T20 match
-
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
#INDvsSA : తొలి టి20లో భారత్ ఘన విజయం...సెంచరీతో చెలరేగిన సామ్సన్ (ఫొటోలు)
-
Asia T20 Cup: సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో ఎంట్రీ
వర్దమాన టీ20 క్రికెట్ జట్ల ఆసియా కప్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అల్ అమెరత్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక-‘ఎ’ జట్టు పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ అర్ధ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు.Omair Yousuf sits back and brings out the reverse sweep 6️⃣@TheRealPCB#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/PTyFhDF7OJ— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024దుషాన్ హేమంత తిప్పేశాడుఅయితే, యూసఫ్నకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లంక బౌలర్లను ఎదుర్కోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్ బ్యాటర్ కెప్టెన్ మహ్మద్ హ్యారిస్(6) పూర్తిగా విఫలం కాగా.. తర్వాతి స్థానాల్లో వచ్చిన కాసిం అక్రం(0), హైదర్ అలీ(14), అరాఫత్ మిన్హాస్(10), అబ్దుల్ సమద్(0), అబ్బాస్ ఆఫ్రిది(9), మహ్మద్ ఇమ్రాన్(13), సూఫియాన్ ముఖీం(4 నాటౌట్), షానవాజ్ దహానీ(0- నాటౌట్) చేతులెత్తేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ దుషాన్ హేమంత అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్లు నిపుణ్ రన్సిక, ఇషాన్ మలింగ రెండేసి వికెట్లు కూల్చారు.అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశోద లంక (11- అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్) తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వచ్చినా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదర 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ నువానిడు ఫెర్నాండో(9) విఫలం కాగా.. సహాన్ అరాచ్చిగె(16 బంతుల్లో 17)ఫోర్ బాది లంకను విజయతీరాలకు చేర్చాడు.ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోఈ క్రమంలో 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో సెమీ ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత-‘ఎ’ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో శ్రీలంక టైటిల్ కోసం ఆదివారం(అక్టోబరు 27) తలపడుతుంది.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.ఫలితంగా గ్రూప్ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్ సివర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు), డానీ వ్యాట్ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన కెప్టెన్దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ వోల్వార్ట్ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్వార్ట్, తజ్మీన్ బ్రిట్స్ (19 బంతుల్లో 13; 1 ఫోర్)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్ బాష్ (26 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్నవోల్వార్ట్ను ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కెప్టెన్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్ చివర్లో డెర్క్సెన్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.కీలక భాగస్వామ్యం... షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరిగినా... వ్యాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్ గెలుపు గీత దాటింది. విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్ వెనుదిరగ్గా... బ్రంట్ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్ తలపడుతుంది. ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువేదిక- షార్జాటాస్- సౌతాఫ్రికా.. బ్యాటింగ్సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)ఇంగ్లండ్ స్కోరు: 125/3 (19.2)ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్‌లు అందుకున్నారు. వైజాగ్‌కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్లో తన ఎక్స్‌ప్రెస్ బౌలింగ్‌తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఆసీస్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఫ్రెజర్ మెక్‌గర్క్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ ఇంగ్లిష్(42), హెడ్(31), మాథ్యూ షార్ట్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్, రషీద్ చెరో వికెట్ సాధించారు.లివింగ్ స్టోన్ ఊచకోత..అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు.అతడితో పాటు జాకబ్ బితల్(24 బంతుల్లో 44), కెప్టెన్ సాల్ట్(23 బంతుల్లో 39) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ మాథ్యూ షార్ట్ 5 వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. అతడితో పాటు అబాట్ రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లైమ్ లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 15న జరగనుంది.చదవండి: టీమిండియా ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్: గంభీర్, దాదాకు దక్కని చోటు -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్‌పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
‘క్లీన్‌స్వీప్’పై భారత్ గురి
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్‌కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్... ఈ సిరీస్ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్‌లే ఉండటంతో పొట్టి ఫార్మాట్లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్‌ను బాగా సది్వనియోగం చేసుకోవాలి. కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం, బౌలింగ్ పదునెక్కడంతో భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్ దృష్ట్యా అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్‌రౌండ్ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది. దూబేను ఆపతరమా... ఈ సిరీస్‌లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్లో భర్తీ చేయదగ్గ బ్యాటర్లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్‌కు బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్‌తో అర్‡్షదీప్, ముకేశ్ కుమార్... స్పిన్‌తో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
'సూర్య' ప్రతాపం.. టీ20 కింగ్ (ఫోటోలు)
-
INDvsSA : మూడో T20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
సమరానికి సై...
ముంబై: భారత పురుషుల జట్టు ఇటీవల పొట్టి ఫార్మాట్లో ఆ్రస్టేలియాపై అదరగొట్టింది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా అలాంటి ప్రదర్శనే ఇచ్చేందుకు ఇంగ్లండ్‌తో టి20 సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి వాంఖెడె స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ ఏడాది హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ప్రత్యేకించి టి20 ఫార్మాట్లో రాణించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సహా... బంగ్లాదేశ్ గడ్డపై 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సఫారీ గడ్డపై జరిగిన ముక్కోణపు టి20 సిరీస్‌లోనూ భారత మహిళల జట్టు మెరుగ్గా రాణించి ఫైనల్లో రన్నరప్‌గా సంతృప్తి పడింది. అక్కడే జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరాయి. కానీ ప్రత్యర్థుల చేతిలో ఇరు జట్లు ఓటమి చవిచూశాయి. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్‌తో పేలవమైన గత రికార్డును మరిచేలా చక్కని ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టి20 ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొమ్మిది టి20 మ్యాచ్‌లాడితే కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. మరోవైపు రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ జట్టు 1–2తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ అనుకూలతలను వినియోగించుకొని ఫామ్‌లో ఉన్న హర్మన్ బృందం ఈ సిరీస్‌లో గట్టి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. పురుషులతో పోల్చితే పరిమిత సంఖ్యలో జరిగే మ్యాచ్‌లతో అమ్మాయిల జట్టు... వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌కు మేటి జట్టుగా బరిలోకి దిగాలని ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన, టాపార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్లో హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. పిచ్, వాతావరణం వాంఖెడె వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. తూర్పు తీరాన్ని తుఫాను వణికిస్తున్నా... ముంబైలో ఆ బెడద లేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచితంగా మైదానంలోకి అనుమతి ఇస్తున్నారు. 27 ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 27 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 7 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్‌లో ఈ రెండు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో టీమిండియా, 7 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. -
విజయంతో ముగించేందుకు
బెంగళూరు: భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ ఆఖరి మజిలీకి చేరింది. మరో గెలుపుతో సిరీస్ ఆధిక్యాన్ని 4–1కు చేర్చుకోవాలిన టీమిండియా చూస్తుంటే... సిరీస్ ఎలాగూ చేజారింది కాబట్టి విజయంతోనైనా ముగింపు పలికి తిరుగుముఖం పట్టాలని కంగారూ సేన భావిస్తోంది. అయితే జట్ల బలాబలాల విషయానికొస్తే మాత్రం సూర్యకుమార్ సేనే పటిష్టంగా కనిపిస్తోంది. సిరీస్ ఇదివరకే సాధించడం, బౌలర్లు ఫామ్‌లోకి రావడం ఆతిథ్య భారత్‌ను దుర్బేధ్యంగా మార్చింది. వన్డే ప్రపంచకప్ సాధించిన ఆసీస్ జట్టు సభ్యుల్లో ఒక్క ట్రవిస్ హెడ్ తప్ప మిగిలిన 10 మంది ఆటగాళ్లంతా కొత్తవారే కావడం, నిలకడ లోపించడం కంగారూను మరింత కలవరపెడుతోన్న అంశం. బౌలింగ్ బలగం గత నాలుగు మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే భారత్ బ్యాటింగ్ జోరుతో తొలి మూడు టి20ల్లో అవలీలగా 200 పైచిలుకు పరుగులు చేసింది. యశస్వి, రుతురాజ్, కెపె్టన్ సూర్యకుమార్, రింకూ సింగ్ ఇలా వీరంతా మెరిపించినవారే! కానీ బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోరు చేశాక కూడా మూడో టి20లో భారత్ ఓడింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మాత్రం గత మ్యాచ్‌లకు భిన్నంగా తక్కువ స్కోరు చేసినా టీమిండియా సిరీస్ విజయాన్ని అందుకుంది. దీనికి బౌలింగ్ పదును పెరగడమే కారణం. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌ల స్పిన్, దీపక్ చహర్ పేస్‌లతో భారత్ బౌలింగ్ బలం పెరిగింది. ఇప్పుడు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏమాత్రం ఒత్తిడి లేని ఆఖరి మ్యాచ్‌లో గెలవడం కష్టం కానేకాదు. గత మ్యాచ్‌లో హిట్టర్ జితేశ్ శర్మ కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల కోసం వచ్చిన శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించే పనిలో పడితే మాత్రం భారత్ మరో 200 పరుగుల్ని చేయడం ఇంకాస్త సులువవుతుంది. ఒత్తిడిలో ఆసీస్ నాలుగో టి20లో టాస్ నెగ్గినప్పటికీ ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ ఆర్డర్‌పై నమ్మకంతో చేజింగ్ ఎంచుకొని భంగపడింది. దీంతోనే సిరీస్‌నూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియాపైనే సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలనన్న ఒత్తిడి భారంగా మారింది. హెడ్ మెరిపిస్తున్నా... ఫిలిప్, హార్డీ, టిమ్ డేవిడ్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడం బ్యాటింగ్ ఆర్డర్‌ను ఆందోళన పరుస్తోంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వన్డే జట్టు విజయంతో ఇంటికెళ్లినట్లే... టి20 జట్టు సిరీస్‌తో కాకపోయినా... ఆఖరి ఫలితంతో సంతృప్తిగా స్వదేశం వెళ్లాలంటే ఆటగాళ్లంతా మరింత బాధ్యత కనబరచాల్సి వుంటుంది. పిచ్–వాతావరణం ఇక్కడి చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు బాగా కలిసొచ్చే గ్రౌండ్. ప్రతీసారి కూడా బౌండరీలు, సిక్సర్ల మజాను పంచుతోంది. కాబట్టి టాస్ గెలిస్తే ఏ జట్టయినా ఛేదనకే మొగ్గు చూపుతుంది. ఆటకు వాన ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, ముకేశ్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), ఫిలిప్, హెడ్, మెక్‌డెర్మాట్, అరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, షార్ట్, డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, బెహ్రెన్‌డార్‌్ఫ, తనీ్వర్ సంఘా/నాథన్ ఎలిస్. -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
హాట్‌కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్–ఆస్ట్రేలియా టీ20 తొలి మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఏసీఏ ఆధ్వర్యంలో పేటీఎం ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ముగించగా శుక్రవారం ఐదు వేల టికెట్లను ఆరు డినామినేషన్లలో కౌంటర్ల ద్వారా విక్రయించారు. వైఎస్సార్ స్టేడియంతో పాటు టౌన్ కొత్తరోడ్, గాజువాకల్లోని మున్సిపల్ స్టేడియాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించారు. కనీస ధర రూ.600 నుంచి గరిష్ట ధర రూ.6000లో పాటు రూ.1500, రూ.2000,రూ.3000,రూ.3500లు టికెట్లను మూడు ప్రాంతాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయాన్ని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్టేడియంలో ప్రవేశానికి ఫిజికల్ టికెట్లుగా మార్చుకునేందుకు ఆయా సెంటర్లలోనే 22వ తేదీవరకు అవకాశం కల్పించగా మ్యాచ్ జరిగే రోజు ఈనెల23న స్టేడియంలోనూ టికెట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో శనివారం సైతం ఆరు డినామినేషన్లలో టికెట్లను ఆయా కౌంటర్ల ద్వారా విక్రయించనున్నామని తెలిపారు. -
ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్..ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం
-
IND vs WI: భారత్‌పై వెస్టిండీస్ విజయం.. సిరీస్ కైవసం
భారత్, వెస్టిండీస్ మద్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. దీంతో టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత జట్టు 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు.. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్ ముందు మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. గత మ్యాచ్‌లో చెలరేగిన శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ సింగిల్ డిజిట్ పరుగులకే వెనుదిరిగారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023