Gudakesh Motie
-
విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది. రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరేప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు. మిగతా వారికి ఏడాదికేఅదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్ -
Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్‌కు ఫ్యూజులు ఔట్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.AN ABSOLUTE CHERRY FROM MOTIE. - The reaction of Ben Stokes says all. 😲pic.twitter.com/NTnSvRQXhJ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024మోటీ మాయాజాలంఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్‌గా నిలిచాయి. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు స్టోక్స్, రూట్లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా స్టోక్స్ బౌల్డ్ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్ స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.