తాడేపల్లి, సాక్షి: ఏపీలో పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరుతున్నారాయన.
‘‘.. వినుకొండలో నడిబజారులో రషీద్ ని నరికి చంపారు. రషీద్‌కు ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ కార్యకర్తకు అండగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారాయన.
ఇదీ చదవండి: వినుకొండకు జగన్.. రషీద్ కుటుంబానికి పరామర్శ
.. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది?. వారంలోగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలి. చేయలేక పోతే కూటమి నేతలంతా రాజీనామాలు చేయాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment