బెన్‌ స్టోక్స్‌ డూప్‌.. వైరల్‌ వీడియో | Ben Stokes Doop Highlighted During ENG Vs WI 2nd Test Match, Ben Stokes Reaction Goes Viral | Sakshi
Sakshi News home page

ENG Vs WI 2nd Test: బెన్‌ స్టోక్స్‌ డూప్‌.. వైరల్‌ వీడియో

Published Mon, Jul 22 2024 12:31 PM | Last Updated on Mon, Jul 22 2024 3:27 PM

Ben Stokes Doop Highlighted During ENG VS WI 2nd Test Match

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్‌లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్‌ స్టోక్స్‌ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్‌ స్టయిల్‌, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్‌ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 457, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఓలీ పోప్‌ (121), హ్యారీ బ్రూక్‌ (109), జో రూట్‌ (122).. విండీస్‌ ఆటగాడు కవెమ్‌ హాడ్జ్‌ (120) సెంచరీలు చేశారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో టెస్ట్‌ జులై 26న మొదలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement