Shamar Joseph
-
విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. గత సీజన్లో కనబరిచిన అసాధారణ ప్రదర్శన ఆధారంగా తొమ్మిది మంది క్రికెటర్లకు ఏకంగా రెండేళ్ల కాంట్రాక్టును ఇచ్చింది. కాగా సాధారణంగా ఏ క్రికెట్ బోర్డు అయినా తమ ఆటగాళ్లకు ఏడాది పాటే కాంట్రాక్టే ఇస్తుంది. రెండేళ్ల కాంట్రాక్టు పొందినది వీరేప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సంవత్సరకాలానికే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తుంది. ఆ ఏడాదికి సంబంధించిన ఆటతీరును బట్టే తదుపరి ఏడాది గ్రేడ్‌ను నిర్ణయించి కాంట్రాక్టు ఖరారు చేస్తుంది. అయితే, విండీస్ బోర్డు ఇందుకు భిన్నంగా రెండేళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం విశేషం. ఈ జాబితాలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇక.. క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 15 మంది చొప్పున మహిళా, పురుషుల క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు కట్టబెట్టింది. అదనపు కాంట్రాక్టు పొందిన వారిలో పురుషుల జట్టు వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్, పేస్ నయా సంచలనం షమర్ జోసెఫ్, హిట్టర్లు షై హోప్, బ్రాండన్ కింగ్, గుడకేశ్ మోతీ, సిలెస్ ఉన్నారు. మిగతా వారికి ఏడాదికేఅదే విధంగా.. మహిళల జట్టుకు సంబంధించి కెప్టెన్ హేలీ మాథ్యూస్, వైస్ కెప్టెన్ షెమైన్ క్యాంప్‌బెల్, స్టెఫానీ టేలర్ ఉన్నారు. 15 మందిలో ఎంపికైన మిగతా వారికి ఎప్పట్లాగే ఏడాది కాంట్రాక్టు లభించింది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పుకొన్న సౌతాఫ్రికా స్టార్ -
కుప్పకూలిన దక్షిణాఫ్రికా
ప్రొవిడెన్స్: వెస్టిండీస్ పేసర్ల ధాటికి రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు... విండీస్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.షామర్ జోసెఫ్ (5/33), జైడెన్ సీల్స్ (3/41) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 134 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ బెడింగ్హమ్ (28), ట్రిస్టన్ స్టబ్స్ (26), కైల్ వెరినె (21) ఓ మాదిరిగా ఆడగా.. కెపె్టన్ తెంబా బవుమా (0), మార్క్రమ్ (14), టోనీ డి జోర్జి (1), ముల్డర్ (0), కేశవ్ మహరాజ్ (0) విఫలమయ్యారు. -
సౌతాఫ్రికాతో సిరీస్.. విండీస్ వికెట్ల వీరుడి రీ ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటిచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న టెవిన్ ఇమ్లాచ్, బ్రియాన్ చార్లెస్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం కల్పించింది.గయానాకు చెందిన ఇమ్లాచ్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1097 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ చార్లెస్ 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో భాగమై.. 150 వికెట్లు పడగొట్టాడు. వీరి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడైన కేసీ కార్టీకి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చింది విండీస్ బోర్డు.వైస్ కెప్టెన్‌గా జోషువా డా సిల్వాఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తమ రెగ్యులర్ వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతినివ్వాలని భావించామని.. అందుకే జోషువాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఆండ్రే కోలే తెలిపాడు. ఇక ఈ జట్టులో.. ఇంగ్లండ్ టూర్‌కు పక్కనపెట్టిన జస్టిన్ గ్రేవ్స్‌కు కూడా అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. వికెట్ల వీరుడి పునరాగమనంఅదే విధంగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్, వికెట్ల వీరుడు కెమర్ రోచ్(81 టెస్టుల్లో 270 వికెట్లు) కూడా ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగష్టు 7- 11 వరకు తొలి టెస్టు, గయానాలో ఆగష్టు 15- 19 వరకు రెండో టెస్టు నిర్వహించనున్నారు. అదే విధంగా.. ఆగష్టు 23, 24, 27 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ వేదిక.ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుక్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, కేసీ కార్టీ, బ్రియాన్ చార్లెస్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, మిక్కిల్ లూయిస్, గుడకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికాన్. -
Eng vs WI: గాయపడ్డ బౌలర్.. ‘వికెట్ల వీరుడి’కి పిలుపు
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్ జెరెమా లూయీస్ స్థానంలో అకీం జోర్డాన్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.కాగా విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 10న ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.చిత్తు చిత్తుగా ఓడిపర్యాటక వెస్టిండీస్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక నాటింగ్‌హామ్‌లో జూలై 18- 22 వరకు జరిగిన రెండో టెస్టులోనూ వెస్టిండీస్‌కు పరాభవమే ఎదురైంది. 241 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను 0-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జూలై 26 నుంచి నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. బర్మింగ్‌హాంలోని ఎడ్జ్‌బాస్టన్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో ముందడుగు వేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.దురదృష్టంమరోవైపు.. ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. అయితే, ఇంతవరకూ టెస్టులాడని జెరెమీ లూయిస్‌కు విండీస్ ఈ సిరీస్ ద్వారా పిలుపునివ్వగా.. తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉన్నాడు. కానీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.అయితే, మూడో టెస్టుకు ముందు అతడు గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. తొడ కండరాల గాయం కారణంగా జెరెమా జట్టుకు దూరమైనట్లు తెలిపింది. అయితే, అతడు జట్టుతో పాటే ఉంటూ చికిత్స తీసుకుంటాడని తెలిపింది. జెరెమా స్థానంలో అకీమ్ జోర్డాన్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొంది.లైన్ క్లియర్!కాగా 29 ఏళ్ల అకీమ్ జోర్డాన్ ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. బార్బడోస్‌కు చెందిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఫస్ట్‌క్లాస్ రికార్డు మెరుగ్గా ఉంది. 19 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 67 వికెట్లు తీశాడు. ప్రస్తుతం యూకేలోనే ఉన్న జోర్డాన్ జట్టుతో చేరినట్లు సమాచారం.ఇక విండీస్ పేస్ దళంలో అల్జారీ జోసెఫ్, జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ అందుబాటులో ఉన్నారు. అయితే, తదుపరి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వీరిలో ఒకరికి బోర్డు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలా అయితే, జోర్డాన్ అరంగేట్రానికి మార్గం సుగమమవుతుంది. -
విండీస్ ప్లేయర్ భారీ సిక్సర్.. ప్రేక్షకులకు తప్పిన పెను ప్రమాదం
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు స్టేడియం పైకప్పుపై టైల్స్ బద్దలయ్యాయి.Omg that six by Shamar Joseph broke the roof and part of that roof fell on the spectators unbelievable#WTC25 | 📝 #ENGvWI pic.twitter.com/xU8IMTgF5T— Cinephile (@jithinjustin007) July 20, 2024బద్దలైన టైల్స్ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు. ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. రూఫ్ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.కాగా, 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమార్ జోసఫ్ మూడో రోజు ఆటలో చెలరేగిపోయాడు. షమార్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. షమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్‌కు 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ లభించింది.అంతకుముందు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో.. అలిక్ అథనాజ్ (82), జాషువ డసిల్వ (82 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. దీనికి ముందు ఓలీ పోప్ (121) సెంచరీతో.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యారీ బ్రూక్ (71), జో రూట్ (37) క్రీజ్‌లో ఉన్నారు. -
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్‌కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్‌తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్‌ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఒకే బంతికి 14 పరుగులు
వెస్టిండీస్ సంచలన ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ప్రారంభించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తరపున జోషెఫ్ ఈ క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో జోషెఫ్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో షమర్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. జోషఫ్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అదేవిధంగా కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన జోషఫ్ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తన తొలి ఓవర్లో ఏకంగా జోషఫ్ 10 బంతులు వేశాడు. తొలి 5 బంతుల్లో 7 పరుగులు ఇచ్చి పర్వాలేదన్పించిన జోషఫ్.. ఆఖరి బంతికి ఓవర్‌స్టెప్ చేశాడు. దీంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత వరుసగా రెండు బంతులను వైడ్‌గా వేశాడు. అందులో ఒకటి వైడ్‌గా వెళ్లి బౌండరీ దాటింది. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత కూడా మళ్లీ నోబాల్ వేశాడు. ఆఖరికి ఫ్రీహిట్ బంతిని సాల్ట్ సిక్స్‌గా మలిచాడు. దీంతో చివరి బంతి వేసే క్రమంలో జోషఫ్ ఏకంగా 14 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును జోషఫ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్‌గా ఈ కరేబియన్ పేసర్ నిలిచాడు. ఈ జాబితాలో అబు నెచిమ్ 27 పరుగులతో అగ్రస్ధానంలో ఉన్నాడు. -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రచిన్ 10 మ్యాచ్‌లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్‌గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్‌గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్‌గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్‌తో కొయెట్జీ గత వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్‌గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్‌రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్‌కు ఆల్‌రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్‌కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్‌ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్‌ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
బౌలింగ్ సంచలనం, విండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ పోటీపడినప్పటికీ.. విండీస్ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లు షమార్‌కే దక్కాయి. మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అమీ హంటర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. కాగా, షమార్ జోసఫ్ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్ యువ పేసర్ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. -
శభాష్ షామర్.. సెక్యూరిటీ గార్డు టూ 'గబ్బా' హీరో
దాదాపు రెండేళ్ల క్రితం అతను బతుకుతెరువు కోసం ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే క్రికెట్‌పై పిచ్చి ఈ ఉద్యోగంలో నిలవనీయడం లేదు. ఇలాగే సాగితే తన జీవితం సెక్యూరిటీకే అంకితం అయిపోతుందని అతను భయపడ్డాడు. ఏదో సాహసం చేయాల్సిందేనని భావించాడు. కానీ ఒక్కసారిగా ఇంటి కష్టాలు కళ్ల ముందు నిలిచాయి. అయితే అతడి కలను నెరవేర్చేందుకు కుటుంబం అండగా నిలుస్తూ ధైర్యాన్ని నిపించింది. దాంతో దేనికైనా సిద్ధమే అంటూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెడుతూ తన సాధన కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత చూస్తే ప్రతిష్ఠాత్మక బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాటర్లను తన బౌలింగ్‌లో ఒక ఆటాడించాడు. తమకు ఘనమైన రికార్డు ఉన్న గాబా మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు అతని బౌలింగ్ ముందు తలవంచారు. వేగవంతమైన బంతులతో చెలరేగిపోతుంటే జవాబు ఇవ్వలేక బ్యాట్లు ఎత్తేశారు. ఫలితంగా వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయం. 24 ఏళ్ల ఆ బౌలర్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఎక్కడో గయానా అడవుల్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చిన ఆ కుర్రాడే పేస్ బౌలర్ షామర్ జోసెఫ్. అతని నేపథ్యం, ఆపై ఎదిగిన తీరు అసమానం, స్ఫూర్తిదాయకం. జనవరి 17, 2024...అంతర్జాతీయ క్రికెట్లో షామర్ జోసెఫ్ అరంగేట్రం చేసిన రోజు. అడిలైడ్ మైదానంలో తీవ్ర ఒత్తిడిలో తన మొదటి ఓవర్ వేసేందుకు అతను తన బౌలింగ్ రనప్ మొదలు పెట్టాడు. ఎదురుగా బ్యాటింగ్ చేస్తున్నది టెస్టు క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన స్టీవ్ స్మిత్. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ దానిని నియంత్రించలేక మూడో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అంతే... ఒక్కసారిగా విండీస్ శిబిరంలో సంబరాలు. టెస్టుల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన ఆటగాళ్ల జాబితాలో షామర్ చేరాడు. ఈ క్షణాన్ని ఫోటో ఫ్రేమ్ చేసిన తన ఇంట్లో పెట్టుకుంటానని అతను ప్రకటించాడు. అయితే ఆ ఆనందం అంతటితో ఆగిపోలేదు. మరో 11 రోజుల తర్వాత అది రెట్టింపైంది. 216 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 113 పరుగులకు 2 వికెట్లతో పటిష్ఠ స్థితిలో నిలిచిన దశలో షామర్ స్పెల్ కంగారూలను కుప్పకూల్చింది. విరామం లేకుండా బౌలింగ్ చేసిన అతను 7 వికెట్లతో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యం కనబర్చాడు. ఎప్పుడో షామర్ పుట్టక ముందే 27 ఏళ్ల క్రితం ఆసీస్‌ను వారి సొంతగడ్డపై విండీస్ ఆఖరిసారిగా ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఒక గెలుపు. ఇన్నాళ్లుగా ఒక విజయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన నాటి దిగ్గజాలు బ్రియాన్ లారా, కార్ల్ హూపర్ కన్నీళ్లపర్యంతమవగా షామర్ వారి ముందు ఒక అద్భుతం చేసి చూపించాడు. సాధారణంగా తమను ఓడించిన ప్రత్యర్థులపై కసితో ఆమడ దూరం ఉండి ఆగ్రహాన్ని ప్రదర్శించే ఆసీస్ ఆటగాళ్లు కూడా బీరు గ్లాసులతో వేడుకల్లో జత కలిశారు. ఎందుకంటే ఈ విజయం విలువేమిటో అందరికీ తెలియడమే కాదు, షామర్ జోసెఫ్ గురించి తెలుసుకున్న తర్వాత వారందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. కట్టెలు కొట్టడంతో మొదలై... గయానా దేశంలో న్యూ ఆమ్స్టర్డామ్ ఒక చిన్న పట్టణం. దాదాపు 20 వేల జనాభా ఉంటుంది. బెర్బిస్ నదీ తీరంలో ఈ పట్టణం ఉంటుంది. బెర్బిస్ ఉప నది కాంజే ద్వారా అక్కడి నుంచి దాదాపు 225 కిలో మీటర్లు పడవలో రెండు రోజుల పాటు ప్రయాణిస్తే, బరాకారా అనే చిన్న ఊరు వస్తుంది. జనాభా దాదాపు 400 మంది. ఇటీవలి వరకు అక్కడ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అనే పేరు కూడా తెలీదు. ఊర్లో అందరికీ ఒకటే వృత్తి.. అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టడం, వాటిని దుంగలుగా కట్టకట్టి కాంజే నది ద్వారానే న్యూ ఆమ్స్టర్డామ్ వరకు చేర్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం. షామర్ కుటుంబం కూడా అదే పనిలో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబంలో అతను ఒకడు. అలాగే జీవితం సాగిపోతున్న సమయంలో అనూహ్యం జరిగింది. అడవిలో పని చేస్తున్న క్రమంలో ఒక పెద్ద జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అర క్షణం తేడాతో షామర్ చావునుంచి తప్పించుకున్నాడు. దాంతో ఈ పనిని మానేయాలని అతను వెంటనే నిర్ణయించుకున్నాడు. అయితే ఉపాధి కోసం న్యూ ఆమ్స్టర్డామ్కే వెళ్లిపోయాడు. ముందు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్‌గా పని చేశాడు. అక్కడ ఇబ్బందులు రావడంతో ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. అప్పటికే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్న షామర్ టేప్ బాల్‌తో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. అయితే వరుసగా 12 గంటల బ్యాంక్ ఉద్యోగం, అలసట కారణంగా ఆదివారాలు కూడా ఆడే అవకాశం లేకపోయేది. దాంతో ఒక గందరగోళ స్థితిలోకి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో కుటుంబం మద్దతుగా నిలిచి ప్రోత్సహించింది. ‘నువ్వు ఇష్టపడే చోట కష్టపడు’ అంటూ ఒక ప్రయత్నం చేయమని, మిగతావారంతా కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని అండగా నిలిచారు. దాంతో షామర్‌కు స్వేచ్ఛ దొరికినట్లయింది. అండగా అందరూ... టేప్ బాల్, రబ్బర్ బాల్, ప్లాస్టిక్ బాల్, నిమ్మకాయలు, జామకాయలు.. ఇలా అన్నింటిలోనూ షామర్‌కు క్రికెట్ బంతే కనిపించింది. బౌలింగ్‌ను ఇష్టపడిన అతను వీటన్నంటితో ఆడుతూనే వచ్చాడు. టీవీల్లో, పోస్టర్లలో కనిపించే నాటి దిగ్గజాలు ఆంబ్రోస్, వాల్ష్లపై మొదటినుంచీ అభిమానాన్ని పెంచుకొని వారినే అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టపడేవారికే అదృష్టం కూడా అండగా నిలుస్తుందనేది వాస్తవం. షామర్ విషయంలోనూ అది నిజమైంది. వేర్వేరు దశల్లో ఎంతోమంది షామర్‌కు సహాయం చేయడంతో అతను ముందంజ వేయగలిగాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టి అవకాశం దొరికిన చోటల్లా తనలోని సహజమైన బౌలింగ్ ప్రతిభను షామర్ ప్రదర్శించాడు. ఒక రోజు విండీస్ ఆల్‌రౌండర్ రొమారియా షెఫర్డ్ దృష్టి అతనిపై పడింది. ఇతనిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన షెఫర్డ్ తనకు సన్నిహితులైన అందరి వద్ద షామర్ గురించి చెబుతూ వచ్చాడు. అదే అతనికి వరుసగా అవకాశాలు కల్పించింది. గయానా కోచ్ ఎసన్ క్రాన్డన్, మాజీ కెప్టెన్ లియాన్ జాన్సన్, గయానా సీపీఎల్ జట్టు ప్రతిభాన్వేషి ప్రసన్న అగోరమ్...ఇలా అందరూ షామర్‌కు అండగా నిలిచేవారే. ముఖ్యంగా తనకు తల్లీ, తండ్రి లాంటివాడు అని షామర్ చెప్పుకున్న ప్రసన్న కారణంగానే తొలిసారి పెద్ద స్థాయిలో అతనికి క్రికెట్ టోర్నీ అవకాశం దక్కింది. ముందుగా డివిజన్ స్థాయి క్రికెట్లో బరిలోకి దిగి సత్తా చాటడంతో ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. తన పదునైన పేస్ బౌలింగ్‌ను మాత్రమే నమ్ముతున్న షామర్‌కు మరో సిఫారసు అవసరం లేకుండా పోయింది. సీపీఎల్‌లో చెలరేగడంతో గయానా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అవకాశం దక్కింది. ఏడాది తిరిగేలోగా వెస్టిండీస్ సీనియర్ జట్టులోకి ఎంపిక కావడం అతని పురోగతిని చూపిస్తోంది. ప్రతికూల పరిస్థితిని జయించి... షామర్ను హీరోగా మార్చిన బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ చేయగలగడమే అనూహ్యం. అంతకు ముందు రోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని కాలి వేలికి తీవ్ర గాయమైంది. దాంతో మ్యాచ్ బరిలోకి దిగడమే సందేహంగా మారింది. అందుకే జట్టుతో పాటు మైదానంలోకి టీమ్ డ్రెస్‌తో కాకుండా క్యాజువల్‌గా వచ్చేశాడు. అయితే డాక్టర్ నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన కలిగింది. తన జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు ఏదైనా చేయగలననే నమ్మకంతో అతను బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఏం జరిగినా ఆఖరి వికెట్ పడే వరకు నేను బౌలింగ్ ఆపను అంటూ కెప్టెన్ బ్రాత్వైట్కు చెప్పాడు. దాంతో హడావిడిగా సహాయక సిబ్బంది డ్రెస్ కోసం హోటల్ గదికి పరుగెత్తగా సహచరుడు జాకరీ మెకస్కీ జెర్సీని తీసుకున్న షామర్ నంబర్‌పై స్టికర్ అంటించి అంపైర్ అనుమతితో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిశాయి. చక్కగా ఆడుతున్న జట్టు విజయం దిశగా వెళుతోంది. 29వ ఓవర్‌తో షామర్ తన బౌలింగ్‌ను మొదలు పెట్టాడు. అంతే...కెప్టెన్‌కు మాట ఇచ్చినట్లుగా వరుసగా 11.5 ఓవర్లు వేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఒకటి, రెండు, మూడు.. ఇలా మొదలై చివరకు ఏడో వికెట్‌కు విండీస్‌ను గెలిపించి విజయనాదం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. టెస్టు క్రికెటర్‌గా షామర్ ఆట ఇప్పుడే మొదలైంది. రాగానే సంచలనం సృష్టించినా, ఆటగాడిగా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అవరోధాలను దాటి, గాయాలను అధిగమించి పెద్ద కెరీర్ నిర్మించుకోవడం అంత సులువు కాదు. పైగా విండీస్‌లాంటి బలహీనమైన జట్టు తరఫున ఎప్పుడూ అద్భుతాలు సాధ్యం కావు. అయితే షామర్లో ప్రతిభను చూస్తే అతను ఈ ఒక్క ఘనతకే పరిమితం కాడనేది అంచనా. అన్నింటినీ మించి ఫలితాలను పక్కన పెడితే అతను ప్రస్తుతం సగర్వంగా నిలిచేందుకు సాగించిన ప్రస్థానం మాత్రం ఆటల్లో ఎదగాలనుకునే అందరికీ ప్రేరణ ఇస్తుందనేది మాత్రం వాస్తవం. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
IPL: విండీస్ పేస్ సంచలనానికి లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ప్రకటన
వెస్టిండీస్ యువ సంచలనం షమార్ జోసెఫ్‌కు లక్కీ ఛాన్స్!!... 24 ఏళ్ల ఈ పేస్ బౌలర్ త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో షమార్ జోసెఫ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘షమార్.. నీ రాక మాకెంతో సంతోషం. ఐపీఎల్-2024 సందర్భంగా మార్క్ వుడ్ స్థానంలో షమార్ జట్టుతో చేరనున్నాడు’’ అని లక్నో ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాపై అదరగొట్టి.. సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన షమార్ జోసెఫ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అడిలైడ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ తొలి బంతికే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. స్టీవ్ స్మిత్ రూపంలో అంతర్జాతీయస్థాయిలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అడిలైడ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తీసిన షమార్ జోసెఫ్.. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. కంగారూ గడ్డపై వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ ఫ్రాంఛైజీలు షమార్ జోసెఫ్‌నకు బంపరాఫర్లు ఇస్తున్నాయి. ఇటీవలే అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగమైన పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ధ్రువీకరించింది. కాగా రూ. 3 కోట్లు వెచ్చించి ఈ కరేబియన్ బౌలర్‌ను లక్నో సొంతం చేసుకుంది. Shamar, we're so happy to have you 💙🔥@SJoseph70Guyana joins our squad for IPL 2024, replacing Mark Wood 🤝 pic.twitter.com/YPfGQZB18N — Lucknow Super Giants (@LucknowIPL) February 10, 2024 -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్‌వుడ్: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హాజిల్‌వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
వెస్టిండీస్ సంచలన బౌలర్‌కు బంపరాఫర్.. ఏకంగా ఐపీఎల్లో!?
వెస్టిండీస్ నయా పేస్ సంచలనం షమర్ జోసెఫ్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోషఫ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024లో వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్రాన్ ప్రత్యామ్నాయంగా జోషఫ్ తీసుకోవాలని ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. కుర్రాన్‌ను రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇక ప్రతష్టత్మక గబ్బా స్టేడియంలో జోషఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి విండీస్‌కు చారిత్రత్మక విజయం అందించాడు. జోషప్ బొటన వేలు గాయంతో బాధపడుతూనే ఆసీస్‌కు తమ సొంత గడ్డపై చుక్కలు చూపించాడు. ఈ ప్రదర్శనతో జోషఫ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడికి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీలు నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ షమీర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఓ ఫ్రాంచైజీ కూడా అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది. కానీ బొటన వేలి గాయం కారణంగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌కు షమర్ దూరమయ్యాడు. -
సంచలన బౌలర్ షమార్ జోసఫ్‌కు బంపర్ ఆఫర్లు
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసి వార్తల్లో నిలిచిన విండీస్ పేసర్ షమార్ జోసఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్‌ల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. 24 ఏళ్ల షమార్కు తొలుత పాకిస్తాన్ క్రికెట్ లీగ్ నుంచి ఆహ్వానం లభించింది. షమార్ నిన్ననే పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. షమార్కు తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 1న అతను ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌తో డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. అరంగేట్రం సిరీస్‌తోనే (ఆసీస్) షమార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. షమార్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు విదేశీ లీగ్‌ల నుంచి ఆఫర్లు, ఎండార్స్మెంట్లు వస్తున్నాయి. అరంగేట్రం సిరీస్‌కు ముందు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసిన షమార్ రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో ప్రదర్శనకు గానూ షమార్ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆసీస్ మీడియా సహా ప్రపంచ మీడియా మొత్తం ఈ యువ పేసర్‌కు జేజేలు పలుకుతుంది. మాజీలు, విశ్లేషకులు షమార్ బౌలింగ్ ప్రదర్శనలను కొనియాడుతున్నాడు. షమార్ విండీస్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాడని వారు అభిప్రాయపడుతున్నారు. రెండో టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించిన అనంతరం విండీస్ మాజీలు కన్నీటిపర్యంతమవుతూ షమార్‌ను ఆకాశానికెత్తిన వైనం క్రికెట్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రభ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్‌ను షమార్ మళ్లీ జీవం పోశాడంటూ ఆసీస్ మీడియా షమార్‌ను కొనియాడుతుంది. షమార్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి ఐపీఎల్ బంపరాఫర్ కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు షమార్పై కన్నేసి ఉంచాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో షమార్‌ను తమ పంచన చేర్చుకోవాలని ఆశిస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో వారి స్వదేశంలో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షమార్ రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలతో 13 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమార్.. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే షమార్ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ 7 వికెట్ల ప్రదర్శన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా కీర్తించబడుతుంది. ఈ ప్రదర్శన కారణంగానే షమార్ ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
పెను సంచలనం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన విండీస్
టెస్ట్ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను శోభ తగ్గిన విండీస్ వారి సొంత దేశంలోనే చిత్తుగా ఓడించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. WEST INDIES HAS WON A TEST MATCH AT GABBA 🤯 - Shamar Joseph is the hero. pic.twitter.com/d9zqVfcOpP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించేందుకు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్ జోసఫ్ (7/68) విజృంభించడంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్‌కు ఇది మొదటిసారి. ఈ మ్యాచ్‌లో షమార్ జోసఫ్ బొటనవేలి ఫ్రాక్చర్‌తో బాధపడుతూనే అద్భుతం చేశాడు. The celebration by West Indies is emotional. - World cricket needs powerful West Indies. 🦁pic.twitter.com/QwbbO9VxHP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 ఇదే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన షమార్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా షమార్ బంతితో, బ్యాట్‌తో రాణించాడు. పదకొండో నంబర్ ఆటగాడిగా వచ్చి అతి మూల్యమైన పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అత్యంత పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. Gilchrist hugging Lara in commentary box after the historic win in West Indies at Gabba. - What a moment. 👌pic.twitter.com/8T9N1qjf8J — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ జనం ఈ గెలుపుతో పండుగ చేసుకుంటున్నారు. ఇటీవలికాలంలో చిన్న జట్ల చేతుల్లో కూడా పరాజయాలు ఎదుర్కొని, కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు (2023) అర్హత సాధించలేకపోయిన విండీస్... ఈ గెలుపుతో పూర్వవైభవం సాధించేలా కనిపిస్తుంది. Ian Bishop describing the journey of Shamar Joseph. - This is lovely. 👏pic.twitter.com/tyjjFzt83i — Johns. (@CricCrazyJohns) January 28, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. Lara hugging Shamar Joseph. - What a moment for the youngster, he has started a new chapter. pic.twitter.com/fnn411HZ92 — Johns. (@CricCrazyJohns) January 28, 2024 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. Shamar Joseph said "I told my captain that I will bowl till the last wicket falls no matter what happens to my toe". pic.twitter.com/Col1wTPJQI — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను షమార్ మ్యాజిక్ స్పెల్‌తో ఇబ్బంది పెట్టాడు. షమార్ ధాటికి ఆసీస్ 193 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. షమార్తో పాటు అల్జరీ జోసఫ్ (2/62), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
AUS VS WI 2nd Test: వేలు విరిగినా ఇరగదీసిన విండీస్ పేసర్
బ్రిస్బేన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ను గెలుపు ఊరిస్తుంది. యువ పేసర్ షమార్ జోసఫ్ (6/65) ధాటికి ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు 191 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. స్టీవ్ స్మిత్ (90 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్మిత్‌కు జతగా హాజిల్‌వుడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. బొటన వేలు విరిగినా ఇరగదీసిన షమార్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో స్టార్క్ బౌలింగ్ విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టార్క్ సంధించిన యార్కర్ నేరుగా షమార్ కాలి బొటన వేలిని తాకింది. దీంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్వల్పంగా ఫ్రాక్చర్ ఉందని డాక్టర్లు చెప్పినా షమార్ బౌలింగ్‌కు దిగాడు. బౌలింగ్ చేయడమే కాకుండా ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. షమార్తో పాటు అల్జరీ జోసఫ్ (2/50), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు తీయడంతో ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది. Shamar Joseph has to retire hurt after this toe-crusher from Mitch Starc! Australia need 216 to win #AUSvWI pic.twitter.com/3gAucaEfwg — cricket.com.au (@cricketcomau) January 27, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. Shamar Joseph helped from the field to end West Indies’ innings #AUSvWI pic.twitter.com/YZPUcmQ7s6 — Andrew McGlashan (@andymcg_cricket) January 27, 2024 విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
విండీస్ అరంగేట్ర పేసర్ సంచలనం: స్మిత్ నమ్మలేకపోయాడు!
#Shamar Joseph: ‘‘టెస్టు కెరీర్లో ఇంతకంటే గొప్ప ఆరంభం ఉండాలని ఎవరైనా కలగనగలరా?! ఈ అబ్బాయి చరిత్ర సృష్టించాడు’’.. వెస్టిండీస్ అరంగేట్ర పేసర్ షమార్ జోసెఫ్ గురించి కామెంటేటర్ అన్న మాటలు. నిజమే.. జాతీయ జట్టుకు ఆడాలన్న చిరకాల కోరిక నెరవేర్చుకున్న 24 ఏళ్ల ఈ యువ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో.. అది కూడా పటిష్ట ఆస్ట్రేలియాతో టెస్టులో.. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ రూపంలో దిగ్గజ బ్యాటర్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 85 ఏళ్ల రికార్డు సమం అంతేకాదు.. వెస్టిండీస్ చరిత్రలో 85 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సమం చేశాడు కూడా! విండీస్ తరఫున టెస్టు క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు.. 1939లో టిరెల్ జాన్సన్.. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 23వ స్థానం ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో 23వ బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు షమార్ జోసెఫ్. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా షమార్ జోసెఫ్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు ఇక టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 188 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. కంగారూ జట్టు పేసర్లు ప్యాట్ కమిన్స్, హాజిల్‌వుడ్ నాలుగేసి వికెట్లు తీసి విండీస్‌ను కోలుకోని దెబ్బకొట్టారు. వీరి ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా పదకొండో స్థానంలో బరిలోకి దిగిన షమార్ జోసెఫ్ కీమర్ రోచ్‌తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 41 బంతుల్లో 36 పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. స్మిత్‌ను బోల్తా కొట్టించి మరీ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో తిప్పలు పెట్టాడు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి స్మిత్‌ను బోల్తా కొట్టించాడు షమార్. గుడ్ లెంగ్త్ డెలివరీతో స్మిత్‌ను డిఫెన్స్‌లో పడేసి వికెట్ సమర్పించుకునేలా చేశాడు. కాగా షమార్ బౌలింగ్‌లో బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. FIRST BALL! Shamar Joseph gets Steve Smith with his first ball in Tests! #OhWhatAFeeling | @Toyota_Aus | #AUSvWI pic.twitter.com/XLelMqZHrG — cricket.com.au (@cricketcomau) January 17, 2024 ఇదిలా ఉంటే... పదిహేనో ఓవర్ ఐదో బంతికి మార్నస్ లబుషేన్(10) రూపంలో రెండో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు షమార్. ఇక.. తొలి రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసిన ఆస్ట్రేలియా విండీస్ కంటే 129 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు