సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేక పోతోందని.. ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రూ.3.63 కోట్లతో ఎగ్‌పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలి’’ అని పేర్ని నాని సవాల్ విసిరారు.
‘‘బొద్ధింకలు, ఎలుకలను పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తాలేక జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు.. హామీల అమలుపై దృష్టిపెట్టండి’’ అని పేర్ని నాని హితవు పలికారు.
‘‘జీఏడీ చంద్రబాబు చేతిలో ఉంది. జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పుడు పనులు చేయలేరు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్లు చెల్లించారు. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. టమోటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో చెప్పారు. ఇప్పుడు ఆ రైతులు అలోలక్ష్మణా అని బాధ పడుతుంటే.. మరి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.
‘‘మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటున్నారంటూ అప్పట్లో గొడవ చేశారు. మరి దళితులు, పేదలు చదవకూడదా?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడటం ఎందుకు?. ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా టమోటా రైతులను ఎందుకి దత్తత తీసుకోలేదు?. వైఎస్సార్‌సీపీ వారిపై దాడి చేయటం కాదు.. జనానికి ఉపయోగపడే పనులు చేయాలి. చంద్రబాబుకు దమ్ముంటే పఫ్‌ల లెక్కలు బయటపెట్టాలి.. పరిపాలన చేయటం చేతకాక జగన్‌పై పడి ఏడవటం మానుకోవాలి. జీఏడీ శాఖ మంత్రిగా కూడా ఉన్న చంద్రబాబు పఫ్‌ల ఖర్చు ఫైల్ బయట పెట్టగలరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
ఎంగిలి బిస్కెట్లకి ఆశపడి @ysjagan గారిపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతున్న పచ్చమంద
సిగ్గులేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారే.. ఇది జర్నలిజమా.. బ్రోకరిజమా?
దమ్ము, ధైర్యముంటే సాక్ష్యాలతో నిరూపించండి. లేదా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. pic.twitter.com/RYSchbcDBn— YSR Congress Party (@YSRCParty) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment