టెస్ట్‌ మ్యాచ్‌ అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఇంతలా బాదితే ఎలా..? | ENG Vs WI 3rd Test: England Beat West Indies By 10 Wickets In Third Test, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

ENG Vs WI 3rd Test: టెస్ట్‌ మ్యాచ్‌ అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఇంతలా బాదితే ఎలా..?

Published Sun, Jul 28 2024 8:45 PM | Last Updated on Mon, Jul 29 2024 1:35 PM

England Beat West Indies By 10 Wickets In Third Test

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (జులై 28) ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్‌ కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఆట మూడో రోజు విండీస్‌ను 175 పరుగులకే ఆలౌట్‌ (సెకెండ్‌ ఇన్నింగ్స్‌) చేసిన ఇంగ్లండ్‌.. 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 7.2 ఓవర్లలోనే ఛేదించింది. 

ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టోక్స్‌.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. స్టోక్స్‌ వీరబాదుడు ధాటికి విండీస్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కళ్లు మూసుకుని తెరిచే లోగా హాం ఫట్‌ అయ్యింది. స్టోక్స్‌కు జతగా బరిలోకి దిగిన బెన్‌ డకెట్‌ (16 బంతుల్లో 25 నాటౌట్‌; 4 ఫోర్లు) సైతం మరో ఎండ్‌లో చెలరేగాడు. స్టోక్స్‌ బజ్‌బాల్‌ గేమ్‌ను చూసిన వారు "టెస్ట్‌ మ్యాచ్‌ అనుకున్నావా లేక టీ20 అనుకున్నావా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మార్క్‌ వుడ్‌ (5/40) ఐదేసి విండీస్‌ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్‌ 2, వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ బ్యాటర్లలో మికైల్‌ లూయిస్‌ (57), కవెమ్‌ హాడ్జ్‌ (55) హాఫ్‌ సెంచరీలు చేశాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ‌282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (61), జేసన్‌ హోల్డర్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 4, క్రిస్‌ వోక్స్‌ 3, మార్క్‌ వుడ్‌ 2, షోయబ్‌ బషీర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్‌ (87) కెరీర్‌లో 63వ హాఫ్‌ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌ జేమీ స్మిత్‌ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్‌ స్టోక్స్ (54), క్రిస్‌ వోక్స్‌ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 4, జేడన్‌ సీల్స్‌ 3, షమార్‌ జోసఫ్‌ 2, గుడకేశ్‌ మోటీ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement