
సాక్షి, వైఎస్సార్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఆదివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో ఓ వెంచర్‌లో ఆయన తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ వెంచర్ ఫెన్సింగ్‌ను తన అనుచరులతో కలిసి తొలగించి.. అక్కడ దున్నించాడు బీటెక్ రవి. అయితే..
వెంచర్ ఓనర్ మాత్రం తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అయినా రవి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ‘‘అనుచరులతో మాపై ఆయన దౌర్జన్యం చేయడం దారుణం. బీటెక్ రవి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపాలి’’ అని వెంచర్ ఓనర్ కోరుతున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన స్థానికులను మారణాయుధాలతో బీటెక్ రవి బెదిరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. స్థానికంగా బీటెక్ రవి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారులు హడలిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
సంబంధిత కథనం: బీటెక్ రవి నేతృత్వంలో మారణాయుధాలతో..
Comments
Please login to add a commentAdd a comment