Kemar Roach
-
సౌతాఫ్రికాతో సిరీస్.. విండీస్ వికెట్ల వీరుడి రీ ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటిచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న టెవిన్ ఇమ్లాచ్, బ్రియాన్ చార్లెస్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం కల్పించింది.గయానాకు చెందిన ఇమ్లాచ్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1097 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ చార్లెస్ 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో భాగమై.. 150 వికెట్లు పడగొట్టాడు. వీరి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడైన కేసీ కార్టీకి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చింది విండీస్ బోర్డు.వైస్ కెప్టెన్‌గా జోషువా డా సిల్వాఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తమ రెగ్యులర్ వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతినివ్వాలని భావించామని.. అందుకే జోషువాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఆండ్రే కోలే తెలిపాడు. ఇక ఈ జట్టులో.. ఇంగ్లండ్ టూర్‌కు పక్కనపెట్టిన జస్టిన్ గ్రేవ్స్‌కు కూడా అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. వికెట్ల వీరుడి పునరాగమనంఅదే విధంగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్, వికెట్ల వీరుడు కెమర్ రోచ్(81 టెస్టుల్లో 270 వికెట్లు) కూడా ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగష్టు 7- 11 వరకు తొలి టెస్టు, గయానాలో ఆగష్టు 15- 19 వరకు రెండో టెస్టు నిర్వహించనున్నారు. అదే విధంగా.. ఆగష్టు 23, 24, 27 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ వేదిక.ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుక్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, కేసీ కార్టీ, బ్రియాన్ చార్లెస్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, మిక్కిల్ లూయిస్, గుడకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికాన్. -
నిప్పులు చెరుగుతున్న కీమర్ రోచ్.. విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్లను (0) పెవిలియన్‌కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్‌లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది. స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు యశస్వి జైశ్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలు కొట్టిన యశస్వి జైశ్వాల్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. బ్యాటింగ్‌తో ఇరగదీసిన జైశ్వాల్ ఒక్క విషయంలో మాత్రం దొరికిపోయాడు. వెస్టిండీస్ వెటరన్ ప్లేయర్ కీమర్ రోచ్‌పై జైశ్వాల్ దూషణల పర్వానికి దిగడం ఆసక్తి కలిగించింది. ఇన్నింగ్స్ చివరి సెషన్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికే సెంచరీతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న యశస్వి జైశ్వాల్ క్రీజులో పాతుకుపోయాడు.. మరో ఎండ్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్ బాగానే చేస్తున్న సందర్భంలోనే జైశ్వాల్ అనవసరంగా ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. కీమర్ రోచ్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన అనంతరం నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వచ్చిన జైశ్వాల్.. రోచ్వైపు చూస్తూ “Hutt Na Behe*c**d Samne Se( నా దారి నుంచి పక్కకు తప్పుకో...) అంటూ బూతు పదం అందుకున్నాడు. ఇది గమనించిన కోహ్లి జైశ్వాల్ వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. ''మంచిగా ఆడుతున్నావ్.. ఈ సమయంలో ఇలాంటి వివాదాలు అవసరమా'' అన్నట్లుగా కోహ్లి చూపుల్లో అర్థమున్నట్లుగా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Yashasvi Jaiswal abusing WI player in Hindi. Following the footsteps of Virat Kohli in his very first international match.#YashasviJaiswal #WIvIND #INDvsWI #RohitSharma #ViratKohlipic.twitter.com/2R3ePz1AlM — Mufaddal Vohra (@mufaddl_vora) July 13, 2023 చదవండి: #ViratKohli: ఒక్క బౌండరీ.. 'నిన్ను చూస్తే హీరో నాని గుర్తొస్తున్నాడు కోహ్లి' Equal Prize Money For Cricketers: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
నార్త్ సౌండ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 84 పరుగుల విజయలక్ష్యాన్ని వెస్టిండీస్ 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 49/3తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో వికెట్ కోల్పోకుండా విజయానికి అవసరమైన పరుగులను సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ (58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, బ్లాక్‌వుడ్ (26 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన విండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
WI Vs Eng: రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం!
England Tour Of West Indies 2022- నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. 71 ఓవర్లలో 286 పరుగుల ఊరించే విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మ్యాచ్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్క్రుమా బానర్ (38 నాటౌట్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), బ్రాత్‌వైట్ (33) రాణించారు. ఆతిథ్య జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడి గెలుపు కోసం ప్రయత్నించింది. అయితే 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో వెనక్కి తగ్గిన వెస్టిండీస్ ‘డ్రా’పై దృష్టి పెట్టింది. నాలుగో వికెట్ పడిన తర్వాత బానర్, హోల్డర్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మరో 35.4 ఓవర్లు పట్టుదలగా నిలబడ్డారు. బానర్ 138 బంతులు ఆడగా, హోల్డర్ 101 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం(మార్చి 16) నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ పాత జట్టుతోనే బరిలోకి దిగుతామని విండీస్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ స్పష్టం చేశాడు. మొదటి టెస్టు జట్టులో భాగమైన 13 మంది ఆటగాళ్లను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బానర్‌పై హేన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట తీరు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 355 బంతుల్లో 123 పరుగులు సాధించిన బానర్.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), బ్లాక్‌వుడ్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, జాషువా డి సిల్వా, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కైలీ మేయర్స్, వీరసామి పెరుమాల్, ఆండర్సన్ ఫిలిప్, కేమార్ రోచ్, జేడెన్ సీల్స్. కాగా భారత సంతతికి చెందిన వీరసామికి ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. తొలి టెస్టు తుదిజట్టులో భాగమైన ఈ లెష్టార్మ్ స్పిన్నర్ 87 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు This kind of resilience is priceless! Nkrumah Bonner takes our #MastercardPricelessMoment of the 1st Test. #WIvENG pic.twitter.com/nM5Di0iCtq — Windies Cricket (@windiescricket) March 12, 2022 Draw! A patient day of Test cricket comes to an end.👏🏿 #WIvENG #MenInMaroon pic.twitter.com/1LsYMQn2YW — Windies Cricket (@windiescricket) March 12, 2022 -
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. సీనియర్ బౌలర్ రీ ఎంట్రీ
భారత్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. సీనియర్ బౌలర్ కెమర్ రోచ్‌తో పాటు న్క్రుమా బోన్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా బ్రాండన్ కింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు కీరన్ పొలార్డ్ సారథ్యం వహించనున్నాడు. కాగా వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేలు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (సి), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: IND Vs WI: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్; తొలి వన్డేకు రాహుల్ దూరం -
నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ
జమైకా: పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిధ్య విండీస్ జట్టు నరాలు తెగే ఉత్కంఠత నడుమ అద్భుత విజయం సాధించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పాక్ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 160/5తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో విండీస్ తరఫున 5 వికెట్ల ఘనత సాధించి అత్యంత పిన్న వయస్కుడిగా(19 ఏళ్లు) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం పాక్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. రోస్టన్ ఛేజ్ (22), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (55), హోల్డర్(16), జాషువా డిసిల్వా(13), కీమర్ రోచ్(30 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. హసన్ అలీ(3/37), షాహీన్ ఆఫ్రిది(4/50), ఫహీమ్ అష్రాఫ్(2/29) విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. ఓ దశలో కరేబియన్ల ఓటమి దాదాపు ఖరారైంది. ఈ సమయంలో కీమర్ రోచ్ సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 8 వికెట్లతో రాణించిన జేడెన్ సీల్స్కు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరగులు చేయగా.. విండీస్ 253 రన్స్‌కు ఆలౌటైంది. చదవండి: Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్లో ఆడతారా? -
Jason Holder: అన్ని ఫార్మాట్లలో హోల్డర్...
ఆంటిగ్వా: క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) 2021–22 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది మొత్తం 22 మంది ఆటగాళ్లకు కాంట్రాక్ట్ దక్కగా... ఈసారి మాత్రం 18 మందికే చోటు దక్కింది. కొత్త కాంట్రాక్ట్ 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20)ను జేసన్ హోల్డర్ మాత్రమే దక్కించుకున్నాడు. తొలిసారిగా ఎన్క్రుమా బ్యానర్, జోషువా డ సిల్వా, అకీలా హుసీన్, కైల్ మేయర్స్లకు సీడబ్ల్యూఐ చోటు కల్పించింది. ఇటీవల టెస్టు కెప్టెన్సీని చేపట్టిన క్రెయిగ్ బ్రాత్‌వైట్ (టెస్టు ఫార్మాట్లో), డారెన్ బ్రావో (వన్డే ఫార్మాట్లో)లు తిరిగి కాంట్రాక్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. అయితే వైట్‌బాల్ (వన్డే, టి20) కాంట్రాక్ట్ నుంచి హెట్‌మైర్, షెల్డన్ కాట్రెల్... ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ నుంచి రోస్టన్ చేజ్‌లకు ఈసారి కాంట్రాక్ట్ దక్కలేదు. కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా ఆల్ ఫార్మాట్ కాంట్రాక్ట్ (టెస్టు, వన్డే, టి20): జేసన్ హోల్డర్. రెడ్ బాల్ కాంట్రాక్ట్ (టెస్టు): క్రెయిగ్ బ్రాత్‌వైట్, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, ఎన్కుమ్రా బ్యానర్, కార్న్‌వాల్, జోషువాడ సిల్వా, షానన్ గాబ్రియెల్, కైల్ మేయర్స్, కీమర్ రోచ్. వైట్‌బాల్ కాంట్రాక్ట్ (వన్డే, టి20): కీరన్ పొలార్డ్, ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రావో, షై హోప్, అకీలా హుసీన్, ఎవిన్ లూయిస్, అల్జారీ జోసెఫ్, నికోలస్ పూరన్, హెడెన్ వాల్ష్ జూనియర్. -
శ్రీలంక 169 ఆలౌట్
నార్త్‌సౌండ్: వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ జేసన్ హోల్డర్ (5/27) నిప్పులు చెరగడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 69.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తొలుత కీమర్ రోచ్ (3/47) దెబ్బ తీయగా... అనంతరం జేసన్ హోల్డర్ హడలెత్తించడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెర పడింది. లహిరు తిరిమన్నే (70; 4 ఫోర్లు), డిక్వెల్లా (32; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ రెండో రోజు కడపటి వార్తలు అందే సమయానికి 67 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించే దిశగా సాగుతోంది. -
మ్యాచ్‌కు ముందు తండ్రి చనిపోయినా..
హామిల్టన్: న్యూజిలాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న హామిల్టన్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు వెస్టిండీస్ పేసర్ కీమర్ రోచ్ తండ్రి మృతిచెందారు. ఈ విషయాన్ని విండీస్ టీమ్ మేనేజర్ రావల్ లూయిస్ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ ప్రకటనలో తెలిపారు. రోచ్ తండ్రి మృతికి తనతో పాటు బోర్డు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కీమర్ రోచ్ త్వరలోనే స్వదేశానికి వెళతారన్నారు. మనం ప్రేమించే దూరమైతే ఆ బాధను జీర్ణించుకోవడం చాలా కష్టమన్నారు. ఈ కష్టసమయంలో రోచ్‌కు తాము అండగా ఉంటామన్నారు. కాగా, మ్యాచ్‌లో లాథమ్ వికెట్‌ను రోచ్ సాధించాడు. (చదవండి: ‘ఐపీఎల్ వేలంలో అతని కోసం పోటీ తప్పదు’) వికెట్‌ను తీసిన తర్వాత మోకాళ్లపై కూర్చొని రోచ్ సెలబ్రేట్ చేసుకున్నాడు. తన తండ్రికిచ్చే గౌరవానికి సూచకగా మోకాళ్లపై కాసేపు అలానే కూర్చుండి పోయాడు రోచ్. రోచ్ తండ్రి మృతికి సంతాపంగా ఇరుజట్ల క్రికెటర్లు చేతికి బ్లాక్ బ్యాండ్స్ కట్టుకుని బరిలోకి దిగారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(97 బ్యాటింగ్), రాస్ టేలర్(31 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ టామ్ లాథమ్(86) హాఫ్ సెంచరీ సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. విలియమ్సన్తో కలిసి 154 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. సెంచరీ చేస్తాడనుకున్న తరుణంలో కీమర్ రోచ్ బౌలింగ్‌లో లాథమ్ పెవిలియన్ చేరాడు. (చదవండి: 'క్రికెటర్ కాకపోయుంటే రైతు అయ్యేవాడు') -
భారమంతా ఆ ఇద్దరిదే!
కరీబియన్ పర్యటనలో టి20లు, వన్డేల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించినా... టెస్టులు మాత్రం అంత సులువేం కాదని టీమిండియాకు తెలిసొచ్చేలా ప్రారంభమైంది తొలి టెస్టు. ప్రత్యర్థి పేసర్ల ప్రతాపంతో స్వల్ప వ్యవధిలోనే ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోయిన భారత్ తర్వాత కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఫామ్ లేమితో విమర్శల్లో కూరుకుపోయిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం యువ సంచలనం రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు క్రీజులో ఉన్నారు. వీరిద్దరి పోరాటం మీదనే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ ఆధారపడి ఉంది. నార్త్‌సౌండ్ (అంటిగ్వా): పిచ్ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్ పేసర్లు గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియాను ఆత్మరక్షణలోకి నెట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ హోల్డర్ నిర్ణయానికి న్యాయం చేస్తూ... భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (2), కెప్టెన్ విరాట్ కోహ్లి (9)లను త్వరత్వరగా పెవిలియన్ చేర్చా రు. అయితే, రాహుల్ (97 బంతుల్లో 44; 5 ఫోర్లు), రహానే (122 బంతుల్లో 81; 10 ఫోర్లు) ఓపికతో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.117 బంతుల్లో రహానే అర్ధసెంచరీ పూర్తయింది. రహానేకు విహారి (56 బంతుల్లో 32; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. అయితే వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమయ్యారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 68.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషభ్ పంత్(41 బంతుల్లో 20 బ్యాటింగ్; 4ఫోర్లు), రవీంద్ర జడేజా(3 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరి రాణిస్తేనే కోహ్లి సేన కనీసం 300 పరుగుల మార్క్ దాటగలుగుతుంది. మరి వీరిద్దరూ ఎంతవరకు పోరాడుతారో చూడాలి. రోచ్ దెబ్బకొట్టాడు సొంతగడ్డపై టెస్టుల్లో తానెంత ప్రమాదకారినో చెబుతూ కీమర్ రోచ్ (3/34) భారత ఇన్నింగ్స్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. ఫుల్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌పై పడిన అతడి బంతిని మయాంక్ ఫ్రంట్ ఫుట్‌పై ఆడబోగా బంతి నేరుగా కీపర్ హోప్ చేతిలో పడింది. అంపైర్ ఔట్ ఇవ్వకున్నా విండీస్ రివ్యూ కోరి ఫలితం సాధించింది. భారత్‌కు అసలైన షాక్ పుజారా ఔట్ రూపంలో నాలుగు బంతుల అనంతరం తగిలింది. రోచ్ లెంగ్త్ బాల్... పుజారా బ్యాట్ అంచును సుతారంగా తాకుతూ హోప్ గ్లోవ్స్‌లోకి చేరింది. వచ్చీ రావడంతోనే రెండు బౌండరీలు బాదిన కోహ్లి జోరుకు గాబ్రియెల్ తెరదించాడు. కవర్స్ దిశగా కట్ షాట్‌కు కోహ్లి చేసిన యత్నం విఫలమైంది. అతడిచ్చిన క్యాచ్‌ను గల్లీలో బ్రూక్స్ ఒడిసిపట్టాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రహానే–రాహుల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరు 68 పరుగులు జోడించారు. విండీస్ పేసర్ల బౌలింగ్‌లో పలుసార్లు బంతి శరీరానికి తగిలినా పట్టుదలగా> నిలిచిన రాహుల్... స్పిన్నర్ చేజ్ బౌలింగ్‌లో వెనుదిరిగి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రహానే, విహారిలు క్రీజులో నిలదొక్కుకోని ఆచితూచి ఆడుతున్నారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో రోచ్ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. విహారిని బోల్తా కొట్టించాడు. మరో 14 పరుగులు వ్యవధిలోనే రహానే(81)ను గాబ్రియల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు . దీంతో కనీసం రెండు వందల పరుగులు నమోదు చేయకముందే టీమిండియా ఆరు వికెట్లను చేజార్చుకుంది. కూర్పులో అనూహ్యం తొలి టెస్టులో టీమిండియా కూర్పు కొంత ఆశ్చర్యపర్చింది. ఓపెనింగ్‌లో రాహుల్, మయాంక్‌కే ఓటేసిన టీం మేనేజ్మెంట్... ఆరో నంబరు బ్యాట్స్‌మన్‌గా విహారికి చోటిచ్చింది. ఇంకా అనూహ్యంగా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టింది. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాపై భారం వేసి బరిలో దిగింది. విహారి పార్ట్‌టైమ్ ఆఫ్‌స్పిన్ ఉపయుక్తం కాగలదని అంచనా వేసింది. కీపర్‌గా సాహాను కాదని యువ రిషభ్ పంత్‌వైపే మొగ్గింది. అశ్విన్‌ను ఆడించకపోవడంపై దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. -
వెస్టిండీస్ ఘన విజయం
నార్త్‌సౌండ్: సొంతగడ్డపై వెస్టిండీస్ మరోసారి చెలరేగింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బ్యాట్స్‌మెన్ మళ్లీ విఫలం కావడంతో ఇంగ్లండ్ శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (24)దే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీమర్ రోచ్ (4/52), కెప్టెన్ హోల్డర్ (4/43) తమ పేస్‌తో ప్రత్యర్థిని పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యాన్ని మినహాయిస్తే...14 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 13 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 2009 తర్వాత ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. మూడో టెస్టు ఈ నెల 9నుంచి గ్రాస్ ఐలెట్‌లో జరుగుతుంది. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా విండీస్ కెప్టెన్ హోల్డర్‌పై ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించడంతో తర్వాతి మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. -
రోచ్ గర్జన... ఇంగ్లండ్ 77 ఆలౌట్
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ పేసర్ కీమర్ రోచ్ (5/17) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను హడలగొట్టాడు. అతడి ధాటికి ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు గురువారం ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వెస్టిండీస్‌కు 212 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు బర్న్స్ (2), జెన్నింగ్స్ (17), కెప్టెన్ రూట్ (4), బెయిర్ స్టో (12), స్టోక్స్ (0), మొయిన్ అలీ (0), బట్లర్ (4), ఫోక్స్ (2) అంతా విఫలమయ్యారు. రోచ్ ఐదు వికెట్లను 31 బంతుల వ్యవధిలో 9 పరుగులిచ్చి పడ గొట్టడం విశేషం. అంతకుముందు ఆతిథ్య జట్టు 289 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మైర్ (81; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడైన ఇన్నింగ్స్, షై హోప్ (57), చేజ్ (54) అర్ధ సెంచరీలతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అండర్సన్ (5/46)కు ఐదు, స్టోక్స్ (4/59)కు నాలుగు వికెట్లు దక్కాయి. -
తొలి టెస్టుకు రోచ్ దూరం
రాజ్‌కోట్: ప్రధాన పేసర్ కీమర్ రోచ్ లేకుండానే వెస్టిండీస్ తొలి టెస్టు బరిలో దిగనుంది. అమ్మమ్మ మృతితో స్వదేశానికి వెళ్లిన అతడు ఇంకా తిరిగి రాలేదు. ఈ కారణంగానే రోచ్ బోర్డు ఎలెవెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అతడు తొలి టెస్టు మధ్యలో జట్టుతో చేరే అవకాశం ఉందని కోచ్ స్టువర్ట్ లా తెలిపారు. మరో పేసర్ జోసెఫ్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టులో గాబ్రియెల్ జతగా కీమో పాల్ విండీస్ పేస్ భారాన్ని పంచుకునే అవకాశం ఉంది. -
18 నెలలు తరువాత టెస్టు జట్టులోకి..
ఆంటిగ్వా:సుదీర్ఘ విరామం తరువాత వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కీమర్ రోచ్‌కు జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కింది. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో చివరిసారి కనిపించిన రోచ్.. ఇంగ్లండ్ కు పయనమయ్యే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్ ల్లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న రోచ్ ను ఇంగ్లండ్ తో ఆడే మూడు టెస్టులకు ఎంపిక చేస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెస్టు జట్టును శనివారం ప్రకటించారు. టెస్టు అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన రో్చ్ ను ఎంపిక చేయడానికి అతని ఫామ్ కారణమని విండీస్ సెలక్షన్ చైర్మన్ కర్ట్నీ బ్రౌన్ తెలిపారు. ఇప్పటివరకూ 37 టెస్టుల్లో ఆడిన రోచ్ 122 వికెట్లు సాధించాడు. దాదాపు 18 నెలలు తరువాత రోచ్ కు తిరిగి జట్టులో స్థానం దక్కడం విశేషం. -
కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!
బ్రిడ్జ్ టౌన్: వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. రోచ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ వాహనం అదుపుతప్పడంతో బ్రిడ్జ్ టౌన్ నగర శివారులోని వన్స్టీడ్ డ్రైవ్ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది. ఓవల్ క్రికెట్ స్టేడియానికి సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో కారు పలుమార్లు పల్టీలు కొట్టిందని బార్బోడోస్ చెందిన వెబ్ సైట్ తెలిపింది. ఈ ప్రమాదంలో రోచ్ తలకు గాయమైందని... ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. వెస్టిండీస్ తరపున 23 టెస్టులు, 61 వన్డేలు ఆడిన రోచ్ గాయం కారణంగా ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. -
రోచ్ అవుట్, వన్డేలకు పొలార్డ్ దూరం
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై గాయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పేసర్ కెమర్ రోచ్ గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ వన్డేలకు దూరమయ్యాడు. రోచ్ భుజంనొప్పి కారణంగా రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక పొలార్డ్‌కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. భారత పర్యటనలో కరీబియన్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌కు విండీస్ జట్టును ప్రకటించారు. జట్టు: డ్వెన్ బ్రావో (కెప్టెన్), టినో బెస్ట్, డారెన్ బ్రావో, చార్లెస్, డియోనరైన్, క్రిస్ గేల్, హోల్డర్, సునీల్ నరైన్, పెరుమాళ్, పావెల్, రాందిన్, రాంపాల్, డారెన్ సామీ, శామ్యూల్స్, సిమన్స్.