
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాల్టి నుంచి (జులై 26) మొదలయ్యే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో.. రెండో టెస్ట్‌లో 241 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విండీస్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment