పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు
రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపులు
ముందస్తు బెయిల్ రాగానే మరోసారి రికవరీ నోటీసులు
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.
పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.
రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.
రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు
బెయిల్‌ను సహించలేని ప్రభుత్వం
ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసు
దాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే'
Comments
Please login to add a commentAdd a comment