england tour
-
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు.. గుజరాత్ ప్లేయర్‌కు బంపర్ ఆఫర్
South Africa Tour Of England: జులై 19 నుంచి దాదాపు మూడు నెలల పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్‌లలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్లను (మూడు ఫార్మాట్ల జట్లు) క్రికెట్ సౌతాఫ్రికా మంగళవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి సౌతాఫ్రికా ఈ రెండు దేశాలతో మూడు ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. జులై 19 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సపారీ టీమ్.. మధ్యలో ఆగస్ట్ 3, 5 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆతర్వాత ఆగస్ట్ 17-సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనల కోసం క్రికెట్ సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లతో పాటు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. ఇటీవల టీమిండియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో గాయపడిన వైట్‌బాల్ కెప్టెన్ టెంబా బవుమా మూడు జట్లలో స్థానం కోల్పోగా.. గుజరాత్ టైటాన్స్ (ఐపీఎల్) ఆటగాడు డేవిడ్ మిల్లర్, భారత సంతతి ఆటగాడు కేశవ్ మహారాజ్‌లు బంపర్ ఆఫర్లు కొట్టేశారు. టెస్ట్‌ల్లో డీన్ ఎల్గర్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్ఏ.. వన్డేల్లో కేశవ్ మహారాజ్‌ను, టీ20ల్లో డేవిడ్ మిల్లర్‌ను కెప్టెన్లుగా నియమించింది. South Africa announced Test, ODI, and T20I squads for the upcoming England tour.#SkyFair #ENGvsSA #SouthAfrica #England #DavidMiller #Cricket #T20I #TestCricket #ODI #CricketTwitter pic.twitter.com/CQrxXoOwVc — SkyFair (@officialskyfair) June 29, 2022 ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల్లో సౌతాఫ్రికా పర్యటన వివరాలు.. జులై 19 : ఇంగ్లాండ్ తో తొలి వన్డే జులై 22 : రెండో వన్డే జులై 24 : మూడో వన్డే జులై 27 : తొలి టీ20 జులై 28 : రెండో టీ20 జులై 31 : మూడో టీ20 ఆగస్టు 3 : ఐర్లాండ్ తో తొలి టీ20 ఆగస్టు 5 : రెండో టీ20 ఆగస్టు 17-21 : ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆగస్టు 25-29 : రెండో టెస్టు సెప్టెంబర్ 8-12 : మూడో టెస్టు చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్ -
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు భలే ఛాన్స్.. ఇంగ్లండ్‌కు పయనం!
IPL 2022- Mumbai Indians: ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లకు ఆటను మెరుగుపరచుకునే మంచి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వారు మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. కాగా ఐపీఎల్-2022లో ముంబై దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోహిత్ శర్మ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు రాణించడం కాస్త ఊరటనిచ్చిన అంశం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. వాళ్లందరికీ అవకాశం ఈ విషయాల గురించి ముంబై వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్‌లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో చేరునున్నాడు’’ అని పేర్కొన్నాయి. ఇక భారత్‌కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. కాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్-2022లో 397 పరుగులతో ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ట్రిప్‌లో భాగమైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా(అంచనా) ఎన్టీ తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్‌దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 -
ఐపీఎల్లో రాణించినా పట్టించుకోలేదు.. ఇక నేను టీమిండియాకు ఆడటం కష్టమే..!
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు. గడిచిన ఐపీఎల్ సీజన్లో తన పర్ఫామెన్స్‌ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది. ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు. చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అతను సఫారీలతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని రాహుల్ త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)లో వైద్యుల పర్యవేక్షనలో ఉన్న అతను మెరుగైన చికిత్స నిమిత్తం జర్మనీకి వెళ్లనున్నట్లు టీమిండియా వర్గాలు వెల్లడించాయి. రాహుల్ జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆతర్వాత జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. England bound ✈️📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm— BCCI (@BCCI) June 16, 2022 ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియాలోని మెజార్టీ సభ్యులు ఇవాళ లండన్ విమానం ఎక్కారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్ తదితరులు ఇవాళ ఉదయం ముంబై నుంచి లండన్‌కు బయల్దేరారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించగా.. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది.. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జులై 7న తొలి టీ20 జులై 9న రెండో టీ20 జులై 10న మూడో టీ20 జులై 12న తొలి వన్డే జులై 14న రెండో వన్డే జులై 17న మూడో వన్డే చదవండి: 'రోహిత్ అందుబాటులో లేకపోతే కెప్టెన్‌గా అతడే సరైనోడు' -
టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కు కేఎల్ రాహుల్ దూరం..!
ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కూడిన భారత జట్టు రేపు (జూన్ 16) లండన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఈ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమేనని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ రాహుల్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రాహుల్ గాయం నుంచి కోలుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ సహచర సభ్యులతో రేపు ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉన్నా అతను ఇంకా ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) లోనే ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా టీమిండియా మొత్తం రేపు లండన్ ఫ్లైట్ ఎక్కనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు కూడా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే పంత్, శ్రేయస్ ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించాల్సి ఉంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చదవండి: వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్ -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు తొలి అవకాశం
ముంబై: ఐపీఎల్లో సత్తా చాటిన ఇద్దరు యువ పేస్ బౌలర్లకు భారత జట్టు పిలుపు లభించింది. ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొట్టిన ఉమ్రాన్ మలిక్, పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన అర్ష్‌దీప్ సింగ్‌లకు మొదటిసారి టీమిండియా అవకాశం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కొంత విరామం తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9న (ఢిల్లీ), 12న (కటక్), 14న (విశాఖపట్నం), 17న (రాజ్‌కోట్), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వేగం...పొదుపు... ప్రస్తుత ఐపీఎల్ ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు ఉమ్రాన్, అర్‡్షదీప్ ఎంపిక చూపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ తన అసలు సిసలు ఫాస్ట్ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం 150 కి.మీ. వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (156.9 కి.మీ.)ను నమోదు చేశాడు. వేగంతో కొన్నిసార్లు గతి తప్పినా... ఎక్కువ భాగం నియంత్రణతో కూడిన బౌలింగ్‌ను ప్రదర్శించిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. అర్‡్షదీప్ ఖాతాలో 10 వికెట్లే ఉన్నా పొదుపైన బౌలింగ్ (7.70 ఎకానమీ)తో ఆకట్టుకున్నాడు. వారిద్దరూ వచ్చారు... 2021 టి20 ప్రపంచకప్‌లో ఆడినా ఎక్కువ భాగం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న అతనికి సహజంగానే భారత జట్టులో చోటు లభించింది. 2019 తర్వాత భారత జట్టుకు ఆడని దినేశ్ కార్తీక్ కూడా ఐపీఎల్ ప్రదర్శనతోనే తిరిగి రావడం విశేషం. ఈ సీజన్లో 191.33 స్ట్రయిక్‌రేట్‌తో 287 పరుగులు చేసిన అతను డెత్ ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని దీపక్ చహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పేర్లను సెలక్టర్లు పరిశీలించలేదు. భారత జట్టు చివరిగా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడగా... అందులో భాగంగా ఉన్న సంజు సామ్సన్, మొహమ్మద్ సిరాజ్ మాత్రం జట్టులో చోటు కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు -
ఐపీఎల్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ పర్యటనకు రహానే దూరం
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సభ్యుడు, భారత క్రికెటర్ అజింక్య రహానే కండరాల గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ టోర్నీతోపాటు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా రహానే గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఫీల్డింగ్ చేయలేదు. రహానే కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ ఐపీఎల్ సీజన్లో రహానే ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 133 పరుగులు సాధించాడు. -
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు..
లండన్: 3 టీ20లు, 5 వన్డేల సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. లీసెస్టర్ వేదికగా న్యూజిలాండ్ మహిళలు, ఇంగ్లండ్ మహిళల మధ్య ఇవాళ(సెప్టెంబర్ 21) జరగాల్సిన మూడో వన్డేకు కొద్ది గంటల ముందు ఓ గుర్తు తెలియని అగంతకుడు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపుకు పాల్పడినట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దృవీకరించాయి. కివీస్ బృందం బస చేస్తున్న హోటల్‌ను బాంబు పెట్టి పేల్చేస్తామని సదరు అగంతకుడు కివీస్ మేనేజ్మెంట్లోని ఓ వ్యక్తికి మెయిల్ చేశాడు. అయితే ఈ బెదిరింపు నమ్మదగదిగా లేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కొట్టిపారేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఇటీవల కివీస్ పురుషుల జట్టు భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా బెదిరింపులు వచ్చి ఉండవచ్చని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబు బెదిరింపు తర్వాత కివీస్ మేల్ క్రికెటర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టేడియం బయట తమ ఆటగాళ్లపై దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కివీస్ ప్రధాని జెసిండా.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్ జట్టు వైదొలిగిన తర్వాత ఇంగ్లండ్ జట్టు సైతం పాక్ టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..! -
మూడు కాదు.. ఐదు.. ఈసీబీకి ఆ ఆఫర్ ఇచ్చాం: బీసీసీఐ
Team India Tour Of England In July: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్ నిర్ణయాత్మక ఐదో టెస్టు వాయిదా పడిన నాటి నుంచి రీ షెడ్యూల్ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత ఆటగాళ్లకు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా ఆడేందుకు విముఖత చూపారని, కాబట్టి తాము ఓడినట్లు టీమిండియా అంగీకరించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అంతేగాక... మ్యాచ్ రద్దు కావడం వల్ల తమకు వాటిల్లిన నష్టం గురించి, విజేతను నిర్ణయించే అంశంలోనూ జోక్యం చేసుకోవాల్సిందిగా ఐసీసీ వివాద పరిష్కార కమిటీ(డీఆర్సీ)కి లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో... మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆఖరి టెస్టు రద్దు కావడం వల్ల ఈసీబీకి జరిగిన నష్టాన్ని(సుమారు 40 మిలియన్ పౌండ్లు) పూడ్చేలా.. వచ్చే ఏడాది టూర్లో అదనపు టీ20లు ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా వీటిని ధ్రువీకరించారు. క్రిక్‌బజ్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘అవును.. నిజమే.. జూలైలో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో రెండు ఎక్స్ట్రా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీబీకి చెప్పాం. మూడు టీ20లకు బదులు ఐదు మ్యాచ్‌లు ఆడతాం. అంతేకాదు రద్దైన టెస్టు మ్యాచ్ కూడా ఆడతాం. అయితే, మా ఆఫర్‌ను అంగీకరిస్తారా లేదంటే తిరస్కరిస్తారా అనేది వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లండ్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. -
65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే?
లండన్: టీమిండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ దాదాపు 65 రోజుల తర్వాత తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దీంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ పరస్పరం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోను సూర్య తన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ స్టార్ తన భార్యతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్ ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో తెగవైరల్ అవుతోంది. కాగా సూర్యకుమార్ యాదవ్ గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌కు ముందు బయోబబుల్ కోసం తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తూ 10 రోజులు మళ్ళీ క్వారంటైన్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో ఈ జంట లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. చదవండి:Mohammed Siraj: సిరాజ్ ఎంపిక, విజయంలో ఆయన పాత్రే కీలకం! View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
లండన్ చేరిన భారత జట్టు
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్‌గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్‌హామ్ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్‌లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్ ఈ నెల 13న ముగియనుంది. గంగూలీ...లార్డ్స్ టెస్టు చూసేందుకు! బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లార్డ్స్ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడు. భారత్‌ను తాజాగా ‘రెడ్’ లిస్ట్ నుంచి ‘అంబర్’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. -
పాక్ రివెంజ్.. హీరో మాత్రం అతనే!
భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. శుక్రవారం నాటింగ్హమ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ బాబర్ అజామ్ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. బ్యాట్జులిపించిన లిమాయ్ అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్. కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్లో) భారీ షాట్ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. The moment Liam Livingstone struck England's fastest T20I century 💪#ENGvPAKpic.twitter.com/nEkYA8iQsf — The Cricketer (@TheCricketerMag) July 16, 2021 -
టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. బీసీసీఐ అలర్ట్!
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. మరోవైపు 20 రోజుల బ్రేక్ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్ బారినపడ్డ(అసింప్టోమెటిక్ లక్షణాలు) విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్ లేఖను పంపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్యాంప్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. -
Viral Video: సూపర్ ఉమెన్ స్మృతి మంధాన.. జస్ట్ వావ్
ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ టైంలో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన ఒడిసి పట్టిన క్యాచ్.. మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు).. దీప్తి బౌలింగ్‌లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు చేర్చింది. Out of 10, how much would you rate this stunner by Smriti Mandhana? 😍🙌 #ENGvIND #ENGWvINDW pic.twitter.com/M66ivgC88v — Female Cricket (@imfemalecricket) July 3, 2021 కాగా, ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ఉమెన్ అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే 2-1తేడాతో సిరీస్ ఓడిన టీమిండియా.. జులై 9న మొదలుకాబోయే టీ20 సమరానికి సిద్ధమవుతోంది. -
ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్ బెంగాల్ మహిళా క్రికెటర్.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్-19, అండర్-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు. -
Team India England Tour: బ్యాకప్ కీపర్‌గా భరత్
న్యూఢిల్లీ: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు వెంబడి అదనపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ వెళ్లనున్నాడు. బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నా... అతను పర్యటన మధ్యలో గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ ఒకరు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ శ్రీకర్ భరత్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ టోర్నీలో ఆడే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో కోల్‌కతాలోని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెడతాడు. చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ -
రెండు వారాలు ముంబైలో... పది రోజులు సౌతాంప్టన్‌లో...
ముంబై: మూడున్నర నెలల ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణం మొదటి మజిలీ ముంబైకి చేరుకుంది. జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టూర్లో భాగంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతుంది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. రెండు ప్రత్యేక విమానాల్లో... టీమిండియా జట్టు సభ్యులు సురక్షితంగా ముంబైకి చేరుకునేందుకు బీసీసీఐ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ, చెన్నైల నుంచి ఈ విమానాలు బయలుదేరాయి. ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరారు. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎక్కగా... రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిన మయాంక్ అగర్వాల్ కూడా వీరితో జత కలిశాడు. ఇదే ఫ్లయిట్ హైదరాబాద్‌కు వెళ్లింది. మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిలతోపాటు సిరాజ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దీంట్లో ప్రయాణించి ముంబై చేరారు. ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు పుజారా, జడేజా, అక్షర్, షమీ మాత్రం తమ ‘నెగెటివ్ రిపోర్ట్’లతో కమర్షియల్ ఫ్లయిట్ల ద్వారా విడిగా ముంబై చేరారు. అలా అయితే ఎలా... తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫెనల్‌కు సంబంధించిన నిబంధనలపై ఐసీసీ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. టెస్టులో ఇరు జట్ల ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాని సమయంలో వర్షం కారణంగా ఆట రద్దయిపోతే ఎలా... మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఎలా... వీటిపై ఇంకా ఐసీసీ మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 4 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది. వారికి కాస్త సడలింపు... ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్‌కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు. మరోవైపు ఐపీఎల్‌లోనే కరోనా పాజిటివ్‌గా తేలిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా కోలుకున్నాడు. స్టేడియం పక్కనే... లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్‌కు వెళ్లిపోతుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ కొనసాగుతుండగానే టీమిం డియా క్వారంటైన్ మొదలవుతుంది. అయితే మ్యాచ్ జరిగే ఏజియస్ బౌల్ మైదానానికి ఆనుకునే ఉన్న హోటల్లోనే ఉండాల్సి రావడం కొంత వెసులుబాటు. ఇక్కడ భారత్ 10 రోజుల పాటు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది. -
కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే..
ముంబై: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న కోహ్లీ సేనకు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసును అక్కడే ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యూకే ఆరోగ్య శాఖ పర్యవేక్షించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్ తొలి డోసును భారత్‌లో తీసుకున్న కోహ్లి అండ్ కో, రెండో డోసును ఇంగ్లండ్‌లో తీసుకోనుంది. 18 ఏళ్ల దాటిన వారు కోవిడ్ టీకాను తీసుకోవచ్చని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలని బీసీసీఐ ప్రకటించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా ఇతర ఆటగాళ్లంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లకు మూడు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగా, రెండు వారాల క్వారెంటైన్ నిమిత్తం ఇదివరకే ముంబై చేరుకున్న భారత బృందం.. ఇంగ్లండ్‌కు వెళ్లాక అక్కడ కూడా పది రోజులు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీమిండియాకు బ్రిటన్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. జట్టు సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా చదవండి: రిటైర్మెంటే ఫైనల్: ఏబీ డివిలియర్స్ -
భారత మహిళల బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్..
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా పని చేస్తున్న అతను.. 2020లో పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో అతనికి జాతీయ జట్టుకు సేవలందించే అవకాశం దక్కింది. కాగా, ఒడిశాకు చెందిన శివ్ సుందర్ దాస్ 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడి 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. అతను 4 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఆడనుంది. చదవండి: టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు -
భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది..
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఓ సంఘటన త్వరలో చోటు చేసుకోనుంది. పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మహిళా క్రికెట్ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. ఇలా పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఈనెల 19న ముంబైలో సమావేశం కావాలని బీసీసీఐ అధికారులు సూచించారు. ఆనంతరం ఆటగాళ్లందరూ 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటారని, ఆ సమయంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది. ఇంగ్లండ్ చేరుకున్నాక ఇరు జట్లు వారం రోజుల ఐసోలేషన్ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభిస్తారని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు -
పాజిటివ్ వచ్చిందో... చోటు పోయినట్లే
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్ వస్తే వారు ఇంగ్లండ్ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్ పర్మార్ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్లోకి అడుగు పెట్టగానే ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ డోసు తీసుకోండి... మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్ మరో వెర్షన్ అయిన అస్ట్రాజెన్కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో కోవిషీల్డ్ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్’ వ్యాక్సిన్ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. -
ఆ సమయంలో ఎవరూ లేరు: కోహ్లి
ముంబై: ఒకానొక సమయంలో తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించారు. ప్రపంచంలో తానొక్కడే ఒంటరి వాడినని ఫీలైనట్లు తెలిపాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెటర్’ పాడ్‌కాస్ట్‌లో భాగంగా కోహ్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వెల్లడించాడు. పాడ్‌కాస్ట్ సందర్భంగా నికోలస్, కోహ్లిని ఉద్దేశించి ‘‘మీ కెరీర్లో డిప్రెషన్‌కు గురైన సందర్భాలు ఏవైనా ఉన్నాయా’’ అని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి ‘‘అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దాదాపు చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితి అనుభవించి ఉంటారు. ఆ సమయంలో మనం దేన్ని కంట్రోల్ చేయలేం. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్ టూర్లో నేను ఇలాంటి పరిస్థితి అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది. నేనేం చేయలేకపోతున్నాననే బాధ నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యాను’’ అన్నాడు కోహ్లి. ‘‘ఆ సమయంలో వృత్తి పరమైన నిపుణుడు మనతో పాటు ఉంటే బాగుండు అనిపించింది. అంత మందితో కలిసి ఉన్నప్పటికి నేను ఒంటరిగానే ఫీలయ్యేవాడిని. అయితే దీని గురించి ఎవరికి చెప్పలేదు. నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో వివరించేందుకు ఓ నిపుణుడితో మాట్లాడటం అవసరం అనిపించింది. కానీ ఆ సమయంలో ఎవరు లేరు. అప్పుడనిపించింది జీవితంలో ప్రతి దశలో మనకు ప్రొఫేషనల్ అవసరం ఉంటుంది అని. మనం ఎలా ఉన్నాం.. దేని గురించి ఆలోచిస్తున్నాం... దేని వల్ల మనం సరిగా నిద్ర పోలేకపోతున్నాం.. లేవలేక పోతున్నాం.. మన మీద మనకు నమ్మకం లేదు.. ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి.. మనం చెప్పేది వినడానికి ప్రొఫేషనల్ అవసరం ఎంతో ఉంది అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ పరిస్థితుల నుంచి బయటపడగలిగాను’’ అన్నాడు కోహ్లి. 2014 ఇంగ్లాండ్ టూర్లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0,7, 6, 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్‌లోకి వచ్చాడు. చదవండి: వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి 'కమాన్ రోహిత్.. యూ కెన్ డూ ఇట్' -
విరాట్ కోహ్లి ఈజ్ బ్యాక్!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం భారత్‌కు వచ్చిన విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఇషాంత్, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగొచ్చారు. ఇక బ్రిస్బేన్ టెస్టులో అదరగొట్టిన ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. దాంతోపాటు స్టాండ్ బై వికెట్ కీపర్‌గా తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ అవకాశం లభించింది. నాలుగు గెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు చెన్నైలో ప్రారంభమవుతుంది. తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇది... భారత జట్టు: విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. (చదవండి: చారిత్రక విజయం: రహానే, రవిశాస్త్రి భావోద్వేగం) -
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆగస్టు–సెప్టెంబర్ 2021లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్తాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఏడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్–ఇంగ్లండ్ మధ్య పోరునే ‘సెంటర్ పీస్ ఈవెంట్’గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4–8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12–16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25–29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్ 2–6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్ 10–14) జరుగుతాయి. పాకిస్తాన్‌లోనూ...: 16 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ టీమ్ పాకిస్తాన్ గడ్డపై క్రికెట్ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ సిరీస్ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయల్దేరతాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్తాన్లో పర్యటించింది. -
మన దేశంలోనే జరిపేందుకు ప్రయత్నిస్తాం
దుబాయ్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సిరీస్‌ను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అవసరమైతే ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించే విధంగా అక్కడి బోర్డులో బీసీసీఐ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నా... మన దేశంలో నిర్వహించాలనేదే తమ ఆలోచన అని అతను అన్నాడు. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో కోవిడ్–19 పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సౌరవ్ వెల్లడించాడు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు జరగాల్సి ఉంది. ‘భారత గడ్డపై దీనిని జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం. గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి. ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్ జరిగేందుకు ఏమాత్రం అ వకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహిం చి చూపించడం సంతోషంగా ఉంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ధోని సా ధించిన ఘనతలను బట్టి చూస్తే అతనిడి అన్ని విధాలా గౌరవించుకోవాలన్న గంగూలీ... ప్రస్తు త పరిస్థితుల్లో ధోని వీడ్కోలు మ్యాచ్ విషయంపై మాత్రం ఏమీ చెప్పలేనని స్ప ష్టం చేశాడు. తన మార్గదర్శ నంపై ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయనే విమర్శలపై కూడా ‘దాదా’ పెదవి విప్పాడు. సుమారు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తను అయ్యేరే కాదు, కోహ్లి... ఇంకే ఆటగాడు అడిగినా సాయమందిస్తానని చెప్పాడు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదని హితవు పలికాడు. -
అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. హిప్ అలైన్ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో వీడియో చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్ టూర్లో బ్యాటింగ్ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు. ‘‘ఇంగ్లండ్ టూర్లో హిప్ పొజిషన్ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్ చేస్తూ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్ టూర్లో నేను ఈ టెక్నిక్ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది. (1000వ పోస్టును షేర్ చేసిన కోహ్లి) ఆ తర్వాత ముంబైలో సచిన్ పాజీని కలిశాను. ఫార్వర్డ్ ప్రెస్(బలంగా నిల్చుని కాలు ముందు చాచడం) ద్వారా ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్ టూర్లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2014 ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 13.40 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి కెరీర్లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్ మార్చుకుని ఆసీస్ టూర్(2014-15)లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు. -
ఇంగ్లండ్ బయలుదేరిన పాకిస్తాన్ జట్టు
మాంచెస్టర్: ఓవైపు కరోనా తాలూకు భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం ఆదివారం ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం మాంచెస్టర్ పయనమైంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో ఇరు జట్ల మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరినట్టుగా పాక్ వన్డే, టి20 కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఇంగ్లండ్‌కు వెళ్లే దారిలో ఉన్నాం. ఈ పర్యటన కోసం ఎంతోకాలంగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా’ అని పేర్కొన్న బాబర్ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను పంచుకున్నాడు. అయితే కరోనా బారిన పడిన 10 మంది క్రికెటర్లను మళ్లీ పరీక్షించగా అందులో ఆరుగురు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ వారిని మరోమారు పరీక్షించాకే ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. పాకిస్తాన్ జట్టు: అజహర్ అలీ, బాబర్ ఆజమ్, అబిద్ అలీ, అసద్ షఫీఖ్, ఫహీమ్ అష్రఫ్, ఫవాద్ ఆలమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హఖ్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ అబ్బాస్, మూసా ఖాన్, నసీమ్ షా, రోహైల్ నాజిర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, యాసిర్ షా. -
‘ఆ పది మంది’ లేకుండా...
కరాచీ: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పష్టత వచ్చింది. తొలిసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలిన 10 మంది క్రికెటర్లను పక్కన పెట్టి మిగతా 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో పాక్ జట్టు నేడు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ వెళ్లనుంది. వీరితో పాటు రిజర్వ్‌గా ఎంపిక చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా అదనం. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 28 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. వీరిలో పది మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వీరికి శనివారం మరో సారి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్ ‘నెగెటివ్’గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్‌కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది. ‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్‌గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌గా ఎంపికై నెగెటివ్ వచ్చిన మూసా ఖాన్, రొహైల్ నజీర్ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు’ అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వెల్లడించారు. మరో నలుగురు క్రికెటర్లు హైదర్ అలీ, హారిస్ రవూఫ్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్‌గా బయట పడ్డారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. పాక్ జట్టు ముందుగా మాంచెస్టర్ చేరుకొని అక్కడి నుంచి వస్టర్‌షైర్‌కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్ దేశపు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం. -
అమ్మాయిలు ఇంగ్లండ్‌కు వెళ్లరు
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్ తలపడాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్ క్రికెట్‌ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్ సీజన్లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్‌ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది. ‘ఈ వేసవిలో కొంత వరకైనా క్రికెట్ కార్యకలాపాల్ని నిర్వహించగలమని మేం నమ్ముతున్నాం. వాయిదా పడిన అంతర్జాతీయ టోర్నీలను రీ షెడ్యూల్ చేసి మళ్లీ నిర్వహిస్తాం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిస్థితులు సద్దుమణిగాకే ప్రొఫెషనల్ క్రికెట్‌ను నిర్వహిస్తాం’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ పేర్కొన్నారు. -
సెలక్టర్లు నాతోనూ మాట్లాడలేదు!
ముంబై: టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోయిన భారత ఓపెనర్ మురళీ విజయ్ సెలక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరుణ్ నాయర్‌లాగే తనతో కూడా మాటమాత్రమైనా చెప్పకుండానే జట్టునుంచి తప్పించారని వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన విజయ్‌ని టీమ్ మేనేజ్మెంట్ మూడో టెస్టు ఆడించకుండా పక్కనబెట్టింది. అనంతరం సెలక్టర్లు చివరి రెండు టెస్టులకు అతనిపై వేటు వేశారు. దీనిపై అతను మాట్లాడుతూ ‘మూడో టెస్టునుంచి నన్ను తప్పించిన తర్వాత చీఫ్ సెలక్టర్‌గానీ, మిగతా సెలక్టర్లుగానీ ఎవరూ నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇంగ్లండ్‌లో కేవలం జట్టు మేనేజ్మెంట్ మాత్రమే నాతో మాట్లాడింది. అంతకుమించి తొలగింపుపై నేను ఇంకెవరితోనూ మాట్లాడింది లేదు. నాకు చెప్పింది లేదు’ అని అన్నాడు. జట్టుకు ఎంపికైనా కరుణ్ నాయర్‌కు ఒక్క టెస్టులోనూ అవకాశం ఇవ్వకుండానే ప్రస్తుత విండీస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించడంపై విమర్శలొచ్చాయి. కరుణ్ తనను తప్పించడానికి గల కారణాలు, ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు సూచనలు ఎవరు చెప్పలేదని మీడియాతో అన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో 20, 6 పరుగులు చేసి విజయ్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అయితే విజయ్ వ్యాఖ్యలపై కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడిని జట్టునుంచి తప్పించినప్పుడు అందుకు తగిన కార ణాలు వివరిస్తూ సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ స్పష్టంగా మాట్లాడినట్లు ప్రసాద్ వివరణ ఇచ్చారు. -
ఆట ఆడటానికా ? ఫొటో షూట్ కోసమా?
నాటింగ్‌హామ్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడికి వెళ్లింది ఆట ఆడటానికా ? లేక ఫొటో షూట్ కోసమా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పాండ్యా తన ఖాళీ సమయాన్ని లండన్ వీధుల్లో తిరుగుతూ ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది అభిమానులకు ఎక్కడి లేని ఆగ్రహాన్ని తెప్పించింది. టెస్ట్ సిరీస్‌ల్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడి కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించాల్సిన ప్రయత్నం చేయకుండా ఇలా ఎంజాయ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లండ్ టూర్ ఆడటానికి వచ్చాననే విషయాన్ని గుర్తు చేసుకో అని మండిపడుతున్నారు. ఇలా సమయాన్ని వృథా చేయకుండా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయమని సలహాలిస్తున్నారు. ‘ఈ ఫొటో షూట్స్ తరువాత కానీ.. ముందు ఆట మీద దృష్టి సారించూ’ అని గట్టిగానే క్లాస్ పీకుతున్నారు. ( చదవండి:పాండ్యాను ఆల్‌రౌండర్ అనలేం) ఈ సిరీస్‌లో పాండ్యా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 52 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. రెండో టెస్టులో 11, 26 పరుగులు చేసి విఫలమైనా.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్,159 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి ఈ రెండు టెస్టుల్లో కోహ్లి మినహా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో కోహ్లి-రహానే జోడీ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లోను పాండ్యా(18) నిరాశపరిచాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. చదవండి: మూడో టెస్టు ముచ్చట్లు ! -
తోటి క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తూ హంగామా!
-
విమానంలో హార్దిక్ పాండ్య హంగామా!
లండన్ : ఐర్లాండ్‌తో బుధవారం నుంచి జరగనున్న రెండు మ్యాచ్‌లు టీ-20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జట్టు మంగళవారం బ్రిటన్ చేరుకుంది. ఇండియా నుంచి ప్రత్యేక విమానంలో బ్రిటన్ బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు.. గగనయానంలో సరదా సరదాగా గడిపారు. హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అందుకు కారణం ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య తోటి ఆటగాళ్లను, మేనేజ్మెంట్ సిబ్బందిని ఇంటర్వ్యూ చేయడమే.. విమానంలో సరదాగా అతడు చేసిన ఇంటర్వ్యూ వీడియోను బీసీసీఐ తన వెబ్సైట్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనపై ఏమనుకుంటున్నారు? భారత జట్టులో డాన్ ఎవరు? సూపర్ మ్యాన్ ఎవరు? చాహల్ గురించి రోహిత్ శర్మ ఏం చెప్పాడు.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, సరదా సరదా ప్రశ్నలతో పాండ్య, చాహల్ కొంత హంగామా చేశారు. తోటి ఆటగాళ్లకు ఎంటర్టైన్మెంట్ పంచారు. మరో విషయం ఏమిటంటే పాండ్య.. ధోనీని ఏమీ అడగలేకపోయాడు. తన వద్దకు వచ్చిన పాండ్యకు ధోనీ ఒక బిస్కెట్ ఇచ్చి.. వెళ్లాల్సిందిగా సూచించడంతో అతడు.. ధోనీని వదిలేసి పక్కనే ఉన్న ధావన్ వద్దకు వెళ్లాడు. ఇంగ్లండ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఎంతో సరదాగా గడపవచ్చునని, గొప్ప క్రికెట్ ఆడుతూ.. ఆస్వాదించవచ్చునని కోహ్లి ఈ వీడియోలో పేర్కొన్నాడు. ఇక, తొలిసారి టీమిండియాతో ఇంగ్లండ్ వస్తున్న కేఎల్ రాహుల్ లాంటి వారికి ఇది సువర్ణావకాశమని చెప్పాడు. ఇక ఈ వీడియోలో ఇంటర్వ్యూ చేసిన పాండ్యనే డాన్ అని దినేశ్ కార్తీక్ పేర్కొనగా.. చాహల్ వద్ద చెమట వాసన వస్తోంది..డియోడ్రెంట్ వాడాలంటూ రోహిత్ సరదాగా సెటైర్లు వేశాడు. మనీష్ పాండే హెయిర్స్టైల్పైన పాండ్య, చాహల్ జోకులు పేల్చారు. -
రోహిత్ శర్మకు లైన్ క్లియర్
సాక్షి, బెంగళూరు : ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికమైన యో-యో పరీక్షలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. తద్వారా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఈ ముంబైకర్ అర్హత సాధించాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో బుధవారం నిర్వహించిన యో-యో టెస్టును క్లియర్ చేసినట్లు రోహిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. తన ఫొటోతో పాటు.. ‘యో యో త్వరలోనే ఐర్లాండ్ వచ్చేస్తున్నా’ అంటూ రోహిత్ పోస్ట్ చేశాడు. నిజానికి 15వ తేదీనే రోహిత్ శర్మ ఈ టెస్టుకు హజరవ్వాల్సి ఉండగా.. విదేశాల్లో ఉన్న కారణంగా బీసీసీఐ అనుమతితో 17వ తేదీకి మార్చుకున్నాడు. కానీ 17వ తేదీన కూడా రోహిత్ ఫిట్నెస్ టెస్టుకు హాజరు కాకపోవడంతో ఇంగ్లండ్ పర్యటనకు అర్హత సాధిస్తాడా లేదా అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే బీసీసీఐ బుధవారం రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వగా అతడు సద్వినియోగం చేసుకుని జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 27,29న టీమిండియా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 3 టీ20లు, 3 వన్డేలు, 5 టెస్ట్‌లు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. A post shared by Rohit Sharma (@rohitsharma45) on Jun 20, 2018 at 2:39am PDT -
అర్జున్ ఎంపికపై గంగూలీ ఏమన్నాడంటే ?
ముంబై : క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. తనయుడి ఎంపికపట్ల ఇప్పటికే సచిన్ సంతోషం వ్యక్తం చేస్తూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కెరీర్లో తొలి మైలురైయిని అందుకున్న అర్జున్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘చాలా మంది అర్జున్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. నేను అయితే ఇప్పటి వరకు అతని ఆట చూడలేదు. అతను అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.’ గంగూలీ పేర్కొన్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో రెండు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అర్జున్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఈ టోర్నీలో తప్పక రాణించాల్సిందే. ఎందుకంటే అర్జున్ వచ్చే( 2020) అండర్-19 వరల్డ్‌కప్ ఆడలేడు. అప్పటికే అతని వయసు 19 ఏళ్లు దాటుతోంది. అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా సైతం అర్జున్ బాగా రాణిస్తాడని ఆకాంక్షించారు. పాకిస్తానే గెలిచింది.. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి సేన రాణిస్తోందని గంగూలీ జోస్యం చెప్పాడు. ‘ ఇంగ్లండ్ పర్యటనలో భారత్ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నా. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడానికి ఆడిన ఆట ఇక్కడ పునరావృతం అయితే భారత్ విజయం సులువు.’ అని అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో జూలై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్‌లు ఆడనుంది. ఇటీవల పాక్‌తో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో ఓడి తరువాత సిరీస్ సమం చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తానే గెలిచింది.. అలాంటప్పుడు భారత్ సులువుగా సీరీస్ గెలుస్తోంది. పాక్ కన్నా భారత్‌కు చాలా అవకాశాలున్నాయి.’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. -
పాక్ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్
లండన్: పాకిస్థాన్ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది. స్మార్ట్ వాచ్‌లతో మైదానంలోకి అడుగుపెట్టకూడదని తెలిపింది. స్మార్ట్ వాచ్‌లతో ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్కారం ఉండటంతో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేసర్ హసన్ అలీ మీడియాకు తెలియజేశాడు. ప్రస్తుతం పాక్ జట్టు ఇంగ్లాండ్ టూర్లో ఉంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో తొలిటెస్ట్ ప్రారంభమైంది కూడా. అయితే ఆట ముగిశాక ఐసీసీ నుంచి పాక్ టీమ్‌కు ఆదేశాలు అందాయి. పాక్ టీమ్ లోని ఇద్దరు ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లతో మైదానంలో కనిపించారని, అది నిబంధనలకు విరుద్ధమని, ఇక నుంచైనా వాటిని వాడొద్దంటూ తెలిపింది. అయితే ఆ ఆటగాళ్ల ఎవరన్నది మాత్రం ఐసీసీ వెలువరించలేదు. మరోపక్క ఐసీసీ తన అఫీషియల్ ట్విటర్లో స్మార్ట్ వాచ్‌ల వాడకంపై ఉన్న నిషేధాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేసింది. ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉండటంతో ఎలక్ట్రానిక్(కమ్యూనికేషన్‌కు సంబంధించి) డివైజ్‌లను సాధారణంగా మైదానంలోకి అనుమతించరు. గతంలో (2010) పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడటం, పాక్ జట్టు నిషేధం విధించటం, జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. The ICC has confirmed that smart watches are not allowed on the field of play or areas designated as the Player and Match Officials Area (PMOA).https://t.co/MAv4mRNAqv pic.twitter.com/tYgDi1LJwn — ICC (@ICC) 25 May 2018 -
రహానేను కాదని రాయుడినా?
ఇంగ్లండ్ పర్యటనకు అజింక్య రహానేను కాదని అంబటి రాయుడును వన్డే జట్టులోకి ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. స్వింగ్ పిచ్‌లపై అతని ఆటతీరు చక్కగా సరిపోతుందని అలాంటిది అతన్ని కాదని రాయుడు ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ అంశంపై గంగూలీ స్పందిస్తూ... ‘నేనైతే రాయుడు కంటే ముందు రహానేను తీసుకునేవాడిని. ఇంగ్లండ్ గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. అలాంటిది అతడిని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం కఠిన నిర్ణయమే’ అని తెలిపాడు. -
ప్లీజ్.. కోహ్లిని తిట్టొద్దు
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని తప్పుగా అర్థం చేసుకోవద్దని బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి అభిమానులను కోరారు. అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉండకుండా ఇంగ్లండ్ కౌంటీలకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల కోహ్లిపై విమర్శలు గుప్పించారు. చారిత్రాత్మకమైన అఫ్గాన్ టెస్టుకు కోహ్లి దూరం కావడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అమితాబ్ చౌదరి కోహ్లిని తిట్టవద్దని కోరారు. అఫ్గాన్ టెస్టుకు దూరం కావడంలో కోహ్లికి వేరే ఉద్దేశం లేదని, ఇంగ్లండ్ పరిస్థితులను తెలుసుకోవడం కోసమే అతను అక్కడికి వెళ్తున్నాడని స్పష్టం చేశాడు. దయచేసి అభిమానులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అఫ్గానిస్తాన్‌తో ఆడకూడదన్న ఉద్దేశం కోహ్లికి లేదు. ఇంగ్లండ్ గడ్డపై రాణించి అభిమానులను సంతృప్తిపరచాలనే అతను కౌంటీ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపాడు. ఇందులో భాగంగానే కొంతమంది ఆటగాళ్లు అక్కడికి ముందుగానే పంపించాం. టెస్టు క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టే ఇలా చేస్తున్నాం. పరమిత ఓవర్ల క్రికెట్ కోసం అయితే కాదు‘’ అని అమితాబ్ చౌదరి తెలిపారు. మరెందుకు ఓపెనర్లను కౌంటీ క్రికెట్ ఆడేందుకు పంపించలేదు అన్న ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ సమాధానమిచ్చారు. విరాట్‌కు మాత్రమే అవకాశం వచ్చిందని, ఇతరులకు వచ్చిందో రాలేదో తెలియదన్నారు. వారి కూడా అవకాశం వస్తే సంతోషంగా పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్లు!
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన ఈ సంఘటనతో ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు జట్టుకు దూరమయ్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఈ ఉదంతం క్రీడా స్పూర్తినే దెబ్బతీసింది. దీంతో అప్పటికప్పుడే స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్న సీఏ.. తాత్కలిక కెప్టెన్‌గా యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్‌ను ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ జట్టు కోసం వన్డేలకు టీమ్ పెయిన్, టీ20లకు ఆరోన్ ఫించ్‌ను కెప్టెన్లుగా నియమించింది. మంగళవారం ఇంగ్లండ్‌లో పర్యటించే 15 మంది సభ్యులతో కూడిన టీ20, వన్డే జట్టులను ప్రకటించింది. నాథన్ లియోన్, షాన్ మార్ష్‌లు తుదిజట్టులో స్థానం దక్కించుకోగా స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌లిన్ చోటు కోల్పోయాడు. వన్డేల్లో ఫించ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20ల్లో టీమ్ పెయిన్‌కు స్థానం లేకపోవడం గమనార్హం. ఆసీస్ ఇంగ్లండ్‌తో 5 వన్డేలులతో పాటు జింబాంబ్వే, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో ఆడనుంది. వన్డే జట్టు: టీమ్ పెయిన్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్ (వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, అలెక్స్ కారే, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, బిల్లీ స్టాన్లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, నాథన్ లియోన్, అస్థోన్ అగర్ టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కారే(వైస్ కెప్టెన్), డీఆర్సీ షార్ట్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మాక్స్వెల్, నిక్ మాడిసన్, మిచెల్ స్వెప్సన్, జాక్ విల్డేర్ ముథ్, మార్కస్ స్టోయినిస్, బిల్లీస్టేన్లేక్, ఆండ్రూ టై, కేన్ రిచర్డ్సన్, జేయ్ రిచర్డ్సన్, అస్థోన్ అగర్ -
కోహ్లికి బాగా కలిసొచ్చే అంశం
పుణే: కౌంటీ క్రికెట్ ఆడాలన్న విరాట్ కోహ్లి నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సమర్థించారు. ఇంగ్లాండ్ టూర్ కంటే ముందుగా ఇంగ్లీష్ మైదానాలపై ఆడటం కోహ్లికి బాగా కలిసొచ్చే అంశమని ఆయన అంటున్నారు. ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘యూకే డొమెస్టిక్ ఫార్మట్‌లో ఆడటం గొప్ప అవకాశం. కౌంటీ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందుగానే కోహ్లి ఆ ఫార్మట్‌లో ఆడితే అది బాగా కలిసొచ్చే అంశం. ఆ అనుభవం టీమిండియాకు బాగా పనికి వస్తుంది’ అని కిర్‌స్టెన్ చెప్పారు. గత ఇంగ్లాండ్ టూర్(2014)లో కోహ్లి పేలవమైన ఫామ్‌తో విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగబోయే కౌంటీ మ్యాచ్‌ల్లో భాగంగా సర్రే టీమ్ తరపున కోహ్లి బరిలోకి దిగనున్నాడు. జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఈ నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించినా.. కోహ్లి మాత్రం ‘ఎప్పటి నుంచో ఆడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కొరిక తీరబోతుంది’ అని తేలికగా కొట్టిపడేశాడు. కౌంటీ మ్యాచ్‌ల కారణంగా బెంగళూరులో అఫ్గానిస్తాన్(అరంగేట్రం)తో భారత్ ఆడబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి దూరం కానున్న విషయం తెలిసిందే. జూన్ చివరి వారం నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మే 8న జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించనుంది. -
ప్రిపరేషన్ ఎంతో అవసరం: రహానే
సాక్షి, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ పర్యటనకు ప్రిపరేషన్, మంచి ప్రారంభం ఎంతో అవసరమని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో రహానే మాట్లాడుతూ.. ‘ ప్రతి పర్యటనకు ముందు ప్రిపరేషన్ ఎంతో అవసరం. గత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లో మేం అలానే విజయాలందుకున్నాం. సిరీస్ ప్రారంభం అద్భుతంగా ఉంటే విజయాలు సులువుగా సొంతమవుతాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. 60 వికెట్లు పడగొట్టడం ఆశామాషి వ్యవహారం కాదు. పేసర్లు, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో మాలో పట్టుదల పెరిగిందని’ రహానే చెప్పుకొచ్చాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన రహానే చివరి టెస్టుకు ఎంపికై భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. ‘జోహన్నస్ బర్గ్ పిచ్ చాలా ప్రమాదకరమైనది. కానీ ఈ అవకాశం నన్ను హీరోను చేసింది. నాకు తొలి రెండు టెస్టుల్లో అవకాశం రాలేదు. నేను నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టా. జోహన్నస్ బర్గ్‌లో ఎలా ఆడాలో గ్రహించి అదే చేశా. ఈ విజయంలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది.’ అని ఈ ముంబై ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఇక ఓవర్సీస్ పర్యటనలను చాలెంజింగ్‌గా తీసుకున్నామన్న రహానే.. స్వదేశ పిచ్‌లుగా భావించే అద్భుత ప్రదర్శన కనబర్చామన్నాడు. కుంబ్లే పరుగులు చేయమని డిమాండ్ చేసేవాడు.. మాజీ కెప్టెన్ గంగూలీ మాట్లాడుతూ.. ‘బౌలింగ్ ప్రదర్శనతోనే కోహ్లిసేన ఓవర్సీస్లో రాణిస్తోందన్నారు. భారత క్రికెట్ ఎప్పుడు బ్యాట్స్‌మన్‌పై ఆధారపడేది. బ్యాట్స్‌మన్ 400 పరుగులు చేస్తే బౌలర్లు 20 వికెట్లు పడగొట్టేవారు. కానీ తొలిసారి బ్యాట్స్‌మన్ పరుగులు చేయకున్నా బౌలర్లు రాణించారని చెప్పుకొచ్చారు. ఇక తన హయాంలో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయాలని, ఆ తర్వాత గెలుపు తను చూసుకుంటానని కుంబ్లే అనేవాడని గుర్తు చేసుకున్నారు. ఇక మహ్మద్ షమీ వ్యవహారంపై ప్రశ్నించగా.. గంగూలీ తిరస్కరించారు. అది అతని వ్యక్తిగత వ్యవహారమని, క్రికెట్ గురించి మాట్లడటమే మంచిదని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు. -
కోహ్లిని గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఒప్పుకోను
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ కానే కాదని.. ఒకవేళ అది నిరూపించుకోవాలంటే తన ముందున్న ఛాలెంజ్‌ను కోహ్లీ అధిగమించాలని హోల్డింగ్ సూచిస్తున్నారు. ‘‘మూడు ఫార్మట్లలో కోహ్లి అద్భుతమైన ఆటగాడని అంతా ప్రశంసిస్తుంటారు. కానీ, అది నిరూపించుకోవాలంటే ఇంగ్లాండ్ గడ్డపై అతను పరుగులు సాధించాల్సి ఉంటుంది. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. సెంచూరియన్‌లో 153 పరుగులు ఇన్నింగ్స్‌తో కోహ్లి ఆకట్టుకున్నాడు. అయితే గతంలో 2014 ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా కోహ్లి మొత్తంగా విఫలం అయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా అతను సాధించిన సగటు కేవలం కేవలం 13.4 మాత్రమే. ఇన్నేళ్లకు కోహ్లికి మళ్లీ అవకాశం దక్కింది. తానేంటో నిరూపించుకోవాలి’’ అని హోల్డింగ్ తెలిపారు. కోహ్లి మంచి ఆటగాడని మాత్రమే తానూ ఒప్పుకుంటానని.. ఇంగ్లాండ్ పై రాణిస్తే అతన్ని గొప్ప బ్యాట్సమన్‌గా అంగీకరిస్తానని హోల్డింగ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో ఒకవేళ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కు జాబితాను తయారు చేస్తే కోహ్లితోపాటు, జోయ్ రూట్, స్టీవ్ స్మిత్ పేర్లను తాను ప్రతిపాదిస్తానని ఈ 63 ఏళ్ల కరేబియన్ బౌలింగ్ దిగ్గజం చెబుతున్నారు. కాగా, జూలైలో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనున్న టీమిండియా జట్టు అక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మైకెల్ హోల్డింగ్ -
ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తన కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్చడానికి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం విదితమే. -
ఇంగ్లండ్ నుంచి వైఎస్ జగన్ రాక నేడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని గురువారం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌కు వస్తున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. తన కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్చడానికి వైఎస్ జగన్ ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. -
యువ తరంగం!
♦ భారత అండర్–19 జట్టులో భగత్ వర్మ ♦ నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ ఆఫ్ స్పిన్నర్ ♦ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ ఆటగాళ్ల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ ఈ ఏడాది హైదరాబాద్ క్రికెట్‌కు అంతా మంచే జరుగుతోంది. ఐపీఎల్–10 సీజన్లో విశేషంగా రాణించిన పేసర్ మొహమ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు వన్డే టోర్నీ, అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికవ్వగా... తాజాగా ఇంగ్లండ్‌లో పర్యటించే భారత అండర్–19 జట్టులో హైదరాబాద్‌కే చెందిన ఆఫ్ స్పిన్నర్ భగత్ వర్మకు స్థానం లభించింది. ఈ నెలలో ఇంగ్లండ్‌తో భారత్ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఏడాది కాలంగా జాతీయస్థాయిలో నిలకడగా రాణించిన ఫలితం ఎట్టకేలకు భగత్ వర్మకు దక్కింది. తనకు లభించిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని... వచ్చే ఏడాది జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ స్థానాన్ని సొంతం చేసుకుంటానని ‘సాక్షి’తో భగత్ వర్మ చెప్పాడు. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన భగత్ వర్మ అభిప్రాయాలు అతని మాటల్లోనే... సరదాగా మొదలుపెట్టి... ఐదేళ్ల వయసులో క్రికెట్లో అడుగుపెట్టాను. సికింద్రాబాద్‌లో ఇంటికి సమీపంలోని మహబూబ్ కాలేజీలో కోచ్ మొహమ్మద్ ఇక్బాల్ అకాడమీ ఉంది. సరదాగా అక్కడి వెళ్లిన సమయంలో క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి ఆయన వద్ద శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆయన వద్దే ప్రాక్టీస్ చేస్తున్నా. చిన్న తనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ ఉమ అన్నీ తానై నన్ను ముందుకు నడిపించారు. నేను ఈ స్థాయికి చేరుకోవడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. కోచ్ ఇక్బాల్ ప్రోత్సాహం మరవలేనిది. కీలక సమయంలో భారతి సిమెంట్స్ నుంచి స్పాన్సర్షిప్ లభించడంతో పూర్తి ఏకాగ్రతతో కెరీర్‌పై దృష్టి సారించాను. శ్రమకు తగ్గ ఫలితం... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే లీగ్స్‌లో మూడేళ్లుగా నేను ఆర్.దయానంద్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గత ఏడాది కూచ్ బెహర్ అండర్–19 ట్రోఫీ జాతీయ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసుకున్నాను. ఈ ప్రదర్శనే నాకు జాతీయ జట్టులో స్థానం లభించేందుకు దోహదపడింది. స్కూల్, జూనియర్ కాలేజీ స్థాయిలో సెయింట్ ఆండ్రూస్, సెయింట్ జాన్స్ జట్ల తరఫున ఆడాను. ఈ సందర్భంగా హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్ ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. భారత అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో శిక్షణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. క్రికెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన ఆటను అభిమానించాను. ఈ ఏడాది హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ లీగ్స్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాను. పది వికెట్లు తీయడంతోపాటు ఒక అర్ధ సెంచరీ చేశాను. అవకాశం వదులుకోను... స్వతహాగా నేను ఆఫ్ స్పిన్నర్‌ను. బ్యాటింగ్ కూడా బాగా చేయగలను. ఇంగ్లండ్ పర్యటనలో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ తరఫున నాకు తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. దొరికిన అవకాశాన్ని వృథా కానివ్వను. నా ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు కృషి చేస్తాను. నా తదుపరి లక్ష్యం వచ్చే ఏడాది జనవరి–ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఎంపికవ్వడం. ఇక భారత సీనియర్ జట్టుకు ఆడటం నా జీవితాశయం. -
ఆ కెప్టెన్ ఇప్పట్లో వీడ్కోలు పలకడు
'పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్ మరికొద్ది నెలల్లో రిటైర్ పోతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, మిస్బా నుంచి ఇంకా ఎంతో ఆశించవచ్చు' అని చీఫ్ సెలెక్టర్, వెటరన్ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో అతడి శతకం అనిర్వచనీయమంటూ ప్రశంసించాడు. అతడికి వయసు అనేది అడ్డంకి కాదని, పాక్ క్రికెట్ కు అతడు ఎంతో కాలం సేవలు అందిస్తాడని పాక్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడైన మిస్బాకు మద్ధతు తెలిపాడు. మిస్టా కెప్టెన్సీలో పాక్ 20 టెస్టు విజయాలు సొంతం చేసుకుంది. ఈ వయసులో కూడా అతడి ఫిట్ నెస్ చూస్తే తనకు చాలా ఆశ్చర్యమేస్తుందన్నాడు. బ్యాట్స్ మన్‌గా, కెప్టెన్‌గానూ జట్టుకు అతడి సేవలు మరింత కాలం అందించాలని సూచించాడు. లార్డ్స్ టెస్టులో ఘనవిజయం సాధించిన పాక్, ఓల్డ్ ట్రాపోర్డ్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనా.. మిస్టా కెప్టెన్సీలో జట్టు కోలుకుని సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తుందని అభిప్రాయపడ్డాడు. -
జూనియర్ హాకీ జట్టు శుభారంభం
మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్ పర్యటనలో భారత జూనియర్ హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఇక్కడి బిషమ్ అబే స్పోర్ట్స్ సెంటర్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో స్కాట్లాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున నీలకంఠ, సిమ్రన్‌జీత్ గోల్స్ చేయగా... విలియం మార్షల్ స్కాట్లాండ్కు ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ యాసిర్ షా..
టెస్టుల్లో పాక్ బౌలర్ కు నం.1 ర్యాంకు దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లతో చెలరేగిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. యాసిర్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టులో పాక్ 75 పరుగులతో నెగ్గిన విషయం తెలిసిందే. 1996లో ముస్తాక్ అహ్మద్ తర్వాత టెస్టుల్లో నం.1 ర్యాంక్ సాధించిన పాక్ బౌలర్‌గా యాసిర్ నిలిచాడు. అయితే ముస్తాక్ కూడా లెగ్ స్పిన్నర్ కావడం విశేషం. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 2005లో టాప్ ర్యాంకులో నిలవగా, ఆ తర్వాత యాసిర్ తప్ప మరో లెగ్ స్పిన్నర్ నెం.1 ర్యాంకు సాధించలేదు. ఇప్పటివరకూ టాప్ ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో అతడు మూడోస్థానానికి పడిపోగా, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2వ, ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ 4వ స్థానాల్లో నిలిచారు. -
నగరానికి వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: పది రోజుల ఇంగ్లండ్ పర్యటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. -
టర్కీ బయల్దేరిన ప్రధాని మోదీ
లండన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్ పర్యటన ముగించుకుని టర్కీ బయల్దేరారు. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే 20 సదస్సులో ఆయన పాల్గొంటారు. రెండు దేశాలతో ధ్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం చర్చలు జరుపనున్నట్టు సమాచారం. కాగా బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తో లంచ్, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇక మూడోరోజు మోదీ జాగ్వర్ లాండ్రోవర్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఆయన టర్కీకి బయల్దేరారు. ఈ నెల 16వ తేదీ వరకూ మోదీ విదేశీ పర్యటన కొనసాగనుంది. -
లండన్‌లో వర్థిల్లిన 'భారతీయం'
-
వచ్చే ఏడాదే అతడి రిటైర్మెంట్!
కరాచీ: రిటైర్మెంట్ అంశంపై కొన్ని రోజులవరకు ఏ నిర్ణయం తీసుకోవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను కోరింది. వచ్చే ఏడాది వరకూ ఆటను కొనసాగించాలని బోర్డు మిస్బాను సంప్రదించింది. ఇంగ్లండ్‌తో సిరీస్ జరిగే వరకు వీడ్కోలు విషయంపై ఎటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవద్దని పేర్కొంది. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ ముగిశాక తన రిటైర్మెంట్ విషయాన్ని బోర్డుకు వెల్లడిస్తాడని మిస్బా చెప్పాడు. ఒకవేళ వీడ్కోలు పలకాలని మిస్బా భావించినట్లయితే, మరో ఏడాదిపాటు ఆటను కొనసాగించాలని అతడిని కోరతామన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో కెప్టెన్, సీనియర్ ప్లేయర్‌గా మిస్బా జట్టులో ఉండటం మాకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతవారం దుబాయ్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్ గెలిచిన అనంతరం తన రిటైర్మెంట్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. 2010లో పాక్ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లతో సిరీస్‌లు జరగలేదని, వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో టెస్ట్ సిరీస్‌లు ముగిశాక మిస్బా రిటైర్మెంట్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని షహర్యార్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆసీస్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు మిస్బా గుడ్ బై చెప్పిన విషయం విదితమే. -
విజయంతో ముగించిన ఆసీస్
మాంచెస్టర్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు ఆస్ట్రేలియా ఘన విజయంతో వీడ్కోలు పలికింది. చివరిదైన ఐదో వన్డేలో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది. ముందుగా ఇంగ్లండ్ 33 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. స్టోక్స్ (42), రషీద్ (35 నాటౌట్) కొంత వరకు పోరాడారు. మిషెల్ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఫించ్ (70 నాటౌట్) రాణించాడు. మిషెల్ మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. -
అశ్విన్‌కు ‘అర్జున’ అవార్డు అందజేత
న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును శుక్రవారం అందజేశారు. క్రికెటర్ గతేడాది ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. అయితే ఇంగ్లండ్ పర్యటన కారణంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి అశ్విన్ హాజరుకాలేకపోయాడు. దీంతో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా అతను పురస్కారాన్ని స్వీకరించాడు. అవార్డును సాధించినందుకు చాలా గర్వంగా ఉందని స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ‘క్రికెట్‌తో నా ప్రయాణం ఆనందంగా సాగుతోంది. ఓ రకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేశానికి ఆడటం నాకు లభించిన అతి పెద్ద డిగ్రీ. మరింత మెరుగ్గా దేశానికి సేవలందిస్తూ ఎన్నో అవార్డులను సాధించాలని కోరుకుంటున్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు. -
ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదం: పల్లె
తన ఇంగ్లండ్ పర్యటనపై మంత్రి పల్లె సాక్షి, హైదరాబాద్: తన ఇంగ్లండ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న మంత్రి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పర్యటనలో.. వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు, ఇండో-బ్రిటన్ బంధం, అవినీతిపై చర్యలు, అక్కడి పార్లమెంటు, అసెంబ్లీల పనితీరుపై అధ్యయనం చేసినట్లు మంత్రి వివరించారు. 16 ఐటీ, ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. విజయవాడ, తిరుపతి, అనంతపురం, గుంటూరులలో ఐటీ రంగం అభివృద్ధికి ఈ కంపెనీలన్నీ కృషి చేస్తాయన్నారు. -
వర్కింగ్ కమిటీలో నివేదికలు!
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి భారత జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వేర్వేరు నివేదికలు ఇవ్వనున్నారు. బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో వీటిపై చర్చిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు సభ్యులు నివేదికలు పూర్తిగా చదివిన అనంతరం తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 26న ఈ సమావేశం జరగనుంది. టూర్ తొలి భాగంలో కోచ్‌గా ఫ్లెచర్ పూర్తి బాధ్యతలు నెరవేర్చగా, వన్డే సిరీస్ నుంచి శాస్త్రి కూడా జట్టుతో కలిశారు. 11న ఆర్సీఏ కేసు విచారణ బీసీసీఐ, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై ఈ నెల 11న జైపూర్ జిల్లా కోర్టులో మరోసారి వాదనలు జరగనున్నాయి. లలిత్ మోడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆర్సీఏ కోర్టును ఆశ్రయించగా... ఆగస్టు 11న దీనిపై కోర్టులో విచారణ కూడా జరిగింది. -
సిరీస్ మధ్యలో మార్పులెందుకు?
రాహుల్ ద్రవిడ్ ప్రశ్న న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన పూర్తిగా ముగియక ముందే సహాయక సిబ్బందిని మార్చడంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్పులు చేయాల్సిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ప్రొఫెషనల్ క్రీడలో మార్పులు సహజం. దానిని ఎవరూ తప్పుపట్టరు. అయితే కొత్త సహాయక బృందం ఈ సిరీస్ వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేదానిపై స్పష్టత లేదు. సాధారణంగా సహాయక సిబ్బందితో కూడా ఆటగాళ్లకు అనుబంధం ఏర్పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల విజయం, వైఫల్యంపై కూడా వారి ప్రభావం ఉంటుంది. కాబట్టి సిరీస్ మధ్యలో మార్చితే అనవసరపు సందిగ్ధత ఏర్పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రవిశాస్త్రి చక్కదిద్దగలడని విశ్వాసం వ్యక్తం చేసిన ద్రవిడ్...‘కొత్త వాతావరణం’లో ఇమడగలడా లేదా అనేది ఫ్లెచర్ స్వయంగా తేల్చుకోవాలని సూచించారు. -
గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంటి దగ్గరే వదిలేయండి!
బీసీసీఐ ఆటగాళ్లకు షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి విదేశీ పర్యటనలకు ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను తీసుకు వెళ్లేందుకు బీసీసీఐ నో చెప్పనుంది. క్రికెటర్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంటికే పరిమితం చేయాలని నిర్ణయించింది. అలాగే ఆటగాళ్లు తమ భార్యలను తమతోపాటు తీసుకువెళ్లే విషయంలో ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనలకు భారత క్రికెటర్లతో పాటు వారి భార్యలు వెళ్లడం తక్కువ. అయితే ఈసారి ఇంగ్లాండ్‌లో రెండు నెలల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో క్రికెటర్లలో చాలామంది తమ వెంట భార్యలనూ తీసుకెళ్లారు. పనిలో పనిగా విరాట్ కోహ్లీ తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మను తీసుకు వెళ్లాడు. విషయానికి వస్తే ఇంగ్లండ్ సిరీసీలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి బీసీసీఐ కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బీసీసీఐ నియమ నిబంధనల ప్రకారం విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు... క్రికెటర్లతో పాటు కేవలం వారి భార్యలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇక పెళ్లికాని క్రికెటర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్‌ను విదేశీ టూర్లకు తీసుకువెళ్లడం బీసీసీఐ నియమావళికి విరుద్ధం. క్లోహీ అడగటమే ఆలస్యం బీసీసీఐ ఏమాత్రం ఆలోచించకుండా అనుష్కను తీసుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో ఇంగ్లండ్ టూర్లో కోహ్లి...అనుష్కశర్మతో ప్రేమ కలాపాల్లో మునిగిపోయి... ఆటను పక్కన పెట్టాడని విమర్శులు వచ్చాయి. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చాడు. దాంతో తీరిగ్గా నాలుక కరుచుకున్న బీసీసీఐ ఈసారి నుంచి టెస్ట్ మ్యాచ్‌లకు ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంటి వద్దే వదిలి రావాలని సూచించనుంది. అయితే ఈ నిబంధన ఎప్పటివరకూ కొనసాగించాలనేది బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వెళ్లిన పని మరచి... ఎంజాయ్ చేస్తున్న ఆటగాళ్లను దారిలో పెట్టేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వర్కవుట్ అవుతుందేమో చూడాలి. -
కెప్టెన్సీకి ధోని గుడ్ బై?
లండన్: ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహించి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా అనే ప్రశ్నలు మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టు 1-3 తేడాతో ఘోర పరాజయం పొందిన తర్వాత ధోని కెప్టెన్సీపై అనేక సందేహాల్ని క్రికెటర్లు, భారత క్రికెట్ అభిమానులు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే ధోని కూడా కెప్టెన్సీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ పదవిని వదులుకుంటున్నారా అనే ప్రశ్నకు వేచి చూడండి అనే సమాధానాన్ని ధోని నోటి వెంట వచ్చింది. వరుసగా ఐదు ఇన్నింగ్స్ ల్లో భారత బ్యాట్స్ మెన్ లు ఘోరంగా విఫలమవ్వడంపై ధోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
సేనానాయకేపై నిషేధం
కొలంబో: వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేపై ఐసీసీ నిషేధం విధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మేలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో సేనానాయకే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ శైలిని ప్రదర్శించాడని రుజువైంది. ఈమేరకు ఐసీసీ బౌలింగ్ యాక్షన్ లీగల్టీ అసెస్మెంట్ నివేదిక లంక బోర్డుకు అందింది. 29 ఏళ్ల సేనానాయకే ఒక టెస్టు, 37 వన్డేలు, 17 టి20లు ఆడాడు. ఓవరాల్‌గా 58 వికెట్లు తీశాడు. -
విజయంపైనే దృష్టి పెట్టాం: ధోని
-
లంకను గెలిపించిన పెరీరా
ఇంగ్లండ్‌తో ఏకైక టి20 లండన్: ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో తిషార పెరీరా ఆల్‌రౌండ్ షో (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు; 1/24) కనబరచడంతో ఇంగ్లండ్‌పై లంక 9 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆరంభంలో వితనగే (26 బంతుల్లో 38; 7 ఫోర్లు), తిరిమన్నె (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించగా, చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా చెలరేగడంతో భారీస్కోరు నమోదైంది. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు తోడు బట్లర్ (26), బొపార (28 నాటౌట్)లు పోరాడినా.. లంక బౌలింగ్‌కు తలవంచారు. సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక: 20 ఓవర్లలో 183/7 (తిసార పెరీరా 49, తిరిమన్నె 40; గర్నీ 2/26); ఇంగ్లండ్: 20 ఓవర్లలో 174/7 (హేల్స్ 66, బొపార 28 నాటౌట్; మలింగ 3/28). -
పేస్ ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తా: పుజారా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ పెద్దగా రాణించలేకపోతున్న చతేశ్వర్ పుజారా అప్పుడే ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి సారించాడు. జులైలో మొదలయ్యే ఈ సిరీస్‌లో అక్కడి పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రాణించేందుకు రాజ్‌కోట్‌లోని సీమింగ్ ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తానని పుజారా చెప్పాడు. ‘ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులను మనం ఇక్కడ సృష్టించలేం. అయితే ఐపీఎల్ ముగిశాక రాజ్‌కోట్ స్టేడియంలోని ట్రాక్‌ను దీనికి తగ్గట్టుగా మలుచుకుని ప్రాక్టీస్ చేస్తాను. అయితే ఇప్పటి నుంచే ఆ సిరీస్‌పై ఒత్తిడి పెంచుకోవడం అనవసరం. లీగ్ ముగిశాకే దృష్టి పెడతాను. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆడడమనేది ప్రతీ క్రికెటర్ కల. అయితే నేను ఆ జట్టులో ఉంటానా? లేదా? అనేది చెప్పలేను. బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మెరుగ్గా రాణించగలననే నమ్మకం ఉంది’ అని పుజారా తెలిపాడు. -
మనకూ ఉన్నారు!
భారత క్రికెట్‌కు పేస్ విభాగం ఎప్పుడూ సమస్యే. ఇటీవల కాలంలో వస్తూ పోతున్న బౌలర్లతో ఈ విభాగంలో నిలకడలేమి ధోనికి పెద్ద సమస్యగా మారింది. అయితే కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ సీజన్ ఐపీఎల్ భారత కెప్టెన్‌కు కాస్త ఊరటనిచ్చింది. ఏకంగా నలుగురు భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటం ఇంగ్లండ్ పర్యటనకు ముందు స్థైర్యాన్ని పెంచనుంది. సాక్షి క్రీడా విభాగం సాధారణంగా ఐపీఎల్లో ప్రతిసారీ విదేశీ బౌలర్లదే హవా. ముఖ్యంగా పేసర్ల విషయంలో భారత క్రికెటర్లు వికెట్ల జాబితాలో ఎక్కడో ఉండేవారు. కానీ ఈసారి సీన్ మారింది. వికెట్ల జాబితాలో టాప్-10లో ఏకంగా నలుగురు పేసర్లు ఉన్నారు. వీరిలో భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ తమ స్వింగ్‌తో సంచలన ఫలితాలు సాధిస్తుంటే... మోహిత్ శర్మ కొత్తగా ‘స్లో’ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను అయోమయంలోకి నెడుతున్నాడు. ఇక భారత్‌లో ప్రస్తుతం ఉన్న పేసర్లలో నిలకడగా గంటకు 140కి.మీ.తో బంతులు వేయగల బౌలర్ వరుణ్ ఆరోన్. తను కూడా ఈ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా ఇది భారత క్రికెట్లో ఉత్సాహాన్ని పెంచే అంశం. ఈ సీజన్లో ఈ నలుగురు బౌలర్ల ప్రదర్శనను గమనిస్తే... భువనేశ్వర్ కుమార్ భారత పేసర్ల గురించి చర్చ వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గురించే. ఈ సీజన్లో తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. రెండేళ్ల కిందట భారత జట్టులో చోటు సంపాదించిన భువనేశ్వర్ కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తూ ఫలితాలు రాబట్టాడు. అయితే డెత్ ఓవర్లలో మాత్రం చాలా బలహీనం. కానీ ఈ యూపీ బౌలర్ లోపాలను సరిదిద్దుకుని చక్కగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్ లెంగ్త్ బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తున్నాడు. ఐపీఎల్లో కీలకమైన సమయాల్లో వికెట్లు పడగొడుతూ హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు విజయాలు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఏడో సీజన్లో ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు. అహ్మదాబాద్‌లో రాజస్థాన్‌పై (4 వికెట్లు), షార్జాలో పంజాబ్‌పై (3 వికెట్లు) రాణించాడు. కొత్త బంతితో తన బలం స్వింగ్‌ను ఉపయోగించి అద్భుతాలు చేస్తున్న భువీ... డెత్ ఓవర్లలో మెరుగైన బంతులు వేస్తుండటం ఈ ఐపీఎల్ ద్వారా తనకు జరిగిన పెద్ద మేలు. మోహిత్ శర్మ ఐపీఎల్లో భారత క్రికెటర్లలో భువనేశ్వర్ తర్వాత ఆ స్థాయిలో బౌలింగ్ చేస్తున్న బౌలర్ మోహిత్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ గత ఏడాదీ ఐపీఎల్లో బరిలోకి దిగాడు. 2013లో 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. పరుగుల హోరులో ఎవరూ అతని ప్రతిభను గుర్తించలేదు. ఈ సీజన్ ఆరంభంలో మోహిత్ గురించి పెద్దగా తెలియకపోయినా... అద్భుత బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. అతను వేసే బంతుల్లో వేగం లేకపోయినా.. బ్యాట్స్‌మెన్‌ను చక్కటి బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నాడు. బెన్ హిల్ఫెనాస్ లాంటి బౌలర్ జట్టులో ఉన్నా.. ప్రధాన బౌలర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. స్లో బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు. సీజన్లో కెవిన్ పీటర్సన్, ఆరోన్ ఫించ్, కీరన్ పొలార్డ్ లాంటి హిట్టర్లను సైతం బోల్తా కొట్టించాడు. ఇక మోహిత్ డెత్ ఓవర్లలోనూ స్లో బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ 18 వికెట్లు తీశాడు. మోహిత్ ఇదే నిలకడైన బౌలింగ్ ప్రదర్శనను కొనసాగిస్తే కీలక బౌలర్‌గా ఎదిగే అవకాశాలున్నాయి. సందీప్ శర్మ ఐపీఎల్ ఏడో సీజన్లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన బౌలర్ సందీప్ శర్మ. ఓ వైపు పంజాబ్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లతో అదరగొడుతుంటే... 20 ఏళ్ల సందీప్ ఐపీఎల్లో తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జోరుకు బ్రేకులు వేస్తున్నాడు. 2010, 2012 అండర్-19 ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సందీప్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా పంజాబ్ తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. స్వింగ్‌తో బెంబేలెత్తిస్తున్న ఈ యువ బౌలర్ వేగంపైనా దృష్టి పెట్టాడు. గత ఏడాది 125 కి.మీ వేగంతో బంతులు విసిరిన సందీప్ శర్మ ప్రస్తుతం నిలకడగా 130 కి.మీ. వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో భువనేశ్వర్ ఉన్నందున సందీప్‌కు వెంటనే అవకాశం రాకపోచ్చు. అయితే ఒక ప్రత్యామ్నాయం మాత్రం దొరికింది. వరుణ్ ఆరోన్ భారత స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ ఐపీఎల్ ఏడో సీజన్లో సత్తా చాటుతున్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలో ఉన్న 24 ఏళ్ల ఆరోన్ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. కొన్నాళ్లుగా గాయాలతో సహవాసం చేసిన ఆరోన్ నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. త్వరలో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఆరోన్ ప్రదర్శన భారత బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చే అవకాశం ఉంది. అయితే తరచూ గాయాలబారిన పడటం తనకున్న పెద్ద సమస్య. ఇదే తన కెరీర్‌కు పెద్ద ప్రతిబంధకం. పూర్తి ఫిట్నెస్తో ఉంటే ఆరోన్ భారత్‌కు ప్రధాన బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉంది.