rashid
-
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
రషీద్ కుటుంబానికి ప్రభుత్వం వేధింపులు
-
వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన -
రాణించిన రషీద్, కరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 244/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు చివరకు 105.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (287 బంతుల్లో 159; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ రాహుల్ రాదేశ్ (22) క్రితం రోజు స్కోరు వద్దే అవుట్ కాగా.. చామా మిలింద్ (5), తనయ్ త్యాగరాజన్ (10), అనికేత్ రెడ్డి (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్ 5, మొహమ్మద్ రఫీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.కెప్టెన్ షేక్ రషీద్ (161 బంతుల్లో 79 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... కరణ్ షిండే (41 బ్యాటింగ్; 4 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (38; 4 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 133 పరుగులు వెనుకబడి ఉంది. రషీద్‌తో పాటు కరణ్ షిండే క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) సందీప్ (బి) రఫీ 124; అభిరత్ రెడ్డి (సి) మోహన్ (బి) విజయ్ 35; రోహిత్ రాయుడు (సి) (సబ్) జ్ఞానేశ్వర్ (బి) విజయ్ 0; హిమతేజ (సి) భరత్ (బి) సందీప్ 36; రాహుల్ సింగ్ (సి అండ్ బి) విజయ్ 1; నితీశ్ రెడ్డి (స్టంప్డ్) భరత్ (బి) మోహన్ 22; రాహుల్ రాదేశ్ (ఎల్బీ) (బి) శశికాంత్ 22; మిలింద్ (బి) విజయ్ 5; తనయ్ (సి) రషీద్ (బి) విజయ్ 10; అనికేత్ రెడ్డి (సి) భరత్ (బి) రఫీ 7; రక్షణ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 301. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, 6–245, 7–253, 8–265, 9–288, 10–301. బౌలింగ్: శశికాంత్ 19–4–38–1; రఫీ 24.4–4–5–59–2; విజయ్ 31–5–118–5; లలిత్ మోహన్ 23–4–64–1; సందీప్ 8–0–18–1. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: హేమంత్ (సి) నితీశ్ (బి) రక్షణ్ 9; అభిషేక్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 38; షేక్ రషీద్ (బ్యాటింగ్) 79; కరణ్ షిండే (బ్యాటింగ్) 41; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (58 ఓవర్లలో 2 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–17, 2–84, బౌలింగ్: మిలింద్ 8–2–21–0; రక్షణ్ రెడ్డి 10–0–35–1; అనికేత్ రెడ్డి 22–5–56–1; తనయ్ త్యాగరాజన్ 9–0–39–0; రోహిత్ రాయుడు 9–2–16–0. -
నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్లో ఉన్నా. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.చదవండి: ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్! -
బెయిల్‌పై విడుదలైన ఇంజినీర్ రషీద్.. మోదీపై పోరాటం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఢిల్లీ కోర్టు రషీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. త్వరలో జరగనున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ 2 వరకు బెయిల్ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు జైలు నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ కట్టు కథకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ‘అయిదున్నర సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత.. నన్ను నేను బలంగా భావిస్తున్నాను. అలాగే నా నియోజకవర్గ ప్రజల గురించి గర్వపడుతున్నాను.నా ప్రజలను ఎప్పుడూ నిరాశపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఘోరంగా విఫలమైన మోదీ 'నయా కాశ్మీర్' కథనంపై పోరాడతాను. ఆగస్ట్ 5, 2019న ఆయన ఏం చేసినా (ఆర్టికల్ 370 రద్దు) ప్రజలు తిరస్కరించారు’ అని రషీద్ పేర్కొన్నారు.VIDEO | Lok Sabha MP from Jammu and Kashmir's Baramulla Engineer Rashid walks out of Tihar Jail, a day after he was granted interim bail in a terror funding case."After remaining in jail for 5.5 years, I feel myself stronger and proud of my people. I take a pledge that I will… pic.twitter.com/SdsIc9vsu0— Press Trust of India (@PTI_News) September 11, 2024మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినదాని కన్నా తన పోరాటం పెద్దదని రషీద్ తెలిపారు. ‘ఆయన (ఒమర్ అబ్దుల్లా) పోరాటం కుర్చీ కోసం. నా పోరాటం ప్రజల కోసమని అన్నారు. బీజేపీ తనపై అణచివేత వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. తాను బీజేపీ బాధితుడినని, చివరి శ్వాస వరకు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.కాగా 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఆయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2019 నుంచి రషీద్ జైలులోనే ఉన్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి పోటీ చేసిన రషీద్.. ఒమర్ అబ్దుల్లాను ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
అసలైన దోషులను అరెస్ట్ చేయాలి
నరసరావుపేట: తమ కుమారుడి హత్యలో ప్రమేయం ఉన్న వారి పేర్లు చెప్పినా ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని వినుకొండలో హత్యకు గురైన రషీద్ తల్లి బడేబీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి.. వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు రషీద్ తల్లిదండ్రులు పరేషా, బడేబీలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిడ్డను కోల్పోయి తామంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే.. తన కుటుంబంపై పరువునష్టం దావా వేస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇలా వేధించడం కంటే ఒక్కసారిగా ‘మమ్మల్ని కూడా నరికించండి’.. అంటూ విలపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ‘ఇప్పుడు కొమ్మలే నరికాం.. భవిష్యత్తులో మొదలు నరుకుతాం.. ’ అని ప్రకటిస్తున్నారంటే తనను కూడా తుదముట్టించాలనే ఆలోచన వారికి ఉందని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉండి తీరతానని స్పష్టం చేశారు. రషీద్ హత్యకు ప్రేరేపించిన వారిని పక్కన పెట్టి ఎవరెవరినో అరెస్ట్ చేశారని విమర్శించారు. అసలైన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రషీద్ రౌడీషీటర్ అని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అతడు సౌమ్యుడని, గొడవలకు వెళ్లే వ్యక్తి కాదన్నారు. తన స్వగ్రామం వేల్పూరులో 30 మంది పోలీసులను పెట్టినా.. టీడీపీకి ఓటేయలేదన్న కారణంతో టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని బొల్లా ఆందోళన వ్యక్తం చేశారు. -
రషీద్ హత్యకేసులో అసలు దోషులేరీ..?
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండ వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ హత్యను ప్రభుత్వం నీరుగారుస్తోంది. రాజకీయ ప్రతీకార హత్య అయినప్పటికీ వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మృతుడి రక్త సంబంఽధీకులు ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకుండా నామమాత్రంగా కొందరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బాధిత కుటుంబం నుంచి వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజే రషీద్ సోదరుడు ఖాదర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదులో రషీద్ మరణానికి కారణంగా పేర్కొంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ మున్సిపాలిటీకి చెందిన కీలక టీడీపీ నేతలు షమీమ్‌ఖాన్, అయూబ్‌ఖాన్, హంతకుడు జిలానీ స్నేహితులైన కొందరు టీడీపీ రౌడీల పేర్లు ప్రస్తావించారు. అయితే పోలీసులు కేవలం హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాల పేర్లు మాత్రమే పొందుపరచి, హత్యకు కుట్ర పన్నిన ప్రజాప్రతినిధులు, పట్టణ టీడీపీ ముఖ్యనేతల పేర్లు తొలగించారు. దీనిపై తొలిరోజు నుంచి రషీద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నిన వారిని పక్కకు తప్పించి ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాలు అరెస్ట్రషీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జిలానీని ఇప్పటికే అరెస్ట్ చేయగా, హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చూపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు జిలానీ కూడా టీడీపీకి చెందిన వారే. ఈ ఏడాది జనవరి 17న ప్రచురితమై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరంతా టీడీపీ కార్యకర్తలని, వారిపై వినుకొండలో జరిగిన ఓ దాడి కేసులో కేసు నమోదు చేశారని వార్త రాశారు. గురువారం అరెస్ట్ అయిన ఒక్కొక్కరిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి హత్య ఉదంతాన్ని ముగించారు. మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేసే రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎలా వెళ్తాడు అనేది వారం ముందు నుంచే జిలానీ, అతని అనుచరులు అక్కడ సంచరిస్తూ ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలో పలు దుకాణాల వద్ద లభ్యమైన సీసీ ఫుటేజ్‌ల్లో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు చెబుతున్నారు. రషీద్‌ను పాశవికంగా హత్య చేస్తున్న సమయంలో హంతకుడు జిలానీ అనుచరులు ఒక వలయంగా ఏర్పడి పహారా కాశారు. కొందరు హత్యకు ముందు మారణాయుధాలను అందించారు.పోలీసులపై తీవ్ర ఒత్తిడి?రషీద్ హత్య కేసులో తెరవెనుక కీలకంగా వ్యవహరించిన షమీమ్‌ఖాన్, అయూబ్‌ఖాన్‌లను ఎలాగైనా కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ ఒత్తిడితో తాను న్యాయం చేయలేకపోతున్నానంటూ ఓ పోలీసు అధికారి బాధిత కుటుంబానికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేస్తే టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని అందుకు వారిద్దరిని అరెస్ట్ చేయకుండా చూడాలని పోలీసు శాఖలో ఓ ఉన్నతాఽధికారిని ఎమ్మెల్యే కోరినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా...తన పార్టీ క్యారకర్త రషీద్ హత్యను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినుకొండకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు మనో ధైర్యం చెప్పారు. నిందితుడు జిలానీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు సతీమణి లీలావతికి కేక్ తినిపిస్తున్న ఫొటోలు వైఎస్ జగన్‌కు చూపి తమ పార్టీ వాడు కాదని టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మృతుడి తల్లిదండ్రులు ఎండగట్టారు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. రషీద్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దేశ రాజధాని వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఈ కేసును వ్యక్తిగత కక్షలతో అని అర్థం చెప్పేలా ప్రయత్నిస్తున్నాయి.అజ్ఞాతంలో అసలు నిందితులురషీద్ హత్యకు కుట్ర పన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న షమీమ్ ఖాన్, ఆయూబ్ ఖాన్లు హత్య జరిగిన రోజు నుంచి వినుకొండ నుంచి పారిపోయినట్టు సమాచారం. రషీద్ హత్యకు కఽథా, స్క్రీన్‌ప్లే మొత్తం షమీమ్, అయూబ్ఖాన్లే రచించారనదే వినుకొండలో అందరినోటా వినిపిస్తోంది. ప్రధాన నిందితుడు జిలానీ, షమీమ్, అయూబ్ ఖాన్‌లపై ఈ ఏడాది జనవరిలో షాదీఖానా వద్ద జరిగిన గొడవలో నిందితులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వీరు ముగ్గురి మధ్య సంత్ససంబంధాలు ఉన్నాయి. హత్యానంతరం వీరిద్దరు అజ్ఞాతంలో ఉండి తమ ఫోన్లను స్విచ్ఆఫ్ చేసి మారు నెంబర్లతో మాట్లాడి రషీద్ హత్యకేసులో నిందితులను పోలీసులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. దీనికి ప్రతిఫలంగా కేసు నుంచి వీరి ఇరువురు పేర్లు తప్పించేందుకు ఒప్పందం కుదిరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యతో సంబంధం లేకపోతే వీరు పారిపోవాల్సిన అవసరమేముంది? పరారైన నిందితులు ఆశ్రయం కోసం వీరి వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు బాధిత కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి. చిన్నచిన్న కేసుల్లో నానా హడావుడి చేసే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీమ్, ఆయూబ్‌లను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహించడం పోలీసుశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. -
రషీద్‌ది రాజకీయ హత్యే
సాక్షి, నరసరావుపేట: వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అతని తల్లి బడేబీ, తండ్రి ఫరేషా స్పష్టం చేశారు. ‘మా కుమారుడికి పాత కక్షలు ఏమీ లేవు. నేర చరిత్ర లేదు. ఎవరినీ చంపలేదు, నరకలేదు. కేవలం వైఎస్సార్సీపీలో చురుగ్గా తిరుగుతున్నాడన్న కారణంతోనే టీడీపీ నేతలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. ఇందుకు జిలానీని అడ్డుపెట్టుకొన్నారు. బుల్లెట్ బండి తగలబెట్టడానికి, మా కుమారుడికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ వినుకొండలో ఎవరిని అడిగినా చెబుతారు’ అని చెప్పారు. జగన్‌ను ఎందుకు అడ్డుకున్నారు? తన పార్టీ కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నేతలు హత్య చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను అసెంబ్లీ వద్ద ఎందుకు అడ్డుకున్నారని ప్రశి్నంచారు. ‘రషీద్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదా? ప్లకార్డులను ఎందుకు చింపేశారు? జగన్ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రజలంతా చూస్తారు. మాకు జరిగిన అన్యాయం అందరికీ తెలుస్తుందని కదా’ అని అన్నారు. కొడుకును కోల్పోయి బాధలో ఉన్న తమకు వైఎస్ జగన్ భరోసానిచ్చారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేసి పోరాడతానన్నారని చెప్పారు. తమకు న్యాయం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంటి వద్దకు వచ్చి భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచారు. ఇప్పటికీ తమ పిల్లల్ని టీడీపీ వారు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా నలుగురు ఉన్నారు, మిమ్మల్నీ చంపుతామంటూ ఫోన్లు చేస్తున్నారన్నారు. పిల్లలకు ఫోన్లు చేయిస్తున్న వారెవరో తేల్చాలని కోరారు. ‘ఆమె ఎవరో హోంశాఖ మంత్రి అనిత అంట.. ఎంత అన్యాయంగా మాట్లాడుతోంది! పాత కక్షలు, ముస్లింలు ముస్లింలు కొట్టుకున్నారని ఆమె చెప్పడం సరికాదు. మా కడుపు కోతను అర్థం చేసుకొని మరోసారి పాతకక్షల వల్ల హత్య అని అనవద్దు. మాకు న్యాయం చేయండి’ అని అన్నారు. బొండాలు కొట్టే కత్తితో రషీద్‌ను హత్య చేశారని అంటున్నారని, ఆ కత్తిని ఎందుకు చూపడంలేదని ప్రశి్నంచారు. అది ఎక్కడ తయారు చేశారు, ఎవరు చేయించారో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. -
నా బిడ్డది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్ తల్లిదండ్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: ముమ్మాటికీ తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్ తల్లిదండ్రులు ఆరోపించారు. రషీద్‌ను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్ అంజనేయులే చంపించారని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడనే టీడీపీ నేతలు తన బిడ్డను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కూడా ఓ మహిళే కదా.. తల్లి కడుపు కోత తెలియదా అని ప్రశ్నించారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వం న్యాయం చేసేదే అయితే ఎందుకు తమ దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పలేదని రషీద్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కొంతమంది ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో రషీద్ హత్యపై వైఎస్ జగన్ పోరాడుతుంటే పోలీసులు ఎందుకు ప్లే కార్డులు లాక్కున్నారని ప్రశ్నించారు.‘వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎందుకు మాట్లాడను ఇవ్వటం లేదు. ఒక మనిషిని అన్యాయంగా చంపితే ఆయన తరుపున మాట్లాడే హక్కు లేదా?. పార్టీ పరంగా అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదా?. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు పదేపదే నా బిడ్డది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు -
రషీద్‌ది రాజకీయ హత్యే..
-
రషీద్ ఘటనపై వినుకొండ ప్రజలు ఫైర్
-
అండగా ఉంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మీ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రషీద్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం గూండాల చేతిలో రషీద్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వినుకొండకు రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన సాయంత్రం ఐదున్నర గంటలకు రషీద్ నివాసానికి చేరుకున్నారు. రషీద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రషీద్ సోదరుడు ఖాదర్.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి హత్య జరిగిన తీరును సెల్ఫోన్లో చూపించి వివరించారు. తన సోదరుడు వైఎస్సార్సీపీలో పని చేస్తున్నాడని కక్షతోనే హత్య చేయించారని, ఈ హత్య వెనుక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉన్నారని చెప్పారు. రషీద్ తల్లి బడేబీ మాట్లాడుతూ.. తన కుమారుడు తన పనేంటో తాను చూసుకునే వాడని, ఎలాంటి గొడవలకు వెళ్లడన్నారు. ఎమ్మెల్యే మనుషులు తన కొడుకును టార్గెట్ చేసి హత్య చేయించారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. జిలానీ.. రషీద్‌ను అన్నా అని పిలుస్తుంటాడని, కేవలం రాజకీయ కక్షతోనే నరికి చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మద్యం షాపులో సూపర్వైజర్గా చేస్తున్న తన తమ్ముడు ఎనిమిది గంటలకు షాపు క్లోజ్ చేస్తాడని, ఆ సమయంలో నిందితుడు వెనుక నుంచి వచ్చి హత్య చేశాడని ఖాదర్ వివరించాడు.దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ ‘చంపుకునేంత కక్షలు లేవు.. ఎందుకలా జరిగింది.. రాష్ట్రమంతా అతలాకుతలంగా మారింది.. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు.. మన ఊళ్లల్లో మనం ఉండేందుకు కూడా వీలు లేకుండా పోయింది. మన ఎమ్మెల్యేలపై కూడా రాళ్లు వేయించిన పరిస్థితి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. మన కన్నా ఎక్కువ చేస్తామని చెప్పి, నాలుగింతలు ఎక్కువ మేలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అమ్మ ఒడి ఇస్తానన్నాడు. అమ్మ ఒడి పడిందా.. మోసం చేశారు. రైతు భరోసా, సున్నా వడ్డీ.. ఇవన్నీ పడలేదు. తప్పు చేయకపోయినప్పటికీ తప్పు చేసినట్లు చూపిస్తారు.. రషీద్ హత్యకు సంబంధించి దోషులకు తప్పకుండా శిక్ష పడేలా చేద్దాం. మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టించినా నేరుగా హైకోర్టులో కేసు వేసి, అన్ని రకాలుగా అండగా ఉంటాం. న్యాయం జరిగేలా చూస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. చేస్తే మంచి చేయాలి. ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వెంట నేనుంటాను’ అని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ పర్యటనలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, కోన రఘుపతి, అన్నాబత్తుని శివకుమార్, కాసు మహే‹Ùరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు బలసాని కిరణ్‌కుమార్, షేక్ నూరీఫాతిమా తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రమేయంతోనే రషీద్ హత్య పోలీసుల తీరుపై మండిపడుతున్న కుటుంబ సభ్యులు సాక్షి, గుంటూరు : వ్యక్తిగత కక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని పోలీసులు చెబుతుండటంపై మృతుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పక్కా పథకం ప్రకారం తమ కుమారుడిని స్థానిక నాయకుల ప్రోద్బలంతో హత్య చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చే ముందు రషీద్ తల్లిదండ్రులు బడేబీ, పరేషాలు మీడియాతో మాట్లాడారు. హత్యలో రాజకీయ కోణం లేకపోతే గతంలోనే హత్య చేయాలి కదా.. అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే హత్య జరగడం రాజకీయం కాక మరేంటని నిలదీశారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని వాపోయారు. -
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది.. రాష్ట్రపతి పాలన విధించాలి
గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం అవసరమా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏ సామాన్యుడిని కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తం అవుతోంది. టీడీపీ నాయకులు ఎవరినైనా కొట్టొచ్చు.. ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయొచ్చు.. హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడొచ్చనే రీతిలో పాలన నడుస్తోంది. అరాచకాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసి అన్ని ఆధారాలను నివేదిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కచ్చితంగా తమ పార్టీ నిరసన గళాన్ని వినిపిస్తుందన్నారు. 24వ తేదీన (బుధవారం) తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు యావత్తు దేశానికి తెలిసేలా ఢిల్లీలో ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ కోరామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఉభయ సభల వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆటవిక పాలనపై ప్రశ్నిస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేయకుండా దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల ప్రేక్షకపాత్ర..రాష్ట్రంలో దారుణమైన ఆటవిక చర్యలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చివరికి టీడీపీ నాయకుల దాడుల్లో బాధితులైన వ్యక్తులు పోలీసుల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటుంటే తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి దాపురించింది. ఇలాంటి నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతుండటం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ దారుణ హత్య పెద్ద ఉదాహరణ. గతంలో పల్నాడు జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి రవిశంకర్ ఎస్పీగా ఉంటే తెలుగుదేశం నాయకులు తమ పలుకుబడితో ఆయన్ను తప్పించేశారు. అనంతరం వారికి అనుకూలంగా పని చేసే బిందుమాధవ్‌ను ఎస్పీగా తెచ్చుకుని అరాచక పర్వానికి తెరలేపారు. బిందు మాధవ్ ఎన్నికల సమయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఎన్నికల కమిషన్ స్వయంగా సస్పెండ్ చేసింది. తర్వాత మరో మంచి అధికారి మలికా గార్గ్‌ను ఈసీ నియమిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను సైతం పంపించేశారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు సహాయ సహకారాలు అందించరనే కారణంతో మలికా గార్గ్‌ను తప్పించారు. ఇప్పుడు టీడీపీకే మద్దతు పలికే శ్రీనివాస్ అనే వ్యక్తికి పల్నాడు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగానే కత్తులతో నరికి రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించేందుకే అమాయకుడు, సాధారణ ఉద్యోగి అయిన రషీద్‌ను క్రూరంగా హత్య చేయడం దుర్మార్గం. మీడియా ముసుగులో దిగజారుడుతనం రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ టీడీపీకే కొమ్ముకాస్తోంది. వీరితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు మీడియా ముసుగులో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. రషీద్ హత్య ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దు్రష్పచారానికి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. జిలానీకి చెందిన మోటార్ బైక్‌కు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులు నిప్పుపెట్టడంతోనే ఇప్పుడు ఈ హత్యకు పాల్పడినట్టు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు.వాస్తవానికి మోటార్ బైక్ జిలానీది కాదు. వైఎస్సార్సీపీకి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిది. ఆ బైక్‌ను టీడీపీకి చెందిన మాజీ చైర్మన్ షామీమ్, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆయూబ్ ఖాన్, మరికొంత మంది టీడీపీ నాయకులు తగలబెట్టి, ఆసిఫ్‌ను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 17నే పోలీసులు కేసు నమోదు చేశారు.10/2024తో క్రైమ్ నంబర్ కూడా నమోదైంది. అయితే ఇదంతా జరగలేదన్నట్టు ఎల్లో మీడియా సృష్టించి, పోలీసులు కేసు కూడా పెట్టలేదని చెబుతోంది. వాస్తవాలను వక్రీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ ఘటన జరిగిన గంటల్లోనే బయటకు వచ్చి వ్యక్తిగత కక్షలతో జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతున్నారు.ఈ సంబంధాలేంటి?రషీద్ హత్యపై పోలీసులు కేసు పెట్టామని అంటున్నారు. ఈ కేసు జిలాని అనే వ్యక్తి మీద మాత్రమే పెట్టారు. జిలానీకి.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో ఫొటోలు దిగాడు. ఆయన భార్యకు కేక్‌లు తినిపించాడు. ఆ పార్టీ నాయకులు షమీమ్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో వారందరి పేర్లు ఎందుకు ఎఫ్ఐఆర్లో లేవు? ఇదేంటి మరి? (ఫొటో చూపుతూ) ఇందులో జిలానీ స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తున్నాడు. లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వారు కేక్ కట్ చేయడం.. ఆ కేక్‌ను ఈ జిలానీ స్వయంగా ఎమ్మెల్యే భార్యకు తినిపించడం కళ్లెదుటే కనిపిస్తోంది. అంటే వీళ్ల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? (ఎమ్మెల్యేతో, ఆయూబ్‌ఖాన్, షమీమ్ఖాన్తో జిలానీ దిగిన ఫొటోలు చూపారు) మరి వీళ్లెవరూ కేసులో ఎందుకు లేరు? వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? రషీద్‌ను ఫ్యాక్షన్ మూలాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం దారుణం. ఆ కుటుంబం ఏం పాపం చేసిందని ఒక మనిíÙని చంపారు? అంతటితో ఆగకుండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తులకు సానుభూతి తెలపకుండా తప్పుడు ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వీడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వవు అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. ఎంపీలను తిరగనివ్వట్లేదు ఎంపీ మిథున్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పుంగనూరులో తిరగకూడదా? మా మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళితే.. ఆ ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి, రెడ్డెప్ప కారుకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. ఇంతకన్నా శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబే పట్టించుకోవద్దని చెప్పడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ రోజు టీడీపీ వాళ్లను కొట్టండి, చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏ అక్కచెల్లెమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఏదైనా ఆపద వస్తే మొబైల్ ఫోన్లో ‘దిశ’ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే రక్షించే వ్యవస్థను తెచ్చాం. -
వినుకొండ: రషీద్‌కు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. అండగా ఉంటానని భరోసా (ఫొటోలు)
-
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
రషీద్ తల్లిదండ్రులను గుండెలకు హత్తుకున్న జగన్
-
మరికాసేపట్లో రషీద్ ఇంటికి జగన్
-
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే అడ్డుకుంటారా..
-
వ్యక్తిగతం కాదు.. రాజకీయ హత్యే
-
ఘటనపై కుటుంబ సభ్యుని షాకింగ్ నిజాలు.. రషీద్ చివరి మాటలు..
-
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే: రషీద్ తల్లిదండ్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్‌ను చంపించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. వైఎస్సార్సీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు చంపేశారు. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదు’’ అని రషీద్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘పోలీసులు పదేపదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలవల్లే జరిగిందని చెప్తున్నారు. ఈ కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ హత్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించలేదు.రాజకీయ కారణాలతోనే హత్య చేయించారు. హత్య వెనుక ఎవరున్నారో తేలాల్సిందే. జిలానీకి గంజాయి తాగించి.. పక్కా పథకం ప్రకారం హత్య చేయించారు. రషీద్ వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడని కక్ష పెంచుకున్నాడు. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తే.. ఎమ్మెల్యే జీవీ చెప్తున్నవనీ అబద్ధాలే. వ్యక్తిగత కక్షలతో హత్య జరగలేదు.’’ అని స్థానికులు అంటున్నారు. -
వినుకొండలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య గురించి తెలియగానే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ బృందం వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చింది. వైఎస్ జగన్ గురువారం ఉదయం వినుకొండ రానున్నారు. రోడ్డు మార్గంలోంచి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రషీద్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15 మంది వరకు రషీద్‌ను చంపడానికి పథకం వేశారు. రషీద్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎటు నుంచి వెళ్తాడన్న విషయాలు తెలుసుకుని ముండ్లమూరు సెంటర్లో నిఘా వేశారు. షాపు నుంచి వచ్చాక జిలానీ దారుణంగా కత్తితో నరికి చంపాడు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు ఈ హత్యలో నరసరావుపేటకు చెందిన సిద్ధు, ఇమ్రాన్, జానీ, రఫీ, షఫీ, సాయిబాబాతో పాటు మరికొందరికి సంబంధం ఉందని రషీద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహే‹Ùరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ తల్లిదండ్రులు పడేషా, బడీబీలు తమ కుమారుడిని టీడీపీ నాయకులే పొట్టన పెట్టుకున్నారని, చంపొద్దని వేడుకున్నా.. దారుణంగా చంపేశారని నాయకుల వద్ద బోరున విలపించారు. రషీద్ మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు హత్యకు గురైన రషీద్ మృతదేహాన్ని సందర్శించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోగానే భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద పోలీసులు మోహరించారు. సుమారు 200 మందికి పైగా పోలీసులు ఆస్పత్రి చుట్టు పక్కల మోహరించారు. మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రషీద్ బంధువులు వంద మందికి పైగా మహిళలు రోడ్డుపై ఆందోళన చేసేందుకు వస్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమను లాఠీలతో కొట్టారంటూ ముస్లిం మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్ ఉందని, ఎలాంటి బంద్‌లు, నిరసనలకు అనుమతి లేదనే పోలీసుల సూచనల మేరకు వారు ఆందోళన విరమించారు. మరోవైపు టీడీపీ నాయకులు ఈ హత్యను ఖండించకుండా జిలానీ కూడా వైఎస్సార్సీపీ వాడేనంటూ ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి జిలానీ ఏడాది క్రితమే తెలుగుదేశంలో చేరాడు. అతని సోదరుడు వినుకొండ పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన వివాదాన్ని ఇప్పుడు హత్యకు సాకుగా తెలుగుదేశం నాయకులు, పోలీసులు చూపిస్తున్నారు. కాగా, రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. -
రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
-
రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యే: కనుమూరు రవిచంద్రారెడ్డి
తాడేపల్లి, సాక్షి: ఏపీలో పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరుతున్నారాయన. ‘‘.. వినుకొండలో నడిబజారులో రషీద్ ని నరికి చంపారు. రషీద్‌కు ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ కార్యకర్తకు అండగా వైఎస్సార్సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారాయన. ఇదీ చదవండి: వినుకొండకు జగన్.. రషీద్ కుటుంబానికి పరామర్శ.. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది?. వారంలోగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలి. చేయలేక పోతే కూటమి నేతలంతా రాజీనామాలు చేయాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
కోస్టల్ రైడర్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మన్యాల ప్రణీత్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ షేక్ రషీద్ (20; 4 ఫోర్లు), మద్దిల హర్షవర్ధన్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), మిట్టా లేఖజ్ రెడ్డి (26; 5 ఫోర్లు), పాథూరి మనోహర్ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు, సాయితేజ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ మున్నంగి అభినవ్ (57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోస్టల్ జట్టు బౌలర్లలో చీపురపల్లి స్టీఫెన్, సుదర్శన్, ఆశిష్, మనోహర్ రెండు వికెట్ల చొప్పున తీసి బెజవాడ జట్టును దెబ్బ తీశారు. -
గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు.. నేను ఆధారపడేది రషీద్‌పైనే: హార్ధిక్ పాండ్యా
-
పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు
అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు. -
ప్రాణహాని.. షీలాపై తండ్రి సంచలన ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షీలా రషీద్‌పై ఆమె తండ్రి అబ్దుల్ సోరా సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి పెద్ద ఎత్తను నగదు జమచేస్తోందని పేర్కొన్నారు. తన కూతురుకు చెందిన ఎన్జీవోపై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ డీజీసీ దిబాగ్ సింగ్‌కు సోమవారం రాత్రి మూడు పేజీల లేఖను రాశారు. ఆ లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కూతురు షీలా, భార్య, చిన్న కూతురు నుంచి నాకు ప్రాణహాని, మా ఇంటి సెక్యూరిటీతో కలిసి నన్ను హతమార్చేందుకు కుట్రపన్నుతున్నారు. సంఘ విద్రోహ శక్తులతో కలిసి షీలా దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతోంది. ఆమెకు పెద్ద ఎత్తున డబ్బు కూడా అందుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త నుంచి ఇటీవల మూడు కోట్ల రూపాయాలు అందాయి. ఆమె నిర్వహిస్తున్న ఎన్జీవో ఎన్నో అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. నన్ను ఇంట్లో బంధించిన గృహహింసకు పాల్పడుతున్నారు. వారి నుంచి నాకు రక్షణ కల్పించండి’ అంటూ డీజీపీకి రాసిన లేఖలో షీలా తండ్రి సోరా పేర్కొన్నారు. సోరా లేఖను స్వీకరించిన పోలీసులు.. దీనిపై త్వరలోనే విచారణ చేపట్టనున్నారు. కాగా జేఎన్‌యూలో విద్యార్థి నేతగా వెలుగులోకి వచ్చిన షీలా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా గళం విప్పి.. నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. గతంలో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. మరోవైపు తండ్రి చేసిన ఆరోపణలను షీలా తీవ్రంగా ఖండించారు. తాము సోరాను ఎంతో బాగా చూసుకుంటామని, ఇలాంటి ఆరోపణలు చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. -
జేసీ ప్రధాన అనుచరుడు రషీద్ మృతి
సాక్షి, తాడిపత్రి: ఎల్లో డాన్ కేవీ రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. రషీద్.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉంటూ పట్టణంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోనూ పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తుండేవాడు. 2018 డిసెంబర్ 30వ తేదీన రషీద్‌ను అరెస్టు చేసేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన అప్పటి సీఐ హమీద్‌ఖాన్ తన సిబ్బందితో కలిసి తాడిపత్రికి చేరుకున్నారు. అయితే అతనితో పాటు అనుచరులు సీఐ హమీద్‌ఖాన్, ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రషీద్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై విడుదలైన రషీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. (జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం) -
భారత్-పాక్ యుద్ధం ఖాయం, ఇదే చివరిది కూడా!
ఇస్లామాబాద్: దాయాది దేశాల మధ్య ఒక వైపు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే పాకిస్తాన్ పదే పదే కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్-భారత్ మధ్య అక్టోబర్-నవంబర్ మధ్య యుద్ధం రానుందంటూ వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్ర్య యుద్ధం జరగనుందంటూ ప్రమాదకర వ్యాఖ్యలు చేసారు. రావల్పిండిలో బుధవారం మీడియాను ఉద్దేశించి షేక్ రషీద్ మాట్లాడుతూ "కశ్మీర్ తుది స్వాతంత్ర్య పోరాటానికి సమయం ఆసన్నమైంది" పేర్కొన్నారు. అంతేకాదు భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే పది యుద్ధాలు జరిగాయి.. కానీ ఇదే చివరి యుద్ధమని కూడా ప్రకటించారు. పనిలో పనిగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అనాగరిక, ఫాసిస్ట్ నరేంద్ర మోదీనే కశ్మీర్ విధ్వంసానికి కారణమని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ మాత్రమే మోదీ కళ్లముందు కనిపిస్తోందనీ, ఈ సమస్యపై మిగతా ముస్లిం ప్రపంచం ఎందుకు మౌనంగా ఉందని షేక్ రషీద్ ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించలేదని పేర్కొన్న ఆయన ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు నిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) ఈ సమస్యను నిజంగా పరిష్కరించాలనుకుంటే ఇప్పటికే కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేదని వ్యాఖ్యానించారు. తమ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో మరోసారి ఐరాస సర్వసభ్య సమావేశానికి తీసుకువెళతారన్నారు. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ) شیخ رشید نے نومبر دسمبر میں پاک بھارت جنگ کا خدشہ ظاہر کردیاhttps://t.co/DXu35qUgMH https://t.co/LBdFSrPy50https://t.co/pHWrgEi8euhttps://t.co/wE5bEF66OK#Newsonepk #Islamabad #RailwaysMinister #SheikhRashid #India #Pak #War #November #December pic.twitter.com/onlwibk1xC — Newsonepk (@newsonepk) August 28, 2019 -
ఏజెన్సీ నిర్వాహకుడిని తొలగించాలి
శెట్టూరు మండలంలోని ప్రభుత్వ హైస్కూలులో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రషీద్‌ను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శెట్టూరులో ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని పలుమార్లు చెప్పినా పెడచెవిన పెట్టాడని దీని వల్ల అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు తెలిపారు. స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీఓ వచ్చి, నిర్వాహకుడిని తొలగిస్తామని తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
ప్రేమఖైదీ
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘మొదట నేను... కెరటాల వంటి నీ శిరోజాలతో మాట్లాడాను. నీ కళ్లలోని వెన్నెల వెలుగులతో మాట్లాడాను. నీ పెదాలపై విరిసిన హరివిల్లుతో మాట్లాడాను. చివరిగా నీ హృదయంతో మాట్లాడాను. ప్రియా... ఇప్పుడు నేను ‘నేను’ కాదు... నువ్వు!’ ప్రేమ... రెండు ప్రపంచాలను ఒకే ప్రపంచంగా చేస్తుంది. అతడి ప్రపంచం: ‘మోడల్ బ్యాడ్‌బాయ్’ ఎవరంటే ఎవరైనా సరే... మొహమాటం లేకుండా వేలెత్తి చూపించేంత బ్యాడ్ ఇమేజ్ రషీద్‌కు ఉంది. టీనేజ్‌లో వయసుతో పాటు వచ్చిన అల్లరి... ఇంతింతై అన్నట్లు ఎక్కడికో వెళ్లిపోయింది. చదువుకు నీళ్లొదిలి, వీధి రౌడీగా పోలీసుల లిస్టులోకి ఎక్కడానికి అతడికి ఎంతో కాలం పట్టలేదు. మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా ఉండేది రషీద్ జీవితం. అయితే వాటి కంటే దారుణమైన పని ఒకటి పదిహేడేళ్ల వయసులో చేశాడు. ఏదో ఒక గొడవలో ఆవేశాన్ని అణచుకోలేక, న్యూ యార్క్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏ కిక్ కోసమైతే రషీద్ నేరాలకు పాల్పడేవాడో ఇప్పుడది జైలులో లేదు. ఎటు చూసినా ఒంటరితనం. అందులో నుంచి పుట్టిన నిరాశా నిస్పృహలు. వాటి నుంచి పుట్టిన ఆలోచనలు! తమ తొలి పరిచయం నుంచి రషీద్‌ను పెళ్లి చేసుకునే వరకు ప్రతి అనుభవాన్నీ కూర్చి ‘ద ప్రిజనర్స వైఫ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది ఆశ. ‘టూ రూమ్ ట్రైలర్’లో అతడితో రెండు రోజులు ఏకాంతంగా గడిపిన ఆనందానికి ఫలితంగా పుట్టిన బిడ్డను తాను ఒంటరిగా పెంచుతోన్న వైనాన్ని, ఆ అను భూతిని వివరిస్తూ ‘సమ్‌థింగ్ లైక్ బ్యూటిఫుల్’ బుక్ రాసింది. రషీద్ విడుదలై వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె ప్రపంచం: మన్హట్టన్లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఆశా బండెల్. చదువుకు చదువు, తెలివికి తెలివి. వాటితో పాటు సామాజిక స్పృహ. ఎప్పుడూ సామాజికసేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. ఆమెలో ఒక చక్కని రచయిత్రి కూడా ఉంది. అందమైన కవితలు అల్లుతూ ఉంటుంది. ఒకసారి తన ప్రొఫెసర్ కోరిక మేరకు న్యూయార్క్‌లోని ఓ జైలుకు వెళ్లింది ఆశ. అక్కడికి వెళ్లి ఆమె చేయాల్సిన పని... ఖైదీలకు తన కవిత్వం వినిపించడం. అప్పుడే ఆమె రషీద్‌ని చూసింది. అందరు ఖైదీల మధ్యలో ఉన్నా అతడు ఆమెకు ప్రత్యేకంగా కనిపించేవాడు. ఆమె కవిత్వం చెబుతుంటే విని పులకించేవాడు. కళ్లతోనే అభినందించేవాడు. చివరికి ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లి అభినం దించాడు. ఆమె కవిత్వం తన మనసుకు కలిగించే ఊరట గురించి చెప్పాడు. నాటి నుంచీ ఆశ, రషీద్‌ల మధ్య స్నేహం పెరిగింది. ఆమె స్నేహంలో తనొక కొత్త ప్రపంచాన్ని చూశాడు. కొత్త మనిషిగా బతకడానికి, కొత్త జీవితం మొదలు పెట్టడానికి తన కోసం దేవుడు పంపిన విలువైన కానుక అని భావించాడు రషీద్. ‘ఇప్పటి వరకు నాది బతుకే కాదు. ఇక నుంచైనా మనిషిగా బతకాలి’ అనుకున్నాడు. రషీద్ గురించి ఆశ కూడా చాలా ఆలోచించింది. పెరిగిన పరిస్థితులే అతడి నలా మార్చాయని అర్థం చేసుకుంది. రషీద్‌ను చూడడానికి ఆశ వారానికి రెండు సార్లు జైలుకు వచ్చేది. ఫోన్లు కూడా చేసు కునేవారు. ఉత్తరాలు రాసుకునేవారు. వీలైనంత వరకూ తన మాటలతో అతడిలో మంచిని నింపడానికి ప్రయత్నం చేసేది ఆశ. చివరికి మోడల్ బ్యాడ్‌బాయ్‌ని మోడల్ ప్రిజనర్‌గా మార్చేసింది. ఏడేళ్లు దొర్లిపోయాయి. వారి మనసులు దగ్గరయ్యాయి. ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని ఒకరోజు ప్రపోజ్ చేసింది ఆశ. ‘‘ఇప్పటికి విధి నాతో ఆడుకుంది చాలు. ఇప్పుడు నువ్వు కూడానా’’ అన్నాడు రషీద్. ‘‘నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’... రషీద్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది. ఆశ అబద్ధం ఆడలేదు. అన్నట్టుగానే రషీద్‌ని పెళ్లాడింది. అధికారుల అనుమతితో జైలు నాలుగు గోడల మధ్యే అతడి అర్ధాంగి అయ్యింది. నాలుగు నెలల తరువాత జైల్లోని ‘టూ రూమ్ ట్రైలర్’లో ఆ ఇద్దరికీ రెండు రోజులు ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది. ఆ రోజు ఇద్దరూ ఒక్కటయ్యారు. నాటి నుంచీ ‘నేను నేను కాదు’’ అంటున్నాడు రషీద్. నిజమే కదా! - యాకుబ్ పాషా -
విజయంతో ముగించిన ఆసీస్
మాంచెస్టర్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు ఆస్ట్రేలియా ఘన విజయంతో వీడ్కోలు పలికింది. చివరిదైన ఐదో వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్ 33 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. స్టోక్స్ (42), రషీద్ (35 నాటౌట్) కొంత వరకు పోరాడారు. మిషెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఫించ్ (70 నాటౌట్) రాణించాడు. మిషెల్ మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. -
అమ్మా.. నన్ను కాపాడు
ఖతర్ నుంచి కన్నపేగు ఘోష కుటుంబ భారాన్ని మోయడానికి ఖతర్ వెళ్లిన యువతి కష్టాల్లో చిక్కుకుంది. అక్కడ నరకం చూస్తున్నానని నెల క్రితం తల్లికి ఫోన్లో చెప్పిన యువతి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా, పెద్ద దిక్కుగా ఉన్న సోదరుడు మంచం పట్టాడు..ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన యువతి సమాచారం అందకపోవడంతో ఆ తల్లి పడ రాని పాట్లు పడుతోంది.. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అమ్మా.. నన్ను రక్షించు, దేశం కాని దేశానికి పంపించావు, వాళ్లు ఇక్కడ నరకం చూపిస్తున్నారు, నీవు నన్ను త్వరగా రప్పించుకో లేకపోతే నా ప్రాణాలు పోతాయి’’ అని ఓ యువతి ఖతర్ దేశం నుంచి నగరంలోని తన తల్లికి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో ఆ తల్లి తన కూతురు కోసం తల్లిడిల్లుతోంది. ఎనిమిదేళ్ల క్రితం భర్త మృతి.. మంచం పట్టిన పెద్ద కుమారుడు... కాటేదాన్‌కు చెందిన మాధవి , సత్యనారాయణ దంపతులు. వీరికి కుమారులు కార్తీక్ (20), అర్జున్ (18), కూతురు లత (22) సంతానం. పాతబస్తీలో ఓ వెల్డింగ్ షాపులో పనిచేసే సత్యనారాయణ ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అయినా మాధవి ధైర్యం కూడగట్టుకుని కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించింది. రెండేళ్ల క్రితం చేతికి ఎదిగిన కొడుకు కార్తీక్ పురానాపూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నేటికి కూడా ఇంట్లో మంచంమీదే ఉండే పరిస్థితి. మరోపక్క అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం చాలా కష్టంగా నడుస్తోంది. ఈ స్థితిలో వనితా కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన లత తాను కూడా కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే చార్మినార్‌కు చెందిన రషీద్ మాధవికి పరిచయం అయ్యాడు. జీతం రూ.13 వేలని నమ్మించి.. ఖతర్ దేశంలో మా వదినే ఇంట్లో పనిచేసేందుకు లతను పంపిస్తే నెలకు రూ.13 వేలు వ స్తాయి, అప్పులన్నీ తీర్చ వచ్చని రషీద్ ఆమెతో నమ్మబలికాడు. కుటుంబ భారం మోయడానికి లత ఖతర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. రషీద్ లతకు పాస్‌పోర్టు ఇప్పించి, జనవరిలో ఖతర్‌కు పంపించాడు. నాలుగైదు నెలలు లత అక్కడ బాగానే ఉందని మాధవికి రషీద్ చెప్పేవాడు. కాగా గత నెల మొదటి వారంలో లత తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా ఇక్కడ నాకు నరకం చూపిస్తున్నారు, నన్ను వెంటనే తీసుకెళ్లు, ఇక్కడుంటే చంపేస్తారు అని కన్నీరుమున్నీరైంది. రషీద్‌తో మాట్లాడి తీసుకువస్తానని ఆమెకు ధైర్యం చెప్పింది. తన కూతురుకు ఏదో అపాయంలో ఉందని భావించిన మాధవి, రషీద్ వద్దకు వెళ్లి తన కూతురు గురించి అడిగింది. వెంటనే తన కూతురు కావాలని కోరింది. రషీద్‌ను గట్టిగా నిలదీయడంతో రెపో మాపో రప్పిస్తానని సముదాయించాడు. ఖతర్‌లో ఉన్న రషీద్ వదినకు ఫోన్‌చేసిన మాధవికి ‘‘ నీ కూతురు ఎక్కడికో వెళ్లిపోయింది, బతికుంటే వస్తుందిలే అని నిరక్ష్యంగా సమాధానం చెప్పడంతో, నెల రోజులు పూర్తయినా కూతురు జాడ లేకపోవడంతో వారం రోజుల క్రితం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. అయితే వారు స్పందించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి చూసి తట్టుకోలేకనే భారాన్ని భుజాన వేసుకున్న నా కూతురు లత విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకుందని మాధవి సాక్షితో తన ఆవేదనను వ్యక్త పర్చింది. తన కూతుర్ని రక్షించి క్షేమంగా నగరానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇదిలావుండగా దుబాయ్‌లో అరబ్‌షేక్ చేతుల్లో చిక్కుకున్న నగరానికి చెందిన ఓ మహిళను చైతన్యపురి పోలీసులు స్పందించి ఆమెను రక్షించి క్షేమంగా నగరానికి వారం రోజుల క్రితం రప్పించారు. అలాగే లతను కూడా రప్పించాలని ఆమె కోరుతుంది. -
పాతబస్తీలో ఆడపిల్లల ఆక్రందనలు
ఏడాదిగా బాలికతో వ్యభిచారం డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టిన తల్లి, అక్క, బావ పీయూసీఎల్ సహకారంతో ఫలక్‌నుమాలో కేసు నమోదు చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో అరబ్ షేక్‌ల పెళ్లిళ్ల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముక్కుపచ్చలారని బాలిక జీవితాలను కన్నవాళ్లు, బ్రోకర్లు, అరబ్ షేక్‌లు మొగ్గలోనే తుంచేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఇప్పుడు అమ్మాయిల అంగడిగా మారింది. అరబ్ షేక్‌లతో పెళ్లి పేరుతోను.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమ్మాయిల ఎగుమతి కొనసాగుతూనే ఉంది. గద్దల్లా తిరిగే బ్రోకర్లు ముస్లిం కుటుంబాలపై వాలి వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని ఆడ పిలల్లకు వెలకట్టి అరబ్ షేక్‌లకు అమ్మేస్తున్నారు. షేక్‌ల మోజు తీరాక వారిని వ్యభిచార గృహాలకు అప్పగిస్తున్నారు. ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఒమన్ దేశానికి చెందిన రషీద్(61) వారం రోజుల వ్యవధిలో పాతబస్తీలో బ్రోకర్ల ద్వారా ఇద్దరు బాలికలను నిఖా(వివాహం) చేసుకుని పట్టుబడ్డాడు. ఈ ఉదంతం మరచిపోక ముందే తాజాగా ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుజూసింది. ఏడాది నుంచి తల్లి, అక్క, బావ ఈ బాలికను భయపెట్టి ఈ దారుణానికి ఒడిగడుతూ వస్తున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా వట్టేపల్లి నైస్ హోటల్ ప్రాంతానికి చెందిన ముర్తుజా బేగం (48), జాఫర్ ఖురేషీ (50) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సుమయ (28)ను బాబానగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్(40)కిచ్చి వివాహం చేశారు. ఏడాది నుంచి అక్బర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. ముర్తుజా బేగం రెండో కుమార్తెకు భర్త విడాకులివ్వడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కాగా డబ్బులుకు కక్కుర్తి పడ్డ ముర్తుజా బేగం తన చిన్న కుమార్తె(15)ను కుమార్తె సుమయ, అల్లుడు అక్బర్ సాయంతో ఏడాది కాలంగా వ్యభిచారం చేయించసాగింది. దీనికి బాలిక ప్రతిఘటించిన ప్రతిసారి చితకబాద సాగారు. ఈనెల 9న బాలికను అక్బర్ దుబాయ్‌కి చెందిన ఓ షేక్ చేతుల్లో పెట్టాడు. అతడు బాలికను గోవాకు తీసుకెళ్లి ఓ హోటల్లో ఆరు రోజులు గడిపారు. బాలిక వెళ్లిపోతానని ఏడవడంతో ఈనెల 16న తీసుకొచ్చి అక్బర్‌కు అప్పగించగా అతడు ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం మరొకరి వద్దకు పంపేందుకు బేరం ఆడుతుండడాన్ని గమనించిన బాలిక స్థానికంగా ఉండే ఓ యువకుడి సాయంతో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాలను కలిశారు. బాలికకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న జయ బుధవారం అర్ధరాత్రి ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. మహిళా అధికారులు లేని కారణంగా గురువారం రావాలని సిబ్బంది చెప్పడంతో జయ గురువారం ఉదయమే బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీస్ అధికారితో విచారణ చేయించారు. ఏడాది కాలంగా తనపై జరుగుతున్న దారుణాన్ని సదరు బాలిక వారికి తెలిపింది. ఈ ఘటనపై బాలిక తల్లి ముర్తుజా బేగం, అక్క సుమయ, బావ అక్బర్‌పై నిర్భయ, అత్యాచారం, అక్రమ రవాణ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూతురునే విక్రయించిన ఘనుడు అక్బర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన అక్బర్ నాలుగు నెలల క్రితం తన కన్న కూతురుకు ఆరు కాంట్రాక్ట్ వివాహాలు జరిపించాడు. కరి కాంట్రాక్ట్ ముగిసాక తలాక్ చెప్పించి మరొకరికి అంటగట్టాడు. ఈ విషయమై కంచన్‌బాగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతటితో ఆగని అక్బర్ తన చిన్న మరదలితో ఏడాది కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. తన రెండో మరదలిని కూడా ఇదే వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన ఓ యువకుడి నుంచి కొన్నాళ్లుగా నిందితులు డబ్బు గుంజుతున్నట్టు పీయూసీల్ సభ్యులు తెలిపారు. ఇతనిపై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. బెంగళూరుకు చెందిన ఓ గృహిణిని సైతం షాయిన్‌నగర్‌కు చెందిన మహిళ సాయంతో దుబాయికి అమ్మేశాడు. ఆడ పిల్లలకు రక్షణ కరవు: జయ వింధ్యాల పాత నగరంలో ఆడపిల్లకు రక్షణ కరువైందని పీయూసీఎల్ తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాల అన్నారు. గురువారం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె నిందితులను కఠినంగా శిక్షించాలని ఏసీపీని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. పాత నగరంలో పేదరికం, నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు తమ పిల్లలను వ్యభిచార కూపంలోకి దించుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. -
ఆ లెక్కన అతడే ఆదికవి!
గ్రంథం చెక్క ఫారసీలో రూద్కీ తొలుతటికవి. అతనికి ముందు కవితా రచన చేసిన వాళ్లు లేరని కాదు. కాని, అంతటి శ్రేష్ఠమైన కవిత అల్లిన వాళ్ళు తమ కవితనంతటిని సంకలనం చేసుకున్నవాళ్లు లేరు. ఆ లెక్కన అతడే ఆదికవి అని అందరూ అంగీకరించారు. రూద్కీ పుట్టంధుడు. భాషా సాహిత్యాల్లోనే కాక బహుశాస్త్రాల్లో పండితుడు. సరస మధుర కవిత, కమ్మని గాత్రం, చతుర వచోవైఖరి, సమయస్ఫూర్తిలాంటి స్వాభావిక గుణాల వలన సారస్వత పోషకులైన సామానీ ప్రభువుల ఆస్థానంలో శతాధికసంఖ్యలో గల కవులకు సరదారు కాగలిగాడు. ఆ ప్రభువుల అనుగ్రహం వలన అతడనుభవించిన వైభవాన్ని ఆ తరువాతి కవులు అసూయ వ్యక్తమయ్యే పదజాలంతో ప్రస్తావించారు. అతని సవారీ ఎక్కడికి కదిలినా రెండు వందలమంది బంగారు పట్టాల బానిసలుండేవారట వెంట. అతని వస్తు సామగ్రిని మోయడానికి నాలుగు వందల ఒంటెలట! తన నూరేళ్ల జీవితంలో ఆ మహాకవి వ్రాసిన కవితలు అన్నీయిన్నీ కాదట. పదమూడు తడవలు లెక్కిస్తే పద్యపంక్తుల సంఖ్య లక్షదాక వచ్చిందట! ఇంకా జాగ్రత్తగా లెక్కిస్తే ఎక్కువే కావచ్చునంటాడు రషీద్. ‘అట’ అని ఎందుకంటున్నానంటే కవుల చరిత్రలో కనబడు పంక్తులు తప్ప ఆ మహాకవి కవిత మనదాకా మిగులలేదు. రూద్కీ కవితాశక్తి ఎంతటి తాసీర్ కలదో అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నవాడు కనుక సుల్తాన్ సామానీ అతని చేత పనికిమాలిన ప్రశంస కావ్యాలు వ్రాయించే కంటే ప్రబంధరచన చేయిస్తే మంచిదనుకున్నాడు. నలభై వేల దిరహాలు బహూకరించి ‘కలీల వదమ్నా’ అనే కావ్యాన్ని అరబీ లోంచి ఫారసీకి అనువదింపజేశాడు. - డా. ఎస్.సదాశివ ‘ఫారసీ కవుల ప్రసక్తి’ నుంచి... -
ఇల్లు అమ్మనివ్వలేదని..
నెల్లూరు(క్రైమ్): ఇల్లు అమ్మనివ్వలేదన్న అక్కసుతో భార్యను ఓ భర్త కడతేర్చిన సంఘటన నెల్లూరు డైకస్‌రోడ్డు సెంటర్లోని ఎన్సీసీ కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు ఎన్సీసీ కాలనీకి చెందిన మహబూబ్‌జానీకి బిట్రగుంటకు చెందిన ఎస్కే హమీద్జాని (45)తో 25 ఏళ్ల కిందట వివాహమైంది. మహబూబ్‌జానీ మంచం అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి రషీద్, నవీద్, సల్మాన్, ఇస్మాయిల్ పిల్లలు. పెద్ద కుమారుడు రషీద్‌కు వివాహమైంది. అందరూ ఎన్సీసీ కాలనీలో నివాసముంటున్నారు. మహబూబ్‌జానీ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో పాటు కొట్టేవాడు. ఇటీవల అప్పులిచ్చిన వారు మహబూబ్జాన్పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎన్సీసీ కాలనీ మూడో వీధిలో ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మివేసి అప్పులు కట్టేందుకు ఆయన సిద్ధపడ్డాడు. అందుకు భార్య అంగీకరించకపోవడంతో ఘర్షణ జరుగుతోంది. మంగళవారం రాత్రి మహబూబ్‌జాన్ పూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. అతను ఓ గదిలో , హమీద్జాన్ తన పిల్లలతో కలిసి మరో గది లో నిద్రించారు. అర్ధరాత్రి తాగేందుకు మంచినీళ్లు కావాలని భార్యను లేపాడు. ఆమె నీరు తీసుకుని గదిలోకి వెళ్లగా మహబూబ్ వెంటనే తలుపులు వేసి ఎలాగైనా ఇల్లు అమ్మివేస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. మహబూబ్ కత్తితో భార్యను కడుపు, ఛాతి, వీపుపై బలంగా పొడిచాడు. ఆమె కేకలు వేయగా పక్కగదిలో నిద్రిస్తున్న కుమారులు గదిని తెరిచేందుకు యత్నించారు. రాకపోవడంతో సిమెంట్ కిటికీని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. నిందితుడు పరారయ్యాడు. తల్లిని కుమారులు రామచంద్రారెడ్డి వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందన్నారు. దీంతో బాధితులు ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర సీఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఏ.రషీద్‌ను సస్పెండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.విద్యాసాగర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ ఈ నెల 18న పత్రిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీడీటీడబ్ల్యూను సస్పెండ్ చేసే అధికారం ఐటీడీఏ పీవోకు లేదని, గతంలో సస్పెండైన గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఐటీడీఏ ఎదుట మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి శనివారం రషీద్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. విధి నిర్వహణలో బాధ్యతరాహిత్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకోకపోవడం, రూల్ 3 ఆఫ్ సీసీఎల్ 1991కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ధర్నాలో పాల్గొనడం, ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం తదితర చర్యలకు పాల్పడినందుకు జీవో నంబర్ 274 ప్రకారం రషీద్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డీడీటీడబ్ల్యూ సస్పెన్షన్
ఉట్నూర్, న్యూస్‌లైన్ : దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఏ రషీద్‌ను బుధవారం ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ సస్పెండ్ చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడం, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతో జీవో ఎమ్ఎస్ నంబర్ 274 ప్రకారం గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అసలు ఏం జరుగుతోంది.. ఐటీడీఏ ఆధీనంలోని గిరిజన సంక్షేమశాఖలో అసలు ఏం జరుగుతోందని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇటీవల డీడీటీడబ్ల్యూ రషీద్ సెలవుపై వెళ్లడం, సూపరింటెండెంట్ నారాయణరెడ్డి సస్పెండ్‌కు గురికావడంతో శాఖలో పనులు నిలిచాయి. మొదటి నుంచి ఐటీడీఏ పీవో, డీడీటీడబ్ల్యూ మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఉంది. అందుకే జూలై నెల 31న అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ డీడీటీడబ్ల్యూ సెలవుపై వెళ్లి కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహించారనే ప్రచారం ఉంది. అనంతరం రషీద్ నవంబర్ 28న డీడీటీడబ్ల్యూ బాధ్యతలు స్వీకరించి ఈనెల 5న విధుల్లో చేరారు. అయినా వీరిద్దరి మధ్య అంతరం తగ్గలేదు. ఈ విషయమై డీడీటీడబ్ల్యూ రషీద్‌ను అడుగగా.. నాపై ఐటీడీఏ పీవో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. డీడీటీడబ్ల్యూను ఐటీడీఏ పీవో సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు. తనపై చర్యలు తీసుకునే అధికారం తమ శాఖ కమిషనర్‌కు, కలెక్టర్‌కు, ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్నారు.