క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్‌లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది.
రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరే
ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు.
మిగతా వారికి ఏడాదికే
అదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది.
చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్
Comments
Please login to add a commentAdd a comment