భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై గాయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై గాయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పేసర్ కెమర్ రోచ్ గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా, ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ వన్డేలకు దూరమయ్యాడు.
రోచ్ భుజంనొప్పి కారణంగా రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఇక పొలార్డ్కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. భారత పర్యటనలో కరీబియన్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్కు విండీస్ జట్టును ప్రకటించారు.
జట్టు: డ్వెన్ బ్రావో (కెప్టెన్), టినో బెస్ట్, డారెన్ బ్రావో, చార్లెస్, డియోనరైన్, క్రిస్ గేల్, హోల్డర్, సునీల్ నరైన్, పెరుమాళ్, పావెల్, రాందిన్, రాంపాల్, డారెన్ సామీ, శామ్యూల్స్, సిమన్స్.