- ఉప ముఖ్యమంత్రి రాజప్ప
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
Published Mon, Nov 14 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
బాలాజీచెరువు(కాకినాడ) :
మారిన సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పాఠకులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గ్రంథాలయ ఉద్యమం భారత జాతిని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా నడిపించిందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను ఆదరించాలని కోరారు. గ్రంథాలయాల్లో సాహితీ గ్రంథాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రంథాలయ సెస్ వసూళ్లను వేగవంతం చేసి మండల, ,గ్రామీణశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర గ్రంథాలయ భవన ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రంథాలయ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్‌హౌస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, సభ్యులు గద్దేపల్లి దాసు, పాఠకులు పాల్గొన్నారు.
Advertisement