
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్‌ను చంపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. వైఎస్సార్‌సీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు చంపేశారు. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదు’’ అని రషీద్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘పోలీసులు పదేపదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలవల్లే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈ హత్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించలేదు.రాజకీయ కారణాలతోనే హత్య చేయించారు. హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. జిలానీకి గంజాయి తాగించి.. పక్కా పథకం ప్రకారం హత్య చేయించారు. రషీద్ వైఎస్సార్‌సీపీలో తిరుగుతున్నాడని కక్ష పెంచుకున్నాడు. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తే.. ఎమ్మెల్యే జీవీ చెప్తున్నవనీ అబద్ధాలే. వ్యక్తిగత కక్షలతో హత్య జరగలేదు.’’ అని స్థానికులు అంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment