సాక్షి, కృష్ణా: ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ.. మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదవ వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న అరాచకాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారాయన.
కౌంటింగ్ రోజు నుంచే వైఎస్సార్‌సీపీ నాయకుల పై దాడులు చేస్తున్నారు. టీడీపీ , జనసేన పార్టీ రౌడీ మూకలు అధికారమదంతో రెచ్చిపోతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు ఉద్యోగం చేయకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు , ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు..
.. పోలీసులను టీడీపీ రౌడీలు , రౌడీషీటర్లు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న టీడీపీ రౌడీలను ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు.
మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం కేసు కూడా పెట్టడం లేదు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు పతనావస్థకు తీసుకొచ్చాడు. టీడీపీ రౌడీ షీటర్లు మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా ఎస్పీ ఏమైపోయారు.
.. చంద్రబాబు సీఎం అయ్యాక రౌడీలు సీఐలు,డీఎస్పీలు , ఎస్పీలు అయిపోయారు.మేం మీటింగ్ పెట్టుకుంటే మా నాయకులను రాకుండా అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉంటే.. మేం కూడా తిరగబడక తప్పదుచంద్రబాబు చేయిస్తున్న దౌర్జన్యాల పై చర్యలు తీసుకోనందుకు కోర్టుకు వెళ్తాం. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీని మా నాయకులమంతా కలుస్తాం’’ అని పేర్ని నాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment