సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా.. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమ్తెతారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు.
2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్ట్ 2న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకొని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు.’’ అని పేర్ని నాని మండిపడ్డారు.
‘‘175 నియోజకవర్గాల్లో అందరిని జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం.. 2029లో టీడీపీని కులగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలయి వుంటారు. అరెస్టులు చేసి తప్ఫడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్‌లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిన ఆనందం తాత్కాలికం..’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment