వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో బట్లర్ బాదిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. గుడకేశ్ మోటీ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్ 115 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఇది జరిగింది. మోటీ లెంగ్త్ బాల్‌ను వేయగా.. బట్లర్ క్రీజ్ దాటి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు. బట్లర్ హార్డ్ హిట్టింగ్ దెబ్బకు బంతి స్టేడియం దాటి బయటపడింది.
JOS BUTTLER WITH A 115M SIX. 🤯🔥 pic.twitter.com/cfwNjHyWKn
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ ఉతికి ఆరేయడంతో 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. విల్ జాక్స్ (29 బంతుల్లో 38) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్ (23 నాటౌట్), జాకబ్ బేతెల్ (2 నాటౌట్) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
తొలి టీ20లో మెరుపు సెంచరీ చేసిన ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్‌లో గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు విండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ 41 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు తీసి విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా నవంబర్ 14న మూడో టీ20 జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment