లంకను గెలిపించిన పెరీరా | Thisara, Malinga script Sri Lanka win | Sakshi
Sakshi News home page

లంకను గెలిపించిన పెరీరా

Published Thu, May 22 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

లంకను గెలిపించిన పెరీరా

లంకను గెలిపించిన పెరీరా

ఇంగ్లండ్‌తో ఏకైక టి20
 లండన్: ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో తిషార పెరీరా ఆల్‌రౌండ్ షో (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు; 1/24) కనబరచడంతో ఇంగ్లండ్‌పై లంక 9 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
 
 ఆరంభంలో వితనగే (26 బంతుల్లో 38; 7 ఫోర్లు), తిరిమన్నె (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించగా, చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా చెలరేగడంతో భారీస్కోరు నమోదైంది. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు తోడు బట్లర్ (26), బొపార (28 నాటౌట్)లు పోరాడినా.. లంక బౌలింగ్‌కు తలవంచారు.
 
 సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక: 20 ఓవర్లలో 183/7 (తిసార పెరీరా 49, తిరిమన్నె 40; గర్నీ 2/26); ఇంగ్లండ్: 20 ఓవర్లలో 174/7 (హేల్స్ 66, బొపార 28 నాటౌట్; మలింగ 3/28).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement