కార్యకర్తల రక్షణ కోసం YSRCP కార్యచరణ | YSRCP Action Plan To Counter TDP Attacks In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో టీడీపీ దాడులకు కౌంటర్‌.. YSRCP యాక్షన్‌ ప్లాన్‌ ఇదే

Published Mon, Jun 10 2024 9:36 AM | Last Updated on Mon, Jun 10 2024 1:55 PM

YSRCP Action Plan To Counter TDP Attacks

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండపై పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం అవుతోంది. దాడులకు కౌంటర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకుంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే.. వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది. 

వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్‌ టీం చూసుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రణాళిక రూపొందించింది. 

ఇదిలా ఉంటే..  ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని, సాధారణ ఓటర్లను, ఆఖరికి.. వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వాళ్లను సైతం వదలడం లేదు. ఈ దాడుల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. 

మరోవైపు దాడులపై కేసులు సైతం నమోదు చేయకుండా.. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా దెబ్బ తినడంపై అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ కేడర్‌కు ధైర్యం చెబుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసా ఇస్తున్నారు పలువురు నేతలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement