Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్‌కు ఫ్యూజులు ఔట్‌ | ENG VS WI 1st Test: Motie Clean Bowled Ben Stokes | Sakshi
Sakshi News home page

Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్‌కు ఫ్యూజులు ఔట్‌

Published Thu, Jul 11 2024 8:04 PM | Last Updated on Fri, Jul 12 2024 9:58 AM

ENG VS WI 1st Test: Motie Clean Bowled Ben Stokes

లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్‌ (57), రూట్‌ (68), బ్రూక్‌ (50), జేమీ స్మిత్‌ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌ 4, జేసన్‌ హోల్డర్‌, గుడకేశ్‌ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ అరంగేట్రం బౌలర్‌ గస్‌ అట్కిన్సన్‌ (7/45) విండీస్‌ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్‌, వోక్స్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో మిఖైల్‌ లూయిస్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మోటీ మాయాజాలం
ఈ మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్‌ గుడకేశ్‌ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్‌గా నిలిచాయి. మోటీ తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్లు స్టోక్స్‌, రూట్‌లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ముఖ్యంగా స్టోక్స్‌ బౌల్డ్‌ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్‌ స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్‌ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement