
డెర్బీ: ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 47 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. టామ్సిన్ బ్యూమోంట్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. విండీస్ బౌలర్లలో షకీరా కసాండ్రా మూడు వికెట్లు తీయగా... హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి ఓడిపోయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీండ్రా డాటిన్ (59 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేరకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment