దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటిచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆకట్టుకున్న టెవిన్ ఇమ్లాచ్, బ్రియాన్ చార్లెస్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం కల్పించింది.
గయానాకు చెందిన ఇమ్లాచ్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1097 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ చార్లెస్ 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో భాగమై.. 150 వికెట్లు పడగొట్టాడు. వీరి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడైన కేసీ కార్టీకి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చింది విండీస్ బోర్డు.
వైస్ కెప్టెన్‌గా జోషువా డా సిల్వా
ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తమ రెగ్యులర్ వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతినివ్వాలని భావించామని.. అందుకే జోషువాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఆండ్రే కోలే తెలిపాడు. ఇక ఈ జట్టులో.. ఇంగ్లండ్ టూర్‌కు పక్కనపెట్టిన జస్టిన్ గ్రేవ్స్‌కు కూడా అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.
వికెట్ల వీరుడి పునరాగమనం
అదే విధంగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్, వికెట్ల వీరుడు కెమర్ రోచ్(81 టెస్టుల్లో 270 వికెట్లు) కూడా ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది.
ట్రినిడాడ్ వేదికగా ఆగష్టు 7- 11 వరకు తొలి టెస్టు, గయానాలో ఆగష్టు 15- 19 వరకు రెండో టెస్టు నిర్వహించనున్నారు. అదే విధంగా.. ఆగష్టు 23, 24, 27 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ వేదిక.
ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, కేసీ కార్టీ, బ్రియాన్ చార్లెస్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, మిక్కిల్ లూయిస్, గుడకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికాన్.
Comments
Please login to add a commentAdd a comment