Goons attack
-
రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యే: కనుమూరు రవిచంద్రారెడ్డి
తాడేపల్లి, సాక్షి: ఏపీలో పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరుతున్నారాయన. ‘‘.. వినుకొండలో నడిబజారులో రషీద్ ని నరికి చంపారు. రషీద్‌కు ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ కార్యకర్తకు అండగా వైఎస్సార్సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారాయన. ఇదీ చదవండి: వినుకొండకు జగన్.. రషీద్ కుటుంబానికి పరామర్శ.. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది?. వారంలోగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలి. చేయలేక పోతే కూటమి నేతలంతా రాజీనామాలు చేయాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్‌లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
‘టీడీపీ దాడులు.. ప్రాణాల్ని అడ్డేసి కార్యకర్తల్ని కాపాడుకుంటాం’
అన్నమయ్య, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా కిరాయి గుండాలు దాడులకు పాల్పడి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా తోడుగా నిలబడాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అందుకే ప్రాణాల్ని అడ్డుపెట్టి అయినా కార్యకర్తల్ని కాపాడుకుంటాం అని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటిలో టీడీపీ నాయకుల చేతిలో కత్తిపోట్లకు గురై అసుపత్రిలై చికిత్స పోందుతున్న వాళ్లకు శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కౌన్సిలర్లపై వారి ఆస్తులపై దాడులు జరగడం దురదృష్టకరం. తమ పాలనలో జిల్లా కేంద్రం చేసి శాంతిభద్రతలు పరీక్షించం. అదనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కార్యాలయం ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా కిరాయి గుండాలు దాడులకు పాల్పడి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ మా అందరికీ సూచించారు. మా ప్రాణాలు అడ్డుపెట్టి కార్యకర్తలను కాపాడుకుంటాం. .. కిరాయి గుండాలతో దాడులు చేయించి, హీరోయిజంగా ఫీల్ అవ్వడం రాక్షసత్వం. గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కత్తులు కట్టెలు, బండలతో చేస్తున్న వికృత చేష్టలు సిగ్గుపడేలా ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఏనాడూ ప్రోత్సహించలేదు. తిరిగి దాడులు చేయడం మా సంస్కృతి కాదు. టీడీపీ దాడులను ఐక్యమత్యంతో తిప్పి కొడతాం అని అన్నారాయన. -
YS Jagan: 19న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా. -
TDP Attacks: వైవీ సుబ్బారెడ్డి పిల్‌పై మధ్యాహ్నాం విచారణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మొదలైన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో.. వారంపైగా జరుగుతున్న ఈ హింసాత్మక దాడులపై రాష్ట్ర హైకోర్టులో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరపాల్సి ఉంది. అయితే కోర్టు ప్రారంభమైన కాసేపటికే విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15కు ఈ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చదవండి: టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి -
కార్యకర్తల రక్షణ కోసం YSRCP కార్యచరణ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండపై పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధం అవుతోంది. దాడులకు కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే.. వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది. వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్ టీం చూసుకునేలా వైఎస్సార్సీపీ ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని, సాధారణ ఓటర్లను, ఆఖరికి.. వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లను సైతం వదలడం లేదు. ఈ దాడుల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. మరోవైపు దాడులపై కేసులు సైతం నమోదు చేయకుండా.. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా దెబ్బ తినడంపై అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. మరోవైపు వైఎస్సార్సీపీ కేడర్‌కు ధైర్యం చెబుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసా ఇస్తున్నారు పలువురు నేతలు. -
చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
అమరావతి, సాక్షి: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. ‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.This is the situation in Andhra Pradesh!Heart-wrenching visuals from Mangalagiri, Andhra Pradesh.@JaiTDP leaders are targeting Dalits in the state who raise their voices against them. They are literally threatening the lives of Dalits, forcing them to apologize to @naralokesh… pic.twitter.com/6Id1s8Lwxt— YSR Congress Party (@YSRCParty) June 9, 2024 -
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల అరాచకాలపై సర్వత్రా ఖండనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఈర్ష్య, అసూయలతో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాల్లేవీ ఉండకూదని పచ్చ మూకలు దాడులకు తెగపడుతోంది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె ఈ దాడుల్ని ఖండిస్తూ ఓ సందేశం ఉంచారు. ‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం.రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…— YS Sharmila (@realyssharmila) June 9, 2024.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు.. బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని సందేశం ఉంచారామె. మరోవైపు.. ఏపీలో టీడీపీ శ్రేణుల దాడుల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజు ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారారయన. -
ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ.. మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదవ వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారాయన. కౌంటింగ్ రోజు నుంచే వైఎస్సార్సీపీ నాయకుల పై దాడులు చేస్తున్నారు. టీడీపీ , జనసేన పార్టీ రౌడీ మూకలు అధికారమదంతో రెచ్చిపోతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు , ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు.... పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారు. .. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు అయిపోయారు.మేం మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదుచంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తాం. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం’’ అని పేర్ని నాని అన్నారు. -
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ కొనసాగిస్తున్న దాడుల పర్వంపై వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2024 గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. ఈ విషయంలో గౌరవ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేశారాయన. -
ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసంతూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన. -
నూజివీడులో పోలీసుల సమక్షంలో పట్టపగలే దారుణం
ఏలూరు, సాక్షి: రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన ఆరంభం కాకమునుపే.. దమనకాండకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులపై, సానుభూతిపరులపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతుండగా.. తాజాగా నూజివీడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. గెలుపు మదంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నూజివీడు టౌన్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో కత్తులతో వైఎస్సార్సీపీ నేత మీద దాడికి దిగారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనలో గిరీష్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఘోరం. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి -
వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవి దౌర్జన్యకాండ
సాక్షి, వైఎస్సార్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఆదివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో ఓ వెంచర్లో ఆయన తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ వెంచర్ ఫెన్సింగ్‌ను తన అనుచరులతో కలిసి తొలగించి.. అక్కడ దున్నించాడు బీటెక్ రవి. అయితే.. వెంచర్ ఓనర్ మాత్రం తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అయినా రవి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ‘‘అనుచరులతో మాపై ఆయన దౌర్జన్యం చేయడం దారుణం. బీటెక్ రవి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపాలి’’ అని వెంచర్ ఓనర్ కోరుతున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన స్థానికులను మారణాయుధాలతో బీటెక్ రవి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్థానికంగా బీటెక్ రవి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారులు హడలిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత కథనం: బీటెక్ రవి నేతృత్వంలో మారణాయుధాలతో.. -
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రాళ్లు రువ్విన టీడీపీ నేతలు
-
షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు
దొంగలు డబ్బులు, నగలు దొంగతనం చేస్తారని విన్నాం. అంతేందుకు స్ట్రీట్ లైట్లు, మొక్కలను కూడా ఎత్తుకుపోవడం గురించి కూడా విని ఉంటాం. కానీ ఏకంగా రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలించడం గురించి విన్నారా!. అదీ కూడా రెండు గ్రామాలను కలిపే రహదారిని రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ షాకింగ్ ఘటన బిహార్‌లోని బంకా జిల్లా, రాజౌన్ ప్రాంతంలోని ఖరౌనీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఐదు రోజులు క్రితం వరకు ప్రజలు ఏళ్ల తరబడి వినయోగించినా.. ఖాదంపూర్, ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రహదారిని ఉపయోగించారు. ఒక రోజు ఉదయం ప్రజలు అటుగా వెళ్తున్నప్పుడూ...రోడ్డు మొత్తం మాయమై దాని స్థానంలో పంటలు వేసి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గరయ్యారు గ్రామస్తులు. మొదట్లో వారు దారి తప్పాం అనుకున్నారు. ఆ తర్వాత గానీ వారికి అసలు విషయం అర్థం కాలేదు. ఖైరానీ గ్రామానికి చెందిన గూండాలు, రాత్రికి రాత్రే ట్రాక్టర్‌తో రహదారిని దున్ని గోధుమ పంటలను విత్తారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వ్యరేకించడంతో.. గుండాలు కొట్లాటకు దిగి కర్రలు, రాడ్లతో ప్రజలను బెదిరించారు. దీంతో ఖాదంపూర్ గ్రామానికి చెందిన దాదాపు 35 మంది ప్రజలు సర్కిల్ పోలీస్ అధికారి మహ్మద్ మెయినుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఆక్రమణకు పాల్పడినట్లు తేలితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోలీసు అధికారి హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయానికి వినియోగిస్తున్న ఆక్రమిత భూమిని తొలగించి తిరిగి రోడ్డు వేస్తామని కూడా చెప్పారు. (చదవండి: ఆప్ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్) -
విద్యార్థినిపై గూండాల అమానుషం.. స్నేహితుడి కళ్లెదుటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఒక గ్యాంగ్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం ఆందోళన రేపింది. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచినా, నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద దారికాచి ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని చుట్టుముట్టింది. యుతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదు ఇమ్మని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫ్రెండ్‌ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామనీ, బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని డీసీపీ ప్రదీప్ గుంటితెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరిశోధనా విద్యార్థినిగా బాధిత యువతిని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి సంఘటన జరిగిన ప్రదేశం నుంచే రోజూ ఇంటికి తిరిగి వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ఇది గమనించే ఈ ముఠా దారుణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. -
పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాదిపై ఆయుధాలతో దాడి
ముంబై: ఓ స్థలం వివాదం విషయంలో వాదోపవాదనలు వినిపిస్తున్న న్యాయవాదిపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై 15- 20 మందికి పైగా దాడి చేయడంతో ఆ న్యాయవాది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ న్యాయవాది ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన న్యాయవాది సత్యదేవ్ జోషి ఓ స్థలం వివాదంపై కేసు స్వీకరించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో తన సహాయకుడు అంకిత్ టాండన్‌తో కలిసి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు న్యాయవాది కారును వెంబడించి పశ్చిమ ముంబైలోని దహిసర్ ప్రాంతంలో అడ్డగించారు. కత్తులు, ఇనుప రాడ్లతో సత్యదేవ్ జోషిపై దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏకంగా 14 మంది ఉండడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఆ ముఠా దాడికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న ఎంహెచ్‌బీ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు బొరివలీకి చెందిన వారుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. నిందితులు మూకుమ్మడిగా న్యాయవాదిపై దాడి చేస్తున్న దృశ్యాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. -
బుల్లితెర నటుడికి చేదు అనుభవం..
బుల్లితెర నటుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. కొందరు గుండాలు రోడ్డు మీద తనను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపాడు. హప్పు కి ఉల్తాన్ పల్తాన్ ఫేమ్ సంజయ్ చౌదరికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. ‘గైస్ దయచేసి తెలుసుకొండి. నా విషయంలో ఇదే జరిగింది. నేరస్థులు మీరు ఎవరనే విషయం గురించి పట్టించుకోరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సంజయ్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను మధ్యాహ్నం సమయంలో మీరా రోడ్డు నుంచి షూటింగ్ జరిగే నైగావ్ ప్రాంతానికి వెళ్తున్నాను. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి నా కారు విండోని తట్టి పార్క్ చేయమని చెప్పాడు. అంతేకాక మరాఠీలో తిట్టడం ప్రారంభించాడు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను. ఏ వాహనాన్ని ఢీ కొట్టలేదు. అతను గ్లాస్‌ను కిందకి దించమన్నాడు. నేను అలానే చేశాను. వెంటనే అతడు నా కారు డోర్ తెరిచి లోపలకి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నేను తన స్కూటీని ఢీ కొట్టానని.. అందువల్ల అతడికి 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు’ అన్నాడు. (చదవండి: కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు) View this post on Instagram This is actually happened with me criminals doesn’t care who you are A post shared by Sanjay choudhary (@sanjayychoudhary) on Sep 24, 2020 at 4:33am PDT ‘ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడు వచ్చారు. వారు ముగ్గురు నన్ను బెదిరించడం ప్రారంభించారు. నా దగ్గర అంత మొత్తం లేదని చెప్పాను. ఏటీఎంకి వెళ్లి డ్రా చేసి తీసుకురమ్మన్నారు. లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. నా ఫోన్ లాక్కున్నారు. డబ్బులిస్తేనే మొబైల్ ఇస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదని వాలెట్ తెరిచి చూపించాను. దానిలో ఒక ఐదు వందల రూపాయల నోటు, 200 వందల రూపాయలు మొత్తం ఏడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వారు ఆ మొత్తం తీసుకుని వెళ్లి పోయారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. వారు గుండాలు అని తర్వాత అర్థం అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులందరికి నేను చెప్పేది ఒక్కటే.. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి’ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై ఆదివారం ముసుగు దుండగులు చేసిన విచక్షణారహిత దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విదేశీ యూనివర్సిటీల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధికార, విపక్ష నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుకునే విషయంలో అసమర్ధంగా వ్యవహరించారని యూనివర్సిటీ వైస్ చాన్సెలర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ముసుగులు వేసుకుని జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వచ్చిన దుండగులు ఆదివారం రాత్రి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలోయూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం వారిని సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ హింసకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీదే బాధ్యత అని విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో జేఎన్‌యూలో పరిస్థితిని సమీక్షించారు. మోదీ ప్రభుత్వ సహకారంతో గూండాలు దేశ యువతపై జరిపిన ఈ దాడి అత్యంత గర్హనీయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ అంధుడిపైనా వీరంగం కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ముసుగులు ధరించిన గూండాలు విచ్చలవిడిగా దాడి చేశారని బాధితులు తెలిపారు. ‘మేం హాస్టల్లో ఉండగా, ఏబీవీపీ వారు కర్రలతో వస్తున్నారని ఎవరో అరిచారు. దాంతో మేం రూంలోకి వెళ్లి లోపలి నుంచి తలుపేసుకున్నాం. అయినా, వారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేయసాగారు. దాంతో బాల్కనీ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాం’ అని కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. అంధుడినని కూడా చూడకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని సూర్యప్రకాశ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. గూండాల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళల వసతి గృహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. ‘క్యాంపస్‌లో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొంటుండగా.. 20–25 మంది దుండగులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నాపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు’ అని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ వివరించారు. తనపై దాడి చేసినవారిని గుర్తుపడతానన్నారు. తమకు వ్యతిరేకులైన వారిని గుర్తించి మరీ దాడికి పాల్పడ్డారని, ఇది ఏబీవీపీ దౌర్జన్యమేనని ఘోష్ ఆరోపించారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు గత 4, 5 రోజులుగా ఆరెస్సెస్‌తో సంబంధాలున్న పలువురు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, వారి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది’ అని ఘోష్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ‘జేఎన్‌యూ సెక్యూరిటీ సహకారంతోనే ఆ గూండాలు రెచ్చిపోయారు. ఫోన్ చేసిన 2 గంటల తరువాత పోలీసులు వచ్చారు’ అని ఆయిషీ ఘోష్ ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. దేశవ్యాప్తంగా నిరసనలు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడిని విద్యార్థిలోకం తీవ్రంగా పరిగణించింది. పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్వర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలె యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ వర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐటీ– బాంబే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(పుణె) తదితర విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముంబైలో ఆదివారం అర్ధరాత్రి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం టార్చ్‌లైట్స్ మార్చ్ నిర్వహించారు. విదేశాల్లో.. నేపాల్‌లోని కఠ్మాండూలో జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, ససెక్స్ యూనివర్సిటీల్లో, అమెరికాలోని కొలంబియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వీసీపై ఆరోపణలు దాడి విషయంలో సకాలంలో స్పందించకపోవడంపై యూనివర్సటీ వైస్‌చాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జేఎన్‌యూ అధికారులతో సోమవారం మానవ వనరుల శాఖ జరిపిన సమీక్ష సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. వీసీ గూండాల నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, యూనివర్సిటీలో హింసకు ఆయనదే ప్రణాళిక అని ఆరోపించాయి. దుండగులు ప్రొఫెసర్ల నివాస సముదాయాలపైనా దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారని పలువురు టీచర్లు తెలిపారు. దాడిలో ఏబీవీపీ హస్తం? జేఎన్‌యూలో దాడికి, బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి సంబంధం ఉన్నదని సూచించే పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్నవారిలో జేఎన్‌యూ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వికాస్ పాటిల్ ఉన్నట్లు భావిస్తున్నారు. లాఠీలు, ఇనుపరాడ్లు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులతో వికాస్ ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసులకు దొరికిన ఫైబర్ గ్లాస్ లాఠీ లాంటి దానినే పాటిల్ పట్టుకుని ఉన్నారు. ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తిని ఏబీవీపీకి చెందిన శివపూజన్ మండల్‌గా గుర్తించారు. ఇతను జేఎన్‌యూలో బీఏ తొలిఏడాది చదువుతున్నాడు. కర్రలతో వికాస్ పాటిల్. శివపూజన్ మండల్. యోగేంద్ర (ఇన్సెట్లో) పాటిల్, మండల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయడం గమనార్హం. జేఎన్‌యూ క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులపై దాడి చేయాలంటూ వాట్సాప్‌లో జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ‘వామపక్ష విద్యార్థులపై భౌతిక దాడికి దిగాలి. అదొక్కటే పరిష్కారం’ అని, ‘మేం ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఉన్నాం’ అని అందులో ఉన్నాయి. ఈ చాట్‌లో పాల్గొన్న వారిలో జేఎన్‌యూలో సంస్కృతంలో పీహెచ్డీ చేస్తోన్న విద్యార్థి యోగేంద్ర భరద్వాజ్, మరో పీహెచ్డీ విద్యార్థి సందీప్ సింగ్ ఉన్నారు. భరద్వాజ్ ఇప్పటికే తన ఇతర సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసినప్పటికీ, ఆయన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ద్వారా అతడు ఏబీవీపీ సభ్యుడని గుర్తించారు. బయటివారా? లోపలి వారా? జేఎన్‌యూలో ఆదివారం హింసకు పాల్పడింది వర్సిటీ విద్యార్థులా? లేక బయటినుంచి వచ్చిన వ్యక్తులా? అనే విషయంపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ దృష్టి సారించింది. ‘ఆదివారం మధ్యాహ్నం నుంచే వర్సిటీ గోడలు, గేట్ల వద్ద భారీగా పోలీసు వాహనాలు కనిపించాయి. ఆ స్థాయిలో పోలీసులున్నా దుండగులు క్యాంపస్‌లోకి ఎలా రాగలిగారు? క్యాంపస్‌లో దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఇంటలిజెన్స్ సమాచారం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే.. వారెందుకు వెంటనే స్పందించలేదు?’ అనే ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు స్పందించారు. ‘గత నెల రోజులుగా పోలీసులు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ఆదివారం కూడా అక్కడ ఉన్నారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులు వెళ్లలేరు’ అని వివరించారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారమివ్వడంలో ఆలస్యం కావడంపై వర్సిటీ అధికారులు స్పందించారు. ‘సరైన కారణం లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులను పిలిస్తే విద్యార్థులకు కోపమొస్తుంది. అందుకే పరిస్థితి దిగజారిందని భావించాకే పిలిచాం’ అని తెలిపారు. విద్యార్థులపై మోదీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన అమానుష దాడి ఇది. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. – సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఈ దాడులు 26/11 ముంబై దాడులను గుర్తు చేస్తున్నాయి. దేశంలో తమకు రక్షణ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనల వంటి వాటిని మహారాష్ట్రలో జరగనివ్వను. నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతే.. వారూ అందులో పాలుపంచుకున్నట్లే.. – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం జేఎన్‌యూ దాడిపై బాలీవుడ్ నటి, అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా స్పందించారు. వార్తా పత్రికలోని ఓ భాగాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్.. ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది భయానికి వెరవడం లేదు. నిరసనలను హింసతో అణచలేరు. అదే జరిగితే మరింత మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతారు’ అని చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మాటలను ఏబీవీపీకి మద్దతుదారుడైన అక్షయ్ కుమార్‌కు (ట్వింకిల్ భర్త) చెప్పాలంటూ ట్రోల్ చేస్తున్నారు. -
జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడి
-
‘ముసుగు దుండగులను గుర్తిస్తా’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ క్యాంపస్‌లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం చీఫ్ ఐషే ఘోష్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లోకి ప్రవేశించి హాకీస్టిక్‌లు, ఇనుపరాడ్లతో తమపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దుండగుల దాడిలో తలపై గాయాలైన ఘోష్ తాను కోలుకున్న అనంతరం ఏబీవీపీ దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏబీవీపీ సభ్యులపై తాము సమిష్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. విద్యార్ధులపై ఇనుప రాడ్లతో దాడి చేసిన వారిలో కొందరి ముఖాలను తాను గుర్తుపట్టగలనని, ఘర్షణలు చెలరేగిన క్రమంలో పెనుగులాటలో కొందరి ముసుగులు చెదిరిపోయాయని చెప్పారు. దుండగుల దాడిలో దాదాపు 30 మంది జేఎన్‌యూ విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఐషూ ఘోష్ తలపై తీవ్ర గాయమై రక్తమోడుతూ ఆదివారం రాత్రి టీవీల్లో కనిపించారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల హింసాకాండపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. చదవండి : జేఎన్‌యూ దాడిపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ -
‘సామూహిక ఆత్మహత్యలే శరణ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుక జరిగిన రోజు గురుగ్రాంలో దాడికి గురైన ముస్లిం కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. తమ కుటుంబంపై దాడి చేసిన అల్లరి మూక ఇంట్లోని మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసిందని ఆ కుటుంబం పేర్కొంది. స్ధానిక రాజకీయ నేతల సిఫార్సుతో పోలీసులు, అధికారులు దాడికి తెగబడిన గూండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమపై అల్లరిమూకలు పధకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన తీరు బహిర్గతమైందని, ఇప్పటికీ పోలీసులు తమకు సాయపడకుండా, ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని తమను బెదిరిస్తున్న నిందితులకు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన మహ్మద్ అక్తర్ పేర్కొన్నారు. అల్లరి మూకలు తమ ఇంటికి వచ్చి తమమహిళలు, బాలికలను వేధిస్తే పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, తమకు సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు బాధిత కుటుంబం మెమొరాండం సమర్పించింది. నిందితులపై చర్యలు చేపట్టకపోగా తమ కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులపై స్ధానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా తాము గురుగ్రాంలో నివసిస్తున్నామని, హోలీ రోజున 30 నుంచి 40 మందితో కూడిన అల్లరి మూక తమ ఇంటిపై కర్రలతో దాడి చేసి తమను పాకిస్తాన్ వెళ్లాల్సిందిగా తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. బాధితులు అల్లరిమూక దాడి దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. కాగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. -
మొత్తానికి ఓ సస్పెన్స్ సినిమా చూపించారు..
సాక్షి, భోపాల్ : పోలీసులే దొంగలను పట్టుకోవడం సాధారణంగా అందరికీ తెలిసిందే. కానీ, పోలీసులనే దొంగలు పట్టుకుంటే.. అది కూడా పక్కా ప్రణాళిక ప్రకారం వారిని పిలిచి మరీ ఆ పనిచేస్తే.. అవాక్కవడం తప్ప ఆ పోలీసులు చేసేదేం ఉండదు. మధ్యప్రదేశ్‌లో అదే జరిగింది. అచ్చం సినిమాల్లో మాదిరిగానే కొంతమంది దోపిడీ దొంగలు ఏకంగా పోలీసులనే లక్ష్యంగా చేసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్నాం కాపాడండి అంటూ ఫోన్ చేసి పిలిచి వచ్చి రాగానే వారికి గన్ గురిపెట్టి వాహనం ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఓ బాలికను కిడ్నాప్ కూడా చేశారు. వివరాల్లోకి వెళితే పన్నా జిల్లాలో ఆదివారం ఉదయాన్నే ఓ వ్యక్తి గందరగోళం సృష్టిస్తున్నాడనే వచ్చి వెంటనే రక్షణ కల్పించాలని పోలీసులకు 100 ద్వారా అమంగాంగ్ మండల పరధిలోని బామురహా అనే గ్రామం నుంచి ఫోన్ చేశారు. దీంతో ప్రకాశ్ మండల్ అనే ఓ హెడ్ కానిస్టేబుల్, సుభాష్ దుబే అనే ఎస్పీఎఫ్ జవాన్ కలిసి పోలీసు వాహనం తీసుకొని హుటాహుటిన అక్కడి వెళ్లారు. వారు వెళ్లే చూసే సరికి ఓ వ్యక్తి రోడ్డుపై ముఖం కనిపించకుండా పడి ఉన్నాడు. వారు దగ్గరకు వెళ్లే చూసే సరికి వెంటనే లేచి తుపాకీ గురిపెట్టాడు. అతడికి మరో నలుగురు దుండగులు తోడయ్యారు. అందరు కలిసి ఆ పోలీసులను బందించడమే కాకుండా వారి దుస్తులను విప్పించారు. అనంతరం ఓ డ్రైవర్‌తో సహా ఇద్దరు పోలీసుల చేతులు, కాళ్లు కట్టేసి మరో కారులో పడేశారు. అనంతరం వారి దుస్తులు వేసుకొని అదే వాహనంలో బామురహా గ్రామానికి వెళ్లారు. ఓ లైంగిక వేధింపుల కేసులో ఓ యువతిని స్టేషన్‌కు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకురావాలని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతి తండ్రిని, బాబాయిని, ఆ యువతిని 100 వాహనంలో ఎక్కించారు. ఆ తర్వాత వెళ్లిపోయే క్రమంలో ఆ యువతి తండ్రిని, బాబాయ్‌ను బలవంతంగా కిందకు దించేసి పోలీసులను బంధించిన వాహనం వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసులకు తిరిగి దుస్తులు ఇచ్చేసి వేగంగా ఆ యువతిని తీసుకొని పరార్ అయ్యారు. వారికోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.