విజయంతో ముగించిన ఆసీస్ | Australia finished with a win | Sakshi
Sakshi News home page

విజయంతో ముగించిన ఆసీస్

Published Mon, Sep 14 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

Australia finished with a win

మాంచెస్టర్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు ఆస్ట్రేలియా ఘన విజయంతో వీడ్కోలు పలికింది. చివరిదైన ఐదో వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్ 33 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. స్టోక్స్ (42), రషీద్ (35 నాటౌట్) కొంత వరకు పోరాడారు. మిషెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఫించ్ (70 నాటౌట్) రాణించాడు. మిషెల్ మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement