలేదు. అడ్డుగా నిలిచిన ఇనుపగోడ కుల, లింగ వివక్షత అనేవి ప్రజల మనసుల్లో బలంగా ఉండిపోయాయి. మరోవైపు అట్టడుగు వర్గాల వాళ్లు గ్రంథాలయానికి రావడానికి వెనుకాడుతున్నారు. లైబ్రరీకి ‘సావిత్రీబాయి పూలే’ పేరు పెట్టడంతో జనం రావడమే లేదు. నేను ఆ ఊరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలుచుకో లేదు, ఇందులో నాకేవిధమైన వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఊళ్లో జనాల్ని పుస్తకాలతో అనుసంధానించాలనుకున్నాను. కానీ, ఊళ్లో కొందరు పెద్దలకు ఇది నచ్చలేదు. నా కుటుంబంలో నా సోదరుడు, అతని భార్యనే నాకు ఇనుపగోడగా అడ్డు నిలిచారు. దీనిని పడగొట్టడానికి నేను పెద్ద ప్రయత్నమే చేశాను. ఈ పనిలో నా పిల్లల నుండి కూడా నాకు మద్దతు లభించింది. ఇప్పుడు దగ్గరలోని మరో రెండు గ్రామాల్లోనూ గ్రంథాలయ శాఖలు ఏర్పడ్డాయి. పెరిగిన మహిళల సంఖ్య ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగనియామకానికి నేను పుట్టిపెరిగిన ఊరిని ఎంచుకున్నాను. దీనికి అమ్మనాన్నలు, అత్తమామలు ఇద్దరి మద్దతు లభించింది. లైబ్రరీ ఏర్పాటుకు కూడా! కానీ, గ్రామస్థులకు సమస్య అయ్యింది. కూర్చొని పుస్తకాలు చదవగలిగే లైబ్రరీ లాంటి ప్రదేశం ఒకటుంటుందని వారికి తెలియదు. మొదట్లో పుస్తకాల దుకాణం అనుకున్నారు. పోటీ పరీక్షల పుస్తకాల నుంచి నోట్‌బుక్స్ వరకు కావాలని వారు అడుగుతున్నప్పుడు ‘ఇది స్టేషనరీ దుకాణం కాదు, లైబ్రరీ అని, ఇక్కడ చదవడానికి పుస్తకాలు అందుబాటులో అదీ ఉచితంగా ఉంటాయని చెప్పాను. మెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది. పాత టైరుతో అటూ ఇటూ పరిగెత్తే పిల్లలు, గొడవపడే పిల్లలు అప్పుడప్పుడు రావడం మొదలయ్యింది. ఇప్పుడు పిల్లలే కాదు మహిళలు కూడా లైబ్రరీలో చదువుకోవడానికి వస్తుంటారు. ఈ లైబ్రరీలో అన్ని వయసుల వారికీ పుస్తకాలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో చిన్నపిల్లలే కాదు టీనేజర్లు కూడా లైబ్రరీలో కూర్చొని పుస్తకాల గురించి చర్చించుకునేవారు. ఈ పుస్తకాలు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేర్పడమే కాకుండా వారి హృదయాలను సున్నితంగా మార్చుతున్నాయి. నేర్పిన ఒంటరి ప్రయాణం పద్దెనిమిదేళ్ల వరకు నేను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఒంటరిగా రోడ్డు దాటింది లేదు. ‘తక్కువ మాట్లాడు, సున్నితంగా మాట్లాడు, అందరి మాటల్ని విను, దుపట్టాను పక్కకు జరగనీకు’ ఇలా చాలా మంది పెద్దవాళ్లు చెప్పిన సలహా ప్రకారం మంచి అమ్మాయి చేసేదంతా నేను చేశాను. కానీ, బంధువులందరిలోనూ ఏదో ఒక లోపం కనిపించడం నేను చూశాను. సమాజం ఇచ్చిన మంచి అమ్మాయి స్లాట్‌లో నన్ను నేను సరిపెట్టుకోవడంలో విసిగిపోయాను. జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని పుస్తకాల ద్వారా తెలుసుకున్నా, అన్నదమ్ముల కారణంగా వ్యక్తిత్వం బలపడింది. నా భర్త ప్రోత్సాహం వల్ల నా భయాలన్నింటినీ జయించి తొలిసారి ఒంటరి యాత్రకు వెళ్లాను. అండమాన్ నికోబార్ వరకు ఒంటరిగా నడిచాను. పుస్తకాలు సంతోషపరుస్తాయి. ప్రయాణం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఈ పర్యటన నాకు నేర్పింది. జీవితంలో చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, వాటితో దృఢంగా నిలబడే ఓపిక మనకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇతరులు చెప్పేదానికంటే మీ హృదయ స్వరం వినడం, మీరు నిర్ణయించుకున్న మార్గంలో నడవడం చాలా ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. నేను అదే చేశాను. నా పుస్తకాల ప్రపంచంలో నా గ్రామాన్ని మొత్తం చేర్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కల సంపూర్ణమైందన్న భావన నాకు కలిగింది’’ అంటారు మమతాసింగ్. -
కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం
చిక్కడపల్లి: నగరంలో శిథిలస్థితికి చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ పేర్కొన్నారు. ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న, పద్మజ మాట్లాడుతూ.. నగరంలో గ్రంథాలయాలను పాఠకుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్‌తో పాటు నగరంలోని 82 గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, ఇకపై ప్రతి నెలా ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది గ్రంథాలయాల అభివృద్ధి, జీత భత్యాలు తదితర వాటికి దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సమావేశంలో సభ్యులు వాసుదేవ్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మోదీ నోట.. కూరెళ్ల మాట
రామన్నపేట/సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ‘మన్‌కీబాత్’ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరును ప్రస్తావించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య స్వగ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తమ ఇంట్లో 2013లో 70 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. అనంతరం ఆచార్య కూరెళ్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమార్తెలు, దాతల సహకారంతో పాత ఇంటిస్థానంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. సాహితీవేత్తలు, ఉన్నత విద్యనభ్యసించే వారితో పాటు పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే కూరెళ్ల విఠలాచార్య సేవాతత్పరత గురించి ప్రధానమంత్రి మాటల్లోనే .. నా ప్రియమైన దేశ ప్రజలారా.. మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతులతో సుసంపన్నమైనది. ఆ ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనడానికి కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్యగారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కూరెళ్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. తర్వాత విఠలాచార్య తెలుగు అధ్యాపకుడు అయ్యారు. అనేక సృజనాత్మక రచనలు చేశారు. ఆరేడు సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన స్వంత పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు సహకరించటం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో గల ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన కృషితో స్ఫూర్తి పొంది ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో ఉన్నారు. ప్రధాని ప్రశంస మధురానుభూతి పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టు చేయాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇంటిని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంగా మార్చాను. కవులు, రచయితలు వివిధ సంస్థల సహకారంతో 2 లక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో నా ప్రయత్నాన్ని ప్రశంసించడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలుస్తుంది. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య -
103 ఏళ్ల పురాతన చరిత్ర
వేటపాలెం(ప్రకాశం): 103 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా వేటపాలెం సారస్వత నికేతన్ గంథాలయం గుర్తింపు పొందింది. పాతతరంలో ఎందరినో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధిన ఘనత సారస్వత నికేతన్‌కు ఉంది. 103 ఏళ్ల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించింది. గ్రంథాలయంలో ఉన్న గాంధీజీ చేతి కర్ర గ్రంథాలయం ఆవిర్భావం.. 1918 అక్టోబర్ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ బావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శేష్టి ప్రోత్సా హంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్ 18 తేదీన మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది. 1923లో పెంకుటింటిలో ఉన్న గ్రంథాలయం అమూల్యగ్రంథాలు.. రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాల ను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటలుగా భద్రపరచడం జరిగింది. గ్రంథాలయంలోని విజిటర్స్ పుస్తకంలో మహాత్మాగాంధీజీ స్వహస్తాలతో రాసిన ఒపీనీయన్ పరిశోధనా కేంద్రం.. తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతూ వస్తుంది. దేవ వ్యాప్తంగా ఉన్న వివి« ద విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విష యసేకరణ చేస్తుంటారు. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాల యాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శించి వెళుతుంటారు. నేటికీ తగ్గని ఆదరణ.. ప్రసార మాధ్యమాలు, ఇంటర్ నెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈనాటికీ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధా నంగా సివిల్స్ గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు, గ్రంథాల యంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పీహెచ్డీ చేసేవారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తుంటారు. రాష్ట్రంలో వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్ మెంట్‌కి ఎంపికచేశారు. -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి -
కష్టార్జితంతో గ్రంథాలయం: ఓర్వ లేక నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, మైసూరు: ఆయనొక ముస్లిం. నిరక్షరాస్యుడైనప్పటికీ చదువంటే అమితమైన మక్కువ. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ప్రైవేట్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నిత్యం ఎంతో మంది పుస్తకాలు చదివేవారు. ఇది చూసి ఓర్వలేని కొందరు నిప్పు పెట్టడంతో నిన్నటివరకు కళకళలాడిన గ్రంథాలయం బూడిద కుప్పగా మారింది. 11 వేల పుస్తకాలు మంటల్లో ఆహుతయ్యాయి. కర్ణాటకలో మైసూరు నగరంలోని రాజీవ్‌నగరలోని 2వ స్టేజిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సయ్యద్ అనే భాషాభిమాని కష్టార్జితంతో ఒక షెడ్డునే గ్రంథాలయంగా మలిచాడు. వృత్తిరీత్యా చిన్నస్థాయి ప్లంబర్ అయిన ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. కన్నడ భాష అంటే మరీ అధికం. చాలా ఏళ్ల కిందట వైవిధ్య పుస్తకాలతో లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. నిత్యం ఎంతోమంది వచ్చి పుస్తకాలు చదివి వెళ్లేవారు. కానీ శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ లైబ్రరీకి నిప్పు పెట్టారు. పుస్తకాలు, షెడ్డు మొత్తం మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చేటప్పటికీ ఏమీ మిగలలేదు. కాలిపోయిన పుస్తకాలను చూసి సయ్యద్ బోరును విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: నడిచే పుస్తకాలయాలు బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం -
నడిచే పుస్తకాలయాలు
పుస్తకాలు ఒక సంప్రదాయానికి ప్రతీకలు. ఒక సంస్కృతిని మరొక తరానికి అందించే వారధులు. అటువంటి పుస్తక పఠనం తగ్గిపోతుండటంతో, తిరిగి పుస్తక పఠనానికి వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన కొందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు కలిసి ‘లెట్స్ రీడ్ ఇండియా’ అనే ఒక ఉద్యమం ప్రారంభించి, పుస్తకాల లైబ్రరీని ఇంటింటికీ తీసుకురావటం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ కొద్ది నెలల క్రితం ప్రారంభమైంది. అన్ని విభాగాలకు చెందిన పది లక్షల పుస్తకాలతో వీరు ఈ ఉద్యమం ప్రారంభించారు. ‘మా ప్రయత్నం వృథా పోలేదు. మంచి ఫలితాలు వస్తున్నాయి. వాట్సాప్, సోషల్ మీడియా తరాన్ని వెనుకకు మళ్లించి, పుస్తకాలు చదివించాలనేదే మా లక్ష్యం. వారు పుస్తకాలు చదివి, మన సంస్కృతి ని అర్థం చేసుకోవాలి. పుస్తకాల ద్వారా వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అంటున్నారు ఈ ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రఫుల్ల వాంఖేడే. ఇప్పుడు ఈ పుస్తకాలు దూర ప్రాంతాలకు, ఎటువంటి సౌకర్యాలు లేని ప్రదేశాలకు కూడా చేరుతున్నాయి. ‘‘మా పుస్తకాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. మాకు మూడు మొబైల్ లైబ్రరీలు ఉన్నాయి. ప్రజలు మా దగ్గర నుంచి పుస్తకాలను ఉచితంగా, ఒక వారం వారి దగ్గర ఉంచుకునేలా తీసుకోవచ్చు. అయితే పుస్తకం చదివినవారు తప్పనిసరిగా ఆ పుస్తకం గురించి 300 పదాలలో ఒక రివ్యూ రాసి ఇవ్వాలి. అప్పుడే రెండో పుస్తకం ఇస్తామన్నది షరతు. లేదంటే వారు ఒక పుస్తకం తీసుకుని, ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు. అప్పుడు మా లక్ష్యం నెరవేరదు’’ అంటున్నారు వాంఖేడే. పుస్తకాలు చదవాలనుకునేవారు సోషల్ మీడియా సైట్ లేదా వెబ్సైట్ యాప్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది. జిపియస్ ద్వారా మొబైల్ లైబ్రరీ ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. గుర్తించిన ప్రదేశాలకు ప్రతివారం మొబైల్ లైబ్రరీ వస్తుంటుంది. మొదట్లో ‘లెట్స్ రీడ్ ఇండియా’ సంస్థ మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్‌లలో ఈ లైబ్రరీని ప్రారంభించాలనుకున్నా, కరోనా మహమ్మారి కారణంగా పరిధి తగ్గించుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో దృష్టి కేంద్రీకరించారు. రానున్న రెండు సంవత్సరాలలో చిన్నచిన్న గ్రామాల ప్రజలకు కూడా పుస్తకాలు చేరవేయాలనే సంకల్పంతో ఉన్నారు. ‘మహారాష్ట్రలో విస్తృతి పెంచిన తరవాత, దేశంలోని మిగతా ప్రదేశాల మీద మా దృష్టి కేంద్రీకరిస్తాం’’ అంటున్నారు వాంఖేడే. ‘‘మేం పుస్తకాలు మాత్రమే అందచేయట్లేదు. చాలామందికి ఎటువంటి పుస్తకాలు చదవాలనే విషయంలో సందిగ్ధత ఉంటుంది. వారికి ఉపయోగపడే పుస్తకాలు చదవగలిగితే, అది వారి వృత్తి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ఎటువంటి పుస్తకాలు చదవాలో కూడా సూచిస్తాం’’ అంటారు వాంఖేడే. ఈ సంస్థ త్వరలోనే యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించాలనుకుంటోంది. ఇందులో ప్రముఖ రచయితల ఉపన్యాసాలు, ఇంటర్వూ్యలు, రివ్యూలు ప్లే చేస్తారు. పుస్తకం నిలబడాలి, పుస్తకం ద్వారా అక్షరాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలు వారసత్వ సంపదగా రానున్న తరాలకు అందాలి. -
పుస్తకం చల్లగుండ
కోల్‌కతా పేరు వినగానే ప్రధానంగా రెండు విషయాలు మన మదిలో మెదులుతాయి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మిష్టి దోయి అనే తీపి వంటకం, రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు. కోల్‌కతా లో మిష్టిదోయితో పాటు బెంగాలీల రుచికరమైన పదార్థాలు అమ్మే ఓ షాప్ ముందు ఇటీవల ఠాగూరు పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలున్న ఓ పాత ప్రిజ్ లాంటి అల్మరా మన చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాళిదాస్ హర్దాస్, కుంకుమ్లు దంపతులు. కోల్‌కతాలోని పాటులీలో వీరిద్దరూ ఇటీవల స్ట్రీట్ లైబ్రరీని ప్రారంభించారు. తమ పాత ఫ్రిజ్‌ను పుస్తకాల అల్మరాగా మార్చారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్‌తో మాట్లాడి, ఆ షాపు బయట ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ఫ్రిజ్ బుక్ లైబ్రరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలలో పుస్తకపఠన అలవాటును పెంచడానికే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు. ‘మేం పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమను విస్తృతం చేయడం ద్వారా అంతగా సంతోషాన్ని పొందుతున్నాం’ అని చెప్పిన ఈ ఇద్దరూ షాప్ యజమానితో కలసి కోల్‌కతాలోని పాటులీలో ఉచిత వీధి గ్రంథాలయాన్ని తెరిచారు. షాప్ యజమాని తారాపోద్ కహార్ ను సంప్రదించి, అతని షాప్ ముందు ‘కొంత స్థలాన్ని పుస్తకాలు ఉంచడానికి ఉపయోగించవచ్చా’ అని అడిగారు. కహార్ వెంటనే వీరి ప్రతిపాదనను అంగీకరించాడు. దీంతో ఆ దుకాణం బయట పెద్దలు, యువకులు చదవడానికి వీలుగా పుస్తకాలతో నిండిన ఫ్రిజ్ అల్మరాను ఏర్పాటు చేశారు. సందేశాల ఫ్రిజ్ల్మరా! పాఠకులు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక నెల తర్వాత తిరిగి ఇవ్వమనే సందేశాన్ని ఫ్రిజ్‌కు పక్కన రాసి ఉంచారు. ఎవరైనా తమకు నచ్చిన, చదివిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిజ్ బుక్ లైబరీ లో ఉంచచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ బుక్ లైబ్రరీ గురించి తెలుసుకున్న ప్రజలు ఈ చొరవను ఇష్టపడ్డారు. ఇలాంటి లైబ్రరీలను మిగతా వారూ ప్రారంభించాలని, తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
డిజైన్ లైబ్రరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నటి మన్నారా చోప్రా
-
'స్మైల్' లుక్..
-
లైబ్రరీ కుదింపు.. రీసెర్చ్ కనుమరుగు!
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ఇక మంగళం పాడినట్లేనా? లైబ్రరీల్లో పుస్తకాలు రాన్రాను కనుమరుగేనా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై కేంద్రం తాజాగా కొన్ని సవరణలు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సవరణ నిబంధనలను తాజాగా జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఇప్పటివరకు తప్పనిసరిగా సెంట్రల్ రీసెర్చి ల్యాబ్ ఉండాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. కాలేజీ అభీష్టం మేరకు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇది వైద్య పరిశోధనకు విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. చదవండి: కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరు పరిశోధనలకు మంగళం? కొత్త నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీలు తప్పనిసరి కాదని పేర్కొన్నారు. అయితే, పూర్తిగా పరిశోధనలు వద్దనలేదని వైద్య నిపుణులు అంటున్నారు. నిజానికి మెడికల్ కాలేజీల్లోని సెంట్రల్ రీసెర్చ్ లేబొరేటరీల్లో జరిగే పరిశోధనల్లో కాలేజీల్లోఅధ్యాపకులుగా పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారు. బోధనాసుపత్రికి వచ్చే రోగులపై ఈ పరిశోధనలు జరుగుతుంటాయి. బోధనా సిబ్బందికి విలువైన సమాచారాన్ని అందించడానికి హై–స్పీడ్ గ్రాఫిక్ వర్క్‌స్టేషన్, హై–స్పీడ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్స్టేషన్లు ఉంటాయి. వీటిలో క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. కొన్ని రోగాల్లో వచ్చే మార్పులను, కొత్త రోగాలపైనా క్లినికల్ రిసెర్చ్‌లు జరుగుతుంటాయి. వైద్య విద్యార్థుల్లో, బోధకుల్లో నైపుణ్యాన్ని, వ్యాధులపై అవగాహనను పెంచే ఇటువంటి పరిశోధనలను కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. చదవండి: తెలంగాణ బ్రాండ్.. సర్కారీ మెడికల్ షాపులు! రెండేళ్లు ఆసుపత్రి నిర్వహిస్తేనే.. ఇప్పటివరకు మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చాకే ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేళ్ల క్రితం ఏర్పాటుచేసి, అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనేది కొత్త నిబంధన. పైగా రెండేళ్లూ 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఆసుపత్రి లేని కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కరువవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20–25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను తొలగించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో స్థల సమస్య వల్ల బహుళ అంతస్తులు నిర్మించి కాలేజీ నిర్వహించుకోవచ్చు. మెడికల్ కాలేజీల్లో కనీసం 24 శాఖలు ఉండాలి. ప్రతి కాలేజీకి తొలుత 100 – 150 సీట్లతో అనుమతిస్తారు. ఆపై సమకూర్చుకునే సౌకర్యాలనుబట్టి ఆ సంఖ్యను ఏటా పెంచుతారు. కొత్త కాలేజీల్లో లైబ్రరీ–పుస్తకాలు ఇలా.. కొత్తగా ఏర్పాటయ్యే వైద్య కళాశాలల్లో లైబ్రరీకి పెద్దగా స్థలం కేటాయించాల్సిన అవసరం లేదని తాజా సవరణల్లో ఉంది. పైగా వాటిలో పుస్తకాల సంఖ్యనూ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్లున్న మెడికల్ కాలేజీ లైబ్రరీలో 7 వేల పుస్తకాలు, 150 సీట్లున్న కాలేజీలో 11 వేలు, 200 సీట్లున్న కాలేజీలో 15 వేలు, 250 సీట్లున్న కాలేజీ లైబ్రరీలో 20 వేల పుస్తకాలు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఈ పుస్తకాల సంఖ్యను వరుసగా 3 వేలకు, 4,500కు, 6 వేలకు, 7 వేలకు కుదించారు. అలాగే లైబ్రరీ వైశాల్యాన్నీ తగ్గించేశారు. ప్రస్తుతం వంద సీట్ల కాలేజీలో 1,600 చదరపు మీటర్లు, 150 సీట్లున్న కాలేజీలో 2,400 చ.మీ. వైశాల్యంతో లైబ్రరీ ఉండాలి. కొత్త నిబంధనలో 100 నుంచి 150 సీట్లున్న కాలేజీల్లో లైబ్రరీ వైశాల్యాన్ని వెయ్యి చ.మీ.కు కుదించారు. ప్రస్తుతం 200 సీట్లున్న కాలేజీలో 3,200 చ.మీ., 250 సీట్లున్న కాలేజీలో 4 వేల చ.మీ. వైశాల్యంలో లైబ్రరీ ఉండగా, ఇకపై 200 నుంచి 250 సీట్లున్న కాలేజీల్లో 1,500 చదరపు మీటర్ల వైశాల్యంలోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యవసర వైద్యం తప్పనిసరి ప్రతి కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌కు కేటాయించాలి. దీంతో అత్యవసర రోగులకు వైద్యసాయం అందుతుంది. అలాగే ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రియాబిలిటేషన్ సెంటర్ గతంలో ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేశారు. స్కిల్ లేబొరేటరీని కొత్తగా చేర్చారు. వంద సీట్లున్న కళాశాలకు 19 విభాగాల్లో 400 పడకలు ఏర్పాటుచేయాలి. 150 సీట్లున్నచోట 600 పడకలు, 200 సీట్ల కళాశాలలో 800 పడకలు, 250 సీట్లున్నచోట వెయ్యి పడకలు తప్పనిసరి. వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను కుదించారు. ఎమర్జెన్సీ స్టాఫ్ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఆప్షన్‌గా చేశారు. లెక్చర్ హాళ్లను తగ్గించేశారు. ఇక కొన్ని మెడికల్ విభాగాల్లో పడకల సంఖ్యను కుదించారు. అలాగే, ప్రతి ఏటా కాలేజీని తనిఖీ చేయాలనే నిబంధనను తాజాగా మార్చేశారు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించారు. డాక్టర్ల విషయం చెప్పలేదు కానీ, పారామెడికల్ సిబ్బందిని తగ్గించారు. ఇంకొన్ని నిబంధనలు విజిటింగ్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకోవచ్చు. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. ఎమర్జెన్సీ విభాగంలో అదనపు ఫ్యాకల్టీని నియమించాలి.అన్ని మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాల ద్వారా తరగతి గదులు, రోగులకు అందే వైద్యసేవల లైవ్ స్ట్రీమింగ్‌ను జాతీయ వైద్యమండలి ఆధ్వర్యంలో నడిచే డిజిటల్ మిషన్మోడ్ ప్రాజెక్టుతో అనుసంధానించాలి. అనాటమీ విభాగంలో భౌతికకాయాలను కోసి పరిశీలించేందుకు వీలుగా 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో డిసెక్షన్ హాల్ ఏర్పాటుచేయాలి. 400 చ.మీ. వైశాల్యంతో పోస్ట్‌మార్టం/అటాప్సీ బ్లాక్ ఉండాలి. విద్యార్థుల శిక్షణకు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండాలి. ఎయిర్ కండీషన్డ్ బ్లడ్‌బ్యాంక్ నిర్వహించాలి. 24 గంటల పార్మసీ సేవలు అందుబాటులో ఉంచాలి. పుస్తకాలు చదివేది తక్కువే డిజిటల్ యుగంలో చాలామంది ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లలో సమాచారం వెతుక్కుంటున్నారు. వాటిలోనే చదువుకుంటున్నారు. కాబట్టి పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు. అందుకే ఎన్ఎంసీ లైబ్రరీల వైశాల్యాన్ని కుదించింది. పుస్తకాల సంఖ్యను తగ్గించింది. పరిశోధనలను పూర్తిగా వద్దని చెప్పలేదు. – డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు పరిశోధనలతోనే మేలు కొన్ని జబ్బులపై అసిస్టెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పరిశోధనలు చేసి థీసిస్‌లు సమర్పిస్తారు. వాటిని మెడికల్ జర్నల్స్‌ల్లో ప్రచురిస్తారు.ఆ మేరకే వారికి పదోన్నతులు లభిస్తాయి. మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రీసెర్చి లేబొరేటరీలు ఉంటే పరిశోధనలకు ఊపు వస్తుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
వీధిలో విజ్ఞాన వెలుగులు
ఒక మంచిపుస్తకం చదివితే మంచి స్నేహితుడితో సంభాషించినట్టే అంటారు పెద్దలు. ఒక మంచిపుస్తకాన్ని పరిచయం చేస్తే మంచి స్నేహితుడిని పరిచయం చేసినట్టే అంటుంది గురుంగ్ మీనా. అరుణాచల్ ప్రదేశ్‌లో మొట్టమొదటి ‘వీధి గ్రంథాలయాన్ని’ ప్రారంభించి, యువతకు మంచిపుస్తకాలు చదివే అవకాశాన్ని ఇస్తుంది. ఎంతోమందిలో పఠనాసక్తిని పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాపమ్ పరే రాష్ట్రంలోని నిర్జులిలో మీనా లైబ్రరీని ప్రారంభించింది. మిజోరాం ‘మినీ వేసైడ్ లైబ్రరీ’ నుండి ఈ వీధి గ్రంథాలయ ఏర్పాటుకు ప్రేరణ పొందింది. పాఠకులకు ఇక్కడ కూర్చుని చదవడానికి కూడా ఏర్పాట్లు చేసింది. మీనా గురుంగ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె మాట్లాడుతూ– ‘ఈ వీధి గ్రంథాలయం ఏర్పాటు చేసిన 10 రోజులకే పాఠకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పదిరోజులుగా ఇక్కడ తాళాలు లేకుండానే లైబ్రరీ నడిచింది. కానీ, ఇక్కడ నుంచి ఒక్క పుస్తకాన్ని కూడా ఎవరూ దొంగిలించలేదు. ఒకవేళ ఈ పుస్తకాలు ఎవరైనా దొంగిలించినా నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఎవరు దొంగిలించినా అవి వాళ్లు చదవడానికి ఉపయోగిస్తారు’ అని ఆనందంగా చెబుతుంది మీనా. వయోజన విద్య.. గురుంగ్ మీనా బెంగళూరు నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. మహిళలు, వితంతువుల మంచికోసం పనిచేయాలని ఆమె అభిలాష. అలాగే మీనా వయోజన విద్యను ప్రోత్సహిస్తుంది. బాల్యవివాహానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ వీధి లైబ్రరీ నుండి పుస్తకాలు ఎక్కువగా చదివేవారిలో మహిళలు, యువకులు. వీధి గ్రంథాలయం కింద బహిరంగ ప్రదేశంలో కూర్చోవడం టీనేజర్లు ఇష్టపడటం లేదు. అందుకని వారికి ఈ పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లడానికి, తిరిగి ఇవ్వడానికి ఒక రిజిస్టర్‌ను ఉపయోగిస్తుంది. యువతలో ఆసక్తి.. ఆమె తన ప్రయత్నాల ద్వారా టీనేజర్లలో చదువు పట్ల మక్కువ పెంచుకోవాలనుకుంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రతి చిన్న, పెద్దనగరాలలో ఇలాంటి లైబ్రరీలను తెరవాలని మీనా తపన పడుతోంది. ఆమె ప్రయత్నం చాలామందిలో మార్పు తీసుకువస్తోంది. చాలామంది తమ ఇళ్లలో ఉన్న పుస్తకాలను ఈ వీధి లైబ్రరీలో ఉంచడానికి ఇస్తున్నారు. కొందరు పుస్తకాలను కొనడానికి మీనాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ‘నా ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి వీధి గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను‘ అని మీనా చెబుతోంది. మంచిపని ఎవరైనా, ఎక్కడైనా చేయచ్చు. అది ఒక్కపుస్తకంతో కూడా మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తుంది మీనా. -
పుస్తకాల గూడు కావాలా?
కాలానికి ఒక శ్రేయోభిలాషి వస్తాడు. ఈ కాలంలో వినోద్ శ్రీధర్‌కు మించిన శ్రేయోభిలాషి లేడు. చెన్నైలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేస్తున్నారు. మరుసటి రోజుకు వాళ్ల ముంగిట్లోకి అతడొక లైబ్రరీయే తీసుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం శ్రీధర్ ప్రారంభించిన ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ ఈ లాక్డౌన్ కాలంలో గొప్ప ఊరటనిస్తోంది. విజయలక్ష్మి అనే మహిళకు ఇద్దరు పిల్లలు. ఒకరు టెన్త్. ఒకరు ఇంటర్. ఇద్దరూ కాసేపు ఆన్లైన్ క్లాసులని కంప్యూటర్, ఫోన్ పట్టుకుంటున్నారు. అవి అయ్యాక వాళ్లు మళ్లీ గేమ్స్ కోసం వీడియోస్ కోసం మళ్లీ ఆ కంప్యూటర్, ఫోన్లో మునిగిపోతున్నారు. ‘ఇలా అయితే వీరు ఏం కాను?’ అని ఆమెకు బెంగ కలిగింది. మామూలు రోజుల్లో అయితే ఆటలో పాటలో ఫ్రెండ్స్‌తో బయట తిరగడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల కదిలే పరిస్థితి లేదు. ఇంట్లో ఉంటే కుర్చీల్లో కూలబడి కంప్యూటర్‌కు అతుక్కుపోతే ఒళ్లు, బుర్ర రెండూ పాడైపోతాయి. ఆమెకు ఎవరో వినోద్ శ్రీధర్ గురించి చెప్పారు. అతడు చెన్నైలోని అశోక్ నగర్లో ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ నడుపుతున్నాడు. అతనికి ఆమె ఫోన్ చేసింది. ఆమె: మీరు మాకు ఎలా సాయం చేస్తారు? వినోద్ శ్రీధర్: మీరు ఆరు వేల రూపాయలు కట్టి యాన్యువల్ మెంబర్షిప్ తీసుకోవాలి. మీకూ మీ పిల్లలకు ఏయే పుస్తకాలంటే ఆసక్తో, ఎటువంటి విషయాలంటే కుతూహలమో మేము తెలుసుకుంటాం. దానిని బట్టి మీ అభిరుచికి తగిన వంద పుస్తకాల ర్యాక్‌ను మీ హోమ్ లైబ్రరీగా మీ ఇంటికి తీసుకొచ్చి పెడతాం. మూడు నెలలలోపు మీరు ఆ పుస్తకాలను చదువుకోవచ్చు. మూడు నెలల తర్వాత కొత్త పుస్తకాలను పెడతాం. అలా సంవత్సరానికి నాలుగుసార్లు పెడతాం. ఆమె: మాకు అన్ని పుస్తకాలు అక్కర్లేదు. యాభై పుస్తకాల ర్యాక్ చాలు. ఇవ్వగలరా? వినోద్ శ్రీధర్: అలా ఇప్పటిదాకా చేయలేదు. కాని ఆలోచిస్తాను. వినోద్ శ్రీధర్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాడు. అతడి తండ్రి ముప్పై ఏళ్లుగా పుస్తకాల స్టాల్ నడుపుతున్నాడు. కొడుకు ఆ వ్యాపారాన్ని అందుకుని ‘పుస్తకాలు కొనడానికి మన దగ్గరకు వచ్చే వారి కోసం ఎదురు చూసే కన్నా వారి ఇళ్లకే పుస్తకాలు చేరుద్దాం’ అని ‘ప్రీలవ్డ్ బుక్స్ లైబ్రరీ’ మొదలెట్టాడు. ఇందులో మన ఇంటికి తెచ్చి పెట్టే లైబ్రరీలో అన్ని కొత్త పుస్తకాలు ఉండవు. ఎవరో ఒకరు చదివినవి ఉంటాయి. మనం చదివాక మరో ఇంటికి వెళతాయి. ‘నాకు ఈ పని సంతృప్తిగా ఉంది’ అంటున్నాడు వినోద్. తన రోదసి విహారం కన్నా పాఠకులకు ఈ కాలంలో అవసరమైన కాల్పనిక విహారం అవసరమని భావిస్తున్నాడు. వినోద్ శ్రీధర్‌కు కాఫీషాపుల నుంచి, కార్పొరెట్ సెంటర్స్ నుంచి కూడా లైబ్రరీ ఏర్పాటుకు ఆహ్వానాలు అందుతున్నాయి. కస్టమర్లు కాసేపు పుస్తకాలు తిరగేసేలా చేయడం మంచి విషయమే అని ఆయా వ్యాపార స్థలాల యజమానులు భావిస్తున్నారు. చెన్నైకే కాదు ప్రతి ఊరికి ఒక శ్రీధర్ ఉంటే పిల్లలు పెద్దలు పుస్తకాల ప్రియులుగా మారవచ్చు. పుస్తకాలు మంచిని చెబుతాయి. ఇది కూడా కరోనాను ఎదుర్కొనేందుకు ఒక రకమైన ఇమ్యూనిటీయే. -
పుస్తకం.. మస్తిష్క భోజనం
ఆకలికి అన్నం, వేదనకు ఔషధం ఎలాగో... శూన్యంతో నిండిన మెదడుకు పుస్తకం కూడా అలాగే. ఆలోచనలను పదునెక్కించేందుకు, సృజనాత్మకతను పెంచుకొనేందుకు మెదడుకు మేత అవసరం. అది పుస్తకం మాత్రమే భర్తీ చేయగలుగుతుంది. అది నిశ్శబ్దంగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ప్రతి వ్యక్తిని ఒక పరిపూర్ణమైనమానవుడిగా తీర్చుదిద్దుతుంది. కానీ అర్ధాకలితో పస్తులున్నట్లుగానే ఎంతోమంది చిన్నారులు పుస్తకాల కొరత కారణంగా జ్ఞానాన్ని సముపార్జించలేకపోతున్నారు. పిల్లలు ఈ ప్రతికూలతను అధిగమించేందుకు హైదరాబాద్ కేంద్రంగా శ్రీకారం చుట్టింది ‘ఫుడ్ ఫర్ థాట్’ ఫౌండేషన్. ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో 200 పుస్తకాలతో సుమారు 300కు పైగా లైబ్రరీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో ‘ఫుడ్ ఫర్ థాట్’ లైబ్రరీలు ఆకలిగొన్నమస్తిష్కాలకు పుస్తక భోజనాన్ని అందజేస్తున్నాయి. చదువు–చదివించు.. ‘పుస్తకం కొందరికే అందుబాటులో ఉంటుంది. అదిఅందరి దరికీ చేరాలంటే ఏం చేయాలి...’ శ్రీనివాస్‌రావు, షిఫాలీరావు, మాధవీ శర్మ ఈ ముగ్గురినీ వేధించిన ప్రశ్న ఇది. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని ఒకటికి నాలుగుసార్లు చదవగలడు. కానీ అదే పుస్తకాన్ని కొంతమందికి అందజేస్తే.. ఆ కొందరు మరి కొందరికి అందజేస్తే జ్ఞానం అందిరికీ చేరువవుతుంది. ఈ లక్ష్యంతోనే 2015లో ‘ఫుడ్ ఫర్ థాట్’ను ఏర్పాటు చేశారు. మొదట తాము చదివిన పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆర్కే నగర్, హఫీజ్‌పేట్, అంజయ్యనగర్ బస్తీ, సిద్దిఖ్‌నగర్ తదతర అనేకప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 200 పుస్తకాలు. నీతి నైతిక విలువను బోధించే కథల పుస్తకాలు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు జనరల్ నాలెడ్జ్ బుక్స్, ఎన్సైక్లోపీడియాలు ఉంటాయి. మాతృభాషలో 50 పుస్తకాలు ఉంటే మిగతా 150 పుస్తకాలు ఇంగ్లి్లష్‌లో ఉంటాయి. స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థికి గ్రంథాలయం నుంచి గుర్తింపు కార్డు ఉంటుంది. ఇలా కొద్ది స్కూళ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగింది, అనేక మంది దాతలను సంప్రదించింది. సొంత గ్రంథాలయాల నుంచి పుస్తకాలను ఇవ్వలేని వారు కొనుగోలు చేసి ఇచ్చారు.5 సంవత్సరాల్లో సుమారు లక్ష పుస్తకాలను సేకరించారు. హైదరాబాద్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోన్ని అనేక చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. దిల్లీ, బెంగళూర్, కోల్కత్తా, హర్యానా, అస్సాం, మిజోరాం,ఒడిస్సా, మేఘాలయ అనేక రాష్ట్రాలకు ‘ఫుడ్ ఫర్ థాట్’ విస్తరించింది. సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఇది చేరువైంది. అదే సమయంలో వేలాది మంది దాతలను ఒక్కటి చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రముఖ పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు, తదితర చోట్ల ‘ఫుడ్ ఫర్ థాట్’ బాక్సులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పుస్తకాలను సేకరించింది. ఇల్లిల్లూ పుస్తకాలయం... ‘పిల్లల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేయడం ఒక ఉద్యమంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రతిఇంట్లోను పుస్తక పఠనానికి పెంచాలనే లక్ష్యంతో ‘ఘర్ ఘర్ పుస్తకాలయ్(జీజీపీ) కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలో ఇది ప్రారంభమవుతుంది. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న ఇంటికి 50 పుస్తకాల బాక్సును అందజేస్తాం. వారు చదవడంతో పాటు ఇరుగు పొరుగు వాళ్లకుఅందజేయాలి. ఇలా ప్రతి ఇల్లు ఒక పుస్తకాలయం కావాలన్నదే మా లక్ష్యం..’ అని చెప్పారు ఫుడ్ ఫర్ థాట్ కో–ఫౌండర్ షిఫాలీరావు. ఘర్ ఘర్ పుస్తకాలయ్ ఉద్యమాన్ని సైతం నగరంలో ప్రారంభించి దేశమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ ఫర్ థాట్‌కు పుస్తకాలను ఇవ్వాలనుకొనే దాతలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా. ఆ సంస్థ వెబ్సైట్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఒక లైబ్రరీకి సరిపోయే 200 పుస్తకాలు ఉంటే ఆ సంస్థప్రతినిధులే స్వయంగా వచ్చి తీసుకెళ్తారు. నాలెడ్జ్ సొసైటీ నిర్మాణం జరగాలి మా ఇంట్లో అందరం బాగా పుస్తకాలు చదువుతాం. ఆ అలవాటును పది మందికీ పరిచయం చేయాలనిపించింది. మాలాగా చదివే అలవాటు ఉన్న వారిని పుస్తకదాతలుగా ప్రోత్సహించాలని కూడా భావించాం. ఒకేవిధమైన ఆలోచన ఉన్నవారికి ఫుడ్ ఫర్ థాట్ ఒక వేదికైంది. హైదరాబాద్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశమంతటా విస్తరించినందుకు చాలా సంతోషంగా ఉంది.– కె.శ్రీనివాస్‌రావు, ఫుడ్ ఫర్ థాట్ వ్యవస్థాపకులు పాఠ్యపుస్తకాలు వద్దు ఫుడ్ ఫర్ థాట్ పాఠ్యపుస్తకాలను స్వీకరించడం లేదు. స్కూళ్లలో ఎలాగూ ఆ పుస్తకాలనే బోధిస్తారు. అందుకే చరిత్ర,సంస్కృతి, జనరల్ నాలెడ్జ్,సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను స్వీకరించి పిల్లలకు అందజేస్తున్నాం.– షిఫాలీరావు, సహ వ్యవస్థాపకులు ఇతిహాస కథలతో ఆడియోలు పుస్తకాలతో పాటు ఇప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచే సేకరించిన కథలను ఆడియోల రూపంలో పిల్లలకు అందజేస్తున్నాం, యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షించే సదుపాయం కూడా ఉంది.– మాధవీ శర్మ, ఫుడ్ ఫర్ థాట్ ప్రతినిధి -
విద్యార్ధులపై విరిగిన లాఠీలు
-
సినిమాల కంటే లైబ్రరీకే ఎక్కువగా వెళ్లారట
న్యూయార్క్ : ప్రపంచంలో హాలీవుడ్ మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో పెద్దగా వేరే చెప్పనవసరం లేదు. 2019 ఏడాదిలో యూఎస్ ఫిల్మ్ ఇండస్ర్టీ 40 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. కానీ అమెరికాలోని పబ్లిక్ లైబ్రరీతో పోటీ పడాలంటే మాత్రం హాలీవుడ్ ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని గాలప్ పోల్ సంస్థ పేర్కొంది. అదేంటి హాలీవుడ్ మార్కెట్‌కు, పబ్లిక్ లైబ్రరీకి సంబంధం ఏంటనే డౌట్ వస్తుందా.. అక్కడే అసలు విషయం ఉంది. 2019 ఏడాదిలో అమెరికాలో సినిమాల కంటే లైబ్రరీలకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గాలప్ పోల్ తన సర్వేలో వెల్లడించింది. గాలప్ పోల్ సంస్థ ఏడాదిలో అమెరికన్లు తమకు నచ్చిన ప్రాంతాలను ఎన్నిసార్లు చుట్టివస్తున్నారనే దానిపై సర్వే జరిపింది. సంస్థ ప్రతినిధి జస్టిన్ మెక్‌కార్తీ వివరాల ప్రకారం.. అమెరికాలో పబ్లిక్ లైబ్రరీని అమెరికన్లు ఏడాదికి సగటున 10.5 సార్లు సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. కాగా లైవ్ మ్యూజిక్, ఈవెంట్స్, చారిత్రాత్మక ప్రదేశాలను ఏడాదికి 4 సార్లు సందర్శిస్తున్నారని, మ్యూజియం, జూదం ఆడే కేంద్రాలను ఏడాదికి 2.5 సార్లు వెళ్లివస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇక చివరిగా అమెరికాలో పార్క్‌లను ఏడాదికి 1.5 సార్లు, జూలను 0.9 సార్లు సందర్శిస్తున్నట్లు తేలింది. కాగా ఈ సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పబ్లిక్ లైబ్రరీలను సందర్శిస్తున్న వారిలో పురుషల సంఖ్య కంటే మహిళల సంఖ్య రెండు రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో పాటు లైబ్రరీకి వచ్చే వారిలో ఎగువ తరగతితో పోలిస్తే దిగువ తరగతి నుంచి వచ్చేవారే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో బహిర్గతమైంది. -
బుక్ చదివితే.. బిల్లులో 30 శాతం రాయితీ
సాధారణంగా ఏ సెలూన్‌లోనైనా అద్దాలు, కత్తెరలు, షాంపూలు, సబ్బులు తదితర సామగ్రి మాత్రమే ఉంటాయి. అయితే తమిళనాడుకు చెందిన పొన్‌మారియప్పన్ మెన్స్ బ్యూటీ హెయిర్ సెలూన్ మాత్రం పుస్తకాలతో నిండి ఉంటుంది. చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్‌మారియప్పన్ చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కాస్తా మధ్యలోనే ఆగిపోయింది. బతుకుతెరువుకోసం ఓ క్షౌరశాల ప్రారంభించాడు. అయినప్పటికీ కంటపడిన ప్రతి పుస్తకమూ చదివేవాడు. ఈ అలవాటు క్రమేణా పుస్తకసేకరణపై ఆసక్తిని పెంచింది. మొదట స్క్రాప్ డీలర్ల నుంచి పుస్తకాలను సేకరించేవాడు. ఆ తర్వాత ప్రతి నెలా తన ఆదాయంలో కొంత మొత్తాన్ని వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశాడు. వీటన్నింటిని తన దుకాణంలో అందంగా ఆల్మారాల్లో ఉంచాడు. దుకాణంలోకి వచ్చిన వినియోగదారులు కొంతమంది వాటిల్లో తమకు నచ్చినవి చదువుకునేవారు. దీనిని గమనించిన మారియప్పన్ తన దుకాణానికి వచ్చే ప్రతి ఒక్కరితో పుస్తకాలు చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కు ఓ ఉపాయం ఆలోచించాడు. అదే రాయితీ. తీసుకున్న పుస్తకంలో పదిపేజీలు చదివితే బిల్లులో 30 శాతం రాయితీ వస్తుంది. అయితే రాయితీ ఇచ్చినంతమాత్రాన అంద రూ చదువుతారనే నమ్మకమేమీ లేదు. ఇందు కు కారణం ఇప్పుడు అందరూ సెల్ఫోన్లో మునిగితేలుతుండడమే. ‘సెల్‌ఫోన్ వాడరాదు’ అనే బోర్డు ఏర్పాటు చేశాడు. దీంతో అక్కడికి వచ్చినవారు సెల్ఫోన్లను జేబులో పెట్టుకుని పుస్తకాలు పట్టుకోవడంమొదలైంది. అంతరించిపోతున్న పుస్తక పఠనాన్ని పునరుద్ధరించడంలో కృతకృత్యుడైనందుకుగాను అందరూ మారియప్పన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా చాలా మంది పుస్తకాలను విరాళంగా అందజేస్తు న్నారు. ఓ ఎంపీ 50 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్షౌరశాలలో 900 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలోచన నచ్చడంతో మాజీ క్రికెటర్ హర్ష భోగ్లే... మారియప్పన్‌ను అభినందించారు. -
సూపర్ లైబ్రరీ
రాయదుర్గం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థలోని లైబ్రరీ నగరంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగంలో కోర్సులు, శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గచ్చిబౌలి టెలికామ్ నగర్‌లోని 30 ఎకరాల విశాల స్థలాన్ని కేటాయించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిథమ్ సంస్థను 2004 అక్టోబర్‌లో నెలకొల్పారు. అనంతరం నిర్మించిన భవనాలను 2005 మార్చి 16న అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో గ్రంథాలయాన్ని కూడా నిథమ్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ లైబ్రరీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. నూతన తరహాలో సేవలందిస్తోంది. వీటిలో నిథమ్ ఒకటి.. నగరంలో కేవలం కొన్ని గ్రంథాలయాల్లోనే వినియోగించే అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాకేంతికతను వినియోగిస్తున్న విద్యా సంస్థగా నిథమ్ గుర్తింపు పొందింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ– హైదరాబాద్, నగరంలోని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీతో పాటు మరికొన్ని విద్యాసంస్థల్లోనే దీనిని వినియోగిస్తున్నారు. వీటిలో నిథమ్ ఒకటి. 100 మంది కూర్చునేలా లైబ్రరీ హాల్ నిథమ్ గ్రంథాలయంలో ఓ మినీ హాల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. లైబ్రరీ హాల్ పేరిట 5వేల చదరపు అడుగుల విశాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 100 మంది కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. గ్రంథ చౌర్యాన్ని ఇట్టే పట్టేస్తుంది.. ఈ గ్రంథాలయంలో పుస్తకాలను తస్కరించే వీలు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. లైబ్రేరియన్ ధ్యాస మరల్చి పుస్తకాన్ని తస్కరించి ప్రధాన ద్వారం దాటే ప్రయత్నంలోనే అప్రమత్తం చేస్తుంది. దీనికి ఆర్ఎఫ్ఐడీ సాంకేతికతను వినియోగిస్తున్నారు. పుస్తకంలో ఏర్పాటు చేసిన చిప్ ద్వారా అనుమతి లేకుండా దానిని ఎవరైనా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే గుర్తించేలా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ అండ్ డాటా క్యాప్చర్ (ఏఐడీసీ) అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలు.. 2006లో గ్రంథాలయాన్ని ఆధునీకరించడంలో భాగంగా ఆటోమేషన్ ఆఫ్ లైబ్రరీలో లిబ్సైస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ఆరంభించారు. ఆ తర్వాత సోహా ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఆటోమేషన్ చేశారు. 2016లో ఆర్ఎఫ్ఐడీ సాంకేతికను వినియోగించడం అమలు చేశారు. ఆర్ఎఫ్ఐడీ సెక్యూరిటీ గేట్, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్, సెల్ఫ్‌చెక్ ఇన్/ఔట్ కియోక్స్, రెప్రోగ్రఫీ ఫెసిలిటీ, మల్టీమీడియా ఫెసిలిటీ, ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్స్, నాన్–బుక్ మెటీరియల్ మ్యాప్స్, సీడీరోమ్స్, డీవీడీలు, వైఫై ఫెసిలిటీ, నిథమ్ ఈ– న్యూస్‌లెటర్ వంటి అత్యాధునిక సాంకేతికతను లైబ్రరీలో అందుబాటులో ఉంచడం విశేషం. ఈ క్రమంలోనే గ్రంథాలయంలో నూతనంగా ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ కేటలాగ్– లైబ్రరీ కేటలాగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థమే ‘సెల్ఫ్ చెక్’ దక్షిణ భారతంలోనే ఎక్కడా లేని విధంగా బయోమెట్రిక్ విధానం ద్వారా సెల్ఫ్‌చెక్ వ్యవస్థను నిథమ్‌లో అమలు చేస్తున్నాం. ఆర్ఎఫ్ఐడీ సాంకేతికను వినియోగించడం ద్వారా పనిచేయడం ఎంతో సులువుగా మారింది. గ్రంథాలయాన్ని మరింత ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. – యాదగిరి, నిథమ్ లైబ్రేరియన్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటే లక్ష్యం డిజిటల్ లైబ్రరీగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. డీ స్పేస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి పుస్తకాలు, ఇతర వాటిని డిజిటలైజ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాం. లైబ్రరీలో డిస్కషన్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. సెంట్రల్ ఏసీ, కుషన్ వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచాం. – డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డి, నిథమ్ డైరెక్టర్ -
అభిమాన క్రికెటర్‌పై అంతులేని ప్రేమతో...
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ప్రేక్షకారాధన అంతాఇంత కాదు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సచిన్‌ను ఆరాధించేవారైతే అతడిని ఓ మానవాతీత వ్యక్తిగానే భావిస్తారు. ఇలాంటి కోట్లాది మందిలో కేరళలోని కాలికట్లో ఉన్న మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎంసీ వశిష్ట్ ఒకరు. అయితే, మాస్టర్ బ్యాట్స్‌మన్‌పై తన అభిమానాన్ని వశిష్ట్ అందరికంటే భిన్నంగా పుస్తక రూపంలో విశిష్టంగా చాటుకున్నారు. సచిన్ రిటైరైన 2013లోనే తమ కళాశాలలో ‘సచిన్స్ గ్యాలరీ’ పేరిట అతడి ఘనతలు, విశేషాల వివరాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో సచిన్‌పై 11 (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్) భాషల్లో రూపొందించిన 60 పుస్తకాలుండటం గమనార్హం. ఇన్ని భాషల్లో సచిన్ లైబ్రరీ ఏర్పాటు వెనుక దేశ సమైక్యతకు క్రికెట్ ఏవిధంగా తోడ్పడుతుందో చాటే ఉద్దేశమూ ఉండటం అభినందించదగ్గ విషయం. -
ఆముక్తమాల్యద తాళపత్రం.. తమిళనేలపై భద్రం
‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే. – సాక్షి, హైదరాబాద్ వందల్లో గ్రంథాలు... తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సర్వేపల్లి కాంక్షించినా... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం. గణితశాస్త్రంలో మన ఘనత.. గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి.. ‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’ డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి.. ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది... రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు. -
పురాతన భవనంలో ‘గ్రంథాలయం’
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది. కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు. నెరవేరని చైర్మన్ హామీ.. దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. నిర్లక్ష్యం తగదు గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర -
నిరుద్యోగుల చూపు..ఆ వైపు..
సాక్షి, పెద్దపల్లికమాన్ : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగుల చూపంతా జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయం పై పడింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటివద్దే కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యం కాని పరిస్థితి. ఇలా అయితే తమ లక్ష్యం నీరుగారి పోతోందని భావించిన యువత గ్రంథాలయాలకు వచ్చి రోజంతా ఇక్కడే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్షలు, దక్షిణ మధ్య రైల్వేలో పోలీసు, బీఎస్ఎన్లో టీటీఎ, ఎల్ఐసీలో పలు ఉద్యోగాలకు పరీక్షలుండడంతో పటు గ్రామాల నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిరుద్యోగులు తరలివస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే.. పెద్దపల్లితో పాటు అప్పన్నపేట బంధంపల్లి, రాఘవపూర్, రంగంపల్లి, హన్మంతునిపేట లాంటి గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం 8గంటల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకున్న వీరు రాత్రి 8గంటల వరకు గ్రంథాలయంలోనే పఠనం చేస్తున్నారు. సొంతగా తెచ్చుకున్న పుస్తకాలతో గంటల తరబడి చదువుతున్నారు. అరకొర సౌకర్యాలే.... పట్టణం జిల్లాగా మారిన గ్రంథాలయ అభివృద్ధి జరుగడం లేదు. గత సంవత్సరం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాతలు ఇచ్చిన కొన్ని పుస్తకాలు తప్ప కాంపిటిషన్‌కు ఉపయోగపడే పుస్తకాలు లేవని పాఠకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ సాహిత్య, ఉద్యమ చరిత్రలతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సరిపడ పుస్తకాలను తెప్పించాలని గ్రంథాలయ అధికారికి పలుమార్లు పుస్తకాల లిస్టు ఇచ్చామని నిరుద్యోగ యువత తెలిపారు. ఉన్న అడపాతడపా పుస్తకాలను గ్రంథాలయంలోని వెనుక రూంలో ఉంచి తాళం వేసి ముందుగా ఉండే హాల్‌ను మాత్రమే తెరిచి ఉంచి సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంచారని పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ డిస్కర్షన్ సాధ్యం.. కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే ఉద్యోగాలకు సాధన కోసం గత సంవత్సరం నుంచి పెద్దపల్లి గ్రంథాలయానికి వస్తున్నాను. ఇంట్లో చదివేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్‌తో గ్రూప్ డిస్కర్షన్ చేయడం వల్ల అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. – ఇ.సతీష్, సాగర్‌రోడ్ ఏకాగ్రతకు అనువైన ప్రదేశం డిగ్రీ పూర్తి చేశాను. కానిస్టేబుల్, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని అర్హత సాధిస్తా. గ్రంథాలయంలో ఎక్కువ మంది చదువటం వల్ల వారిని చూసి చదువాలనే కసితో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకనే ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న. – రాజుకర్, శాంతినగర్ ప్రశాంతంగా ఉంటుందని.. రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లో చదవాలంటే టీవీ శబ్దాలు, మోటార్ వాహనాల శబ్దాలతో చదువుపై ఏకాగ్రత చేయలేకపోతున్న. ఏకాగ్రతతో చదవాలంటే గ్రంథాలయం ఒక్కటే అనువైన స్థలమని ఇక్కడమిత్రులతో కలిసి చదువుతున్నాను. – ఎ.రమేష్, పెద్దపల్లి పుస్తకాలు అన్నీ తెస్తాం గ్రంథాలయంలో ఇద్దరే ఉద్యోగులు ఉండడం వలన సిబ్బంది కొరత ఉంది. వీరు సమయాన్ని విభజించి షిప్టుల వారిగా పనిచేస్తారు. గ్రంథాలయంలో సిబ్బంది లేనట్లు పాఠకులు నా దృష్టికి తీసుకరాలేదు. అలా జరిగితే మెమోలు జారీ చేసి కఠిన చర్య తీసుకుంటాం. రెండు రోజుల్లో కాంపిటీషన్ పుస్తకాలను తెప్పించి పాఠకులకు అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – గ్రంథాలయ అధికారి, గఫూర్ -
మహా వృక్షం.. ఇప్పుడు లైబ్రరీగా మారింది
వయసు పైబడి, ఎండిపోయిన చెట్టు కనిపిస్తే ఏం చేస్తారు? కలప కోసమో, వంట చెరకు కోసమో నరికేస్తారు. ఎలాగో చనిపోయింది కాబట్టి ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. కానీ అమెరికాలోని బోయిస్ ప్రాంతానికి ఆర్టిస్ట్ కమ్ లైబ్రేరియన్ అయిన షరాలీ ఆర్మిటేజ్ సృజనాత్మకంగా ఆలోచించింది. అప్పటికే కొమ్మలన్నీ నేలరాలి, మోడుగా మిగిలిన 110 ఏళ్ల కిందటి చెట్టును ఓ అందమైన లైబ్రరీగా మార్చేసింది. దానికి ‘లిటిల్ ఫ్రీ లైబ్రరీ’ అని పేరు పెట్టింది. నిజానికి ఈ పేరుతోనే ఓ ఎన్జీవో ఉంది. దీనికి 88 దేశాల్లో లైబ్రరీ షేరింగ్ నెట్వర్క్ ఉంది. ఎవరికి ఏ బుక్ కావాలన్నా తీసుకోవడం, చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయడం ఈ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా ఫ్రీనే. ఇప్పుడా నెట్‌వర్క్‌లోనే ఈ చెట్టు లైబ్రరీని చేర్చింది షరాలీ. చెట్టు కాండానికి ఓ డోర్ పెట్టింది. లోపల అరలు ఏర్పాటు చేసి బుక్స్‌ను అందులో ఉంచింది. ఈ చెట్టు లైబ్రరీ ఫొటోను గతేడాది డిసెంబర్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే లక్ష మందికిపైగా షేర్ చేశారు. -
అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ ఎందుకు?
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో భద్రతను పట్టించుకోకుండా భారత ప్రధాని మోదీ అక్కడ లైబ్రరీ స్థాపనకు సాయం చేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. అఫ్గాన్ భద్రతకు భారత్ సహా ఇతర దేశాలు చేయాల్సినంతగా చేయలేదని విమర్శించారు. అఫ్గానిస్తాన్‌కు బలగాలు పంపాలని అమెరికా తరచూ ఒత్తిడి చేస్తున్నా భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని అమెరికా అధ్యక్షుడు పరిహసిస్తూ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ట్రంప్ ఏ లైబ్రరీ ప్రాజెక్టును ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారో తెలియరాలేదు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అఫ్గానిస్తాన్ భద్రతకు చేస్తున్న ఖర్చుపై మాట్లాడుతూ ట్రంప్..భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ‘ మోదీని కలిసినప్పుడు అఫ్గానిస్తాన్‌లో లైబ్రరీ నిర్మిస్తున్నానని పదేపదే చెప్పారు. మోదీ లాంటి నాయకులు అఫ్గానిస్తాన్ అభివృద్ధికి ఎంతో ఖర్చు చేశామని చెబుతున్న మొత్తం మనం చేస్తున్న వ్యయం కన్నా చాలా తక్కువ. ఆ లైబ్రరీని ఆ దేశంలో ఎవరైనా వినియోగిస్తున్నారా? నాకైతే తెలీదు. అయినా లైబ్రరీ ఏర్పాటుచేసినందుకు మనం భారత్‌కు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మనం అక్కడ ఐదు గంటలకు చేసే ఖర్చుతో ఆ లైబ్రరీ సమానం’ అని ట్రంప్ వెటకారంగా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. భారత్ చేస్తున్న సాయం ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. అఫ్గాన్ ప్రజల అవసరాల మేరకు పలు మౌలిక ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామంది. లాటరీకి ముగింపు పలకాలి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారికే అమెరికా తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ ట్రంప్ స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. లాటరీ విధానంలో వీసాలు ఇవ్వడం సరికాదని.. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. -
తమాషాగా ఉందా.. అంతా మీ ఇష్టమేనా..?
‘నాకు చెప్పకుండానే ఉత్సవాలు చేసేస్తారా?.. అంతా మీ ఇష్టమేనా??.. నాకు కన్పించొద్దు.. సెలవు పెట్టి వెళ్లిపోండి’.. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిపై మంత్రి గంటావారి హూంకరింపులివి..ఉత్త పుణ్యానికే.. ఇంటికి పిలిపించి మరీ ఒంటికాలిపై లేచిన అమాత్యుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కార్యదర్శి ఉదయకుమార్ దీర్ఘకాల సెలవుపై వెళ్లిపోయారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 15న.. గ్రంథాలయ వారోత్సవాల రెండోరోజే చోటుచేసుకుంది. ప్రతి ఏటా జరిగే రీతిలోనే గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించడమే ఆయన చేసిన తప్పట!..కొద్ది నెలల క్రితమే ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇదేరీతిలో ఇంటికి పిలిపించిమరీ వాయించేసిన మంత్రి.. ఆనక ఆత్మీయ సమావేశం పేరుతో రెవెన్యూ అధికారులతో భేటీ అయిచల్లబర్చారు.మళ్లీ ఇప్పుడు గ్రంథాలయ కార్యదర్శిపై విరుచుకుపడటం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆయనపై మంత్రి అలా విరుచుకపడటానికి వేరే కారణముందన్న వాదన కూడా వినిపిస్తోంది. గంటాకు చెందిన ప్రత్యూష సంస్థకు గ్రంథాలయ సంస్థ స్థలం కేటాయింపు వివాదంలో కార్యదర్శి ఉదయకుమార్ గ్రంథాలయ సంస్థకు అనుకూలంగా నివేదిక ఇవ్వడమే.. ఆయన రుసరుసల వెనుక ఆంతర్యమని అంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాసరావు.. పైకి సౌమ్యంగానే కన్పిస్తారు. నవ్వుతూనే అందర్నీ పలకరిస్తుంటారు. కానీ తనకు అనుకూలంగా పని చేయకపోతే మాత్రం గంటకొట్టి మరీ వా యించేస్తారు. నిన్నగాక మొన్న ఆనందపురం తహసీల్దార్ ఈశ్వరరావును ఇంటికి పిలిపించుకు ని నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఆనక నాలుక కరుచుకుని కాళ్లబేరానికి వెళ్లారు. ఆత్మీ య సదస్సు పెట్టి అందర్ని ప్రాధేయపడ్డారు. ఈ ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన చో టు చేసుకుంది. ఈసారి తన మంత్రిత్వశాఖ అధీ నంలో ఉండే జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారి పై నిప్పులు చెరిగారు. గంటా ఆగ్రహానికి గురైన సదరు అధికారి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న వేళ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అండగా నిలవాల్సిన సహచర అధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయారు. తమాషాగా ఉందా? ‘ఏం తమాషాగా ఉందా? నీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తావా? మంత్రిని.. నేను జిల్లాలో ఉండగా.. ఒక్క మాటైనా చెప్పక్కర్లేదా?అంతా మీ ఇష్టమేనా? నువ్వు నా ఎదుట కన్పించకు.. ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు. సెలవుపై వెళ్లిపో’అం టూ విద్యా శాఖకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పువ్వాడ ఉదయకుమార్‌పై మం త్రి గంటా నిప్పులు చెరగడం చర్చనీయాంశమైం ది. గంటాకు ఎదురుచెప్పలేక ఆ కార్యదర్శి ఈ నెల 15వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో పర్యక్షించాల్సిన సెలవు పెట్టేయడంతో వారోత్సవాల వైభవం కనిపించలేదు. అసలేం జరిగింది? ఏటా నవంబర్ 14నుంచి 20వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు జాతీయ పతాకావిష్కరణతో పాటు వారం రోజు ల పాటు వివిధ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.ఈ ఏడాది అదే తరహా ఏర్పాట్లు చేశారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి మంత్రిగారికి కోపమొచ్చింది. ‘అత్తెరి నాకు చెప్పకుండా ఉత్సవాలా? అంటూ ఒంటికాలిమీద లేచారు. పీఏతో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. సెలవుపై వెళ్లిపో..నాకు కనిపించకు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పీఏతోనే డైరెక్టర్‌కు ఫోన్ చేసి ఉదయ్‌ను సెలవుపై పంపించాలంటూ హుకుం జారీ చేయించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఉదయ్ మొరపెట్టుకున్నా వారంతా మిన్నకుండిపోయారు. కన్నెత్తి చూడని గంటా.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కూడా గంటా మంత్రిగా కొనసాగారు. ఆ రెండు ప్రభుత్వాల్లోనూ ఒకే శాఖకు ప్రాతినిధ్యం వహిం చారు. గడిచిన పదేళ్లుగా విద్యాశాఖకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా ఏనాడైనా గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్నారా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. జిల్లా స్థాయి కా దు..రాష్ట్రస్థాయి వారోత్సవాల్లో కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. కానీ ఇప్పుడెందుకిలా జరిగింది..ఆ అధికారినే లక్ష్యంగా చేసుకుని ఎందుకు నిప్పులు చెరిగారో ఆ శాఖ అధికారులు, సిబ్బం దికి కూడా అంతుచిక్కడం లేదని ఓ సీనియర్ లైబ్రేరియన్ ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోనీ సదరు కార్యదర్శి ఏమైనా వివాదాస్పద అధికా రా? అంటే అదీ లేదు. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా ఏనాడూ వివాదాల జోలికి పోలేదు. స్థల వివాదమే కారణమా? మంత్రి ఆగ్రహం వెనుక మరొక కోణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష కంపెనీకి గతంలో గ్రంథాలయ స్థలాన్ని కేటాయించారు. ప్రజాసంఘాలు గగ్గోలు పెట్టడంతో ఆ లీజు రద్దయింది. ఆ వ్యవహారం వివాదస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. కమిటీ కూడా గ్రంథాలయ సంస్థకు అనుకూలంగానే నివేదికిచ్చింది. ఆ వ్యవహారంలో తాను చెప్పినట్టు వ్యవహరించలేదన్న అక్కసుతోనే గంటా ఇలా మండిపడ్డారన్న వాదన తెరపైకి వచ్చింది. మంత్రికి వ్యతిరేకంగా నివేదిక తయారీ కావడంలో కార్యదర్శి పాత్ర కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఈ నెల 28న గ్రంథాలయాల అసెంబ్లీ కమిటీ జిల్లాకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఎటువైపునకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా గ్రంథాలయ వారోత్సవాల నేపథ్యంలో కార్యదర్శి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం ఆ శాఖలో ప్రకంపనలకు దారితీస్తోంది. -
నెహ్రూ మ్యూజియంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)లో భారత మాజీ ప్రధానులందరికీ కేంద్రం చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనీ, మొత్తం దేశానికి సంబంధించిన వారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్ఎంఎంఎల్ ఉన్న తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో జోక్యం చేసుకోవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మన్మోహన్ లేఖ రాశారు. ‘ప్రజల మనోభావాలను గౌరవించి తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఉన్న నెహ్రూ స్మారక మ్యూజియంను అలాగే ఉంచండి. దీనివల్ల దేశ చరిత్రను, వారసత్వాన్ని గౌరవించినవారు అవుతారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం దేశానికి సంబంధించినవారు. నెహ్రూ ఔన్నత్యం, గొప్పతనాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం దీన్ని మార్చాలనుకుంటోంది’ అని మన్మోహన్ లేఖలో తెలిపారు. భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశం, ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపారని మన్మోహన్ వెల్లడించారు. -
ఆ జైలు గదిలో సకల సౌకర్యాలు
ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ నంబర్ బ్యారెక్‌ను ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు. -
35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం
ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్ ఆర్.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం. ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు. 2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్ కరుణానిధి హాస్పిటల్ అని పేరుపెట్టనున్నారు. -
నిర్లక్ష్యం నీడన గ్రంథాలయం
బీర్కూర్ : గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పైసా విదల్చకపోవడం.. పం చాయతీలు సెస్సు చెల్లించకపోవడంతో అభివృద్ధి కి ఆమడదూరంలోనే ఉండిపోతున్నాయి. సౌకర్యా లు మెరుగుపడకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రంథాలయాల అభివృద్ధిని పాలకులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చోట్ల సమస్యలు తిష్టవేశాయి. జిల్లాలో పరిస్థితి.. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని జిల్లా గ్రంథాలయం తో పాటు జిల్లావ్యాప్తంగా 18 శాఖ గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 16 పుస్తక నిక్షేప కేంద్రాలు ఉన్నాయి. 14 గ్రంథాలయాలకు మాత్ర మే సొంత భవనాలున్నాయి. మరో మూడు చోట్ల ఉచిత భవనాల్లో కొనసాగుతుండగా.. మిగిలినవి అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. బీర్కూర్, మద్నూ ర్ తదితర ప్రాంతాల్లోని గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో రూ. 1.20 కోట్ల సెస్ బకాయిలు.. పంచాయతీ పన్నుల వసూలులో భాగంగా 8 శా తం గ్రంథాలయ సెస్సును ప్రజల నుంచి వసూ లు చేస్తారు. ఇలా వసూలు చేసిన సెస్సును పంచాయతీలు గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. కానీ ఏడేళ్లుగా సర్పంచ్‌లు గ్రంథాలయ సెస్ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలో రూ. 1.20 కోట్ల మేర గ్రంథాల య సెస్ పేరుకుపోయింది. ఈ సెస్‌ను పంచాయతీలు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైతం గ్రంథాలయాల నిర్వహణకు ఒక్కపైసా కేటాయించడం లేదు. ఉద్యోగుల వేతనాలకు తప్ప నయా పైసా విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారమవుతోందని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడుగురే ఉద్యోగులు.. జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఒక గ్రేడ్–2 ఉద్యోగి, ముగ్గురు రికార్డు అసిస్టెంట్లు, మరో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఒక లైబ్రేరియన్ ఉన్నారు. రూ. 12 వేల ఫిక్స్డ్ వేతనం పొందే 15 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరు పోరాటం చేస్తున్నారు. వీరిలో కొందరి వయస్సు రిటైర్మెంట్కు సమీపించినా క్రమబద్ధీకరణ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఒక్కో ఉద్యోగిని రెండు, మూడు చోట్ల ఇన్చార్జి గ్రంథపాలకులుగా నియమించారు. సిబ్బంది కొరత సైతం గ్రంథాలయాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రస్థాయిలో బుక్ సెలెక్షన్ కమిటి ఏర్పాటు చేయకపోవడంతో కొత్త పుస్తకాల ఎంపిక జరగడం లేదు. దీంతో కొన్నేళ్లుగా కొత్తపుస్తకాలు గ్రంథాలయాలకు రావడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం పంచాయితీ పాలకులు సెస్ చెల్లించడం లేదు. జిల్లా లో రూ. కోటీ 20 లక్షల సెస్ రావా ల్సి ఉంది. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత కూడా ఉంది. దీంతో ఒక్కో ఉద్యోగికి రెండు నుంచి మూడు చోట్ల బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సిబ్బందిని నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదించాం. – సురేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి, కామారెడ్డి -
టాటావాళ్లే ఫ్లాటయ్యారు
చిన్నప్పుడు సెలవులొస్తే అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో మనకు వేసవి విడిది. అయితే ఈ చిన్నారి ఉన్న చోటనే ఉండి, రోజూ చల్లటి కథల పుస్తకాలను పిల్లలకు పంచిపెడుతూ చుట్టుపక్కల తండాలన్నిటినీ వేసవి విడిదులుగా మార్చేస్తోంది! ‘‘అమ్మా... జూదం చెడ్డ ఆట కదా?’’.. జుట్టు దువ్వుతున్న తల్లిని అడిగింది తొమ్మిదేళ్ల కోమల్ పవార్.‘అవును’’ పోనీ టెయిల్‌కు రబ్బర్ బ్యాండ్ పెడుతూ అంది తల్లి. ‘ధర్మరాజు ఆ ఆట ఆడాడు కాబట్టే కౌరవులు, పాండవులు యుద్ధం చేసుకోవాల్సి వచ్చింది కదా..’’ మళ్లీ కోమల్ ప్రశ్న. ‘‘ఊ’’ అంటూ కూతురిని తన వైపుకి తిప్పుకుంటూ ఆ అమ్మాయి చుబుకం పట్టుకొని నుదిటి మీద ముద్దుపెట్టుకుంది తల్లి. ‘అందుకే కౌరవులు ఎంత చెడ్డవాళ్లో జూదమాడిన ధర్మరాజూ అంతే చెడ్డవాడమ్మా..’’ నేల మీదున్న పుస్తకాల బ్యాగ్‌ను ఆయాసంతో భుజానికి తగిలించుకుంటూ అంది కోమల్!బిడ్డ ఆలోచనకు సంబరపడిపోతూనే ‘‘అంత బరువు మోయకపోతేనేం.. కొన్ని కొన్ని తీసుకెళ్లొచ్చు కదా’’ అంది తల్లి.‘‘ఇవన్నీ బస్తీ పిల్లల ఫర్మాయిష్ పుస్తకాలమ్మా! తీసుకెళ్లాలి. లేకపోతే బాధపడ్తారు పాపం.. అయినా సాయి వస్తాడు కదా.. వాడికీ ఇస్తాను కొన్నిమోయమని’’ జవాబు చెప్తూనే గడపదాటింది కోమల్. ‘జాగ్రత్త ఎండలో..’’ హెచ్చరించింది అమ్మ. బడికే ఇన్స్పిరేషన్! మహారాష్ట్రలోని సతారా జిల్లా హెకల్వాడీలో కోమల్ దినచర్య ఇది. నాలుగో తరగతి చదువుతోంది ఆ అమ్మాయి. పాఠ్యపుస్తకాలంటే ఇష్టం. కథల పుస్తకాలంటే ప్రాణం. కథలు చదవడం.. ఇదిగో ఇలా తన సందేహాలను అమ్మతో పంచుకోవడం..! తను చదివే హెకల్వాడీ జిల్లా పరిషత్ స్కూల్లో చిన్న లైబ్రరీ ఉంది. అందులోని పుస్తకాలను చదవడమే కాకుండా.. యేడాది కిందటి ఎండాకాలంలో తనకు నచ్చిన కథలను చేత్తో రాసి రెండు మూడు పుస్తకాల ప్రతులను తయారు చేసింది. వాటిని ఆ సెలవుల్లో తన ఊరు చుట్టూ ఉన్న తండాల్లో కథలంటే ఇష్టం ఉన్న పిల్లలకు పంచింది. స్కూళ్లు తెరిచాక ఈ విషయం టీచర్లకు తెలిసి కోమల్‌ను ప్రశంసించారు. వారే ఈ ఎండాకాలం ఓ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో కూడా స్కూల్ లైబ్రరీని తెరిచే ఉంచాలని! ఎండల్లో తండాలకు హెకల్వాడీ చుట్టూ నాలుగు తండాలున్నాయి. ఉదయం పూట పుస్తకాలను తండాలకు పంచి తిరిగి సాయంకాలం వాటిని స్కూల్ లైబ్రరీకి చేర్చాలి. కొన్నాళ్లు ఈ బాధ్యతను ఆ స్కూల్ లైబ్రేరియన్ తీసుకున్నారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. అప్పుడు ఇదిగో ఈ చిట్టి కోమలే ముందుకు వచ్చింది. పొద్దున్నే స్కూల్‌కి వెళ్లి కథల పుస్తకాలను సంచీలో సర్దుకొని ఇంటికెళ్లి రెడీ అయి మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తండాలకు బయలుదేరుతుంది. తన ఈడు పిల్లలకు కథల పుస్తకాలు పంచడం, వాళ్లు ఆ పుస్తకాలను చదివేలా చూడ్డం అంటే ఆ పిల్లకు పండుగే. ఈ అమ్మాయి ఉత్సాహం, ఆమె జిల్లా పరిషత్ స్కూల్ ఇస్తున్న ప్రోత్సాహం గురించి తెలిసీ టాటా ట్రస్ట్ వాళ్లు ఈ పిల్లలకు బోలెడు పుస్తకాలను తెచ్చిచ్చారు. అలాగే చిన్న లైబ్రరీని కాస్తా పెద్దగా మార్చారు ఈ యేడు. ఛోటీ గ్రంథపాల్ కోమల్‌ను చూసి ఇప్పుడు వాళ్లింటి చుట్టుపక్కల ఉన్న పిల్లలూ ఆమె సాయంగా తండాలు తిరుగుతున్నారు పుస్తకాలు పట్టుకొని. పొలాల్లో, అంగన్వాడీల్లో, చెరువు గట్ల మీద, వాకిళ్లలో, ఇలా పిల్లలు ఎక్కడ కనపడితే అక్కడ పుస్తకాలు ఇస్తూ, వాళ్లు అవి చదివేలా చేస్తోంది కోమల్ అండ్ టీమ్. పైగా కిందటి రోజు చదివిన కథల గురించి తెల్లవారి చిన్న సైజు గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయట. ‘‘నాకు రామాయణ, మహాభారతం నుంచి నీతికథలు.. అన్ని.. అన్నీ ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా వాటన్నిటినీ చదవాలి. కథలు చదివితే ఇంకో ప్రపంచంలోకి వెళ్తా..’’ అంటుంది ఈ ఛోటీ గ్రంథపాల్. అన్నట్టు కోమల్‌కు తండాలవాళ్లు ఇచ్చిన పేరు అది. బుజ్జి లైబ్రేరియన్ అని! – శరాది -
లైబ్రరీలో మహిళ దారుణ హత్య
బోస్టన్ : ఓ మహిళని విచక్షణా రహితంగా వేటకొడవలితో హత్య చేసి చంపిన ఘటన శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో బోస్టన్ సమీపంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లైబ్రరీ గదిలో చదువుకుంటున్న ఓ మహిళపై మాసాచుసెట్స్‌కు చెందిన 23 ఏళ్ల జెఫ్పరీ యావో వేట కొడవలితో తల, రొమ్ము భాగంలో విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తమోడుతున్న మహిళ లైబ్రరీ తలుపుల వైపుగా పరిగెత్తింది. అతడు అంతటితో ఆగకుండా ఆమె వైపుగా పరిగెత్తాడు. అడ్డువచ్చిన లైబ్రరీ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడి పరారయ్యాడు. సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేక పోయింది. తీవ్ర గాయాలపాలైన మహిళ కొద్ది సేపటి తర్వాత చికిత్స పొందుతూ మరణించింది. ఆ మహిళ ఎవరు.? అతడు ఎందుకు ఆమెపై దాడి చేశాడు.? అన్న వివరాలు ఇంకా తెలియ రాలేదు. జెఫ్పరీ యావో నివసిస్తున్న ఇంటి చుట్టు పక్కల వారిని బోస్టన్ హెరాల్డ్ ఇంటర్వ్యూ చేయగా అతని గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొద్ది సంవత్సరాలుగా యావో ప్రవర్తన క్రూరంగా తయారైందని, మాలో ఎవరిని చంపుతాడో అని భయపడుతుండేవాళ్లమని చెప్పారు. అతని మిత్రులు యావో గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా మారిపోయాడన్న విషయాన్ని దృవీకరించారు. పోలీసులు యావోపై హత్యా, హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదంతస్తుల్లో 12 లక్షల పుస్తకాలు
పుస్తక పురుగులకు బుక్స్ ఇచ్చి వదిలేస్తే చాలు గంటలు గంటలు అలాగే చదువుకుంటూ ఉండిపోతారు. ఇక ఈ ఫొటోలో ఉండే గ్రంథాలయంలో కానీ వారిని విడిచిపెడితే ఇక ఇంటిముఖం చూడనే చూడరేమో! ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదకరమైన గ్రంథాలయాన్ని చైనా ప్రారంభించింది. ఈ గ్రంథాలయాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదేమో! అతిపెద్దగా సర్పిలాకారంలో ఉన్న ఈ గ్రంథాలయ ఆడిటోరియం అక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ పనితనంతో ఔరా అనిపించేలా నిర్మించారు. చైనా టియాంజిన్‌లోని బిన్హై కల్చరల్ జిల్లాలో ఈ గ్రంథాలయం ఉంది. దీన్ని టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, డచ్ డిజైన్ కంపెనీ ఎంవీఆర్‌డీవీ సంస్థలు నిర్మించాయి. 34 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు ఐదంతస్తుల్లో ఉన్న ఈ గ్రంథాలయంలో 12 లక్షల పుస్తకాలు కొలువై ఉన్నాయి. ఇంత పెద్ద గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేయడానికి అక్కడి అధికారులకు మూడేళ్ల సమయం పట్టింది. గ్రౌండ్ ఫ్లోర్‌ను పుస్తకాలు చదవడానికి, మధ్య భాగం సేద తీరడానికి, చర్చించుకోవడానికి వినియోగిస్తున్నారు. కార్యాలయాలు, కంప్యూటర్, ఆడియో రూములను పైభాగంలో ఏర్పాటు చేశారు. -
ఊరంత గ్రంథాలయం
ఊళ్లలో గ్రంథాలయాలు ఉండటం మనకు తెలుసు. ఊరంత గ్రంథాలయం గురించి విన్నారా? ►నిజంగానే ఇది ఊరంత గ్రంథాలయం. దీని విస్తీర్ణం దాదాపు ఒక చిన్న పట్టణం విస్తీర్ణానికి సమానం. ఇక గ్రంథాలయ భవంతి అగ్రరాజ్యాధినేతల అధికారిక భవంతులను తలదన్నే రీతిలో ఉంటుంది. ►ఇటీవలే ప్రారంభమైన ఈ గ్రంథాలయం చైనాలోని టియాంజిన్ ప్రావిన్స్‌లోని బిన్హాయ్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. టియాంజిన్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ నిపుణులు డచ్ నిర్మాణ సంస్థ ఎంవీఆర్‌డీవీ సహకారంతో ఈ సువిశాల గ్రంథాలయ భవంతిని 34 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. ► ఇందులో ఉన్న పుస్తకాల సంఖ్య దాదాపు మన దేశ జనాభా అంత ఉంటుంది. చిన్నా పెద్దా అన్ని రకాలూ కలుపుకొని ఈ బృహత్ గ్రంథాలయంలో ఏకంగా 120 కోట్ల పుస్తకాలు కొలువు తీరడం విశేషం. -
స్వర్ణోత్సవ వేళ.. పోటీల మేళా
భీమడోలు : ఈ ఏడాది రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ స్వర్ణోత్సవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ఈ ఏడాది నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్వర్ణోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. స్వర్ణోత్సవాల వేళ.. గతానికి భిన్నంగా గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించనుంది. ఈ ఏడాది నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలకు ముందుగా స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని వివిధ పోటీలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబం« దించి సర్క్యులర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ తమ గ్రంథపాలకుల ద్వారా విద్యాశాఖాధికారులకు అందించారు. గ్రంథాలయ సంస్థ, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు అకర్షణీయమైన బహుమతులను ప్రకటించింది. జిల్లాలోని గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, జిల్లా కేంద్ర గ్రంథాలయాల పరిధిలోని 73 గ్రంథాలయాల్లో, 3,236 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు గతంలో గ్రంథాలయ వారోత్సవాలను గ్రంథా లయాల పరిధిలో మాత్రమే నిర్వహించేవారు. అయితే రోజు రోజుకూ గ్రంథాలయాల పట్ల అసక్తి సన్నగిల్లడంతో వాటిని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ.. ఇలాంటి పోటీలు లైబ్రరీల బలోపేతానికి దారి తీస్తుందని సంబం« దిత అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థుల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పలు అంశాలపై పోటీలను నిర్వహిస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ కనుబర్చిన విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ, పాఠశాల విద్యాశాఖలు సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందజేస్తాయి. విద్యార్థులకు: వివిధ స్థాయిల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ట్యాబ్‌లను బహుమతిగా అందిస్తారు. విద్యార్థులను మూడు కేటగిరిలుగా విభజించారు. వారిలో 4, 5 తరగతులను సబ్ జూనియర్‌గా, 6,7 తరగతుల వారిని జూనియర్‌గా, 8 నుంచి 10వ తరగతుల వారిని సీనియర్స్‌గా విభజించారు. పాఠశాలలకు: రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల (ఎక్కువ పోటీల్లో ఎక్కువ మంది పాల్గొంటే) మొదటి బహుమతి పొందిన పాఠశాలకు రూ.50 వేల విలువ చేసే పుస్తకాలు, ద్వితీయ బహుమతి పొందిన పాఠశాలకు రూ.25 వేలు, తృతీయ శ్రేణి సాధించిన పాఠశాలకు రూ.10 వేల విలువ గల పుస్తకాలను అందిస్తారు. ఉపాధ్యాయులు: సెకండరీ గ్రేడ్, స్కూలు అసిస్టెంట్లు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు మూడు కేటగిరిల్లో పోటీలను నిర్వహిస్తారు. ఆక్టివిటీ ఇన్చార్జి: పాఠశాల స్థాయిలో ప్రతి నెల మొదటి గురువారం, మూడో గురువారాల్లో విద్యార్థులకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలకు రెండు పీరియడ్లను కేటాయించాలి. ఆక్టివిటీ ఉపాధ్యాయుడిని నియమించి ఆ రోజుల్లో పోటీలు నిర్వహించాలి. ఆ రోజుల్లో సెలవులు వస్తే మరుసటి రోజున జరపాలి. భాషా పండితులతో కలిపి పోటీలను నిర్వహించాలి. జిల్లాస్థాయిలో పాఠశాల స్థాయిలో అక్టోబర్ 6న, మండల స్థాయిలో అక్టోబర్ 13, జిల్లా స్థాయిలో అక్టోబర్ 27న పోటీలు జరుగుతాయి. రాష్ట్రస్థాయిలో... రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 11, 12వ తేదీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో బహుమతులు, ప్రశంసా పత్రాలను అందిస్తారు. -
పలుకులమ్మ తోటమాలి
అక్షర తూణీరం ఒక కుటుంబం కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినందన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది. సముద్రం లోపల ముత్యపు చిప్పలుంటాయి. దానిలో చిన్న పురుగు ఉంటుంది. ఆల్చిప్పల్లోకి ఇసుక రేణువులు జొరబడతాయి. అతి సున్నితమైన ఆ పురుగు ఇసుక రేణువులతో కలిగే చికాకును అస్సలు భరించలేదు. తన నోట్లోంచి తెల్లటి జిగుర్ని ఊరించి, ఆ రేణువులచుట్టూ పొదిగి గరగరల నించి ఉపశమనం పొందుతుంది. ఆ జెల్లీ మెల్లగా గట్టిపడుతుంది. అదే మనం ధరించే మంచి ముత్యం (స్వాతి చినుకులు కేవలం కవి సమయాలు మాత్రమే) అంటే, ఒక్కోసారి కొన్ని గరగరలు, జీవుడి వేదనలు జాతికి మేలు చేస్తాయి. అలా జరిగిన ఒకానొక మేలు– గుంటూరు బృందావన గార్డెన్స్‌లో వెల సిన అన్నమయ్య గ్రంథాలయం. ఒక్క మనిషి కృషి, ఒక్క రెక్క శ్రమ, ఒక్క పురుగు దురద. అరవై ఏళ్లలో లక్షంజిల్లర పుస్తకాలను సేకరించి, పదిలపరచి, ముడుపుకట్టి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి కృతార్థులైనారు. ఈ గ్రంథాళ్వార్ అసలు పేరు లంకా సూర్యనారాయణ. సహస్ర చంద్ర దర్శనానికి చేరువలో ఉన్నా, పుస్తక సేక రణపట్ల ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదు. తను సేకరించలేని అపురూప గ్రంథా లను తలచుకుంటూ అసంతృప్తి పడే మంచి ముత్యం ఎల్లెస్. గుంటూరు సమీపంలోని చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మిం చిన లంకా ఉన్నత చదువులు చదివి సెంట్రల్ ఎక్సైజ్‌శాఖలో వివిధ హోదా ల్లో పని చేశారు. తలచుకుంటే బారువు లకొద్దీ బంగారం ఇచ్చే శమంతకమణి లాంటి శాఖలో ఉన్నా, పెద్ద మనిషి గానే మిగిలిపోయారు లంకా సూర్య నారాయణ. కాలేజీ రోజుల్లోనే పుస్త కాల పిచ్చి పట్టుకున్న ఈ ఆసామి ఇంటిళ్లిపాదినీ తన హాబీకి అనుగు ణంగా మలచుకున్నారు. సంతృప్తి, సింప్లిసిటీ ఇవే గొప్ప అలంకారాలని కుటుంబ సభ్యుల్ని విజయవంతంగా నమ్మించగలిగారు. దరిమిలా ఎల్లెస్ తన వ్యసనాన్ని ప్రశాంతంగా పండిం చుకోగలిగారు. శ్రీ విద్యనుంచి శ్రీ శ్రీ సాహిత్యందాకా ఆయన సేకరణలో లేనివి లేవు. సాహిత్యం, సంగీతం, కళ లపై పత్రికల్లో వచ్చిన కండపుష్టిగల వ్యాసాలను కత్తిరించి, ఒకచోట గుచ్చెత్తడం లంకా చేసిన గొప్ప పని. అసంఖ్యాకంగా ఉన్న అలాంటి సంపుటాలు అన్నమయ్య లైబ్రరీకి అదనపు ఆకర్షణ. ఇంట్లో కొండలుగా పెరిగిపోయిన పుస్తకాలు ఆ వేంకటేశ్వరస్వామి సన్నిధిని చేరాయి. తర్వాత అన్నమయ్య ఉద్యానంలోని భవనాన్ని అలంకరించాయి. లక్షకు పైగా పుస్తకాలను ఆయనొక్కరే వైనంగా చేరవేసి సర్దారు. అది చూశాక నేను అపు రూపంగా చూసుకునే ఎన్సైక్లోపీడియా వాల్యూములు, ప్రారంభంనించీ భారతి సంచికల బైండ్లు, ఆంధ్ర వారపత్రిక ఉగాది సంచికలు, మరికొన్ని మంచి పుస్తకాలు ఆ ఆళ్వార్ చేతిలో పెట్టి బరువు దించుకున్నాను. దేవుడు ప్రత్యక్షమై వాగ్దేవిపట్ల నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకోమంటే, నా అశ్రద్ధవల్ల వసుచరిత్ర ప్రాచీన ప్రతి తాలూకు అనుక్రమణిక పుట రాలిపోయింది. దాన్ని తిరిగి మొలిపించి పుణ్యం కట్టుకోమని లంకా కోరతాడని ఒక ఐతిహ్యం మిత్రుల మధ్య ప్రచారంలో ఉంది. ఒక కుటుంబం యావత్తూ కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. అందరికీ శిరçస్సువంచి నమస్కరిస్తున్నాను. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినం దన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది. ఇలాంటి మాలీలు మన జాతి సంపదలు– వరుసన్ నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారాయణా! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
సంస్కారం లేని చదువు వ్యర్థం!
ఆత్మీయం కొందరికి తాము ఎంతో చదువుకున్నామని, అవతలి వారు ఏమీ చదువుకోలేదనీ, వారికి ఏమీ తెలియదనే భావన అణువణువునా ఉంటుంది. అయితే ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రాన విర్రవీగితే అంతకన్నా అహంకారం మరొకటి ఉండదు. ఉదాహరణకు ఒక గ్రంథాలయంలోకి మనం సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు గొప్పవాడు కాదు. రానివెన్నో అనుకోవడమే గొప్ప. పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్నిరకాల నేలల గురించి చదివాను. ఎన్నోరకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడో’’ అంటాడు. అది సంస్కారం. ఎందుకంటే, చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా, ఆ వినమ్రత లేకుండా ఊరికినే చదువుకోగానే సరిపోదు. అవతలివారి మనస్సు నొప్పించకుండా మాట్లాడటం తెలియాలి. మనం ఏమి చేస్తే ఎదుటివాళ్లు బాధపడతారో తెలుసుకుని ఉండాలి. అలా తెలియకపోతే ఆ చదువు ఎందుకూ పనికి రాదు. -
వేలికొసలపై లక్షల గ్రంథాలు
-అందుబాటులోకి తెచ్చిన జాతీయ డిజిటల్ లైబ్రరీ -విభిన్నాంశాలపై 68 భాషల్లో 76.71 లక్షల పుస్తకాలు బిక్కవోలు (అనపర్తి) : ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికత, కాలక్షేపానికి పుస్తక పఠనం చేసేవారు చాలా మందే ఉన్నారు. కాగితం ధర పెరిగిపోవడంతో పుస్తకాల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పుస్తకాల కొనుగోలు భారంగా మారుతోంది. ఆర్థిక స్థితి బాగున్నవారు పుస్తకాలను కొంటుండగా, కొందరు అద్దెకు తీసుకుంటుంటారు. అయితే ఇప్పడు పైసా ఖర్చులేకుండా లక్షల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్లు, కంప్యూటర్‌తో నిరంతరం కాలం గడుపుతున్న ప్రజానీకానికి అన్నీ డిజిటల్ రూపాల్లోనే అందించాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది మన వేలికొసలతో తెరవగల గ్రంథాలయం లాంటిది. ప్రస్తుత వేసవి సెలవులను పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే మంచిది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఖరగ్‌పూర్ ఐఐటీ సమన్వయంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకూ అవసరమైన విజ్ఞాన సంపదను ఇందులో నిక్షిప్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలు, ఉమ్మడి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ డిజిటల్ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వివరాలు.. 68 భాషల్లో పుస్తకాలు.. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలో ఈ వెబ్‌సైట్‌ను వినియోగించవచ్చు. గతేడాది ఫ్రిబవరిలో ఈ లైబ్రరీకి రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు 76.71 లక్షల పుస్తకాలను ఇందులో పొందుపరిచారు. ఆంగ్గం, హిందీతో పాటు మొత్తం 68 భాషల్లో పుస్తకాలు, సమాచారం లభ్యమవుతున్నాయి. ఉచిత సభ్యత్వం ఇలా.. ఈ గ్రంథాలయం నుంచి సమాచారాన్ని పైసా ఖర్చు లేకుండా పొందవచ్చు. గూగుల్ సెర్చి ఇంజిన్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ‘ఎన్డీఎల్.ఐఐటీకెజీపీ.ఏసీ.ఇన్’ ప్రత్యక్షమవుతుంది. అందులోకి మెంబర్ లాగిన్ క్లిక్ చేయగానే మీ ఈ మెయిల్ అడుగుతుంది. ఇది నమోదు చేయగానే ఆ వెబ్సైట్ నుంచి ఆరు అంకెల పాస్వర్డ్ కనిపిస్తుంది. అది నమోదు చేయగానే సభ్యులుగా చేరినట్లు సమాచారం అందుతుంది. అంశాల వారీగా.. విద్యకు సంబంధించిన అన్ని రకాల పాఠ్యాంశాలు, సామాజిక అంశాలు, వార్తలు, కార్యక్రమాలు, ఆర్టికల్స్, పోటీ పరీక్షలకు మెటీరియల్, వీడియో, ఆడియో పాఠాలు, ప్రశ్నలు, సమాధానాలు, వెబ్ కోర్సులు, పరిశోధనలు, అనేక రకాల విజ్ఞానదాయక పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. 3 లక్షల మంది రచయితలు రాసిన ఏడు లక్షల పుస్తకాలు, 2 లక్షల మంది వివిధ అంశాలపై రాసిన 3 లక్షల క«థనాలున్నాయి. దేశంలోని విశ్వ విద్యాలయాలు సమకాలీన అంశాలపై చేసిన 95 వేలకు పైబడిన పరిశోధనల ఆవిష్కరణలు, ప్రముఖుల రచనలను పొందుపరిచారు. వివిధ రకాల ప్రశ్నా పత్రాలు, సందేహాలు, నిపుణుల సమాధానాలు, వ్యవసాయం, నిపుణుల సమాధానాలు లభ్యమవుతున్నాయి, వ్యవసాయం, భౌతిక, శాస్త్ర సాంకేతిక అంశాలపై వెబ్ కోర్సులు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఉపయోగకరం.. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువత ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ విజ్ఞానం సొంతమవుతుంది. ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ల్రైబరీ ఎంతో ఉపయోగపడుతుంది. వివిధ రంగాల్లో రాణించాలకునే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, శాస్త్రసాంకేతిక పరిశోధనా రంగంలో ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి చిన్ననాటి నుంచే పుస్తకం పఠనం అలవాటు చేసుకోవాలి. వేసవి సెలవుల్లో ఎండల్లో తిరగకుండా విద్యార్థులు ఇంట్లోనే డిజిటల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. వైబీఎస్ ఆచార్యులు, ఉపాధ్యాయుడు, అనపర్తి ఎంతో ప్రయోజనకరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నతస్థాయి కోసం చదివే వారికి డిజిటల్ లైబ్రరీ ఎంతో ప్రయోజనకరం. అనేక రకాల పుస్తకాలను అంతర్జాలంలో అందుబాటులోకి తేవడం సంతోషకరం, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని లక్ష్యాలు సాధించుకోవాలి. -పోకల విజయభాస్కర్, ఎంపీడీఓ, బిక్కవోలు -
గ్రంథాలయాలపై బకాయిల బండ
రూ.కోట్లలో పేరుకుపోతున్న సెస్ ఉద్యోగులకు జీతాలివ్వని వైనం బాలాజీచెరువు(కాకినాడ)/ఆలమూరు (కొత్తపేట) : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో జిల్లా గ్రంథాలయ వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. జిల్లాలో గ్రంథాలయ సెస్ బకాయిలు సమయానికి వసూలు కాకపోవడంతో ఉద్యోగులకు, పింఛన్‌దారులకు సక్రమంగా జీతాలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఉద్యోగులకు, పింఛన్ దారులకు సుమారు రూ.75 లక్షల మేర చెల్లించాల్సిన జీతభత్యాలను సమకూర్చుకోలేని స్థితిలో గ్రంథాలయ జిల్లాశాఖ కొట్టుమిట్టాడుతోంది. గత 12 ఏళ్లలో నెలవారీ జీతాలు అందకపోవడం ఇదే తొలిసారని ఉద్యోగులు చెబుతున్నారు. భర్తీకానీ పోస్టులు జిల్లా కేంద్రమైన కాకినాడ ప్రధాన గ్రంథాలయానికి అనుబంధంగా 119 శాఖ, గ్రామీణ గ్రంథాలయాలు, 146 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. గ్రంథాలయాల్లో 204 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 112 మంది మాత్రమే ఉన్నారు. అందులో 35 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన 92 పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి కనుచూపు మేర కన్పించడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతనాలు రాలేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వైఎస్ హయాంలో ప్రత్యేక గ్రాంటు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టిన తరువాత గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సెస్ బకాయిల వసూలుతో నిమిత్తం లేకుండా జీతభత్యాల కోసం ప్రతిఏటా ప్రత్యేక గ్రాంటును విడుదల చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు విడుదలలో జాప్యం చేస్తుండటంతో జిల్లా గ్రంథాలయశాఖ కేవలం జీత భత్యాల కోసం సెస్ బకాయిలపైనే ఆధారపడుతోంది. జిల్లాలోని పంచాయతీల నుంచి విడుదల కావాల్సిన సెస్ బకాయిలు రూ.రెండు కోట్ల వరకూ ఉండగా తాజాగా పల్లెలో పెంచిన ఇంటిపన్నులో భాగంగా గ్రంథాలయాల సెస్ మూడు రెట్లు పెంచి వసూలు చేస్తున్నారు. కానీ ఆ సెస్‌ను గ్రంథాలయాలకు జమ చేయకుండా పంచాయతీలకు వాడేసుకుంటున్నారు. బకాయిలు ఇవే.. కాకినాడ రూ.7,59,00,000, రాజమహేంద్రవం 7,63,70,481, తుని రూ.23,51,034, మండపేట రూ.19,94,921, సామర్లకోట రూ.24,50,000, పెద్దాపురం 30,23,000, పిఠాపురం రూ.36,29,718, రామచంద్రపురం రూ.21,06, 383, మేజర్ పంచాయతీలు సుమారు రూ.8 కోట్లు సెస్‌లు చెల్లిచడం లేదు ప్రజల నుంచి నీటి పన్ను, ఆస్తి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నును కూడా మున్సిపాలిటీలు, పంచాయతీలు వసూలు చేస్తున్నాయి. కానీ మాకు జమ చేయడం లేదు. రూ.ఐదుకోట్ల16 లక్షలను 2016–17 సంవత్సరానికి విడుదల చేశారు. జనవరి జీతాలు రెండు రోజుల్లో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. సెస్‌లు సక్రమంగా చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి వీలుంటుంది. - ఎన్.వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఉప ముఖ్యమంత్రి రాజప్ప బాలాజీచెరువు(కాకినాడ) : మారిన సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పాఠకులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గ్రంథాలయ ఉద్యమం భారత జాతిని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా నడిపించిందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను ఆదరించాలని కోరారు. గ్రంథాలయాల్లో సాహితీ గ్రంథాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రంథాలయ సెస్ వసూళ్లను వేగవంతం చేసి మండల, ,గ్రామీణశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర గ్రంథాలయ భవన ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రంథాలయ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్‌హౌస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, సభ్యులు గద్దేపల్లి దాసు, పాఠకులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలకు నిర్లక్ష్యపు చెదలు
రూ.16 కోట్ల సెస్ బకాయిలు మూతపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలు భర్తీకి నోచుకోని 130 లైబ్రేరియ¯ŒS పోస్టులు 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు రాయవరం : పిల్లలకు విజ్ఞానం, వినోదం..నిరుద్యోగులకు మేథాశక్తి, పెద్దలకు ఆధ్యాత్మికతను అందించే పుస్తకాలు దొరికే ఏకైక చోటు గ్రంథాలయం. విజ్ఞాన భాండాగారాలుగా వెలుగొందే ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో..అంటూ కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. ప్రస్తుతం పుస్తక భాండాగారాలైన గ్రంథాలయాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సోమవారం నుంచి నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితిపై ’సాక్షి’ కథనం. శాశ్వత భవనాలేవి.. జిల్లా కేంద్రమైన కాకినాడలో సెంట్రల్ లైబ్రరీ ఉంది. జిల్లాలో 98 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. శాఖాగ్రంథాలయాల్లో 58 సొంత భవనాల్లో, 11అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 29 అద్దె లేకుండా పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల్లో ఏలేశ్వరం, సవరప్పాలెం, మలికిపురం తదితర లైబ్రరీలు శిథిలస్థితికి చేరాయి. ఎక్కువగా శాఖా గ్రంథాలయాలు గాలి, వెలుతురు లేని ఇరుకుగదుల్లో నిర్వహిస్తున్నారు. సెస్ బకాయిలు రూ.16కోట్లు.. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలు రూ.14కోట్ల వరకు గ్రంథాలయ పన్నును చెల్లించాల్సి ఉంది. తుని, అమలాపురం, రామచంద్రపురం తదితర మున్సిపాలిటీలు, పలు పంచాయతీల నుంచి గ్రంథాలయ పన్నుగా రూ.రెండుకోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సెస్ బకాయిలు గ్రంథాలయాలకు గుదిబండలా తయారవుతున్నాయి. ఒక్కొక్కటిగా మూతపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలు.. జిల్లాలో 49 గ్రామీణ గ్రంథాలయాలు ఉండగా వీటిలో 25 గ్రామీణ గ్రంథాలయాలు మూతపడ్డాయి. అలాగే 161 పుస్తక నిక్షిప్త కేంద్రాలకు 145 పనిచేస్తున్నాయి. ఏటా కోల్‌కత్తాలో ఉన్న రాజారామ్మోహ¯ŒSరాయ్ లైబ్రరీ ఫౌండేష¯ŒS నుంచి జిల్లాకు పుస్తకాలు వస్తున్నాయి. జిల్లాలో గ్రంథాలయాలు.. కేంద్ర గ్రంథాలయం –1, గ్రేడ్–1 గ్రంథాలయాలు – 5, గ్రేడ్–2 గ్రంథాలయాలు – 11 , గ్రేడ్–3 గ్రంథాలయాలు–82, గ్రామీణ గ్రంథాలయాలు – 45. వీటిలో 24 పనిచేస్తున్నాయి. వారోత్సవాలకు రెట్టింపు నిధులు.. గతేడాది కన్నా వారోత్సవాల నిర్వహణ ఖర్చును రెట్టింపు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.20వేల నుంచి రూ.35 వేలకు, గ్రేడ్–1 గ్రంథాలయానికి రూ.ఐదు వేల నుంచి రూ.10వేలకు, గ్రేడ్–2 గ్రంథాలయానికి రూ.4వేల నుంచి రూ.7వేలకు, గ్రేడ్–3 గ్రంథాలయానికి రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారు. గ్రామీణ గ్రంథాలయానికి రూ.1,000 చొప్పున మంజూరు చేశారు. సిబ్బంది లేమి.. జిల్లాలో 204 లైబ్రరీ పోస్టులకుగాను 77 మంది రెగ్యులర్, 35 మంది ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తుండగా 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ల్రెబ్రేరియ¯ŒS పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. మండల పరిధిలో ఉన్న శాఖా గ్రంథాలయాల్లో సరైన మౌలిక సదుపాయాలు కరవవుతున్నాయి. పలుచోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేదు. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటుండగా, కొన్ని చోట్ల నామమాత్రపు అద్దెతో కాలం వెళ్లదీస్తున్నాయి. వారోత్సవాలు ఇలా.. ‘14న జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం. బాలల దినోత్సవం నిర్వహిస్తారు. 15న పుస్తక సంస్థల సహకారంతో పుస్తక ప్రదర్శన. 16న గ్రంథాలయ రంగంలో ప్రముఖులతో సమావేశం. 17న కవులు, పండితులు, విద్యావేత్తలు, రచయితల సహకారంతో సదస్సులు. 18న ఉన్నత కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వకృ్తత్వ, క్విజ్, ఆటల పోటీల నిర్వహణ. 19న మహిళా దినోత్సవం. 20న అక్షరాస్యతా దినోత్సవం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు. -
గాంధీభవన్ లైబ్రరీని అధ్యయన కేంద్రగా మార్చాలి
కస్టమ్స్, ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ రాజేంద్రన్ కాకినాడ కల్చరల్ : గాంధీజీ జీవిత చరిత్రను వివరించే గ్రంథాలతో గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పరిశోధకులకు ఉపయోగపడే అధ్యయన కేంద్రంగా తయారు చేయాలని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సి.రాజేంద్రన్ సూచించారు. స్థానిక గాంధీభవన్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. గాంధీజీ రచనలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహాత్ముని జననం నుంచి మరణం వరకు ఏర్పాటు చేసిన చిత్రాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి నూలు దండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ అధ్యక్షుడు దంటు సూర్యారావు, కార్యదర్శి డీవీఎన్ శర్మ, అల్లూరి సురేంద్ర, వాసా సత్యనారాయణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇదే చివరి అవకాశం!
► ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక ► ఇక తామే రంగంలోకి దిగుతాం ► తీవ్రంగా స్పందించిన సీజే అన్నా గ్రంథాలయం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదే చివరి అవకాశం అని,చేతకాకుంటే, తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం విచారణ సమయంలో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీవ్రంగా స్పందించడంతో ప్రభుత్వానికి మరో మారు షాక్ తగిలినట్టు అయింది. సాక్షి, చెన్నై : కోట్టూరు పురంలో డీఎంకే హయంలో అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద గ్రంథాలయంగా రూపుదిద్దుకున్న దీనికి, దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నా పేరును నామకరణం చేశారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, డీఎంకే పథకాల్ని తుంగలో తొక్కే ప్రక్రియలో భాగంగా, అన్నా లైబ్రరీని నిర్వీర్యం చేసేందుకు సిద్ధం అయింది. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యారుు. ఆ గ్రంథాలయంలో వసతుల కరువు, తదితర అంశాల్ని హైకోర్టు తీవ్రంగానే పరిగణించింది. హైకోర్టు నేతృత్వంలోని కమిటీ ఆ గ్రంథాలయాన్ని సందర్శించి నివేదికను సైతం సమర్పించింది. ఆ నివేదికలో ప్రభుత్వ తీరు స్పష్టం అయింది. దీంతో ఆ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచాలని, అన్ని రకాల వసతుల కల్పన మీద దృష్టి పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వానికి హైకోర్టు పలు మార్లు ఆదేశాలు ఇచ్చినా ఫలితం శూన్యం. రెండు నెలల క్రితం , ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహాదేవన్లతో కూడిన బెంచ్ ముందు సాగిన విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చుకున్నారు. రెండు నెలలు గడువు ఇవ్వాలని సమయాన్ని కోరారు. అయితే, ఆ సమయం ముగిసినా, ఇంత వరకు ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద అధికార వర్గాలు దృష్టి పెట్ట లేదు. శుక్రవారం మళ్లీ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించక తప్పలేదు. ఇదే చివరి అవకాశం ఉదయం విచారణ సమయంలో పిటిషనర్ల తరఫున న్యాయవాది విల్సన్ హాజరై వాదనల్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ముందు వినిపించారు. గడువు మీద గడువు ఇస్తున్నా, ఇంత వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అక్కడ ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేదని వివరించారు. ఇంతలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకునే యత్నం చేయడంతో, బెంచ్ తీవ్రంగానే స్పందించింది. ఎన్ని సార్లు గడువు ఇవ్వాలని, కోర్టు ఆదేశాల్ని అమలు చేయరా..? అని ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని బెంచ్ వ్యక్తం చేసింది. ఇక, గడువులు లేదు అని, ఇదే చివరి హెచ్చరికగా అవకాశం ఇస్తున్నామని , ఇకనైనా చలనం లేకుంటే, తామే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. చేత కాకుంటే, తామే కమిటీని నియమించి, ఆ గ్రంథాలయం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 14 వరకు ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ అదే తేదీకి వారుుదా వేశారు. -
శిథిలావస్థలో గ్రంథాలయం
తరిగొప్పుల(నర్మెట) : పది రోజుల క్రితం కురిసన వర్షాలకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఆ పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది భవనం ముందు ఆరబెట్టడంతో ‘సాక్షి’ కంటపడింది. తరిగొప్పుల గ్రామ గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఎప్పుడూ కూలుతుందోనని భయపడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గ్రంథాలయానికి రావడానికి పాఠకులు జంకుతున్నారు. ఎంతో సమాచారం, చరిత్ర కలిగిన పుస్తకాలు పూర్తిగా నానిపోవడంతో సంచుల్లో ఓ గదిలో భద్రపరిచారు. మరికొన్ని వర్షానికి నానిపోయి చినిగిపోయాయి. సంబంధిత అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని స్పందించి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శిథిలావస్థలో గ్రంథాలయం
ధర్మారం(పెద్దపల్లి జిల్లా): ప్రజలకు విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయం పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవటంతో పాఠకులకు సరైన రీతిలో సేవలందించలేకపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాల్సిన విలువైన పుస్తకాలు వానకు తడుస్తూ చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది. ధర్మారం మండల కేంద్రంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినప్పటికి ఫలితం లేదని పాఠకులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరి æ పైకప్పు నుంచి వర్షపు నీరు వస్తోంది. స్థానిక లైబ్రెరియన్ పై కప్పు పెంకుల మీద ప్లాస్టిక్ కవర్లు కప్పించారు. అయినా వర్షం పడుతున్నప్పుడు ఉరుస్తోంది. దీంతో విలువైన గ్రంథాలు, దిన, వారపత్రికలు నీటిలో తడుస్తున్నాయి. ఇరుకు గదుల్లో గ్రంథాలయం ఉండటంతో విలువైన పుస్తకాలను భద్రపర్చటానికి స్థలం లేక పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. పురాతన కాలంనాటి విషయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నా శిథిలావస్థకు చేరిన భవనంతో ఫలితం లేకుండా పోతోందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయం గ్రామం చివరలో ఉండటంతో ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రంథాలయానికి పక్క భవనాన్ని నిర్మించుటకు నిధులు మంజూరు చేయించాలని పాఠకులు కోరుతున్నారు. భూమి కేటాయించాలి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వం భూమిని గ్రంథాలయ భవనం కోసం కేటాయించాలి. ప్రసుత్తం ఉన్న చోట సరైన వసతులు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ భవనాన్ని నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. -బత్తిని సంతోష్, బొట్లవనపర్తి నిధులు మంజూరు చేయాలి గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలి. నిరుద్యోగులకు పోటీపరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. సొంత భవనం నిర్మించేలా చూడాలి. - ఎండీ.రఫీ, ధర్మారం అందుబాటులో ఉంచాలి పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచాలి. త్వరలో జరగబోయే గ్రూప్ పరీక్షలకు అవసరమయ్యో పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - మోహన్‌నాయక్, -
గ్రంథాలయ సెస్ వసూలుకు చర్యలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్లైన్లో గ్రంథాలయ శాఖ ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ శ్రీరామమూర్తి బుధవారం సభ్యులతో సమీక్షించారు. గొల్లలకోడేరు, వేలూర్పు గ్రంథాలయ భవనాల నిర్మాణానికి చేరో రూ.26 లక్షలు, భీమవరం శాఖా గ్రంథాలయం మరమ్మతులకు రూ.6 లక్షలు, ఎలక్ట్రికల్ వాటర్ మోటారు తదితర మరమ్మతులకు రూ.6 లక్షలు, జంగారెడ్డిగూడెం గ్రంథాలయ మరమ్మతులకు రూ.5 లక్షలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ పై అంతస్తులోని భవనం మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిమిత్తం రూ.6.50 లక్షలు, ఆచంట గ్రంథాలయం ఆధునికీకరణకు సభ్యులు తీర్మానించారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సై, గ్రామ కార్యదర్శులు, గ్రూప్ వన్, టూ పోస్టులకు ఉచితంగా ఏలూరు శాఖా గ్రంథాలయంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఇస్తామన్నారు. డీఈవో డి.మధుసూదనరావు, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్వి సీహెచ్ మదారు, గ్రంథాలయ సంస్థ సభ్యులు బండి సుజాత, కొడవలి వెంకటరమణ, లైబ్రేరియన్ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
గ్రంథాలయ సెస్ వసూలుకు చర్యలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): జిల్లాలో 2015–16లో పంచాయతీల ద్వారా 8 శాతం గ్రంథాలయ సెస్సును ఆన్లైన్లో గ్రంథాలయ శాఖ ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, 2011 నుంచి పంచాయతీల ద్వారా సెస్ త్వరితగతిన వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చైర్మన్ శ్రీరామమూర్తి బుధవారం సభ్యులతో సమీక్షించారు. గొల్లలకోడేరు, వేలూర్పు గ్రంథాలయ భవనాల నిర్మాణానికి చేరో రూ.26 లక్షలు, భీమవరం శాఖా గ్రంథాలయం మరమ్మతులకు రూ.6 లక్షలు, ఎలక్ట్రికల్ వాటర్ మోటారు తదితర మరమ్మతులకు రూ.6 లక్షలు, జంగారెడ్డిగూడెం గ్రంథాలయ మరమ్మతులకు రూ.5 లక్షలు, జిల్లా కేంద్ర గ్రంథాలయ పై అంతస్తులోని భవనం మరమ్మతులు, ఆధునికీకరణ పనులు నిమిత్తం రూ.6.50 లక్షలు, ఆచంట గ్రంథాలయం ఆధునికీకరణకు సభ్యులు తీర్మానించారన్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సై, గ్రామ కార్యదర్శులు, గ్రూప్ వన్, టూ పోస్టులకు ఉచితంగా ఏలూరు శాఖా గ్రంథాలయంలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఇస్తామన్నారు. డీఈవో డి.మధుసూదనరావు, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టర్ వి.భాస్కరనరసింహం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్వి సీహెచ్ మదారు, గ్రంథాలయ సంస్థ సభ్యులు బండి సుజాత, కొడవలి వెంకటరమణ, లైబ్రేరియన్ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
హుజూర్నగర్ : గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం పట్టణానికి చెందిన హెచ్ఎస్బీసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధిర మంజీర అందజేసిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను ఆమె తండ్రి మధిర ప్రతాప్‌రెడ్డి స్థానిక శాఖ గ్రంథాలయానికి అంద జేశారు. అనంతరం ప్రతాప్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామి, జూలకంటి వాణి, శ్రీనివాస్‌గౌడ్, ఊరె వెంకయ్య, కనకారెడ్డి, దొడ్డా నర్సింహారావు, వెంకటకృష్ణ, జాఫర్, రాజు, అబ్రహాం, రేణుక, శ్రీను, సీతారాం పాల్గొన్నారు. -
విజ్ఞానదివిటి
వనపర్తి టౌన్: మన చరిత్రను తెలుసుకోవాలని ఉందా? సాహితీపరిమళాన్ని ఆస్వాదించాలని ఉందా? చిన్నారులకు చిట్టిపొట్టి కథలు వినిపించాలని ఉందా? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. వనపర్తిలోని సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయానికి ఒక్కసారి వెళ్తేచాలు బోలెడన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ విజ్ఞానభాండాగారానికి మహర్దశ కలగనుంది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 గ్రంథాలయంగా మారనుండడంతో ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. జిల్లా గ్రంథాలయాలకు సాధారణంగానే గ్రేడ్1 గుర్తింపు రావడం, దీనికితోడు వనపర్తిశాఖకు అన్ని అర్హతలు ఉండడం, రెఫరెన్స్ విభాగం, దినపత్రికలు అందుబాటులో ఉండడంతో నిరుద్యోగులు, సాహితీప్రియులు, పాఠకులకు మేలు చేకూరనుంది. అంతేకాకుండా చిన్నపిల్లల గ్రంథాలయం, కంప్యూటర్ సౌకర్యం, చౌకగా నెట్‌సేవలు అందుబాటులోకి రానున్నాయి. సంస్థానాధీశుల కాలంలోనే.. వనపర్తిలో స్వాతంత్య్రానికి పూర్వమే గ్రంథాలయాన్ని 1936లో అష్టభాష బహిరి గోపాల్‌రావు గ్రంథాలయంగా పిలిచేవారు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సంపన్నులు సైతం ఇక్కడికే వచ్చి చదివేవారని స్థానికులు చెబుతుంటారు. సమరయోధులు, వనపర్తి తొలి శాసనసభ్యుడైన సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారకార్థం వనపర్తి పట్టణ నడిబొడ్డున సాహితీప్రియులు, ప్రజాప్రతినిధుల సూచన మేరకు గ్రంథాలయ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. 1996లో సురవరం ప్రతాప్‌రెడ్డి స్మారక గ్రంథాలయంగా మార్పు చెందింది. గ్రంథాలయం సాధారణ పాఠకులకే కాకుండా వివిధ వత్తి, విద్య, నైపుణ్యం అభ్యసించే విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. ఆధునిక, సాంకేతికవిద్యకు సంబంధించిన స్టడీ మెటిరియల్ లభిస్తుండడంతో పేద విద్యార్థులకు అనుకూలంగా ఉంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎనలేని గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. విశిష్టమైన ఖ్యాతి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మినహా ఎక్కడాలేని విధంగా 2150మంది పాఠకులు వనపర్తి గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం కాలానికి అనుగుణంగా 13,595 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తరువాత వెలువడిన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతిరోజు సుమారు 200మంది పాఠకులు గ్రంథాలయానికి విచ్చేస్తుంటారు. జిల్లా ఏర్పాటుతో ఒక లైబ్రేరియన్, అటెండర్, జిల్లా చైర్మన్, జిల్లా కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కొలువుదీరనున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎందరినో నిలబెట్టింది వనపర్తి గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరెందరో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్, నెట్ వంటి పరీక్షల్లో విజయం సాధించారు. ఇటీవల నలుగురు అధ్యాపకులు తెలుగులో పీహెచ్డీ చేసేందుకు అనువైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయని, వాటిని వినియోగించుకున్నాయి. జిల్లా గ్రంథాలయంగా మారితే ఈ ప్రాంతప్రజలకు ఎంతోమేలు కలుగుతుంది. – నరసింహా, ఇన్చార్జ్ గ్రంథాలయాధికారి, వనపర్తి -
విజ్ఞానంపై నిర్లక్ష్యం
శిథిలావస్థలో గ్రంథాలయం గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువు మూడేళ్లుగా ఇన్చార్జి అధికారే.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా పట్టించుకోని పాలకులు జోగిపేట: నిజాం నిరంకుశ పాలనలో గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువైంది.. ఎందరినో చైతన్యవంతులను చేసింది. మరిఎందరికో దిక్సూచిగా నిలిచిన జోగిపేటలోని గ్రంథాలయంపై పాలకుల ఆదరణ కరువైంది. నాందేడ్ -అకోలా జాతీయ రహదారికి కనుచూపు మేరలో ఉన్న అందోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. విజ్ఞానాన్ని సంపాదించి పెట్టే బాండాగారమైనా పట్టించుకున్న పాపాన పోలేదు. 1971వ సంవత్సరంలో జోగిపేటలోని పోస్టాఫీసు పక్కన నిర్మించారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనన్న పరిస్థితుల్లో ఉంది. వర్షం కురుసినప్పుడల్లా గోడలు పూర్తిగా తడిసి పోతున్నాయి. భవనం పై భాగంలో కూడా గోడలు కూలిపోతున్నాయి. చూడడానికే భవనం భయమేసే విధంగా తయారయ్యింది. ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో పాఠకులు సైతం గ్రంథాలయానికి వచ్చేందుకు జంకుతున్నారు. గ్రంథాలయంలో 18,900 వివిధ రకాల పుస్తకాలున్నాయి. ప్రతి రోజూ 11 దినపత్రికలు వస్తాయి. భవనం చుట్టూ పిచ్చి మొక్కలే.. గ్రంథాలయం చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. సుమారు 4 ఫీట్ల ఎత్తులో ఈ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాములు కూడా సంచరిస్తూ ఉన్నాయి. పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారయ్యింది. నగర పంచాయతీ సిబ్బంది కూడా శుభ్రపరిచేందుకు ఆసక్తి చూపడంలేదు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా... గ్రంథాలయ భవనం రోడ్డుకు కొద్ది దూరంలో ఉండడంతో రాత్రి వేళ అటువైపుగా ఎవరూ వెళ్లరు. దీంతో భవనం వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. పట్టించుకోని పాలకులు అందోలు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలెవ్వరూ ఇప్పటి వరకు గ్రంథాలయంవైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం పుస్తకాలు, దినపత్రిలకు నిధులను కేటాయిస్తున్నా భవనం మరమ్మతులకు మాత్రం ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదు. ఏడాదికి వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఆ తర్వాత పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలకు ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ది నిధుల కింద లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులోంచి కొంత మేర నిధులను కేటాయించి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు బాబూమోమాన్ ఆ దిశగా చర్యలు తీసుకొని పాఠకుల మెప్పు పొందాలని పలువురు కోరుతున్నారు. హమీ మరచిన జిల్లా చైర్మన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టిన తర్వాత జోగిపేట గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ తోపాజి అనంతకిషన్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హమీ ఇచ్చారు. హమీ ఇచ్చి సుమారు 4 ఏళ్లు కావస్తుంది. ప్రహరీని కూడా నిర్మిస్తానని అప్పట్లో ఆయన అన్నారు. కాని నేటికీ అమలు కాలేదు. మూడేళ్లుగా ఇన్చార్జి అధికారి జోగిపేట గ్రంథాలయ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో మూడు సంవత్సరాలుగా ఇన్చార్జి అధికారే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2013 నుంచి రాజ్‌కుమార్ అనే అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అటెండర్ కూడా గత సంవత్సరమే రిటైర్డ్ కావడంతో నెలకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి ఒక వ్యక్తిని నియమించారు. ఇన్చార్జి అధికారి ప్రతి బుధ, ఆదివారాల్లో మాత్రమే విధులను జోగిపేటలో నిర్వహిస్తారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి జోగిపేటలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. స్థానికంగా పీజీ వరకు కళాశాలలు ఉండడంతో విద్యార్థులకు అవసరమైన సమాచారం లైబ్రరీలో లభించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన జోగిపేటలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పోటీ ప్రపంచానికి తగ్గట్లు సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. - ఉలువల శ్రీనివాస్, జోగిపేట నూతన భవనం నిర్మించండి 45 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలి. గ్రంథాలయం వద్ద జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి. ఎమ్మెల్యే తన అభివృద్ధి నిధులను కేటాయించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. - ఎండీ ఫైజల్ అహ్మద్, జోగిపేట -
గ్రంథాలయానికి పుస్తకాల బహూకరణ
హుజూర్నగర్: పోటీపరీక్షలకు చెందిన రూ. 5 వేల విలువైన పుస్తకాలను పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య మహిళలు మంగళవారం శాఖా గ్రంథాలయానికి బహూకరించారు. ఈç Üందర్భంగా శాఖా గ్రంథాలయ చైర్మన్ కుంట సైదులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం దాతలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో దాతలు పొట్టుముత్తు సోమలక్ష్మి, తమ్మన సుజాత, కొత్త కళావతి, వంకాయల పద్మావతి, గ్రంథాలయాధికారి వీరస్వామి, ఊరె వెంకయ్య, సైదానాయక్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
గ్రంథాలయ అప్‌గ్రేడ్‌కు మోక్షం
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మానుకోట శాఖ గ్రంథాలయం అప్‌గ్రేడ్ కానుంది. ఈ గ్రంథాలయం ప్రస్తుతం గ్రేడ్ 3గా ఉంది. గ్రంథాలయ కమిటీ, పలు సంఘాలు గ్రేడ్ 2 కోసం కొన్నేళ్లుగా ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయితే జిల్లా ఏర్పాటుతో మానుకోట గ్రంథాలయం గ్రేడ్–1 అయ్యే అవకాశం ఉం ది. 1939 సంవత్సరంలో బాపూజీ పేర గ్రంథాలయాన్ని ఏర్పా టు చేయగా 1964లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈ గ్రం థాలయంలో 24వేల పుస్తకాలు, 2,450 మంది సభ్యులు ఉన్నా రు. రోజూ వచ్చే పాఠకుల సంఖ్య 500కు పైగా ఉంటుంది. పాఠకుల సంఖ్య మేరకు గ్రంథాలయం అభివృద్ధి జరగలేదు. ఉన్న రెండు గదుల్లో ఒకటి శిథిలావస్థకు చేరింది. దీంతో రీడింగ్ హాల్లోనే పుస్తకాలు భద్రపరుస్తున్నారు. క్రమంగా గ్రంథాలయానికి ఆదరణ కరువైంది. రెండేళ్లలో పోటీ పరీక్షల మెటీరి యల్, ఇతర పుస్తకాలు రావడంలేదు. 17 పుస్తకాలు మాత్రమే వచ్చాయని సిబ్బంది తెలిపారు. మానుకోట గ్రంథాలయం గ్రేడ్–3గా ఉండగా నర్సంపేట, జనగామ మాత్రం గ్రేడ్–2లో ఉన్నా యి. గ్రేడ్–2 కోసం ఎంతోకాలంగా కమిటీ సభ్యులు, పలు సంఘాల, పలు పార్టీలు పోరాడాయి. ఇక్కడ కనీసం మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేవు. గ్రంథ పాలకుడు (లైబ్రేరియన్) కూడా ఇన్చార్జే ఉన్నారు. మరో ఫుల్‌టైమ్ వర్కర్ పనిచేస్తున్నా రు. జంగిలిగొండ, సబ్జైల్లో బుక్ డిపాజిట్ సెంటర్లు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) కొనసాగుతున్నాయి. నంబర్ వన్ గ్రేడ్.. మానుకోట జిల్లా ఏర్పాటుతో మానుకోట శాఖ గ్రంథాలయం గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1కు అప్‌గ్రేడ్ కానుంది. గ్రేడ్–1 అయితే అన్ని హంగుల భవనం, ఇంటర్నెట్ సౌకర్యం, పుస్తకాలు, సిబ్బంది సంఖ్య పెరుగుదల, ఇతర సౌకర్యాలు మెరుగుపడతాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచే ఉంటుంది. గ్రేడ్ 2లో వార్తా పత్రికలు తప్పా పుస్తకాల సెక్షన్ ఉండదు. కానీ గ్రేడ్–1 అయితే పలు రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. -
ఐఏఎస్ పరీక్షపై అవగాహన సదస్సు నేడు
విజయవాడ (సత్యానారాయణపురం) : ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు చిత్తరంజన్ శాఖా గ్రంథాలయం అధికారిణి కోగంటి పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గ్రంథాలయంలో నిర్వహించే కార్యక్రమానికి ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరావు పాల్గొంటారని చెప్పారు. -
గ్రంథాలయంలో స్టేజీ షెల్టర్ ప్రారంభం
హుజూర్నగర్ : పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేజీ షెల్టర్‌ను శుక్రవారం దాత బూర్లె లక్ష్మీనారాయణ, శేషమ్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాఖ గ్రంథాలయ అధ్యక్షుడు కుంట సైదులు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి దాతలు చేయూతనందించడం అభినందనీయమన్నారు. అనంతరం స్టేజీ షెల్టర్ దాతలను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వీరస్వామి, శ్రీనివాస్, వెంకయ్య, నాగేందర్, నారాయణ, సైదులునాయక్, వెంకట్రాజు, మౌలాలీ, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ష్! ఇది లైబ్రరీ!
లైబ్రరీలో ఎవరైనా పుస్తకంలా ఉండాల్సిందే. అంటే... సైలెన్స్‌గా ఉండాల్సిందే. కానీ చైనాలోని ఈ అధునాతన గ్రంథాలయ భవంతిలోకి అడుగుపెడితే మాత్రం ఎవరూ సైలెంటుగా ఉండలేరు! వెళ్లీవెళ్లగానే ‘వావ్’ అని ఆశ్చర్యపోతారు. తర్వాత ‘అమేజింగ్’ అనేస్తారు. పుస్తకం ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్జిన్లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసు మళ్లినవారు కూర్చొని చదువుకోడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది. 34,200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంథాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లుంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న కల్చరల్ సెంటర్లో ఒక భాగం ఈ లైబ్రరీ. బిన్హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న ఈ కల్చరల్ సెంటర్లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా.