issue
-
ప్రాణం తీసిన చీర గొడవ
శామీర్‌పేట్: చీర కారణంగా చెలరేగిన వివాదం తల్లి, కుమార్తె మధ్య ఘర్షణకు దారితీయగా అడ్డు వచ్చిన తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట, పెద్దమ్మ కాలనీలో హన్మంతు (50), పెద్దమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బుధవారం తల్లి, కుమార్తెకు చీర విషయమై గొడవ జరిగింది. ఈ విషయంలో తండ్రి హన్మంతు, పెద్దకొడుకు నర్సింహ జోక్యం చేసుకోవడంతో వారి మధ్య ఘర్షకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తండ్రిపై రోకలిబండతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితుడి రిమాండ్... శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
-
ఢిల్లీ కాలుష్యంపై కాప్-29లో చర్చ
బాకు: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీసింది. అజర్బైజాన్ రాజధాని బాకులో పర్యావరణంపై జరిగిన కాప్-29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది.కాప్-29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ ఢిల్లీలోని ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్ మీటర్‌కు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికస్థాయి కాలుష్యం నమోదవుతున్నదన్నారు. బ్లాక్ కార్బన్, ఓజోన్, శిలాజ ఇంధనాల దహనం, ఫీల్డ్ మంటలు వంటి అనేక కారణాలతో కాలుష్యం ఏర్పడుతున్నదని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సివున్నదన్నారు.ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారిందని, అక్కడి ప్రజలు ప్రతిరోజూ 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారన్నాని ఖోస్లా పేర్కొన్నారు. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుందని, ఇటువంటి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.గ్లోబల్ క్లైమేట్ అండ్ హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ కోర్ట్నీ హోవార్డ్ కెనడాలో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తూ 2023లో అడవిలో కార్చిచ్చు కారణంగా, వాయు కాలుష్యం ఏర్పడి 70 శాతం జనాభా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రీత్ మంగోలియా సహ వ్యవస్థాపకుడు ఎంఖున్ బైయాంబాడోర్జ్ తమ దేశంలోని తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే నగరాల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు. -
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-ఎంయూఎల్) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. -
లోక్‌సభ అభ్యర్థికి గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కాజల్ నిషాద్కు గుండెపోటుకు గురయ్యారు. ఆమెను వెంటనే లక్నోలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 5న ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమె స్థానిక స్టార్ హాస్పిటల్లో చేరారు. అయితే ఏప్రిల్ 7న అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు రావడంతో వైద్యుల సూచన మేరకు లక్నోకు తరలించారు. కాజల్ నిషాద్‌ను అంబులెన్స్‌లో లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. తొలుత ఆమె డీహైడ్రేషన్ కారణంగా స్టార్ హాస్పిటల్లో చేరారు. తరువాత ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో చికిత్స పొందుతున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో ఎంతో కీలకమైనది. గతంలో సీఎం యోగి ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం భోజ్‌పురి నటుడు రవికిషన్ ఈ స్థానానికి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా రవికిషన్ బీజేపీ తరపున గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. రవికిషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ తరపున కాజల్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? వాళ్ల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న శ్రామికులపై కనికరం లేదా? సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా?.. .. హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొడుతున్న మీకు.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు.. రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..? నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..?? ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku — KTR (@KTRBRS) March 20, 2024 -
జార్ఖండ్‌లో కొలిక్కిరాని ఇండియా కూటమి సీట్ల కేటాయింపు
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అయితే జార్ఖండ్‌లో ఎన్‌న్డీఏ కూటమి సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దాని మిత్రపక్షాలు కూడా ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇండియా కూటమిలో సీట్ల కేటాయింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రెండు సీట్ల విషయంలో చిక్కుముడి పడిందని సమాచారం. సీట్ల కేటాయింపు విషయంలో ఆర్జేడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాలము సీటు ఆర్జేడీకి ఖరారుకాగా, చత్రా సీటు కోసం ఆర్జేడీ కూడా పట్టుపడుతోంది. మంత్రి సత్యానంద్ భోక్తా ఈ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఈ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఆర్జేడీ సీట్ల కేటాయింపులో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఆయన బీహార్ సమీకరణల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో జార్ఖండ్‌లో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతోంది. లోహర్దగా సీటు కోసం అటు జేఎంఎం, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. జేఎంఎం నుంచి చమ్రా లిండా ఈ సీటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు హజారీబాగ్ స్థానంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ దొరకలేదు. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
2023లో భారత్- చైనా సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్‌లోని తూర్పు లడఖ్‌లో 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత కూడా చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరించిన అదనపు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోలేదు. ఈ విషయంలో చైనా అనుసరించిన వైఖరి కారణంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2023లో కూడా సాధారణ స్థాయికి రాలేదు. ఈ నేపధ్యంలో జరిగిన పలు దౌత్య, సైనిక చర్చల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా దళాలతో గతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణల్లో నలుగురు చైనా సైనికులు మరణించారు. ఈ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో అప్పటికే కొనసాగుతున్న ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి, లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికులను మోహరించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య రెండు అనధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టంభనలోనే ఉన్నాయి. పాంగోంగ్ లేక్ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో 2020, మే 5 నుంచి ప్రతిష్టంభన నెలకొంది. 2020, జూన్‌లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారత్, చైనా సైనికుల మధ్య మూడేళ్లకు పైగా ప్రతిష్టంభన నెలకొంది. చైనా-భారత్ సంబంధాల ప్రస్తుత స్థితికి సంబంధించి చైనాలోని మాజీ భారత రాయబారి అశోక్ కాంత్ మాట్లాడుతూ 2020 నుండి నాలుగు సంవత్సరాలుగా రెండు వైపులా మోహరించిన అదనపు దళాల ఉపసంహరణకు సంబంధించి గణనీయమైన పురోగతి కనిపించలేదు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్య కారణంగా, తూర్పు లడఖ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది. ఇరు దేశాల సంబంధాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరస్పర ఆమోదయోగ్యమైన, వేగవంతమైన పరిష్కారం కోసం భారతదేశం, చైనాలు 20 రౌండ్ల చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఐదు సంఘర్షణ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకున్నట్లు కాంత్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పితే తప్ప చైనాతో సంబంధాలు సాధారణ స్థాయికి చేరవని భారత్ చెబుతోంది. అయితే ద్వైపాక్షిక సంబంధాలను పక్కనపెట్టి, సరిహద్దుల్లోని పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలని చైనా.. భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇది కూడా చదవండి: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
భారత్‌లో బంగ్లా మహిళ రహస్య నివాసం.. 30 ఏళ్లకు బయటపడిన బాగోతం!
యూపీలోని బరేలీలో గత 30 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళ అక్రమంగా భారత్‌కు వచ్చి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇక్కడే నివసిస్తోంది. తాజాగా ఆమె పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఉదంతం పోలీసు శాఖలో కలకలం రేపింది. అక్రమంగా భారత్‌లో ఉంటున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లోని జోధోపూర్‌కు చెందిన ఈ మహిళ పేరు అనితా దాస్. ఆమె దేవ్రానియాలోని ఉదయపూర్ గ్రామానికి చెందిన మంగళ్ సేన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతని భార్యగా ఇక్కడే ఉంటోంది. ఆ మహిళ వయస్సు 55 సంవత్సరాలు. అనిత ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా పోలీసులకు ఆమె గురించి తెలియకపోవడం విశేషం. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో అనిత వారిని చూడటానికి బంగ్లాదేశ్ వెళ్లాలని అనుకుంది. ఈ నేపధ్యంలోనే ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తులో ఆమె తన స్థానిక చిరునామాతో పాటు బంగ్లాదేశ్ చిరునామాను కూడా రాసింది. అలాగే పాస్‌పోర్ట్‌లో పుట్టిన స్థలం కాలమ్ ఉన్న చోట ఆమె బంగ్లాదేశ్ అని రాయడంతో ఆమె బాగోతం బయటపడింది. పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలినలో ఆమె బంగ్లాదేశీ అనేది స్పష్టమైంది. వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అక్రమంగా భారత్‌లో ఉంటున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అనిత బంగ్లాదేశ్‌కు చెందినదనే సంగతి తమకు కూడా తెలియదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అనిత ఈ గ్రామంలో 30 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమెకు ఐదుగురు సంతానం. ఇంతకాలం ఆమె స్థానికురాలేనిని గ్రామస్తులంతా భావించారు. ఇది కూడా చదవండి: గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు.. -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
నేపాల్‌లో ‘డ్రాగన్’ ఆటలకు భారత్ ఎలా చెక్ పెట్టింది?
చైనా రుణంతో నేపాల్‌లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్‌వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు? లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది. గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు. లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది. గత ఏడాది డిసెంబర్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు. కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
92 శాతం కౌలురైతులకు సీసీఆర్సీలు
సాక్షి, అమరావతి: కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు పంట సాగుదారుల హక్కుల కార్డు (సీసీఆర్సీ)ల జారీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ప్రభుత్వం 92 శాతం లక్ష్యాన్ని సాధించింది. కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వడంతోపాటు వారికి బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు మంజూరు చేయించడంపై ప్రత్యేకదృష్టి సారించింది. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య అవగాహన ఒప్పందాలను కుదిర్చి భూ యజమానులకు నష్టం లేకుండా కౌలురైతులకు మేలుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే కౌలురైతులకు సీసీఆర్సీలు జారీచేసి వీలైనంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రతి వారం కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్నారు. కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడంపై సీఎస్ ఇటీవల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 8.81 లక్షలమంది కౌలురైతులకు సీసీఆర్సీలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 8.10 లక్షలమందికి (92 శాతం) కార్డులు జారీచేశారు. 13 జిల్లాల్లో లక్ష్యానికి మించి ఈ కార్డులు జారీచేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా లక్ష్యాలను సాధించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. కౌలురైతులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులున్న వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకర్ల కోసం లోన్ చార్జ్ క్రియేష్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఈ–క్రాప్‌తో కౌలురైతుల రుణ ఖాతాలను అనుసంధానించనున్నట్లు చెప్పారు. బ్యాంకులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.948.77 కోట్ల మేర కౌలురైతులకు రుణాలిచ్చాయని తెలిపారు. మరింతమంది కౌలురైతులకు రుణాలు మంజూరు చేయించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాంకర్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, బ్రాంచీల స్థాయిలో మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ యజమానులకు ఎటువంటి హాని కలగకుండానే కౌలురైతులకు రుణాల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విషయంపై భూ యజమానులకు అవగాహన కల్పించి కౌలురైతులకు సహకరించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. -
పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి?
2024 జనవరి 8 నుంచి కెనడాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈఏడాది పంజాబ్‌కు చెందిన 36 వేల మంది విద్యార్థులు కెనడాలోని వివిధ విద్యాలయాల్లో అడ్మిషన్ తీసుకున్నారు. వీరిలో 70 శాతం మంది విద్యార్థులకు వీసాలు వచ్చాయి. విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే కెనడా- భారత్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కెనడాలో 2,09,930 మంది భారత విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతుండగా, 80,270 మంది విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు. కెనడాలోని వివిధ కళాశాలలను డిప్లొమా కోర్సులను అందిస్తాయి. విశ్వవిద్యాలయాలు బ్యాచిలర్, మాస్టర్స్ డాక్టోరల్ డిగ్రీలను అందిస్తాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డు స్టాండింగ్ కమిటీ నుండి వచ్చిన డేటా ప్రకారం కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి 22.3 బిలియన్ కెనడియన్ డాలర్లకు మించిన అధిక మొత్తాన్ని అందిస్తున్నారు. తీవ్రతరమవుతున్న దౌత్య సంక్షోభం కెనడా విద్యావ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్య కోసం వలస వచ్చే భారతీయ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయనుంది. వీసా వ్యవహారాల నిపుణుడు సుకాంత్ తెలిపిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులు కెనడియన్ విద్యార్థుల కంటే రెండింతల మొత్తాన్ని ఆ దేశ విద్యా వ్యవస్థకు అందిస్తున్నారు. అంటారియో ప్రభుత్వం అందించే నిధుల కంటే ఇవి అధికంగానే ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో చెల్లుబాటు అయ్యే స్టడీ వీసాతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది జనవరిలో తరగతులకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లనున్న సర్బ్జిత్ కౌర్ మాట్లాడుతూ తమకు జనవరి నుండి క్లాసులు ప్రారంభం కానున్నాయని, కెనడాలోని వాంకోవర్‌లో అడ్మిషన్ పూర్తయిందని, టిక్కెట్ కూడా బుక్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు కెనడా- భారత్ మధ్య క్షీణించిన సంబంధాలు కారణంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారతదేశం- కెనడాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కెనడాలో తమ పిల్లల చదువుపై తీవ్ర ప్రభావంచూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం పంజాబ్ నుండి ప్రతి సంవత్సరం 68,000 కోట్ల రూపాయలు అక్కడి విద్యా వ్యవస్థకు చేరుతాయని తెలిపారు. గత సంవత్సరం రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ) కింద కెనడా నుంచి మొత్తం 226,450 వీసాలు ఆమోదం పొందాయి. త్వరలో కెనడాకు వెళుతున్నవారిలో దాదాపు 1.36 లక్షల మంది విద్యార్థులు పంజాబ్‌కు చెందినవారే కావడం గమనార్హం. వీరు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కలిగిన వివిధ కోర్సులను అభ్యసించనున్నారు. ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు? -
'రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు'.. ఆరోగ్యంపై నటి షాకింగ్ కామెంట్స్!
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ చాలా చిత్రాల్లో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) గాయత్రి గుప్తా మాట్లాడుతూ..'ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్‌గా భావించలేదు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఆమెను బోల్డ్ అనడంపై స్పందించింది. డైరెక్టర్స్‌కు కావాల్సిన క్యారెక్టర్‌కు తగినంత పొటెన్షియల్ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది. గతంలో ఆమె ఓ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరి ఇంత బోల్డ్ వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! ) -
చంద్రబాబు ఐటీ కేసు ఇష్యూపై చింతా రాజశేఖర్..!
-
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
సత్తుపల్లి మట్టా దయానంద్‌కి గట్టి దెబ్బ
సాక్షి, ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్‌కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు. ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ప్లాన్ బీ కూడా? 2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్‌రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్‌లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు
టాలీవుడ్లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్,మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) తాజాగా హీరోయిన్ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది. 'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు.' అని తెలిపింది. (ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్) తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్లో నటించినప్పుడు కూడా, అతను లీగల్‌గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది. View this post on Instagram A post shared by Arthana Binu (@arthana_binu) -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు
-
మేనేజర్‌తో విబేధాలు.. స్పందించిన రష్మిక
టాలీవుడ్లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఫుల్ క్రేజ్. అయితే తన మేనేజర్ చేతిలో సుమారు రూ.80 లక్షల వరకు మోసపోయిందని, దీంతో అతన్ని తొలగించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక ఈ విషయంపై తొలిసారి స్పందించింది. తాము విడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం నిజమేనని తెలిపింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) కానీ ఈ నిర్ణయం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. తామిద్దరూ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామని చెప్పుకొచ్చింది. పరస్పర ఒప్పందంతో విడిగా తమ కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రొఫెషనల్‌గా వ్యవహరించే పనిలో ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి ఇంతవరకు వర్క్ చేశామని పేర్కొంది. ఇప్పుడు కూడా అంతే హుందాగా తామిద్దరం విడిగా పనిచేయాలని అనుకుంటున్నట్లు రష్మికతో పాటు ఆమె మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్
రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ నేపాల్‌లో మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ డైలాగ్‌ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?) -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకుంటాం... అరవింద్ కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టే పనిలో విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి మద్దతు కోరగా అయన సానుకూలంగా స్పందించినందుకు కేజ్రీవాల్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం... ఢిల్లీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించిన కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురవడంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తోన్న కేంద్రానికి లోక్ సభలో బిల్లు ఆమోదింప చేయడం పెద్ద కష్టం కాదు. కానీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడాలంటే మాత్రం 93గా ఉన్న వారి బలం సరిపోదు. ప్రతిపక్షాల మద్దతు కూడా కావాలి. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా కేంద్రానికి అడ్డుకట్ట వేయాలని కృతనిశ్చయంతో ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరినీ కలుపుకుంటూ... ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ల మద్దతును కూడగట్టిన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మన్ తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యి మద్దతివ్వాలని కోరారు. అందుకు స్టాలిన్ కూడా సుముఖంగా స్పందించడంతో కేజ్రీవాల్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. తర్వాతి ప్రయత్నంలో ఢిల్లీ సీఎం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. చదవండి: కర్ణాటక ఫలితాలు ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. -
వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవి దౌర్జన్యకాండ
సాక్షి, వైఎస్సార్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఆదివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో ఓ వెంచర్లో ఆయన తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ వెంచర్ ఫెన్సింగ్‌ను తన అనుచరులతో కలిసి తొలగించి.. అక్కడ దున్నించాడు బీటెక్ రవి. అయితే.. వెంచర్ ఓనర్ మాత్రం తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అయినా రవి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ‘‘అనుచరులతో మాపై ఆయన దౌర్జన్యం చేయడం దారుణం. బీటెక్ రవి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపాలి’’ అని వెంచర్ ఓనర్ కోరుతున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన స్థానికులను మారణాయుధాలతో బీటెక్ రవి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్థానికంగా బీటెక్ రవి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారులు హడలిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత కథనం: బీటెక్ రవి నేతృత్వంలో మారణాయుధాలతో.. -
తాడికొండ టీడీపీలో ఫ్లెక్సీల వివాదం
-
ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు!
కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ అజాద్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు జల్లు కురింపించారు. తన పట్ల మోదీ చాలా ఉదారంగా ప్రవర్తించారని తనపై ఎలాంటి రివేంజ్ తీర్చుకోలేదని అన్నారు. అలా అని ఒక ప్రతిపక్ష నేతగా ఆర్టికల్ 370తో సహ హిజాబ్ వంటి పలు విషయాల్లో ఆయన్ను వ్యతిరేకించడమే కాకుండా నిలదీయకుండా విడిచిపెట్ట లేదన్నారు అజాద్. తాను మోదీతో కొన్ని బిల్లులు విషయంలో విభేదించనినప్పటికీ ఆయన తనపై ఏవిధంగానూ రివేంజ్ తీర్చుకునే యత్నం చేయలేదు పైగా ఒక రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించారు. అందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పారు అజాద్. అదే సమయంలో మోదీపై విమర్శలు చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వారి మనసులు కలుషితమైపోయాయని, అందుకే ఆయనపై అలాంటి విమర్శలకు దిగుతున్నారని అన్నారు ఆయనపై ఆరోపణలు చేసేకంటే ముందుగా వారంతా పాలిటిక్స్ అంటే ఏంటో ఓనమాలు నుంచి నేర్చుకోవాలంటూ అజాద్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 2021లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అజాద్ పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సందర్భంగా ప్రదాని మోదీ అజాద్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయనతో తనకు గలు రాజకీయ అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఆయన రాజకీయపరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తాడని అందువల్ల అలాంటి వ్యక్తికి వీడ్కోలు పలకాలంటే బాధగానే ఉంటుందంటూ.. మోదీ భావోద్వేగం మాట్లాడారు. (చదవండి: 'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ) -
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
మరింత ముదురుతున్న భద్రాద్రి లడ్డూ వివాదం
-
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రేమ జంటపై దాడి
-
కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్‌పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్‌ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్‌ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
ఆధిపత్యమే పరమార్థమా?!
ఎప్పుడూ వార్తల్లో ఉండే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంది. ఢిల్లీలో కూడా మొన్న గాంధీ జయంతి రోజున తలెత్తిన సమస్య మినహా పెద్దగా వివాదం ఛాయలు లేవు. తెలంగాణ సరేసరి. ఇంతలోనే కేరళలో రాజుకుంది. అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ బయల్దేరింది. గత నెలలో కన్నూరు యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంపైనా, అంతక్రితం అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించిన లోకాయుక్త అధికారాల కుదింపు వ్యవహారంపైనా ఆరిఫ్ కన్నెర్రజేశారు. తాజాగా కేరళ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక అంశంలో గొడవ మొదలైంది. ఈ వ్యవహారంలో తమ బాధ్యతను మరిచారంటూ 15 మంది సెనేట్ సభ్యుల్ని గవర్నర్‌గా తనకున్న అధికారాలనుపయోగించి తొలగించారు. అంతేకాదు... మంత్రుల్ని పదవీచ్యుతుల్ని చేసే అధికారం కూడా తనకున్నదంటూ హెచ్చరించారు. వైస్ చాన్సలర్ల నియామ కాల్లో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయిగా ఉండేలా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు గత నెల అసెంబ్లీలో ఆమోదం పొందింది. దానిపై ఇంతవరకూ గవర్నర్ సంతకం చేయలేదు. నిర్ణయాలు తీసుకోవటంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మాట నెగ్గాలా, నియామకం ద్వారా పదవిలోకొచ్చిన గవర్నర్‌ది ఆఖరిమాట కావాలా అన్నదే ఈ వివాదాలన్నిటి సారాంశం. కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పాలకపక్షం ఉన్నప్పుడు పెద్దగా గొడవులుండవు. అలాగని విపక్ష ఏలు బడి ఉన్నచోట్ల నిత్యం సమస్యలుంటాయన్నది కూడా నిజం కాదు. రాష్ట్రపతిగా ఇటీవల పదవీ విరమణ చేసిన రాంనాథ్ కోవింద్ బిహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడు అప్పటికి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న నితీష్ కుమార్‌తో ఆయనకెన్నడూ తగవు రాలేదు. రాజకీయపరంగా చూస్తే అంతవరకూ కోవింద్ బీజేపీలో చురుకైన నాయకుడు. రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆరిఫ్ కూడా సీనియర్ నేత. చిరకాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వమ్ము చేస్తూ రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన బిల్లు ముస్లిం మహిళల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ ఆయన 1986లో కాంగ్రెస్‌కు రాజీ నామా చేశారు. బోఫోర్స్ శతఘ్నల కొనుగోళ్లలో కుంభకోణం చోటుచేసుకున్నదంటూ వీపీ సింగ్‌తో కలిసి రాజీవ్ సర్కారుపై పోరాడారు. అనంతరకాలంలో వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభు త్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యం చూస్తే ఆరిఫ్ వివాదాల్లో చిక్కుకోవటం కొంత వింతగానే ఉంటుంది. గవర్నర్‌గా ఉన్నవారూ, రాష్ట్రాన్ని పాలించేవారూ అరమరికల్లేకుండా చర్చించుకుంటే సమస్యలు ఉత్పన్నం కావు. కానీ సమస్యలపై రచ్చకెక్కడం, మీడియా సమావేశాల్లో విమర్శించుకోవటం అలవాటైంది. ట్విటర్ వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకునే ధోరణి కూడా బయల్దేరింది. మంత్రుల్ని తొలగించే అధికారం కూడా తనకున్నదంటూ ట్విటర్ ద్వారానే ఆరిఫ్ హెచ్చరించారు. ‘సీఎంకూ, ఆయన మంత్రులకూ గవర్నర్‌కు సలహాలిచ్చే అధికారం ఉంది. కానీ అందుకు భిన్నంగా గవర్నర్‌ను కించపరుస్తూ కొందరు మంత్రులు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని తొలగించటంతో సహా చర్యలు తీసుకునే అధికారం నాకుంది’ అన్నది ఆ ట్వీట్ సారాంశం. కేరళ వర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక ప్రక్రియలో వివాదం రాజేయటం ఆరెస్సెస్ ఎజెండా అమలు కోసమేనని కేరళ విద్యామంత్రి ఆర్.బిందు అనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మన విశ్వవిద్యాలయాల ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనీ, వాటి ర్యాంకులు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా అడుగంటుతున్నాయనీ ఏటా తెలుస్తూనే ఉంది. వాటిని మళ్లీ చక్కదిద్దటానికి పాలనాపరంగా ఏం చేయాలన్న విషయంలో ఎవరూ పెద్దగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. తగినంతమంది అధ్యాపకులు లేకపోవటం, వారిలో చాలామంది కాంట్రాక్టు ప్రాతి పదికనే వచ్చినవారు కావటం, ప్రభుత్వాలు సకాలంలో నిధులు అందించకపోవటం ప్రమాణాలు పడిపోవటానికి ప్రధాన కారణాలని విద్యార్థి సంఘాల నాయకులూ, అధ్యాపకులూ ఆరోపిస్తు న్నారు. ఇలాంటి అంశాల్లో గవర్నర్ అభ్యంతరం లేవనెత్తితే అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్య ప్రమాణాలను కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని అందరూ జేజేలు పలుకుతారు. కానీ వైస్ చాన్సలర్ నియామకం, సెనేట్ సభ్యుల ఎంపిక, తొలగింపు తదితర అంశాల్లో పట్టుదలకు పోవటం వల్ల ప్రయోజనమేమిటో అర్థం కాదు. ఈ విషయంలో తనకున్న అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటం, ఫలానావిధంగా చేయటమే ఉత్తమమని సలహా ఇవ్వటం మంచిదే. కానీ అందు కోసం రచ్చకెక్కటం వల్ల ఉన్నత విద్యకు ఒరిగేదేమిటి? గవర్నర్ల వ్యవస్థ విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కీలక సూచనలు చేసింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు చేసే నిర్ణయాలకు ఉన్నంతలో విలువనీయటం సరైందని అభిప్రాయపడింది. సర్కారియా కమిషన్ నివేదిక కూడా విస్తృతమైన సిఫార్సులు చేసింది. రాజకీయాలకు సంబంధంలేనివారు, తటస్థులుగా ముద్రపడిన వారు గవర్నర్లయితే మంచిదని తెలిపింది. కానీ ఆ కోవలోకొస్తారని భావించినవారు సైతం వివా దాల్లో ఇరుక్కున్న ఉదంతాలు లేకపోలేదు. నిర్ణయ ప్రక్రియలో పరిధులు అతిక్రమించి విపరీత పోకడలకు పోవటం, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం వంటివి చోటుచేసుకుంటే గవర్నర్లు ప్రశ్నించటంలో తప్పులేదు. కానీ ఎంతసేపూ ఆధిపత్యం కోరుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. కేరళ గవర్నరైనా, మరొకరైనా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. అసలు విషయం ఇది..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్ వీడియో ఇంటర్నెట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నైట్‌పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ నేతలు రాహుల్‌ను టార్గెట్ చేశారు. దీంతో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిపోయింది. అయితే, ఈ వీడియోపై ఓ జాతీయ మీడియా సంస్థ అసలు నిజాలు తెలుసుకొని వీడియోతో సహా రాహుల్ పక్కనే ఓ యువతి గురించి క్లారిటీ ఇచ్చింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ కనిపించారు. వీడియోలో రాహుల్ ఓ యువతి మాట్లాడటం కనిపించింది. సదరు యువతి నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్ ప్రధానిపైనా హనీ ట్రాప్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. కానీ, తాజాగా ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ఆమె చైనీస్ కాదని తెలిపింది. ఆమె నేపాలీ మహిళ, వధువు స్నేహితురాలు రాబిన్ శ్రేష్ట అని పేర్కొంది. అయితే, సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం రాహుల్ సోమవారం నేపాల్‌కు వెళ్లారు. #Factcheck: The woman in the video was a friend of the bride at the wedding that Rahul Gandhi was attending in Nepal. She is not a Chinese diplomat#AFWAFactcheck | @KunduChayan https://t.co/KH8oz6FuNJ — IndiaToday (@IndiaToday) May 3, 2022 ఆమె గురించి వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఇంటర్నేషనల్‌కు దిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ గ్యాంగ్‌రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలను రాశారు. 2001 నుంచి 2017వరకు సీఎన్ఎన్లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. Rahul Gandhi tweeting about pathetic state of Indian economy from a pub in Kathmandu along with Chinese ambassador to Nepal. Congress must explain this alliance pic.twitter.com/bdCMBHAWQx — Shashi Kumar (@iShashiShekhar) May 3, 2022 సుమ్నిమా ఉదాస్ ఫొటోలు ఇది కూడా చదవండి: ముగిసిన డెడ్‌లైన్.. ముంబైలో హైఅలర్ట్ -
బీజేపీలో భూ రగడ.. రాష్ట్ర అధిష్టానం దృష్టికి సమస్య
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో భూ రగడ వివాదాస్పదమవుతోంది.. ఆ పార్టీకి చెందిన జిల్లా ముఖ్య నాయకుల ప్రమేయంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గుర్రుగా ఉన్నారు. మంగళవారం రాత్రి ఈ వివాదం విషయమై ఎంపీని కలిసేందుకు వెళ్లిన కొంతమంది ముఖ్య నాయకులను ఎంపీ గన్మెన్లు ఆ సమయంలో కలిసేందుకు అనుమతినివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గన్మెన్లను నెట్టివేశారు. వారు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే గన్మెన్లను నెట్టివేసిన తీవ్రత కంటే భూ రగడ విషయంలోనే కేసు తీవ్రతకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ సోయం బాపురావుకు, పార్టీ జిల్లా ముఖ్య నాయకుల మధ్య వివాదం బీజేపీలో చర్చనీయంగా మారింది. రాష్ట్ర అధిష్టానం దృష్టికి.. అసైన్డ్ భూమి విషయంలో జిల్లా నేతల ప్రమేయం, దాని విషయంలో ఎంపీ నివాస గృహం వద్ద దురుసు ప్రవర్తన వంటి విషయాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంటి వద్ద జరిగిన వివాదంలో పలువురు బీజేపీ జిల్లా నేతలు ఉన్నప్పటికీ ఈ విషయంలో పార్టీ పరువును దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కేసు నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జిల్లా అధికార ప్రతినిధిపై మాత్రం అట్రాసిటీ కేసు నమోదైంది. కనిపించని సందడి.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పుట్టిన రోజు గురువారం కాగా, ఆ సందడి ఆదిలాబాద్ పట్టణంలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఆయన అత్యవసర పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఎంపీ క్యాంప్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పట్టణంలో ఎక్కడ కూడా ఎంపీ సోయం బాపురావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమివ్వలేదు. బీజేపీలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీల సందడి కనిపిస్తుంది. అలాంటిది ఎంపీ బర్త్ డే సందర్భంగా సందడి కనిపించకపోవడంపైనా చర్చ సాగుతోంది. అసైన్డ్ భూమి విషయంలో.. ఇచ్చోడ మండలం బాబుల్‌డోవ్ గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమి విషయంలోనే ఈ వివాదం చోటుచేసుకుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు, అతని బంధువులు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లో నలుగురు అసైన్డ్‌దారులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వివాదం, ఆ నలుగురి కుటుంబాలను సదరు నేతలు వేధంచడంతో బాధితులు ఓ వ్యక్తి ద్వారా ఎంపీ సోయం బాపురావును కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలోనే మంగళవారం రాత్రి ఎంపీ సోయం బాపురావు తన నివాస గృహంలో ఉన్నప్పుడు అసైన్డ్‌దారుల తరపు వ్యక్తి మాట్లాడేందుకు రాగా, ఈ విషయం తెలుసుకుని జిల్లా బీజేపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ సూచన మేరకు బీజేపీ నాయకులను గన్మెన్లు మరుసటి రోజు ఉదయం రమ్మని చెబుతున్నా దురుసుగా ఇంట్లోకి ప్రవేశించడం, ఆ క్రమంలో గన్మెన్లను నెట్టివేయడం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ -
RRR సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల అభ్యంతరం
-
కావాలనే ఒకరిద్దరు రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే రోజా
-
మొట్ట మొదలు..ఆలుమగలు
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థ అమలు ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. జిల్లాల్లో టీచర్ల కౌన్సెలింగ్‌ను నిలిపివేసిన ప్రభుత్వం వారి ఆప్షన్లు పరిశీలించి స్కూళ్లు కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా భార్యాభర్తలు పెట్టుకున్న ఆప్షన్లపై (స్పౌజ్ కేసులు) దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన జాబితాను తక్షణమే పంపాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం రాత్రి అత్యవసర ఆదేశాలు పంపారు. ఈ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. భార్యాభర్తల ప్రాధాన్యతలపై ప్రధానంగా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే కొత్త జిల్లాల్లో టీచర్లకు స్కూళ్ళు కేటాయించే వీలుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే టీచర్లు ఆప్షన్లు ఇచ్చారని, వీటినే పరిగణనలోనికి తీసుకుంటామని అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండబోదని స్పష్టం చేశాయి. మరోవైపు మల్టీ జోనల్ కేటాయింపులపై అధికారులు సమీక్షించారు. నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే విద్యాశాఖ సరైన విధానంలో ప్రభుత్వానికి జాబితా పంపలేదని తెలిసింది. దీన్ని సవరించి తిరిగి పంపడంతో మల్టీ జోనల్ కేటాయింపుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ముట్టడి విజయవంతం : యూఎస్పీసీ సెక్రటేరియట్ ముట్టడి విజయవంతమైందని యూ ఎస్పీసీ ప్రకటించింది. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వా నికి తెలిపామని స్పష్టం చేసింది. ముట్టడి కార్యక్రమానికి యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), మైస శ్రీనివాసులు (టీపీటీఎఫ్), ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి (డీటీఎఫ్), యు.పోచయ్య (ఎస్టీఎఫ్), ఎన్.యాదగిరి (బీటీఎఫ్), ఎస్.హరికృష్ణ(టీటీఏ), బి.కొండయ్య, ఎస్.మహేష్ (ఎంఎస్టీఎఫ్), చింతా రమేష్ (ఎస్సీ ఎస్టీయూయస్), టి. విజయసాగర్ (టీజీపీఈటీఏ), వై.విజయకుమార్ (ఎస్సీఎస్టీ యూఎస్ టీఎస్) నాయకత్వం వహించారు. ప్రభుత్వ జీవో ఉపాధ్యాయులను సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లుగా మారుస్తోందని నేతలు విమర్శించారు. సాధారణ బదిలీల్లోనే శాశ్వత కేటాయిం పులు చేయాలని, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముట్టడిపై నిర్బంధం.. కేటాయింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఓ పక్క వేగం పెంచుతుండగానే.. మరోపక్క టీచర్లు ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. టీచర్లకు అన్యాయం చేసే 317 జీవో (స్థానికత)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీ (యూఎస్పీసీ) మంగళవారం సచివాలయం ముట్టడి చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు రాజధానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. ఉపాధ్యా య సంఘాల నేతలను జిల్లాల్లోనే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధ రాత్రి నుంచే నిర్బంధం అమలు చేశారని సం ఘాల నేతలు తెలిపారు. పోలీసు నిర్బంధం మధ్యే ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యూహాత్మకంగా సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. వేర్వేరు మార్గాల్లో సెక్రటేరియట్‌కు చేరుకున్న సంఘాల నేతలు కొద్దిసేపు నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉంటే నేతల అరెస్టులను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోని పోలీసుస్టేషన్ల వద్ద ఉపాధ్యాయులు నిరసనలు చేపట్టారు. -
టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి. నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్‌తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్ కల్యాణ్‌కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్‌లో తీసు కుంటారా? బ్లాక్‌లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు పెట్టుకోవాలని భావిస్తారా? నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది. ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు ఇవ్వవచ్చు. కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్ యాదవ్ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి. సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! ఆన్లైన్ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్‌లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒక్క జగన్ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట. ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు దుమారం
-
చంద్రబాబే నన్ను కోట్టించాడు
-
చూడవయ్యా నీ మంత్రే ఏమన్నాడో..
-
ముషంపల్లి ఘటనతో తెరపైకి బెల్ట్ షాపుల అంశం
-
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
-
లక్ష గ్రీన్‌కార్డులు వృథా అయ్యే ప్రమాదం!
వాషింగ్టన్: దాదాపు లక్షకు పైగా గ్రీన్‌కార్డులు ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో చాలామంది ఆశలపై నీళ్లు జల్లినట్లు కానుంది. ఈ ఏడాది ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల కోటా గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా పెరిగి 2,61,500కు చేరిందని భారత్‌కు చెందిన సందీప్ పవార్ చెప్పారు. అయితే చట్టం ప్రకారం సెప్టెంబర్ 30లోపు అవసరమైన వీసాలు జారీ కాకుంటే అధికంగా పెరిగిన కోటాలోని లక్ష కార్డులు వృ«థా అవుతాయన్నారు. ఈ విషయమై బైడెన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ఇంకా ప్రభుత్వ వర్గాలు స్పందించలేదు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) చేస్తున్న జాప్యమే గ్రీన్‌కార్డుల వృ«థాకు కారణమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్, చైనాకు చెందిన 125 మంది ఈ వృ«థా నివారించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారుండగా, మరోపక్క ఇలా కార్డులు వృ«థా కావడం సబబుకాదని వీరు కోర్టుకు విన్నవించారు. యూఎస్సీఐఎస్ అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల పలువురు భారతీయుల భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులకు గ్రీన్కార్డులందడంలేదని భారతీయ హక్కుల పోరాట కార్యకర్త పవార్ చెప్పారు. డ్రీమర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, గ్రీన్ కార్డులపై పరిమితి ఎత్తివేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నేటి నుంచి ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల జారీ బంద్..!
ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్ నేటి నుంచి కొత్త డెబిట్/క్రెడిట్ కార్డులను జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్‌కార్డ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్బీఐ పేర్కొంది. మాస్టర్‌కార్డ్ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్ కార్డ్ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌గా మాస్టర్‌కార్డ్ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్ విషయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ భారత్‌లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్‌కార్డు డెబిట్/ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. బెల్లద్‌కు పరప్పన అగ్రహార జైలు లో ఉన్న యువరాజ్‌స్వామి నుంచి ఫోన్‌కాల్ రాలేదని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన అర్చకుడు జితేంద్రనాద్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసింది నిజమేనని, అయితే పరిచయస్తుడేనని తేల్చారు. జైల్లో ఉండే యువరాజ్‌స్వామి అనే ఖైదీతో ఎలాంటి సంబంధం లేదని డీసీపీ అనుచేత్ నిర్వహించిన విచారణలో నిర్ధారించినట్లు తెలిసింది. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
జగన్ నిర్ణయం బాగుంది : కేతిరెడ్డి
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల నిర్ణయం చాలా గొప్పదని, దీంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ తమ ఎజెండాలను పక్కనపెట్టి మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాలి. అధికారాన్ని సమానంగా పంచనప్పుడు ప్రత్యేక రాష్ట్ర నినాదాలు వస్తాయి. అందుకు ఉదాహరణగా తెలంగాణ, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాలను చెప్పవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలో లోపాలేవీ కనిపించనప్పుడు వేర్పాటు వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటాయి. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని ఇటీవల కొన్ని పార్టీలు ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులాంటిది. ఇప్పటికే కర్ణాటకలో బెంగళూరు, మైసూరులలో రెండు అసెంబ్లీలు, మహారాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో రెండు అసెంబ్లీలు ఉన్నాయి. హైకోర్టు బెంచ్‌లు తమిళనాడులో చెన్నై, మధురైలలో ఉన్నాయి. మహరాష్ట్రలో ముంబై, నాగ్‌పూర్‌లలో బెంచ్‌లున్నాయి. తమిళనాడులో ముందు నుంచే అభివృద్ధిని చెన్నైకి పరిమితం చేయకుండా ప్రతీ జిల్లాకు సమపాళ్లలో పంచారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధినంతా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కే పరిమితం చేయడం వల్ల తెలంగాణ వాదం బలపడింది. జగన్మోహన్రెడ్డి ఇప్పుడు చేసిన పనిని అప్పటి పాలకులు చేసి ఉంటే విభజన జరిగేది కాదు. అలాగే దక్షిణాదిలో రెండవ రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఏ ప్రభుత్వం కూడా మా డిమాండ్‌ను పట్టించుకోవట్లేదు. దానికి కారణం దక్షిణాదిలో కేవలం 130 ఎంపీ సీట్లు ఉండడమే. ఇప్పుడు మోదీ నాయకత్వంలో అయినా రెండో రాజధానిని దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ (అమెండ్మెంట్ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టెండర్లకు అనూహ్య స్పందన రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌కు సైతం డబ్బుల్లేవ్.. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై వివిధ కేసులను హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. హైకోర్టు తీర్పు వచ్చినా ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావట్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ చిక్కుకుంది. దీని ఫలితంగా బస్సులకు డీజిల్ పోసే పంపులకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయొచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతోంది. ఏ క్షణమైనా ఆర్టీసీని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రచ్చకెక్కిన ఏయూ ఎన్నికలు
సాక్షి, ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికలు వివా దాస్పదంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓట్లు చేర్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ పంచాయతీ వీసీ వద్దకు చేరింది. ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 17న విడుదల చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. బుధవారం నీలాపు శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానళ్లు, గురువారం జి.రవికుమార్ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక్కడ వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారి ఆచార్య జి.సుధాకర్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్తగా 185 మందిని ఓటర్లుగా చేర్చుతున్నట్టు అభ్యర్థులకు తెలియజేశారు. దీనిని శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానల్ సభ్యులు వ్యతిరేకించారు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలని, నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓటర్లను చేర్చడం ఏమిటని ఎన్నికల అధికారిని నిలదీశారు. వర్సిటీ వీసీ సంతకంతోనే నూతన జాబితా తనకు చేరిందని ఎన్నికల అధికారి చెప్పడతో వివా దం వర్సిటీ వీసీ కార్యాలయానికి చేరింది. వాగ్వాదాలు.. కేకలు వర్సిటీ వీసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ ఎదురుగానే ఉద్యోగులు ఘర్ణణకు దిగారు. పెద్దగా కేకలు వేశారు. చివరకు వీసీ స్వయంగా వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్లను పిలిచి మాట్లాడారు. అనంతరం పోటీ చేస్తున్న మూడు ప్యానళ్ల అధ్యక్షులతో సమావేశమయ్యారు. వీసీ సూచన మేరకు న్యాయ నిపుణుల తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జి.సుధాకర్ తెలిపారు. ఏమిటీ జాబితా? ఎందుకీ వివాదం ఎన్నికలు ప్రారంభ సమయంలో, నోటిఫికేషన్ విడుదల సమయంలో వర్సిటీలో 1634 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అభ్యర్థులకు సంతకం చేసి ఎన్నికల అధికారి అందజేశారు. తాజాగా గురువారం సాయంత్రం హాస్టళ్లలో పనిచేస్తున్న 185 ఉద్యోగుల జాబితాను దీనికి జత చేయాలని సూచిస్తూ వర్సిటీ వీసీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వర్సిటీ ఉద్యోగులకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు నెలలో రూ.10 వేతనం నుంచి సేకరించారు. మే నెల వేతనాలు నుంచి 1634 మంది ఉద్యోగులకు దీనిని సేకరించారు. తాజాగా జత చేసిన ఉద్యోగులకు గత నెల వేతనాల నుంచి ఎన్నికల నిధిని సేకరించలేదు. వీరికి సంబంధించిన రూ.1850 డీడీ రూపంలో చెల్లించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్యానల్‌కు సంబంధించిన పోటీదారుడే ఈ రుసుం చెల్లించారని వారు ఆక్షేపిస్తున్నారు. సాధారణంగా హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులకు హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్‌లో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వర్సిటీ విభాగాలలో పనిచేసే వారికి ఏయూ ఈయూలో ఓటు హక్కు ఉంటుంది. దీనికి విరుద్ధంగా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని పోటీదారులు కోరుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక చేర్పులా.. ఇప్పటికే వర్సిటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగి సింది. తాజాగా పలువురి ఓట్లు జాబితాలో చేర్చాలనే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు జరిపించాలి. – బుద్దల తాతారావు, పోటీదారుడు ఇదెక్కడి న్యాయం ఉద్దేశపూర్వకంగా కొంతమంది వర్సిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వర్సిటీ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఎంత మాత్రం సహించేది లేదు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలి. మార్పులు, చేర్పులు అనుమతించరాదు. – నీలాపు శివారెడ్డి, పోటీదారుడు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. వర్సిటీలో పనిచేస్తున్న ఎంటీఎస్‌లో కొంత మంది ఉద్యోగులకు గత నెలలో ఎన్నికలకు సంబంధించిన రూ.10 వేలు వేతనం కోత జరగలేదు. దీంతో వీరంతా ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పించారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా డిజిగ్నేషన్ ఇవ్వకుండా లాస్ట్ గ్రేడ్ కేటగిరీ అంటూ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇటీవల ఎంటీఎస్ పొందిన వారిలో కొంత మందికి ఓటు హక్కు కల్పించి, మరికొంత మందికి మొండి చేయి చూపడం ఎంత వరకు సమంజసం. – డాక్టర్ జి.రవికుమార్, పోటీదారుడు -
మైనింగ్ అనుమతుల జారీకి ప్రత్యేక విధానం
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అనుమతులు త్వరితగతిన జారీ చేసేందుకు ప్రత్యేక విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర గనుల శాఖ అధికారులు, రాష్ట్రంలోని జియోసైన్స్ సంస్థల ప్రతినిధులతో గురువారం జరిగిన వార్షిక వ్యూ హాత్మక ముఖాముఖి సమావేశం (అసిమ్)లో ఆయన మాట్లాడారు. అటవీ, పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్న తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులకు మైనింగ్ అనుమతులు సత్వరం జారీ చేయాలన్నారు. దీనికోసం కన్సల్టెన్సీ సేవలు అందించాలని సీఎస్ సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సమావేశాన్ని తెలంగాణలో కేంద్ర గనుల శాఖ నిర్వహించడాన్ని అభినందించా రు. రాష్ట్రంలో గనుల అభివృద్ధి, ఖనిజాన్వేషణకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర గనుల శాఖ పరిధిలోని జియోసైన్స్ పరిశోధనా సంస్థల సహకారంతో తెలంగాణలో ఖనిజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అసిమ్ తరహా ఎంతో ఉపయోగం హైదరాబాద్‌లో ఉన్న జియో సైన్స్ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేందుకు అసిమ్ తరహా సమావేశాలు ఉపయోగపడుతాయని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), అటమిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సం స్థల సహకారంతో ఖనిజాన్వేషణ వేగవంతం గా చేపట్టవచ్చన్నారు. తెలంగాణలో సున్నపురాయి, మాంగనీస్, ఐరన్‌ఓర్, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ పనులు చేపడతామన్నారు. రూ.4,792 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,291 మైనింగ్ లీజులుండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గనులశాఖ జాయింట్ డైరక్టర్ రఫీ అహ్మద్ వెల్లడించారు. స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వా రా ఖనిజాల అన్వేషణ చేపట్టడంతోపాటు కేం ద్ర జియోసైన్స్ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందినట్లు టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ వెల్లడించారు. తమ సంస్థకు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. -
దిక్కులేని సిపాయి
కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా తేలిగ్గా...‘‘ఏంట్రా అబ్బాయి’’ అన్నాడు.‘‘కూలీలు’’ అని పిడికిళ్లు బిగించినంత పనిచేశాడు రాంబాబు.‘కూలీలు’ అనే చిన్న మాటలోనే చెప్పకనే ఎన్నో విషయాలు చెప్పాడు రాంబాబు. కూలిపోతున్న కూలీల జీవితాల గురించి కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు.పట్నంలో చదువుకొని వచ్చిన రాంబాబుకు కూలీలతో పనేమిటి? ఈ రాంబాబు అందరిలాంటోడైతే కూలీలతో పనేమిటి? అనే అనుకోవచ్చు. కానీ రాంబాబు చదువుతో పాటు సమాజాన్ని చదువుకున్నవాడు. అందుకే కూలీల సమస్యలను తన ఇంటి సమస్యగా చేసుకొని భూషయ్య ఇంటికొచ్చాడు.భూషయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.‘‘కూలీల సంగతి కూలోడు, రైతుల సంగతి రైతోడు పడతాడు. కుర్రోడివి నీకెందుకు ఈ ఎవ్వారం’’ విసుక్కున్నాడు భూషయ్య.‘‘చదువుకున్నాడని యవ్వారానికి వచ్చాడు’’ వెక్కిరింపుగా అన్నాడు భూషయ్య భజనుడు.‘‘వచ్చి మాత్రం ఏంచేస్తాడు! వరిముక్క చేతికి ఇచ్చి ఏంట్రా ఇది అని అడిగితే వడ్లుగాసే చెట్టు అనేవాడివి నీకెందుకురా...ఎళ్లు’’ రాంబాబును ఊకలా తేలికగా తీసేశాడు భూషయ్య.మరి భజనుడు ఊరుకుంటాడా..‘‘ఇదిగో గాడిద పని గాడిద కుక్క పని కుక్క చేయాలి. తెల్సిందా!’’ అని అరిచాడు.‘‘నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాద దక్కదు’’ అని హెచ్చరించాడు కూడా.‘‘వెళ్లిపోకపోతే?’’ కోపంగా అన్నాడు రాంబాబు.‘‘తలగొరుకుడు, సున్నంబొట్లు, గాడిద మీద ఊరేగింపు...చాలా’’ తన మాటలతో రాంబాబును మరింత రెచ్చగొట్టాడు భజనుడు.అంతే...‘‘ఏంట్రా కుశావు’’ అని ఆ భజనుడి వైపు పిడుగులా దూసుకువచ్చాడు రాంబాబు.∙∙ ఏటి ఒడ్డున పాక హోటల్.ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లో ఉన్న ఒకాయన టీ తాగుతున్నాడు. ఊరికి కొత్తోడిలా ఉన్నాడు. అప్పుడే అక్కడి వచ్చాడు కామయ్య.‘‘పేరు?’’ అని కొత్తవ్యక్తిని అడిగాడు.‘‘చంద్రశేఖరం’’‘‘చంద్రశేఖరం అని తెల్సండీ. ఊరు?’’‘‘తోలేరు’’‘‘చంద్రశేఖరం... తోలేరు అనే సంగతి తెల్సండి. పని?’’‘‘ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్లో పొలం ఇచ్చారు. దాని కోసం వచ్చాను’’‘‘కరణంగారితో పనన్నమాట. మనం ఉండాలన్నమాట’’‘‘కరణంగారు మీకు తెలుసా?’’‘‘కాకిని, కరణంగారిని తెలియని వారు ఈ ఊళ్లో ఉంటారా! ఎటొచ్చి కొంచెం కమిషన్ అవ్వుద్ది’’‘‘కమిషనా! ఎందుకు?’’‘‘ఎందుకేమిటండీ, కరణంగారితో పని కావాలంటే కామయ్యగోరు కదలాలి. కామయ్యగోరు కదలాలంటే కమిషన్ ఉండాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి. రేపు రండి. మీ భూమి తీసుకువచ్చి మీ చేతిలో పెడతాను’’అమాయకంగా కామయ్య సాలెగూడులో చిక్కుకుపోయాడు పాపం ఆ మిలిటరీ ఆయన. సూటిగా చెప్పాలంటే మిలిటరీ చంద్రశేఖరం మోసపోయాడు.∙∙ ‘‘కరణంగారు ఈ చేను ఎక్కడుందండీ?’’ చంద్రశేఖరం పొలం గురించి వివరం అడిగాడు రాంబాబు.‘‘ఎక్కడిదంటే...’’ నసిగాడు కరణం.చంద్రశేఖరం పొలాన్ని భూషయ్య నొక్కేశాడని రాంబాబుకు అర్థమెంది.‘‘దీన్నంతా ముత్యాలమ్మ చేను అంటారు. ఇది ఎప్పటి నుంచో భూషయ్య చేతిలో ఉంది’’ అని తనతో పాటు వచ్చిన చంద్రశేఖరానికి చెప్పాడు రాంబాబు.తన చేను గురించి భూషయ్యను అడగడానికి వెళ్లాడు చంద్రశేఖరం.‘‘భూషయ్య గారు ఆ చేను నాది. నాకు పట్టా వచ్చింది. దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు’’భూషయ్య తనదైన శైలిలో ఇలా అన్నాడు...‘‘కిట్టమూర్తి మనం అట్టిపెట్టుకోవడమేమిటయ్యా. అది ముత్యాలమ్మ తల్లిది. కాదంటే ఆ తల్లికే కోపం వస్తది. మనకేం!’’‘‘ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడిచెట్టు కల్లు దొంగతనం చేయడానికి ఓ అర్ధాయుష్షు వెధవ చెట్టెక్కాడు’’ అని భజనుడు అన్నాడో లేదో పూజారి టక్కున అందుకున్నాడు...‘‘రక్తం కక్కుకొని టపీమని చావబోయి ఆగాడు. అంటే ఒకటి....అమ్మతల్లి మహత్యం నీకింకా తెలియదు. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లుతుంది. ప్రళయం వచ్చేస్తుంది’’‘‘భయంకర శత్రుమూకలను నేలమట్టం చేయడంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. నేను అవిటివాన్ని అయినా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. ఆ భూమి నాది’’ అని గట్టిగా అరిచాడు చంద్రశేఖరం.తాటిముంజలు తింటూ తాటికాయలను నరుకుతున్న పనివాడిని చూస్తూ తనదైన శైలిలో స్పందించాడు భూషయ్య...‘‘రేయ్ పోతూ! పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్లు నరుక్కెళుతుంటే, వొకనాడు అమ్మతల్లి కన్ను విప్పుతుంది. కుండెడు రక్తం భళ్లునా కక్కాలి’’∙∙ ‘‘రాంబాబు... ఆరునూరైనా సరే రేపే మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చేయ్. చేనులో కలుద్దాం’’ ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్రశేఖరం.మరుసటి రోజు...చేనులో చంద్రశేఖరం కనిపించలేదు.ఆయన శవం కనిపించింది.కళ్లనీళ్లతో శవాన్ని భుజానికెత్తుకున్నాడు రాంబాబు.దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు...‘‘మీరంతా ఇటు చూడండి. తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశం అని నా జనం అని వెర్రిప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువుల మీదికి దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చిసిపాయి. అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. ఇతడ్ని తగిలేయడానికి నాతో రాగలిగిన వారు ఎవరు? మీరా? మీరా?’’ -
హరీశ్, రేవంత్‌లకు ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో నాయకులు ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రచారంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ స్పందించింది. టీఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు.. అభ్యర్థుల అనుమానల గురించి రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల కోసం ఇప్పటికే 32,500 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థలు ఫార్మ్ ఏ, ఫార్మ్ బీని ఎలా సబ్మిట్ చేయాలని అడుగుతున్నారన్నారు. ఫార్మ్ ఏని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) దగ్గర.. ఫార్మ్ బీని ఆర్వో దగ్గర ఇవ్వాలన్నారు. మేనిఫెస్టో మూడు కాపీలను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఫార్మ్ 8ని సెల్ఫ్ డిక్లరేషన్‌తో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలేట్ బాక్స్, ఓటర్ స్లిప్‌కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. బ్యాలేట్ తెలుపు రంగులో ఉంటుందని.. ఓటర్ స్లిప్ పింక్ కలర్లో ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 64.36 కోట్ల రూపాయల డబ్బుతో పాటు రూ. 5 కోట్ల విలువైన మద్యం సీజ్ అయ్యిందని వెల్లడించారు. 77,384 మంది బైండోవర్ అయ్యారని.. సీఆర్పీసీ కింద 14,730 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నాయకులు వాడే భాష కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు. కొందరు మేనిఫెస్టో ఇచ్చారని కానీ కావలసిన పద్దతి ప్రకారం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో నమోదయిన కేసుల విషయంలో.. ఎన్నికల తర్వాత సాక్షులు రావడం లేదు కాబట్టి విచారణ కొనసాగడం లేదని తెలిపారు. ఈ సారిఎన్నికల ఖర్చు విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. -
‘ఆహారభద్రత’కు మోక్షమెప్పుడో!
కరీంనగర్ సిటీ: ఆహారభద్రత కార్డుల జారీ విషయంలో జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కొత్త లబ్ధిదారులు వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే వీలు లేకుండాపోతోంది. ఆగస్టు 15 నుంచి ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గడువు దగ్గర పడుతున్నా లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులు సమగ్ర విచారణ పేరుతో రెవెన్యూ అధికారుల జాప్యం.. హార్డ్‌కాపీలు అందకపోవడంతో సంబంధిత పౌరసరఫరాల శాఖ ఆన్లైన్ మంజూరు చేయకపోవడం వెరసి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో మొత్తంగా 13,000 మంది కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా 8,900 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఆహారభద్రత కార్డులపై అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హడావుడి చేసిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కేవలం కార్డుల లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన డేటా, వినియోగదారుని ఆధార్ సంఖ్య ఆధారంగానే రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారు. ఆహారభద్రత కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాన్ని చేపట్టి సులభతరంగా చేసినా కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల విచారణ వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రస్థాయిలో మంజూరు విధానాన్ని పక్కనపెట్టి జిల్లా స్థాయిలోనే దరఖాస్తులను పరిశీలించి అనుమతి జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. క్షేత్రస్థాయిలోనే ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట ప్రభుత్వం సూచించింది. 13,400 దరఖాస్తులు.. జిల్లావ్యాప్తంగా కొత్తగా ఆహారభద్రత కార్డులకు 13,400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి కార్డు మంజూరుకు పౌరసరఫరాలశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్తరేషన్ కార్డులు జారీకి అర్హులను గుర్తించి, వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 7,200 కొత్త కార్డుల కోసం దరఖాస్తులు రాగా 6,200 మ్యుటేషన్లు (మార్పులు, చేర్పుల) కోసం వచ్చాయి. జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులు 7 వేలకు పైగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పౌరసరఫరాలశాఖకు 6 వేల దరఖాస్తులు హార్డ్‌కాపీల రూపంలో అందగా అందులో 1,500 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఆన్లైన్లో అనుమతించాల్సి ఉంది. 4,500 దరఖాస్తులను ఆన్లైన్ అప్లోడ్ పూర్తి చేశారు. జిల్లా స్థాయి లాగిన్‌లోనే అనుమతివ్వాలని ప్రభుత్వం తాజా మార్పులతో కొత్తకార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇంకా 8,500 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. గత జనవరి నుంచి దరఖాస్తులు సమర్పించిన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో త్వరితగతిన అనుమతినిచ్చే అవకాశమున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. జిల్లా స్థాయిలోనే మంజూరు మారిన నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మంజూరు చేస్తారు. ఆన్లైన్ ప్రక్రియ అయినప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ సేవలో పూర్తి వివరాలతో చేసుకున్న దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయ లాగిన్లోకి వస్తుంది. తహసీల్దార్ సంబంధిత ఆర్ఐకి విచారణ కోసం సిఫారసు చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన ఆర్ఐ ఆ నివేదికను తహసీల్దార్ లాగిన్‌కు పంపిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సరి చూసుకుని అర్హులైతే తన లాగిన్ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. విడిగా ఒక ప్రతీని డీఎస్వోకు పంపించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీఎస్వో ఆహార భద్రత కార్డును మంజూరు చేస్తారు. మీసేవ ద్వారా కార్డు ప్రతీని పొంది సంబంధిత రేషన్ షాపులో సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్ల కిందట కొత్త రేషన్ కార్డులు ముద్రించి జిల్లాలకు పంపారు. అదే సమయంలో జిల్లాల విభజన చేయడంతో పాత జిల్లాల పేర్లతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయకుండా నిలిపేశారు. ఇప్పుడున్న 31 జిల్లాల వారీగా ఆహారభద్రత కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఎదురుచూపులు..! జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న అర్హులైన కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో మాత్రం ముందుకు సాగడం లేదు. క్షేత్ర స్థాయి విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూరికార్డుల ప్రక్షాళన, రైతు బంధు తదితర పనులతో ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా డీఎస్వో దగ్గరకు రాని 7,400 దరఖాస్తుల్లో 5,800 వరకు విచారణకే నోచుకోలేదు. ఆర్ఐల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. 1,600 వరకు దరఖాస్తుల విచారణ పూర్తయినా తహసీల్దార్ తుది నివేదిక హార్డ్‌కాపీ రాకపోవడంతో మంజూరుకు నోచుకోలేదు. మొత్తంగా 7,400 దరఖాస్తులకు మోక్షమే లేదు. కేవలం 4,500 దరఖాస్తులకే పూర్తి స్థాయి విచారణ జరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వాటిని పౌరసరఫరాల శాఖ హార్డ్‌కాపీలతో సరిచూసుకుని అప్రూవల్ చేస్తున్నారు. 13,400 దరఖాస్తులో 8,900 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆర్ఐలు విచారణ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు ఆహారభద్రత కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులకు ఆమోదం తెలిపి డీఎస్వో కార్యాలయానికి నివేదించాలని మండలాల అధికారులను కోరాం. మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో విచారణ, హార్డ్‌కాపీల అందజేయడంలో జాప్యం కారణంగా కొంత ఆలస్యమవుతోంది. విచారణ వివిధ దశల్లో పూర్తి చేయడం కష్టతరమే. డీఎస్వో స్థాయిలోనే అనుమతి ఇవ్వొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా 13 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖకు అందిన 6 వేలల్లో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత కలిగిన వారందరినీ లబ్ధిదారులుగా మంజూరు చేస్తాం. – గౌరీశంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
నా తండ్రి చితికి ఆమే నిప్పంటించారు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్ అండగా నిలిచారు. ఓ జంటకు పాస్‌పోర్ట్ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆమెను దుర్భషలాడుతూ కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తుండటంతో భర్త కౌశల్ స్పందించారు. అయితే దురుసుగా కాకుండా.. భావోద్వేగంతో, చాలా ప్రశాంతంగా ఆయన బదులు ఇవ్వటం విశేషం. ఆ జంట తప్పు చేసిందా? ‘మీ మాటలు ఎంతో బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో కన్నుమూశారు. ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ స్వయంగా నా తల్లికి సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరికి మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్ బదులిచ్చారు. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ భర్త కౌశల్ ఓ ట్వీట్ చేయగా.. దానికి ఓ వ్యక్తి బదులిస్తూ ‘భౌతికంగా సుష్మాను హింసించండంటూ’ రీట్వీట్ చేశాడు. ఆపై పలువురు అసభ్యంగా దూషించటంతో చివరకు భర్త కౌశల్ ఇలా ఎమోషనల్‌గా ట్వీట్లు చేశారు. మరోవైపు సాయం చేసే చిన్నమ్మగా పేరున్న సుష్మాకు పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా -
అడ్డదారుల్లో అనుమతులిచ్చారు
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ ఒరిజినల్ లేఅవుట్లో చూపించిన విధంగా కాకుండా కొందరు బడాబాబులకు తలొగ్గిన అధికారులు, సొసైటీ ప్రతినిదులు తమ ప్లాట్‌ను మార్చేసి అన్యాయం చేస్తున్నారని యూకేకి చెందిన ఎన్ఆర్ఐ గొట్టిపాటి రోహిణి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో సోమవారం తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.86లో జూబ్లీహిల్స్ సొసైటీ ద్వారా తనకు కేటాయించిన 469–డి ప్లాట్‌కు ఆనుకొని ఉన్న సొసైటీకి చెందిన అదనపు స్థలాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో తాను రూ.75 లక్షల బ్యాంకు పూచీకత్తును సొసైటీకి ఇచ్చానన్నారు.ప్రారంభంలో తన ప్లాట్‌ను ఆనుకొని ఉన్న అదనపు స్థలాన్ని తమకే క్రమబద్ధీకరిస్తామని చెప్పినా ఇప్పటిదాకా చేయలేదన్నారు. ఇదే విషయంపై తాను 11 నెలలుగా జీహెచ్ఎంసీ, పోలీసులు, రెవెన్యూ, సొసైటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఇటీవల తమ ప్లాట్ పక్కనే ఉన్న 469–సి ప్లాట్‌కు చెందిన డైమన్షన్ మార్చేసి తమ అధీనంలో ఉన్న స్థలంలోకి జరిపి జీహెచ్ఎంసీ అడ్డదారుల్లో అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై విదేశాంగ శాఖకు, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చే యనున్నట్లు రోహిణి స్పష్టం చేశారు. -
మానసిక రోగులు పెరుగుతున్నారు: రాష్ట్రపతి
సాక్షి, బెంగళూరు: దేశంలో మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉధృతమయ్యేలా కనిపిస్తోందనీ, 2022కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేయాలనికోరారు. మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ ఉద్యోగాలు సంపాదించేందుకు మాత్రమే చదువు అనుకోవడం మంచిది కాదని అన్నారు. -
నేటి నుంచి కరెంటు కష్టాలు!
శ్రీకాకుళం , అరసవల్లి: జిల్లా వాసులకు కరెంటు కష్టాలు వెంటాడనున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకూ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తనుంది. విశాఖపట్నంలో సాంకేతిక లోపం కారణంగా జిల్లాకు కొద్ది రోజుల పాటు విద్యుత్ సరఫరా భారీగా తగ్గనుంది. కలపాకలో (విశాఖపట్నం) గల 315 ఎంవీఏ (మెగా వోల్ట్ ఆంప్స్) పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా అక్కడి విద్యుత్ అధికారుల సూచన మేరకు ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకోనున్నారు. దీంతో మన జిల్లాకు వస్తున్న రోజు వారీ విద్యుత్ సరఫరా కొద్ది శాతం తగ్గనుంది. ఈ ప్రభావంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కింద శుక్రవారం ఉదయం నుంచి వచ్చే నెల 3 వతేది రాత్రి వరకు విద్యుత్ కోతను అధికారులు విధించనున్నారు. జిల్లాకు రోజుకు 240 మెగావాట్లు సరఫరా అవుతుండగా, తాజాగా వచ్చిన సాంకేతిక లోపంతో సుమారు 50 మెగావాట్లు తక్కువగా సరఫరా కానుంది. దీంతో జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ సరఫరాలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లోనే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కోతలు విధించే అవకాశముంది. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు దాదాపుగా ఏడు లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరిపై ఈ ప్రభావం పడనుంది. దీనికి తోడు జిల్లాలో పైడిభీమవరం సబ్‌స్టేషన్‌లో కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇక్కడ కూడా మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో విద్యుత్ కోతలు అనివార్యం కానున్నాయి. వచ్చే నెల 3 వరకు కోతలుంటాయి కలపాక పవర్ ట్రాన్స్ఫార్మర్ మెయింటనెన్స్ కారణంగా శుక్రవారం ఉదయం నుంచి వచ్చే 3 వతేది వరకు జిల్లాలో కొంత వరకు విద్యుత్ కోతలు తప్పవు. అయితే కోతల సమయాలను జిల్లాలో పరిస్థితులు, అవసరాల మేరకు శ్రీకాకుళం డివిజన్, టెక్కలి డివిజన్లలో నిర్ణయిస్తాం. వినియోగదారులకు రాత్రి వేళల్లోనే కొంత మేరకు ఇబ్బందులుంటాయి. దాదాపుగా 40 నుంచి 50 మెగావాట్ల వరకు తక్కువగా విద్యుత్ సప్లై అవుతున్న కారణంగానే ఈ కోతలు అనివార్యంగా విధిస్తున్నాం. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నాం. – దత్తి సత్యనారాయణ, ఎస్ఈ -
మాట మార్చారు..
పోలవరం నిర్వాసితులపై వివక్ష 50 మంది పేర్లు తొలగింపు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి వీలుగా ఇళ్లను తొలగించనున్న కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. పలు సాకులతో కొంతమంది నిర్వాసితుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. కోల్పోయిన ఇళ్లను మరోచోట ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు. మరో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారన్న కారణాలతో ప్రత్యామ్నాయ ఇళ్ల మంజూరు జాబితాలో పేర్లు తొలగించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తొలి రెండు విడతల జాబితాల్లో ఉన్న తమ పేర్లను చివరి జాబితాలో తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా నివాసం ఉన్నా ఇప్పుడు పునరావాసం కాలనీలో ఇళ్లకు అనర్హులమంటూ అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. తుని రూరల్ (తుని) : తుని పట్టణాన్ని ఆనుకుఉన్న కొండవద్ద కుమ్మరిలోవ కాలనీని 1996లో నిర్మించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతోపాటు తునికి చెందిన పలువురు కాలనీలో నివాసాలు ఉంటున్నారు. ఈ ఇళ్లలో పేదలు, వ్యవసాయదారులు, కుల వృత్తిదారులు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమంలో కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. కుటుంబాలు పెరగడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. కొంతమందికి ఉద్యోగాలు లభించడం, కొందరు పదవీ విరమణ కూడా చేశారు. ఇటీవల పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకానికి కుమ్మరిలోవ కాలనీ అడ్డంగా ఉందంటూ కాలనీలో 323 ఇళ్లను తొలగించేందుకు నిర్ణయించారు. నష్ట పరిహారంతోపాటు పునరావాసంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని అధికారులు చెప్పడంతో కాలనీలో ఇళ్లు ఖాళీ చేసేందుకు కాలనీవాసులు అంగీకరించారు. 323 ఇళ్లు తొలగిస్తుండగా దుద్దికలోవలో రూ.వంద కోట్లతో 424 ఇళ్లు నిర్మించేందుకు 26 ఎకరాల భూమిని సేకరించారు. కొత్తగా మెలిక పెట్టారు... ఇప్పుడు కొత్తగా మెలిక పెట్టారు. ప్రభుత్వం నుంచి జీతాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఒక్కటే వర్తిస్తుందని, పునరావాసంలో ఇళ్లు, ప్రత్యేక ప్యాకేజీలు లభించవని స్థానిక అధికారులు చెబుతున్నట్టు బాధితులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని సొంతంగా చేపడతారా? ప్రభుత్వం నిర్మించాలా? అనేదానిపై సర్వే చేస్తున్న అధికారులు తమను సంప్రదించకపోవడంతో జాబితా నుంచి తమను తొలగించారంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. దీంతో 50 మంది వరకు బాధితులు సోమవారం పెద్దాపురం ఆర్డీఓ, బుధవారం తుని తహసీల్దార్‌ను కలసి విషయాన్ని విన్నవించారు. రాజకీయ నాయకులు జోక్యం వల్లే అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు ఇవ్వకపోతే కాలనీ ఖాళీ చేయమని, అవసరమైతే కాలువ తవ్వకాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిర్వాసితులకు పరిహారం మాత్రమే లభిస్తుందని తహసీల్దార్ బి.సూర్యనారాయణ అన్నారు. బాధితుల ఆందోళన, వినతి పత్రాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు. కూతురికి ఇల్లు ఇచ్చాను పెళ్లి సందర్భంలో కూతురికి కాలనీ ఇల్లు ఇచ్చాం. మరో చోట ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. కాలువ తవ్వకానికి ఆ ఇంటిని తొలగించనున్నారు. నష్టపరిహారం ఇచ్చారు. తమ పేరుతో రెండు ఇళ్లు ఉన్నందున పునరావాసంలో ఇల్లు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. – గేదెల ఎర్రియ్యమ్మ, బాధితురాలు పరిహారమే ఇచ్చారు పోలవరం కాలువ తవ్వకానికి కాలనీ ఇళ్లు తొలగిస్తామని అంటున్నారు. 2012లో తుపానుకు ఇల్లు కూలిపోయింది. పిల్లలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. నేను కూలిపోయిన ఇంటి స్థలంలో పూరిపాక కట్టుకున్నాను. దీనికి నష్ట పరిహారం ఇచ్చారు. పునరావాసంలో ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. – నాగం మాణిక్యం, బాధితురాలు, కుమ్మరిలోవ కాలనీ -
‘గూటి’ చుట్టూ గజిబిజే..
-‘అందరికీ ఇళ్లు’ పథకంలో తొలగని అయోమయం -స్పష్టత లేమితో వాయిదాల చెల్లింపులో లబ్ధిదారుల నిర్లిప్తత -గడువు రెండుసార్లు పెంచినా అంతంత మాత్రపు స్పందన -ఫ్లాటు రేటుపై విమర్శలతో మెట్టు దిగిన సర్కారు -టెండర్లు పూర్తయిన తర్వాత ధరల్లో మార్పులు మండపేట : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్న నానుడే.. ఆ రెండు కార్యాలూ ఎంత బరువుబాధ్యతలతో కూడినవో చెపుతుంది. అలాంటప్పుడు.. సర్కారు ‘ఇల్లు కట్టి ఇస్తాం’ అంటే సామాన్యులు, మధ్యతరగతి వారు ఎగిరి గంతేయాలి. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం’ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పథకం ఆదిలోనే అనేక సందేహాలకు నిలయంగా మారింది. ‘సరికొత్త టెక్నాలజీ’ అంటూ.. రియల్టర్ల బాటలో.. ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువగా ఫ్లాట్ రేటు ధర నిర్ణయించిన సర్కారు తొలి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సర్కారే భారీ దోపీడీకి రంగం సిద్ధం చేస్తుండటంపై ‘సాక్షి’ దినపత్రికలో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. నెలవారీ బ్యాంకు వాయిదాలపై స్పష్టత లేకపోవడం, షీర్వాల్ టెక్నాలజీపై ఆందోళన, మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపడం మొదలైన కారణాలతో తొలి విడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అభాసు పాలవుతున్న సర్కారు బ్యాంకు రుణం విషయంలో దిగి వస్తోంది. గత ప్రభుత్వాలు సెంటున్నర స్థలంలో ఇంటి కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తే, సొంతంగా కొంత మొత్తాన్ని వేసుకుని పేద వర్గాల వారు రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్లతో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ ప్రకారం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి ఇచ్చే రూ.3 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే సరికొత్త టెక్నాలజీ అంటూ సామాన్యుల దోపిడీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు సర్కారు. చదరపు అడుగుల పేరిట ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి, వసతుల భారాన్ని పేదలపైనే మోపజూసింది. అందుకోసం లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంకు రుణాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, 430 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాటుగా విభజించింది. జి ప్లస్-3 కింద జిల్లాలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. తొలి విడతగా రూ.1,457.62 కోట్లతో 19,242 ఫ్లాట్లు మంజూరు చేసింది. కాకినాడ నగర పరిధిలో 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరంలో 4,200, పెద్దాపురంలో 1,724, సామర్లకోటలో 1,048, రామచంద్రపురంలో 1,088, మండపేటలో 4,064, పిఠాపురంలో 874, అమలాపురంలో 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. ఇంతవరకూ వాయిదాలు కట్టింది 11,346 మందే.. అయితే ఆ కేటగిరీల్లోని ఫ్లాట్లకు ఎంత వరకూ బ్యాంకు రుణం చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకూ లబ్ధిదారులకు స్పష్టతను ఇవ్వడం లేదు. వసతుల భారాన్ని తమపైనే మోపడంపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తొలివిడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కేటగిరీ-1లో లబ్ధిదారుని వాటా రూ.500 ఒకే వాయిదాగా, రెండవ కేటగిరీలో లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు రూ.12,500లు చొప్పున నాలుగు విడతలుగా, కేటగిరీ-3లో లబ్ధిదారుని వాటా రూ.లక్షకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చెల్లించాలి. జూలై 20లోగా తొలి విడత వాయిదాలు చెల్లించాలని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గడువు జూలై 31 వరకు పొడిగించింది. అప్పటికి ఫలితం లేకపోవడంతో తాజాగా ఈ నెల 14 వరకు మరోమారు గడువిచ్చింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 11,346 మంది లబ్ధిదారులు మాత్రమే తొలి విడత వాయిదాలు చెల్లించారు. వీరిలో కేటగిరీ-1కు 3,413 మంది డీడీలు చెల్లించగా, కేటగిరీ-2కి 1,346 మంది, కేటగిరీ-3కి 6,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు రుణభారం తగ్గింపు.. సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ధర తగ్గించడం జరగదు. అయితే అధిక ధరలు నిర్ణయించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న సర్కారు దిగిరాక తప్పలేదు. ఆయా కేటగిరీల్లో లబ్ధిదారుని వాటా మాత్రం యథావిధిగా ఉంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన 40 రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్యాంకు నుంచి తీసుకునే రుణ భారాన్ని తగ్గించింది. వసతుల కల్పనకు ఫ్లాటుకు రూ.1.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఇటుకలతో ఇల్లు నిర్మిస్తే చదరపు అడుగు రూ.వెయ్యి వరకు మాత్రమే అవుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వాయిదాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. -
గోశాల షాపుల ‘గలీజు’
రూ. 15.72 లక్షలు గోల్మాల్ కమిటీ రద్దయినా నేటికీ దందా కొనసాగిస్తున్న సభ్యులు సభ్యులే బినామీల పేరుతో షాపుల కైవసం నెల అద్దె రూ 6500, కట్టేది రూ.1000 కాకినాడ రూరల్ : కాకినాడ జంతుహింస నివారణ సంఘంలో గో సంరక్షణ పేరుతో రూ. లక్షలకు లక్షలు దోచేశారు. గోవులపై వ్యాపారం చేస్తున్నారని, కమిటీని పూర్తిస్థాయిలో రద్దు చేసి, వారిపై విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం నేడు నిజమైంది. శనివారం సాయంత్రం ఆర్డీవో ఎల్.రఘుబాబు అధ్యక్షతన షాపుల లీజుదారుల సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. షాపు యజమానులు చెప్పే వివరణలు విన్న అధికారులు షాకయ్యారు. తాము ఒక్కొక్క షాపునకు నెలకు రూ. 6,500 చొప్పున పది నెలలు అడ్వాన్సుగా రూ. ఒక్కొక్కరు రూ. 65,000, నెలకు రూ. 6,500 చొప్పున అద్దె చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు రికార్డులను పరిశీలించగా ఒక్కొక్క షాపునకు నెలకు కేవలం రూ. వెయ్యి వంతున మాత్రమే చెల్లించినట్టు నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. దాదాపుగా లీజుల పేరుతో రూ. 15.72 లక్షలు గోల్మాల్ అయ్యిందని అధికారులు గుర్తించారు. లీజు పేరు రద్దయిన కమిటీ సభ్యులు షాపుల యజమానులపై దందాలు కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కమిటీలో ఎవరైనా షాపు యజమానులను బెదిరించి లీజు రూపంలో డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో రఘుబాబు హెచ్చరించారు. ఇటీవల గోవులు మృత్యువాత సంఘటన నేపథ్యంలో కలెక్టర్ కార్తికేయమిశ్రా పాత కమిటీని రద్దు చేసి కొత్తగా కమిటీ చైర్మన్‌గా ఆర్డీవో ఎల్ రఘుబాబును నియమించిన సంగతి తెలిసిందే. గో సంరక్షణకు వీలుగా చర్యలు తీసుకునే భాగంగా ఆర్డీవో షాపులను లీజులకు తీసుకున్న లీజుల గో సంరక్షణకు నిధులు పేరుతో 12 షాపులతో ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్‌ను నిర్మించారు. గో సంరక్షణ ఎలా ఉన్నా, దానిపై పెత్తనం చెలాయించే నాయకులకు మాత్రం ఈ కాంప్లెక్ బంగారు బాతుగా మారింది. నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులే షాపులను వ్యాపారాలకు తీసుకొని, మళ్లీ బినామీల పేరుతో మరొకరు వ్యాపారం చేసుకునేందుకు ఇచ్చేశారు. వారి నుంచి పదిరెట్లు డబ్బులు వసూలు చేసి దోచేశారు. గోవుల మృత్యుఘోష సమయంలో ప్రజలు నుంచి కమిటీపై దుమారం వచ్చినా అధికారులు పెద్దగా స్పందించలేదు. తరువాత కలెక్టర్ మిశ్రా స్వయంగా జంతు హింస నివారణ సంఘాన్ని పరిశీలించి కమిటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 13 మంది సభ్యులపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరి నుంచి షాపులు లీజు రూపంలో దోచేసిన సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు ప్రస్తుతం జంతు హింస నివారణ సంఘంలో 123 గోవులు ఉన్నాయని, వీటిలో రెండు పశువులు నీర్సంగా ఉండడంతో వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీవో రఘుబాబు వివరించారు. ఎవరైనా పశువులకు దానా రూపంలోనే విరాళాలు అందజేయాలని సూచించారు. ఎవరు ఏమీ ఇచ్చినా వాటికి సంబంధించి రశీదు పొందాలన్నారు. ప్రస్తుతం ఉన్న గోవుల సంరక్షణకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. షాపులకు సంబంధించిన లీజులను కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇకపై గతంలో లీజులు తీసుకున్న వారిని తొలగిస్తామని, నేరుగా షాపు యజమానులకే లీజు కేటాయించి, ఆ సొమ్ములను నెల, నెలా జంతుహింస నివారణ సంఘం పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకమా.. పర్సంటేజీలా..!
చైర్మన్ నవీన్ మొగ్గు ఎటువైపన్న దానిపైనే అందరి నిరీక్షణ చర్చనీయాంశమైన జెడ్పీ సీసీ పోస్టింగు సీటు కోసం ఎవరి పైరవీలు వారివి భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్‌లో ఏ ఫైలు కదలాలన్నా, బదిలీలు కావాల్సిన చోటుకి రావాలన్నా, పెన్షన్లు, పీఎఫ్ ఫైళ్లు, ఉపాధ్యాయులు డిప్యుటేషన్లు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, జెడ్పీ నుంచి విడుదలయ్యే కోట్ల రూపాయల నిధులు, వాటి పర్సంటేజీలు, జెడ్పీ ఆస్తులు, ఆదాయాలు వీటన్నింటిపై చక్రం తిప్పే సీటు జెడ్పీలో ఏదైనా ఉందంటే అది జెడ్పీ చైర్మన్ సీసీ పదవే. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్ ఎంపికైన తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న గత జెడ్పీ చైర్మన్ నామన సీసీ ప్రసాద్ మాతృస్థానానికి వెళ్లారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుత చైర్మన్ సీసీగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది. గతంలో వంగా గీతావిశ్వనాథ్ నుంచి సీసీగా అనేక పర్యాయాలు పనిచేసిన ప్రణాళికా విభాగానికి చెందిన హరికృష్ణ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే నామనకు సీసీగా వ్యవహరించిన ప్రసాద్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జెడ్పీలో పనిచేసి ఆర్‌అండ్‌బీకి బదిలీపై వెళ్లిన సత్యనారాయణమూర్తి సైతం ఒకే సామాజిక వర్గ సమీకరణాలతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. సామాజిక వర్గమా.. అనుభవమా..! కీలకంగా మారిన ఈ పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్గీయులకే చైర్మన్ నవీన్ కట్టబెడతారో లేక పర్సంటేజీలలో అనుభవమున్న వ్యక్తులకు ఇచ్చి కలెక్షన్లకు తెరదించుతారోనని చర్చ మొదలైంది. నవీన్ సమావేశాల్లో ఆది నుంచీ రెండేళ్ల పాలనలో జెడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని పెంచుతానని, పర్సంటేజీల పాలనకు స్వస్తి పలికి నీతి నిజాయతీలతో పీఠానికి గౌరవం తెస్తానని అంటున్నారు. ఆయన మాటలు కేవలం సమావేశాలకే పరిమితమా లేక కార్యరూపంలో పెడదారా అన్న సందేహం అందరిలో మొదలైంది. ఉద్యోగుల్లో ఉన్న యూనియన్ల దృష్ట్యా ఏ సంఘం వారికి ప్రాధాన్యం ఇస్తారో ఆయా సంఘాల సభ్యులంతా వేచి చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సందేహాలు నివృత్తి కానున్నాయి. రెండు రోజుల్లో సీసీ నియామకం జరుగుతుందని, పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని, జిల్లా పరిషత్‌లో గ్రీవెన్స్‌తో సహా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చైర్మన్ నవీన్ ప్రకటించారు. -
ఎయిడెడ్ పోస్టుల దందా
పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్న దళారులు మోసపోవద్దుంటున్న విద్యాశాఖాధికారులు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అ«ధ్యాపక పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టుకు రూ.10 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం మీకే..సరేనండి ఇదిగో రూ.10 లక్షలు అంటూ కొందరు. ఇప్పుడు అంత ఇవ్వలేనండి రూ.5 లక్షలు ఇస్తున్నాను మిగతావి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాను అని మరికొందరు. ఆ సొమ్ముతేవడానికి అప్పులు చేసి కొందరు, ఇంట్లో బంగారునగలు, ఉన్నవి అమ్మి మరికొందరు పరుగులు మీద తెచ్చి లక్షల సొమ్ములు ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో దళారులు చేస్తున్న ఎయిడెడ్ పోస్టుల దందా. -కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) ఇదీ పరిస్థితి జిల్లాలో 45 హైస్కూల్స్ ఉండగా వాటిలో 774 పోస్టులు ఉండేవి. వాటిలో ప్రస్తుతం 300 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీ, ఎలిమెంటరీ స్కూల్స్ 100 వరకూ ఉండగా వాటిలో 529 ఉపాధ్యాయులు పని చేసేవారు. ప్రస్తుతం 310 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 210 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న ఈ పోస్టులు 15 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండగా వాటిని 2004 అక్టోబర్ నుంచి భర్తీని బ్యాన్ చేశారు. తర్వాత 2005లో ఎయిడెడ్ సిబ్బంది కోర్టుకెళ్లారు. స్కూల్స్‌లో బోధకులు లేకపోవడంతో విద్యార్థులు ఉండడం లేదు, తాత్కాలిక పోస్టుల భర్తీ చేయాలంటూ పోరాటల ఫలితంగా 2013లో కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో తాత్కాలిక ప్రాతిపదికన ఎయిడెడ్ యాజమాన్యమే జీతాలు ఇచ్చుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తునే ఉంది. కొందరు బోధకులు అవసరం కావడంతో జీవో నెంబర్ 1 ప్రాతిపదికన బోధకులను నియమించుకున్నారు. ఈ బ్యాన్‌ను 30.6.2017న లిప్ట్చేసింది. అంతే....ఎయిడెడ్ పోస్టుల భర్తీ జరుగుతున్నాయి. లక్షలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీకే అంటూ దళారులు దందా ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది అమాయకులు లక్షల రూపాయలు వారి చేతుల్లో పోసారు. దీనిపై విషయం తెలిసినా విద్యాశాఖ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఆ పోస్టులు ఏమిటి, ఎవరిని భర్తీ చేయాలనే దానిపై సమాచారం ఇస్తే అభాగ్యులు మోసపోయేవారు కారేమో. ఇలా మోసపోయిన కొందరు ‘సాక్షి’వద్దకు వచ్చి తమ బాధను తెలిపారు. తాము మోసపోయామని తెలిపారు. దీనిపై విద్యాశాఖ, ఎయిడెడ్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే పలు విషయాలను వివరించారు. ఏ పోస్టుల భర్తీ జరుగుతుంది? కోర్టు ఉత్తర్వుల మేరకు 2002 నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నేరుగా రెగ్యూలర్ అవుతుంది. ఆ తర్వాత కోర్టు 2013 ఇచ్చిన తీర్పుననుసరించి తాత్కాలికంగా జీవో నెంబర్ 1 ప్రాతిపదికన యాజమాన్యం జీతాలు ఇస్తూ భర్తీ చేసుకున్న తాత్కాలిక బోధకులకు ఫైవ్ మెన్ కమిటీతో ఇంటర్వూలు నిర్వహించి వారిని రెగ్యులర్ చేయాలి. ఇప్పటికే ఆ పక్రియ రాష్ట్ర కేంద్రంగా గుంటూరులో ప్రారంభమైంది. అయితే ఈ పక్రియలో ప్రథమంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీలను గుర్తించి రేషనలైజ్ చేయాలి, దీంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి, అంతే తప్ప ఎయిడెడ్ విద్యాసంస్థల్లో కొత్తవారికి ఉద్యోగాలు అనే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ పోస్టులు 2002 ముందు, 2013 తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే. మోసపోవద్దు ఎయిడెడ్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెపితే ఎవరూ నమ్మవద్దు. ఇది అంతా మోసం. కొత్తవారిని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియమించే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ విధానం ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై కొందరు లక్షల సొమ్ము గుంజుతున్న సమాచారం వచ్చింది. దళారులకు సొమ్ములు ఇచ్చి ఎవ్వరూ మోసపోవద్దు. -–ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే కోర్టు తీర్పునిచ్చింది డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే. అయితే కొందరు ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని వచ్చి సొమ్ములు గుంజుతున్నారు. ఇదంతా మోసం. ఎవరూ నమ్మవద్దు. సొమ్ములు పొగొట్టుకోవద్దు. –బి.చిట్టిబాబు, ఏపీ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు -
ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
- సొమ్ములు కట్టినా ఎదురుచూపులే.. - పీఎంఏవైలోనూ అర్హులకు మొండిచెయ్యి - సిఫారసులకు, పచ్చచొక్కాలకే గృహయోగం కాకినాడ : ‘అర్హత’కు ప్రాతిపదిక ఏమిటి? పేదరికమా? అధికార పార్టీ జెండా పట్టుకోవడమా? ప్రభుత్వం మారిపోతే అర్హులు ‘అనర్హులు’గా మారిపోతారా? జిల్లా కేంద్రం కాకినాడలో అర్హత కలిగిన గృహనిర్మాణ లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇల్లు మంజూరు చేస్తామంటే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వేలాది రూపాయలు అప్పులు చేసి, ప్రభుత్వానికి చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏడెనిమిదేళ్లుగా ఇల్లు మంజూరవుతుందని వెయ్యి కళ్లతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఐహెచ్ఎస్డీపీ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దీనికి దాదాపు 1,750 మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ములు కూడా చెల్లించారు. వీరిలో తొలివిడతగా అప్పట్లో 816 మందికి ఏటిమొగ, పర్లోపేట ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మందీ ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.86 వేల వరకు డీడీలు తీసి అప్పట్లోనే గృహనిర్మాణ శాఖకు అందజేశారు. అలా వీరంతా చెల్లించిన రూ.3 కోట్ల వరకు సొమ్ము గృహనిర్మాణ శాఖలో మూలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం కుంటుపడడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక సొంతింటి ‘కలే’నని లబ్ధిదారులు డీలా పడుతూ వచ్చారు. ఇళ్లు ఎప్పుడు మంజూరైనా సొమ్ములు కూడా చెల్లించిన తమకే ప్రాధాన్య క్రమంలో ముందుగా అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎంఏవైలో మొండిచెయ్యి ‘అందరికీ ఇళ్లు’ పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితమే వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లబ్ధిదారులను పక్కన పెట్టి పచ్చచొక్కాలతో కూడిన జాబితా బయటకు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా 4,600 ఇళ్లు మంజూరైనా పాత జాబితాలో ఉన్న చాలామందికి చోటు దక్కకకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. పారదర్శకత ఏదీ? పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా తీసుకుని రాజకీయాలకు దూరంగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను కూడా సమన్వయం చేసుకుని అర్హులకు ఇళ్లు దక్కేలా కృషి చేశారు. ప్రస్తుతం అలాంటి విధానానికి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు చక్రం తిప్పి సొంత పార్టీ కార్యకర్తలకు, సొమ్ములు ఇచ్చినవారికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా చేసుకుపోవడంతో అర్హులకు మొండిచెయ్యే మిగిలింది. గ్రీవెన్స్‌సెల్ ఎందుకూ? కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌కు నిత్యం ఎంతోమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తే ఇక గ్రీవెన్స్‌సెల్ వల్ల ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుని డబ్బులు కూడా కట్టినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ న్యాయం చేయాలి ఏడేళ్ల క్రితం ఇంటికోసం దరఖాస్తు చేశా. రూ.26 వేలు డీడీ కూడా తీసి ఇచ్చా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు వస్తుందని ఎంతో ఎదురు చూసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి. - టి.సత్యనారాయణ, లబ్ధిదారు నచ్చినవారికి ఇస్తున్నారు గృహనిర్మాణాల్లో అర్హత కలిగిన పాత లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి. వేలకు వేలు అప్పులు చేసి సొమ్ములు కట్టాం. తీరా ఇళ్లు వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టి నచ్చినవారికి ప్రాధాన్యం ఇనిస్తున్నారు. - బి.వెంకటలక్ష్మి, లబ్ధిదారు వడ్డీలు కట్టలేకపోతున్నాం ఇల్లు వస్తుందని మూడు విడతలుగా రూ.83 వేలు ప్రభుత్వానికి చెల్లించాను. అప్పులు చేసి కట్టడంతో టైలరింగ్ వృత్తిపై ఆధారపడుతున్న నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి, ఇళ్లు మంజూరు కాని పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి. - వాయివాడ రమణ, లబ్ధిదారు -
కామినేనీ ... కానరాలేదా...
నవమాసాలు పెంచి ... పురుటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఆ బిడ్డ కన్నుమూస్తే ... ఆ కన్నతల్లికి ఏదీ ఊరడింపు...? . తొమ్మిది నెలలు అమ్మ గర్భంతో అనుబంధం పెంచుకొని పేగు తెంచుకొని బాహ్య ప్రపంచంలోకి బయటపడిన రోజుల్లోనే ... అమ్మ ఒడి చవిచూడకుండానే... ఆ తల్లి కన్నుమూస్తే... ఆ బిడ్డకు రక్షణేదీ...? . పౌష్టికాహారలోపం... వాతావరణ కాలుష్యం... దోమల స్తైర విహారం... రక్త హీనత ... కారణాలేమైతేనేం అనుబంధాలు...ఆత్మీయతలు అంతలోనే అదృశ్యమైతే ఆ పాపం ఎవరిదీ...? ప్రశ్నిస్తోంది గిరిజనం . పాలకుల పరామర్శల సాక్షిగా చావులు నిజం... ముసురుతున్న దోమల సాక్షిగా మలేరియా లేదట...! లెక్కలు పక్కాగా చెబుతున్నా... పక్కతోవ పట్టించే యత్నం... ఇదేమి విచిత్రం... -
బాలలు కిలకిలలాడే చోట.. గ్లాసుల గలగలలా?
-నివాసప్రాంతాల్లో నిషా అంగళ్లా? –ససేమిరా సహించబోమంటున్న జనం –జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ కొనసాగిన ఆందోళనలు –ఉద్యమించిన మహిళలను అరెస్టు చేసిన కరప పోలీసులు –కామనగరువులో బ్రాందీషాపును ముట్టడించిన విద్యార్థులు –దుకాణాల ఏర్పాటుకు అనువుగా ఎండీఆర్ రోడ్లుగా రాష్ట్ర రహదారుల మార్పు –ఈ పరిణామంతో జనం మరింత భగ్గుమనే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : పిల్లాపాపల కిలకిలలు ప్రతిధ్వనించే తావుల్లో మందుగ్లాసుల గలగలలను సహించబోమన్న జనాగ్రహం రగులుతూనే ఉంది. ముంగిళ్లలో ముగ్గులు, లోగిళ్లలో మర్యాదమన్ననలకు పెద్దపీట వేసే మనుషులు ఉండే నివాసప్రాంతాల్లో నిషా దుకాణాలు ఏర్పాటు చేసే అనాగరిక వ్యాపార వైఖరిపై నిరసన గళం మార్మోగుతూనే ఉంది. బడి, గుడి గంటల సవ్వడి గాలిలో తేలివచ్చే చోట తాగుబోతుల ప్రేలాపలను ఎంత మాత్రం వినబోమన్న సమరభేరితో దిక్కులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. ఇళ్ల మధ్య, గుడులు, బడుల చేరువలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనం రోడ్లెక్కుతూనే ఉన్నారు. కొత్త మద్యం పాలసీ (2017–19) ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా వేలంలో పాడుకున్న వారు మద్యం దుకాణాల ఏర్పాటుకు సంసిద్ధులయ్యారు. అయితే జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని తొలిరోజు నుంచీ జిల్లాలో పలుచోట్ల స్థానికులు ముఖ్యంగా మíßహిళలు, యువకులు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. జిల్లాలో 545 దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా ఈసారి 534 దుకాణాలు లాటరీలో వ్యాపారులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ జిల్లాలో 175 దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇళ్ల మధ్య, పాఠశాలలు, దేవాలయాలకు సమీపంలో ఉన్న దుకాణాలను తొలగించాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. బుధవారం రాజమహేంద్రవరంలోని జాంపేట మార్కెట్ ఎదురుగా ఇళ్ల మధ్యలో, మసీదుకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని 31వ డివిజన్ కార్పొరేటర్ మజ్టి నూకరత్నం, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ముస్లిం నేత మున్నా మహిళలు, స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏవీ అప్పారావు రోడ్డులో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మహిళలు బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో మద్యం షాపు ఏర్పాటుతో గ్రామ మహిళలు, స్థానికులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. ఆలమూరులో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, గ్రామస్తులు ధర్నా చేశారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడించి, తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు వీరలక్ష్మి తదితరులు కరప మండలం వేళంగిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలను పెడచెవిన పెట్టి మంగళవారం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ మహిళలు, సీఐటీయూ జిల్లా సెక్రటరీ ఎం.వీరలక్ష్మి తదితరులు మంగళవారం రాత్రి వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పోలీసులు వీరలక్ష్మిని, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కరప పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. గ్రామస్తులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్ట్ చేసిన వారిని కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుకాణం 20 రోజుల్లో తొలగిస్తామని పెద్దల సమక్షంలో దుకాణ యజమానులు అంగీకరించడంతో నిరసన విరమించారు. పిఠాపురం మండలం కందరాడ రాజీవ్‌కాలనీ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత మహిళలు ఆందోళనకు దిగారు. పిఠాపురం రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఆది నుంచీ ఆగ్రహాగ్నే.. ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఒకటి నుంచి జిల్లాలో పలు చోట్ల స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముమ్మిడివరం బాలయోగి తపోవనం చేరువలో మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళనలు చేశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి బొమ్మిడిపాలంలో, అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామాల్లో మద్యం దుకాణాలు తీసేయాలని గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఆలమూరు మండలం చింతలూరు, చొప్పెళ్ల, రావులపాలెం సీఆర్పీ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు మద్యం దుకాణాలను తొలగించాలంటూ వాకర్స్, స్థానికులు ధర్నాలు చేశారు. రామచంద్రపురం రూరల్ తాళ్లపొలంలో, కె.గంగవరం మండల కేంద్రంలో మద్యం షాపు వద్దంటూ మహిళలు ఉద్యమించారు. సామర్లకోట 22వ వార్డులో ప్రైవేటు స్కూల్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటుచేయవద్దంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేశారు. మండల కేంద్రాలైన కొరుకొండ, సీతానగరంలలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కాగా, మంగళవారం నగరపాలక, పురపాలక సంఘాలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్పు చేయడంతో మిగిలిన 369 దుకాణాల ఏర్పాటుకు అవకాశం వచ్చింది. ఇందులో జాతీయ రహదారిపై ఉన్న 36 దుకాణాలు కూడా వాటికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసే వీలుంది. ఆ రకంగా ఇవి ఇళ్ల మధ్యకూ వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
పంచాయతీ తేల్చేదెవరు..?
- కృష్ణా జలాలపై పట్టింపు లేని కేంద్రం, బోర్డు - నేడు హైదరాబాద్‌కు కృష్ణా బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల నీటి వినియోగ విధివిధానాల ఖరారుపై అటు కేంద్ర జల వనరుల శాఖ, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. వాటర్ ఇయర్ ఆరంభమై నెల రోజులు ముగిసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వినియోగ విధానంపై సమన్వయం చేయకుండా చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో పదేళ్ల కనిష్టానికి నీటి మట్టాలు చేరుకున్న దృష్ట్యా తెలంగాణ శ్రీశైలం నుంచి నీటి విడుదల కోరుతున్నా, పట్టిసీమ వాటా తేల్చాలంటున్నా కేంద్రం, బోర్డులు మౌనాన్నే పాటిస్తున్నాయి. నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే ఎగువ శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ గత నెలలో మూడు మార్లు కృష్ణా బోర్డుకు విన్నవించినా ఫలితం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని పంపింగ్ చేసేందుకు సాగర్‌లో 502 అడుగుల నీటి మట్టాలు ఉండాలని, అయితే ప్రస్తుతం సాగర్‌లో మట్టం 501.6 అడుగులకు పడిపోయిందని తెలిపినా బోర్డు, ఈ విషయాన్ని ఏపీకి తెలియజేసి వారి అభిప్రాయం కోరడం తప్ప ఏం చేయలేకపోయింది. మూడు సార్లు ఫిర్యాదు చేయగా, దీనిపై ఏపీ తేల్చనప్పుడు తామేం చేయాలంటూ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తెచ్చింది. అయినా సమస్య మాత్రం అలాగే ఉండి పోయింది. సమన్వయ సమావేశాలెప్పుడు? ఇక ప్రతి ఏటా వాటర్ ఇయర్ జూన్ నుంచి మరుసటి ఏడాది జూన్వరకు నీటి వినియోగ ముసాయిదాను ఖరారు చేసుకోవాల్సి ఉం టుంది. ముసాయిదా ఖరారుకు సంబంధిం చి కేంద్ర జలవనరుల శాఖ ఏటా జూన్ లోనే ఇరు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాలకు పరిష్కారం చూపుతూ వస్తోంది. గత ఏడాది జూన్ 21, 22 తేదీల్లోనే సమన్వయ సమావేశాలు పెట్టి ము సాయిదా ఖరారు చేసింది. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు దీనిపై కదలిక లేదు. గత ఏడాది ముసాయిదానే కొనసాగించాలని తెలంగాణ, చిన్నపాటి మార్పులు చేయాలని ఏపీ బోర్డుకు ఇప్పటికే తెలియజేసినా, తమ స్పందన ఏంటన్నది బోర్డు, కేంద్రం తెలు పడం లేదు. ఇక పట్టిసీమతో గత ఏడాది ఏపీ చేసిన వినియోగం 53 టీఎంసీల్లో వాటాలపై ఎటూ తేల్చని కేంద్రం, బోర్డులు ఈ ఏడాది తిరిగి ఏపీ పట్టిసీమతో వినియోగం మొదలుపెట్టినా పట్టించుకోవడం లేదు. ఈ అన్ని అంశాలపై ముందుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలా? లేక నేరుగా కేంద్రం వద్దే సమావేశం ఏర్పాటు చేయాలా అన్న దానిపైన ఇంతవరకు స్పష్టత రాలేదు. కాగా, గత కొన్ని వారాలుగా ఢిల్లీలో ఉన్న కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చాక బోర్డు లేక కేంద్రం వద్ద సమావేశాలపై స్పష్టత వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
నిబంధనలు బేఖాతరు
వివాదాల నడుమ వైన్ షాపుల లైసెన్సులు కొన్ని చోట్ల గుడి, బడి సమీపంలోనే షాపులు తెలుగు తమ్ముళ్లకు వర్తించని నిబంధనలు రాజమహేంద్రవరం క్రైం : వివాదాల నడుమ బ్రాందీ షాపులకు లైసెన్సుల మంజూరు జరిగింది. బ్రాందీ షాపులకు జూన్ 30తో గడువు ముగిసి జూలై 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న వారు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 534 బ్రాందీషాపులకు, 42 బార్లు, స్టార్ హోటళ్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఆదివారానికి జిల్లాలో 175 బ్రాందీ షాపుల యజమానులు, 3 బార్లకు లైసెన్సులు తీసుకున్నారు. ఇంకా బ్రాందీ షాపులు లైసెన్సులు తీసుకోవాల్సి ఉన్నాయి. తీసుకున్న కొన్ని షాపులతో పాటు, పాత బ్రాందీషాపులకు కొన్ని వివాదాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి, హాస్పటల్స్ చూడకుండా ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు ఇవ్వడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బ్రాందీ షాపులకు లైసెన్సులు మంజూరు చేయాలంటే దేవాలయాలు, పాఠశాలలు, హాస్పటల్స్, జాతీయ నాయకుల విగ్రహాలకు 100 మీటర్ల దూరంలో ఇవ్వాలి. దీనితో పాటు స్థానికుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. యజమానులు స్థానికుల అనుమతులు తీసుకోకుండానే షాపులు ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి అనుమతి ఉందని ఎక్సైజ్ అధికారులను నమ్మిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే బ్రాందీషాపులకు లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన తరువాత స్దానికులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా షాపులు తొలగించడం లేదు. చేసేది లేక బ్రాందీషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. రామమందిరం సమీపంలో బ్రాందీ షాపు కొత్తగా ఇచ్చిన బ్రాందీషాపుల లైసెన్సులలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం, ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో కోదండరామ దేవాలయం సమీపంలో దేవసాయి వైన్స్‌కు అనుమతి ఇచ్చారు. ఈ షాపులు ఏర్పాటు చేయడానికి స్థానిక కోదండరామ దేవాలయం కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. అయినా షాపు యథాతథంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గతంలో జాంపేట మార్కెట్ వద్ద ఉన్న పీఎస్ వైన్స్ ఏర్పాటులో స్థానిక ముస్లిం కుటుంబాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా స్థానికుల అభ్యంతరాలు పక్కన పెట్టి మళ్లీ ఎక్సైజ్ అధికారులు లైసెన్సును మంజూరు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రాందీషాపును తరలించాలని పోరాటం చేస్తుంటే ఏటా షాపునకు లైసెన్సులు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. దానవాయిపేటలోని చిన గాంధీ బొమ్మ వద్ద ఎస్వీఎస్ వైన్స్ ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదురుగా బ్రాందీషాపు ఏర్పాటుపై అభ్యతరం వ్యక్తం చేసినా ఎక్సైజ్ అధికారులు తిరిగి మళ్లీ లైసెన్సులు ఇచ్చి నిబంధనలు తుంగలో తొక్కారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన లైసెన్సులపై వివాదాలు వ్యక్తమవుతున్నాయి. -
అదును దాటుతున్న ఖరీఫ్
- మృగశిరలో అందని నీరు - ఆరుద్ర రాకతో మరింత ఆలస్యం - ఇప్పుడు నాట్లు వేస్తేనే తుపాన్ల సమయంలో చేతికి వచ్చేది - శివారులో పునర్వసులోనే నారుమడులు అమలాపురం : ఆరుద్ర... డెల్టాలో ఏరువాకకు పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. పంట తుపాన్లు సమయంలో చేతికి వచ్చే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నారువేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. అయితే ముందస్తుగా మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసులో నారుమడులు వేయడం జిల్లాలో డెల్టాలో ఖరీఫ్ రైతులకు పరిపాటి. ఈసారి కూడా మృగశిరలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే పునర్వసులో నారువేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాడి కూడా ఖరీఫ్ ఆలస్యం కానుంది. గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆదునుదాటుతోంది. ముందస్తు ఖరీఫ్‌కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలానే సాగునీరు పొలాలకు ఆలస్యంగా విడుదల చేయడంతో సాగులో జాప్యం చోటుచేసుకుంటోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా..ఆధునికీకరణ, నీరు–చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్టు వేస్తూ 20వ తేదీ వరకు పొలాలకు అందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు కాగా ఇప్పటి వరకు 60 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదు. మృగశిర ఈ నెల 21 వరకు ఉన్నా ఆ సమయంలో నీరందక రైతులు నారుమడులు ఆలస్యం చేశారు. 22 నుంచి ఆరుద్ర మొదౖలై జూలై ఏడు వరకూ ఉంది. ఐదు నెలల పంట కాలం కావడం వల్ల ఈ సమయంలో నారు మడులు వేస్తే అక్టోబరు నెలఖారు నుంచి నవంబరు 15 మధ్య చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, తరువాత తుపాన్లు కారణంగా పంట నష్టపోవడం డెల్టాలో శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే జూలై మొదటి వారం తరువాత నారుమడులు వేయనున్నారు. అదే జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు వేసే అవకాశం ముంది. ఇదే జరిగితే రబీ ఆలస్యం కావడం, మూడో పంట అపరాలు లేకుండా పోనుంది. ఎగువున కొంతవేగం... – తూర్పుడెల్టాలో అనపర్తి సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో మూడుశాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల వద్ద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. – ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడగా, నాట్లు పది శాతం మాత్రమే అయ్యాయి. – మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంత వరకు నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు పడలేదని అంచనా కాగా, కేవలం 30 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. శివారులో మరింత ఆలస్యం... – తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం నియోజకవర్గం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. – సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం మాత్రమే నారుమడులు పోశారు. – కరప, కాకినాడ మండలాల్లో 28,700 ఎకరాలు ఆయకట్టు ఉండగా, ఇక్కడ నాట్లు ఆరంభం కాలేదు. ఇక్కడ సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. – మధ్యడెల్టాలోని సబ్ డివిజన్ల వారీగా చూస్తే పి.గన్నవరం 14,900 ఎకరాలకుగాను, 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకు గాను 25 శాతంచ రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు వేయలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. -
‘అందరికీ’ అయోమయం
- అందరికి ఇళ్ల పథకంలో కొరవడిన స్పష్టత - చదరపు అడుగు ధరల్లో వ్యత్యాసాలు - తాత్కాలికమంటూ చదరపు అడుగు రూ. 2,150 నుంచి రూ.1,925లకు తగ్గింపు - మున్ముందు పెంచేందుకే ‘తాత్కాలికమని’ అనుమానాలు - షీర్వాల్ టెక్నాలజీ పేరుతో సదుపాయాల కల్పన పేదలపైనే - ఒక్కొక్కరిపై రూ.1.4 లక్షలు అదనపు భారం - జిల్లాలోని తొలివిడత లబ్ధిదారులపై రూ.269.39 కోట్ల భారం - విశాఖలో ప్రైవేటు సంస్థ ప్లాటు చదరపు అడుగు ధర రూ.1,050లే. మండపేట : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఎండీగా ఉన్న కనస్ట్రక్షన్ సంస్థ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్లాటులో చదరపు అడుగు ధర (స్థలం కాకుండా) రూ.1,050. ఈ మేరకు పేదవర్గాల వారికి ప్రభుత్వం నిర్మించే ప్లాట్లలో చదరపు అడుగు ధర ఇంతకన్నా తక్కువ ఉండాలి. అయితే అందరికీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం చదరపు అడుగుకు నిర్ణయించిన ధర రూ. 1,925లు. షీర్వాల్ టెక్నాలజీ అంటూ స్థానిక స్థితిగతులకు తగని విధానంలో ప్లాట్ల నిర్మాణం చేయడంతోపాటు సదుపాయాల కల్పన భారాన్ని పేదలపై మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదవర్గాల వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘అందరికి ఇళ్ల పథకం’లో ధరల వ్యత్యాసం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో నిర్ణయించిన చదరపు అడుగు ధరను ‘తాత్కాలికం’ పేరిట స్వల్పంగా తగ్గించి లబ్ధిదారులతో అంగీకార పత్రాలను తీసుకుంటోంది. సదుపాయాల కల్పన భారాన్ని ప్రజలపైనే మోపుతోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారునిపై రూ.1.4 లక్షలు చొప్పున జిల్లాలోని తొలివిడతలో నిర్మించనున్న 19,242 మందిపై దాదాపు రూ. 269.39 కోట్లు భారాన్ని మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల వారి ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు 24,332 మంజూరు చేసింది. కాకినాడ నగర పాలక సంస్థకు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200 ప్లాట్లు మంజూరు చేయగా, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్లు నిర్మాణానికి రూ.1,457.62 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ధరలు తాత్కాలికమేనా ? అందరికి ఇళ్ల పథకంలో ప్లాటు ధరలపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ‘తాత్కాలికం’ పేరిట మూడు కేటగిరీల్లో చదరపు అడుగుకు రూ. 80లు నుంచి 100లు వరకు తగ్గించింది. ఈ మేరకు గతంలో రూ. 2,150 ఉన్న చదరపు అడుగు ప్రస్తుతం 1,925లకు తగ్గింది. గతంలో రూ. 6.46 లక్షల వ్యయంతో 300 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్రూం ప్లాటు, రూ. 7.8 లక్షలతో 365 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్ రూం ప్లాట్, రూ.9.14 లక్షలతో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూం ప్లాటు చొప్పున మూడు విభాగాలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఆయా విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల రూపంలో లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం 300 అడుగుల ప్లాటును రూ. 5.77 లక్షలకు, 365 చదరపు అడుగుల ప్లాటు రూ. 6.94 లక్షలు, 430 అడుగుల ప్లాటుకు రూ. 8.14లుగా ధర నిర్ణయించింది. సబ్సిడీలు షరామామూలే. ఇది తాత్కాలికమేనని లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న అంగీకార పత్రంలో పేర్కొనడం గమనార్హం. మండపేట పట్టణంలో 4,064 ప్లాట్లు నిర్మాణానికిగాను ఇటీవల గొల్లపుంతకాలనీలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజ చేశారు. ప్రస్తుత ధర తాత్కాలిక ధరగా అంగీకార పత్రంలో ఉండటంతో భవిష్యత్తులో ఈ ధర పెరిగే అవకాశముందని లబ్ధిదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల్లో స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రూ. 269.39 కోట్లు భారం... ప్రస్తుతం ప్లాట్ల నిర్మాణ పనులకుగాను జిల్లాలోని ఆయా ఏరియాలను బట్టి చదరపు అడుగుకు రూ.1600లు వరకు ధర నిర్ణయించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చదరపు అడుగులోని మిగిలిన మొత్తం మౌలిక వసతుల కల్పన కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. డబుల్ బెడ్రూం తీసుకున్న లబ్ధిదారునిపై వసతుల కల్పన రూపంలో రూ.1.4 లక్షలు భారాన్ని మోపుతోంది. జిల్లాలో 90 శాతం మందికి పైగా డబుల్ బెడ్ రూం ప్లాటు కోరుకోగా తొలివిడతలో నిర్మిస్తున్న 19,242 మంది లబ్ధిదారులపై దాదాపు రూ. 269.39 కోట్లు భారం పడుతుందని అంచనా. తాత్కాలిక ధర పెరిగితే ఈ భారం మరింత పెరగనుంది. -
గురువుల్లో గందరగోళం
- రోజురోజుకూ మారుతున్న బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ - పాయింట్ల కేటాయింపులో అస్పష్టత - లోపభూయిష్ట విధానాలపై ఉపాధ్యాయుల అసంతృప్తి - ఇంకా పూర్తికాని రేషనలైజేషన్ ప్రక్రియ రాయవరం (మండపేట) / రామచంద్రపురం రూరల్ : ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్.. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటు.. వీటికితోడు ఇప్పుడు బదిలీల ప్రక్రియ.. పాఠశాలలు పునఃప్రారంభమైన అనంతరం ఇచ్చిన ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ రోజురోజుకూ మారుతోంది. ఈ షెడ్యూల్, ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండడంతో అయ్యవార్లు అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉపాధ్యాయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడికి, 23న సచివాలయం దిగ్బంధానికి ఉపాధ్యాయ ఉమ్మడి సంఘాల కార్యాచరణ వేదిక జాక్టో ఇప్పటికే పిలుపునిచ్చింది. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఏం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొందని ఉపాధ్యాయ నేతలు అంటున్నారు. దీనికి బదులు సాధారణ కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించాలని, దీనివల్ల ఉన్న ఖాళీల్లో తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉపాధ్యాయులకుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సలహాలు, సంప్రదింపులతో ఉపాధ్యాయుల మధ్య కొంతమేర సర్దుబాటు చేసుకునే వెసులుబాబు కూడా ఉంటుందని సూచిస్తున్నారు. సరికొత్త సమస్యలు - బదిలీల కోసం ఉపాధ్యాయులు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఇందులో బదిలీల ఆప్షన్లు ప్రత్యక్షమవుతున్నప్పటికీ సరికొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. - ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు, ఆన్లైన్ దరఖాస్తు సమయంలో కనిపించే వివరాలకు పొంతన ఉండడంలేదు. దీంతో పలువురు ఉపాధ్యాయులు మార్కులు కోల్పోతున్నారు. - కొందరు అదనపు పాయింట్ల కోసం తప్పుడు సమాచారం నమోదు చేస్తున్నారు. దీంతో ప్రతిభ ఆధారంగా పొందాల్సిన అదనపు పాయింట్లు కోల్పోతున్నామని అర్హులు ఆవేదన చెందుతున్నారు. - నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఎస్జీటీలు తప్పనిసరిగా బదిలీ కావాలి. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 15,424 మంది ఉపాధ్యాయులున్నారు. బదిలీలు తప్పనిసరి అయినవారు అన్ని కేటగిరీలూ కలిపి జెడ్పీ యాజమాన్యంలో 4,491 మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కేటగిరీల్లో 150 మంది వరకు ఉన్నారు. బదిలీ అర్హత కలిగిన వారు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వెబ్‌సైట్‌లోని ఆప్షన్ల వల్ల వీరంతా ఆందోళన చెందుతున్నారు. పాయింట్ల కేటాయింపులోనూ.. - పాయింట్ల కేటాయింపులో అసమగ్రత చోటు చేసుకోవడం ఉపాధ్యాయులను కలవరానికి గురి చేస్తోంది. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని భాషా పండితులకు ప్రతిభ ఆధారిత పాయింట్లు కేటాయించలేదు. ఏ స్థాయిలో పాయింట్ల కోసం నమోదు చేసుకోవాలన్నది వివరించలేదు. - ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎస్జీటీలకు స్కూల్ గ్రేడ్ పాయింట్, క్లాస్ గ్రేడ్ పాయింట్ కన్పిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్జీటీలకు క్లాస్ గ్రేడ్ పాయింట్లు మాత్రమే పొందుపరిచారు. - ప్రాథమిక పాఠశాలల్లో ఒకే స్థాయి ఉపాధ్యాయుల్లో ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయుడికి మాత్రమే పాయింట్లు ఇస్తున్నట్లు వెబ్ దరఖాస్తులో ఉంది. - ఎనిమిది సంవత్సరాల్లో స్పౌజ్ పాయింట్‌ను ఉపయోగించుకుంటే ఐదు పాయింట్లు ఇస్తారు. ఎనిమిదేళ్లు పూర్తయినవారు బదిలీకి అర్హులని నిబంధన పెట్టడంతో.. అంతకంటే తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు గతంలో స్పౌజ్ వాడుకుంటే ప్రస్తుత బదిలీల్లో అదనపు పాయింట్లు ఉండవు. - మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు ఉపాధ్యాయులందరూ నిర్వహిస్తున్నప్పటికీ హెచ్ఎంకు మాత్రమే ఒక పాయింటు కేటాయిస్తున్నారు. - ఒక పాఠశాలలో ఐదో తరగతి చదివిన విద్యార్థులందరూ వేరొక పాఠశాలలో ఆరో తరగతిలో చేరితేనే ఉపాధ్యాయులకు 5 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఆ విద్యార్థుల్లో ఏ ఒక్కరు మానేసినా ఉపాధ్యాయులకు ఒక్క పాయింటు కూడా కేటాయించడం లేదు. వాస్తవానికి విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టిన తరువాత వేరొక పాఠశాలలో చేరడం అనేది తల్లిదండ్రుల బాధ్యతే తప్ప ఉపాధ్యాయులకు సంబంధం లేని విషయం. - ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందినవారికి పాయింట్లు కేటాయించడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలి తప్ప, తాను ఉత్తమ ఉపాధ్యాయుడినని, తనకు అవార్డు ఇవ్వాలని దరఖాస్తు చేసుకునే పద్ధతి నచ్చక.. అర్హతలున్నా అవార్డులకు దరఖాస్తు చేయని ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిబంధనల వల్ల బదిలీల్లో వారికి అన్యాయం జరుగుతుంది. - తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో నలుగురు విద్యార్థులు చేరితే, ఉన్న విద్యార్థులతో పోల్చి శాతం లెక్కించి, అధిక పాయింట్లు ఇస్తున్నారు. అదే ఎక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలో అదే నలుగుగురు విద్యార్థులు చేరితే శాతం లెక్కిస్తే తక్కువ వస్తుంది. అయినప్పటికీ దీని ప్రకారం వారికి తక్కువ పాయింట్లు కేటాయిస్తున్నారు. ఒక్కోసారి ఒక్క పాయింటు కూడా రాని పరిస్థితి. - ఇంకా విచిత్రం ఏమిటంటే అన్ని రకాలుగా ఒకే అర్హతలున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పాయింట్లు కేటాయించడంతో ఉపాధ్యాయుల్లో మరింత ఆందోళన నెలకొంటోంది. రేషనలైజేషన్‌పై కానరాని స్పష్టత ఇదిలా ఉండగా పాఠశాలల రేషనలైజేషన్‌పై చిక్కుముడి ఇంకా వీడలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించే ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ జీఓ నంబరు 29 విడుదల చేసింది. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖ ప్రారంభించి సుమారు 15 రోజులవుతున్నా నేటికీ స్పష్టత కానరావడం లేదు. రేషనలైజేషన్‌తో బదిలీ ప్రక్రియ ముడిపడి ఉంది. రేషనలైజేషన్‌పై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం బదిలీ దరఖాస్తుల గడువును పెంచుకుంటూ పోతుంది. రేషనలైజేషన్‌లో ఎక్కడెక్కడ ఏయే స్కూల్స్ విలీనమవుతాయి? ఏయే స్కూళ్లు మూత పడనున్నాయనే విషయం స్పష్టమైతేనే బదిలీల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. నత్తనడకన నమోదు పాయింట్ల కేటాయింపుపై అయోమయం చోటు చేసుకోవడంతో జిల్లాలో బదిలీ దరఖాస్తుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 12 నుంచి బదిలీ దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడుసార్లు దరఖాస్తు గడువు పెంచారు. ఈ నెల 15, 16 తేదీల్లో అధిక సంఖ్యలో నమోదు జరిగింది. ఈ నెల 16వ తేదీ వరకూ 3,715 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో పారదర్శకత లేదు ఉపాధ్యాయ బదిలీలల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ ప్రకటించింది. కానీ ఈ విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. పారదర్శకత అన్న దానికి ఎక్కడా అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ విధానంలో ఏం జరుగుతుందనే దానికి జవాబుదారీతనం కూడా లేదు. ఏం జరుగుతుందని అడిగితే హెల్్ప లైన్ నంబరు అంటున్నారు. అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. వేసవి సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం ఆరంభంలో చేపట్టడం, విధి విధానాలు సరిగ్గా లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. - కేవీ శేఖర్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి చెడ్డ పేరు బదిలీల విషయంలో కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కొత్త బదిలీ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. వెబ్ కౌన్సెలింగ్, ఫెర్మార్మెన్స్ విధానాలను రద్దు చేయాలి. - అరవ విస్సు, ఉపాధ్యాయుడు, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం ఖాళీలపై దృష్టి పెట్టండి పిఠాపురం : జిల్లాలో ఈ నెలాఖరుకు సుమారు 180 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ ఖాళీల భర్తీకి కూడా బదిలీల సందర్భంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఈ నెల పదో తేదీకే పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో దానిని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే ఆయా పాఠశాలల్లో ఖాళీలు అలాగే ఉండిపోయి, విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. -
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో రాజకీయం - ఖాళీ అయిన ఈవో పోస్టుపై రత్నగిరిపై తమ్ముళ్ల పోరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్–1, గ్రేడ్–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్‌కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రయత్నాల్లో ముగ్గురు... అన్నవరం ఈఓ పోస్టింగ్ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్ దక్కింది. ఈ పోస్టింగ్ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఏసీబికి చిక్కడంతో... ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్చిట్ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్‌ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్ వస్తే కొండపై తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ముందస్తు నీరు... అందని తీరు
- వారం రోజులు దాటుతున్నా డెల్టాలో చేలుకు చేరని కాలువ నీరు - ప్రశ్నార్థకంగా మారిన 4.80 లక్షల ఎకరాల్లో సాగు - - మడి తడవక రైతులు సతమతమవుతుంటే ఏరువాకంటూ పాలకులు హడావుడి అమలాపురం : ‘నీరు పల్లమెరుగ’ంటారు...నిజమే. కానీ ఆ సహజ సూత్రాన్నే మార్చేస్తున్నారు నేటి పాలకులు... నీటి పారుదల అధికారులు. డెల్టా కాలువ పరిస్థితి చూస్తే అది నిజమేనని రుజువవుతోంది. డెల్టా కాలువలకు నీరు విడిచిపెట్టి ఎనిమిది రోజులవుతున్నా కోన సీమ ప్రాంతంలోని పల్లంలో ఉండే కాలువలకు కూడా నీరు చేరడం లేదు ... మడి తడవడం లేదు. ఓ వైపు నీరు రాక ... సాగు కాక సతమతమవుతుంటే ప్రభుత్వం మరో వైపు ఏరువాకంటూ ఆర్భాటం చేయడం చూసి డెల్టా రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. గోదావరి డెల్టాలో ఈ ఏడాది ముందస్తు సాగు కోసమంటూ అధికారులు జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేశారు. ప్రధాన పంట కాలువల నుంచి ఛానల్స్, వాటి నుంచి పంట బోదెలకు, వాటి ద్వారా చేలకు చేరడానికి సాధారణంగా నాలుగైదు రోజులు పడుతుంది. శివారు ఆయకట్టుకు వారం రోజుల్లో చేరుతుంది. కానీ ఈసారి కాలువలకు నీరు వదిలి వారం రోజులు దాటుతున్నా ప్రధాన పంట కాలువలను, ఛానల్స్‌ను ఆనుకుని ఉన్న చేలకు నీరు చేరకపోవడం గమనార్హం. ఆధునికీకరణ, నీరు–చెట్టు పనులు పేరుతో ప్రధాన పంట కాలువలకు అడ్డుకట్టు వేసి దిగువునకు నీరు వెళ్లకుండా చేశారు. దీంతో రెండు డెల్టాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో ముందస్తు ఖరీఫ్ సాగు అనేది లేకుండాపోయింది. నీరు విడుదలైనా పలుచోట్ల నిలిపివేయడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 7వ తేదీన ‘సస్యశ్యామలంపై స్వార్థపు చీడ’ అనే కథనం రావడంతో అధికారులు హడావిడిగా కాలువలకు వేసిన అడ్డుకట్టలు తొలగించి కిందదకు నీరు వదిలారు. దిగువున ఛానల్స్, పంట బోదెలపై ఇంకా పనులు జరుగుతూనే ఉండడం గమనార్హం. చాలా పనులు వారం, పది రోజులు క్రితం మొదలు కావడం చూస్తుంటే ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో ఆర్థం చేసుకోవచ్చు. పనులు పేరుతో ఛానల్స్, పంట బోదెలపై పనులు చేస్తూ నీరుకు అడ్డుకట్టు వేయడంతో చేలకు నీరు చేరడం లేదు. తూర్పు, మధ్య డెల్టాలో పరిస్థితి చూస్తేంటే మరో వారం రోజుల వరకు శివారుకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే ఖరీఫ్‌కు ముందస్తు సాగుకు నీరంటూ పాలకులు చేసిందంతా ప్రచారమే తప్ప వాస్తవం కాదనిపిస్తోంది. పని మొదలు పెట్టి వారమే అయింది మధ్య డెల్టాలో కీలకమైన విలస ఛానల్ ఇది. దీనిపై ముక్తేశ్వరం, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌కు నీరు వచ్చినా సిరిపల్లి లాకుల వద్ద పనులు జరుగుతుండడంతో ఇదిగో ఇలా లాకులు మూసి దిగువున పనులు చేస్తున్నారు. దీంతో ఒకటో తారీఖున నీరు ఇచ్చినా ఈ ప్రాంత రైతులకు 15 వరకు నీరందే అవకాశం లేదు. రిటైనింగ్ వాల్ కోసం నీరు వదల్లేదు... ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ నుంచి ముమ్మిడివరం పరిసర ప్రాంతాలకు సాగునీరందించే ఠానేల్లంక ఛానల్ల్లో చుక్కనీరు లేదు. ఆయిల్ ఇండియా నిధులు రూ.1.20 కోట్లతో ఇక్కడ ఛానల్‌కు లాంగ్ రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. ఈ కారణంగా నీరు నిలిపివేశారు. దీనిపై సుమారు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. పైగా ఈ ఛానల్ ఎగువున పనులు చేస్తున్నా.. దిగువున కనీసం పూడిక తొలగించకపోవడంతో నీరు సరఫరా సాఫీగా జరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు.