Pollard
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. సీనియర్ బౌలర్ రీ ఎంట్రీ
భారత్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. సీనియర్ బౌలర్ కెమర్ రోచ్‌తో పాటు న్క్రుమా బోన్నర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా బ్రాండన్ కింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు కీరన్ పొలార్డ్ సారథ్యం వహించనున్నాడు. కాగా వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. మూడు వన్డేలు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (సి), ఫాబియన్ అలెన్, న్క్రుమా బోన్నర్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కెమర్ రోచ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: IND Vs WI: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్; తొలి వన్డేకు రాహుల్ దూరం -
టీమిండియా కెప్టెన్‌కు అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విస్డెన్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రకటించిన మేల్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా ఎంపికైన కోహ్లికి మరో అత్యుత్తమ గౌరవం లభించింది. 2011 వన్డే ప్రపంచకప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన కోహ్లి.. దశాబ్ద కాల వ్యవధిలో 60కిపైగా సగటుతో 11000కుపైగా పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి.. భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు. రెండేళ్ల అనంతరం 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా విరాట్ అద్భుతంగా రాణించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ఫైనల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను భారత కీర్తిపతాకను మరోసారి రెపరెపలాడించాడు. 2010 దశాబ్దంలో జరిగిన 5 ఐసీసీ టోర్నీల్లో కోహ్లి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ప్రతి టోర్నీలో కనీసం సెమీస్ వరకు చేరుకోగలిగింది. కాగా, కోహ్లి తన ఓవరాల్ వన్డే కెరీర్లో 254 మ్యాచ్‌ల్లో 59.7 సగటుతో 12169 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక మహిళల విభాగంలో ఆసీస్ క్రికెటర్ బెత్ మూనీ విస్డెన్ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకుంది. కాగా, విస్డెన్ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టును కూడా ప్రకటించింది. ఆ జట్టుకు కోహ్లినే నాయకుడిగా ఎంపిక చేసింది. విస్డెన్ దశాబ్దపు ఉత్తమ టెస్ట్ జట్టు: అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), వార్నర్(ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), కోహ్లి(కెప్టెన్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), సంగక్కర(శ్రీలంక), బెన్ స్టోక్స్(ఇంగ్లండ్), అశ్విన్(భారత్), స్టెయిన్(దక్షిణాఫ్రికా), బ్రాడ్(ఇంగ్లండ్), ఆండర్సన్(ఇంగ్లండ్) చదవండి: విలియమ్సన్‌ను ఆడించకపోవడంపై ఎస్ఆర్హెచ్ క్లారిటీ -
మనదే పైచేయి
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్...80వ దశకంలో భారత్‌పై కూడా గర్జించింది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. భారత్ గేర్ మార్చుకుంది. వన్డేల్లో సొంత గడ్డపై కరీబియన్‌ను మట్టికరిపిస్తూనే ఉంది. గడిచిన పుష్కర కాలంగా 4 వన్డేల సిరీస్ జరిగినా... 5 వన్డేల్లో తలపడినా... 3 వన్డేలు... ఇలా సిరీస్ ఏదైనా విజేత మాత్రం భారతే. అంతగా రాటుదేలింది టీమిండియా. సాక్షి క్రీడా విభాగం: వెస్టిండీస్ ఇటు వన్డేల్లో, అటు టి20ల్లో రెండేసి సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో, ఎదురుదాడి బ్యాటింగ్‌తో ప్రపంచ ప్రత్యర్థుల్నే వణికించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. తమ దీవుల్లో జరిగే కరీబియన్ లీగ్ పుణ్యమాని ఇప్పుడు టి20ల్లో సత్తా చాటుతున్నప్పటికీ... వన్డేల్లో మాత్రం నిలకడలేని ఆటతీరుతో చతికిలబడుతోంది. అలనాడు భారత్‌లోనూ విండీస్‌ది అద్భుతమైన రికార్డు. 1983 సీజన్లో ఇక్కడ ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో, 1987 సీజన్లో ఏడు వన్డేల సిరీస్‌ను 6–1తో గెలిచిన అసాధారణ జట్టు వెస్టిండీస్. కానీ ఆ తర్వాత... మళ్లీ ఆడేందుకు ఇక్కడికి వస్తే మాత్రం కరీబియన్ సిరీస్‌లు కాదు కదా... మ్యాచ్‌లు గెలిచేందుకే ఆపసోపాలు పడుతోంది. 90 దశకంలో భారత్ ఆధిపత్యం... ప్రపంచ వ్యాప్తంగా వెస్టిండీస్ 80వ దశకంలో ఎక్కడ ఆడినా గెలిచేది. కానీ 90 నుంచి తిరోగమనం మొదలైంది. భారత్ పైచేయి సాధించడం కూడా ప్రారంభమైంది. కరీబియన్‌తో ముఖాముఖి సిరీస్‌లతో పాటు, విండీస్ ఆడేందుకు వచి్చన హీరో కప్ (1993), విల్స్ వరల్డ్ సిరీస్ (1994)లలో భారతే విజేతగా నిలిచింది. సొంతగడ్డపై భారత్ గర్జిస్తుంటే బ్యాటింగ్ దిగ్గజం లారా, బౌలింగ్ లెజెండ్స్ వాల్‡్ష, అంబ్రోస్‌లు ఉన్న విండీస్ జట్టు ఏమీ చేయలేకపోయింది. రిక్తహస్తాలతోనే తిరుగుముఖం పట్టేది. దీంతో ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ స్వర్ణయుగం కరిగిపోయింది. తర్వాత ఓ మామూలు జట్టుగా మిగిలిపోయింది. ఆటగాళ్ల వైఫల్యం, బోర్డు రాజకీయాలు, కాంట్రాక్టు వివాదాలు, సంక్షోభం ఇలా అన్నింటితో సతమతమై ఇప్పుడు కొన్ని మెగా టోర్నీల్లో క్వాలిఫయింగ్ ఆడే పరిస్థితికి దిగజారింది. 12 ఏళ్లుగా టీమిండియాదే విక్టరీ... గుడ్డిలో మెల్లగా వెస్టిండీస్‌ను దశాబ్దాల తర్వాత 2002 సీజన్ ఆదుకుంది. ఆ ఏడాది భారత్‌కు వచ్చిన విండీస్ మొదట టెస్టు సిరీస్ ఓడిపోయినా... సుదీర్ఘంగా సాగిన ఏడు వన్డేల సిరీస్‌లో టీమిండియాను భారత గడ్డపై 4–3తో కంగుతినిపించింది. క్రిస్ గేల్ రెండు శతకాలతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత భారత్‌లో ముఖాముఖి వన్డే సిరీస్‌కు రావడం, ఓడిపోవడం రివాజుగా జరిగేవి. 2007 నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు భారతగడ్డపై అడుగుపెట్టిన కరీబియన్ జట్టు పరాజయంతోనే తిరుగు పయనమైంది. 2007తో పాటు 2011, 2013, 2014, 2018దాకా ఇరు జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ ఐదు సిరీస్‌లలోనూ ప్రత్యర్థి జట్టు ఒక మ్యాచ్‌కు మించి గెలవలేకపోవడం భారత ఆధిపత్యానికి నిదర్శనం. ఒకటేమో ‘టై’ అయింది. ఈసారి వన్డే సిరీస్‌లోనూ కోహ్లి సేనే ఫేవరెట్ కొన్నాళ్లుగా భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవలే ముగిసిన టి20 సిరీస్‌లోనూ భారత్ ఆల్‌రౌండ్ ప్రతాపం తెలిసిందే. బ్యాటింగ్‌లో టాపార్డర్ దుర్భేద్యంగా తయారైంది. రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి ఈ ముగ్గురు నిలబడితే ఎంతటి బౌలింగ్ అయినా చెల్లాచెదురు కావాల్సిందే. గత ఆఖరి టి20లో విండీస్ బౌలర్లకు ఇది బాగా గుర్తయింది. ఇక బౌలింగ్‌లోనూ షమీ, దీపక్ చాహర్ పేస్‌కు కుల్దీప్, చహల్, జడేజాల స్పిన్ అండ ఉండనే ఉంది. ఎటొచ్చి జట్టు మేనేజ్మెంట్ బెంగంతా మిడిలార్డర్, ఫీల్డింగ్‌లపైనే ఉంది. పొట్టి క్రికెట్లో భారత ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌ల్ని నేలపాలు చేశారు. అదే విధంగా నిలకడలేని మిడిలార్డర్ వైఫల్యంతోనే రెండో టి20ని కోల్పోయింది. ఈ రెండు విభాగాలపై జట్టు సహాయ సిబ్బంది కన్నేస్తే భారత జోరుకు తిరుగుండదు. మీకు తెలుసా... ఈ ఏడాది భారత్ బాగానే ఆడినట్లు కనిపించింది. వరుసబెట్టి సిరీస్‌ల్లో పాల్గొంటుంది... గెలుస్తుంది. కానీ స్వదేశంలో మాత్రం ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడింది. అది మార్చిలో ఆ్రస్టేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా అందులో 2–3తో ఓడింది. ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లు ఆడింది. ఇక ఈ ఏడాది భారత్ ఆడే ఆఖరి వన్డే సిరీస్ ఇదే. దీన్ని విజయంతో ముగించాలని కోహ్లిసేన గట్టి పట్టుదలతో ఉంది. గాయంతో భువనేశ్వర్ ఔట్ చెన్నై: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ గాయపడ్డాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సీనియర్ సీమర్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో అతని స్థానంలో యువ పేసర్ శార్దుల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశముంది. ఈ ఏడాది భువీని గాయాలు చికాకు పెడుతున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో అతను తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. పాక్‌తో మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాల్సి వచి్చంది. మళ్లీ సెమీఫైనల్లో ఆడినప్పటికీ... తదనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన సిరీస్‌లకు అతను దూరమయ్యాడు. ఎట్టకేలకు విండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌తో పునరాగమనం చేసిన అతను మళ్లీ వన్డేలకు దూరం కావడం జట్టు వర్గాలను ఆందోళన పరుస్తోంది. భువీ గాయంపై ఇంకా బోర్డు గానీ, జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్గానీ అధికారికంగా వెల్లడించలేదు. ►55 వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత జట్టు ఇప్పటివరకు 55 వన్డేలు ఆడింది. టీమిండియా 27 మ్యాచ్‌ల్లో... విండీస్ కూడా 27 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ►130 ఓవరాల్‌గా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డేల సంఖ్య. భారత్ 62 మ్యాచ్‌ల్లో... విండీస్ కూడా 62 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగియగా... నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
మెరిసేదెవరో... మెప్పించేదెవరో?
భాగ్యనగరం ఎన్నో ఐపీఎల్ టి20 మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. కానీ అంతర్జాతీయ మెరుపులే లేవు. వన్డే, టెస్టులకు ఆతిథ్య మిచ్చిన ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పుడు ఆ ‘పొట్టి’ లోటునూ తీర్చు కునేందుకు సిద్ధమైంది. ఫామ్‌లో ఉన్న కోహ్లి సేన జోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు భాగ్యనగర క్రికెట్ ప్రియులు పోటెత్తనున్నారు. ‘ఢీ’కొట్టేందుకు వెస్టిండీస్ ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: భారత కుర్రాళ్లను ఇప్పుడు ఐపీఎల్ వేలమే కాదు... వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్ కూడా ఊరిస్తోంది. తమ నిలకడైన ప్రదర్శనతో అటు ఫ్రాంచైజీలు, ఇటు సెలక్టర్ల కంట పడేందుకు యువ ఆటగాళ్లకు విండీస్‌తో సిరీస్ చక్కని అవకాశం కలిపిస్తోంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్లో హిట్టయినా... టీమిండియా తరఫున ఫ్లాపవుతున్న ఆటగాళ్లు మనసుపెడితే చోటు ఖాయం చేసుకునే తరుణం కూడా ఇదే! ఐపీఎల్ వేలానికి ముందు జరుగుతున్న సిరీస్ కాబట్టి ఎవరు మెరిపిస్తే వాళ్లపైనే కాసులు కురుస్తాయన్న సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుకు ఆడే కుర్రాళ్లు అందివచి్చన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడ్డారు. నడిపించే నాయకుడొచ్చాడు... బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లి మళ్లీ జట్టును నడిపించేందుకు రావడమే భారత్‌కు సగం బలం. భారత విజయవంతమైన సారథి ఫామ్‌కు ఏ ఢోకా లేదు. ఆడేది ముందయినా... తర్వాత ఛేదన అయినా తన వంతు మెరుపులు మెరిపిస్తాడు. చాన్నాళ్ల తర్వాత టి20 జట్టులోకి కీలక బౌలర్లు పునరాగమనం చేశారు. పేసర్లు భువనేశ్వర్, షమీ, కుల్దీప్లు పొట్టి మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. జట్టు కూర్పులో భాగంగా ఇద్దరేసి సీమర్లు, స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్, షమీకి తుది జట్టులో చాన్స్ లేకపోవచ్చు. ఇటీవల యువ పేసర్ దీపక్ చాహర్ చెలరేగుతుండటంతో కోహ్లి ఈ కుర్రాడివైపే మొగ్గుచూపొచ్చు. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో అక్కరకొస్తాడు. కాబట్టి యజువేంద్ర చహల్‌కు జతగా జడేజానే కోహ్లి ఎంపికవుతుంది. దీంతో కుల్దీప్ బెంచ్‌కే పరిమితం కావాలి. మిడిలార్డర్లో అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబేల స్థానాలకు ఢోకా లేదు. రాహుల్‌కు భలే చాన్సులే! రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం లోకేశ్ రాహుల్‌కు వరమైంది. దీంతో ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కుతుంది. ఇక్కడ మెరుపులు మెరిపిస్తే రోహిత్‌కు రెగ్యులర్ భాగస్వామి కూడా కావొచ్చు. పైగా టి20ల్లో రాహుల్‌కు మంచి రికార్డే ఉంది. 31 పొట్టి మ్యాచ్‌ల్లో 42.74 సగటుతో 974 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లోనూ వీరబాదుడు బాదిన సంగతి తెలిసిందే. మరో యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో తానేంటో నిరూపించుకోవాలి. కెప్టెన్, జట్టు మేనేజ్మెంట్ నుంచి కావాల్సినంత సహకారం లభిస్తున్నా... ఇంకా జట్టులో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ధోని వారసుడిగా వచి్చన పంత్ నిలకడలేని ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను విండీస్‌పైనా పట్టుదలతో రాణించాల్సిన అవసరముంది. అనుభవలేమి అసలు సమస్య... అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం ప్రస్తుత వెస్టిండీస్‌కు పెద్ద సమస్య. ఈ ఐపీఎల్లో ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించిన రసెల్ సహా, బ్రాత్‌వైట్, బ్రేవోలను కాదని వెస్టిండీస్ పూర్తిగా యువ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చింది. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో హిట్టర్ నికోలస్ పూరన్ కూడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో పర్యాటక జట్టు బ్యాటింగ్ లైనప్ ప్రధానంగా ఓపెనర్లు ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, హెట్‌మైర్, కెప్టెన్ పొలార్డ్‌లపైనే ఆధారపడి ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే హోల్డర్, కీమో పాల్, కాట్రెల్‌లపై జట్టు నమ్మకం పెట్టుకుంది. భారత్‌లో ఆడిన అనుభవం తమకు వుందని, యువసత్తాతోనే కోహ్లిసేను ఓడిస్తామని పొలార్డ్ చెప్పాడు. పిచ్, వాతావరణం ఇప్పటిదాకా పొట్టిఫార్మాట్లో ఈ పిచ్ బౌలర్లకు బాగా కలిసొచ్చింది. ఐపీఎల్లో హోమ్ టీమ్ సన్‌రైజర్స్ బౌలర్లు తమ బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోరు చేసినా నిలబెట్టిన సందర్భాలున్నాయి. చల్లటి సాయంత్రం వర్షం ముప్పేమీ లేదు. మంచు ప్రభావం దృష్ట్యా పిచ్‌ను పూర్తిగా కప్పి ఉంచారు. మూడో కంటికి నోబాల్... ఇప్పటిదాకా నోబాల్‌ను ఫీల్డు అంపైర్లే చూసేవారు. వారు చూసినపుడు నోబాల్... లేదంటే లేదు. కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్‌కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో పెవిలియన్ చేరిన సందర్భాలున్నాయి. అయితే నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. భారత్, వెస్టిండీస్‌ల సిరీస్‌తో నోబాల్ నిర్ణయాధికారం థర్డ్ అంపైర్ పరిధిలోకి వెళ్తుందని ఐసీసీ తెలిపింది. ►8 భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గగా... విండీస్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. విండీస్‌తో జరిగిన చివరి 5 టి20ల్లో భారత్‌నే విజయం వరించింది. ►1 మరో సిక్స్ కొడితే అంతర్జాతీయ క్రికెట్లో (టెస్టు, వన్డే, టి20) 400 సిక్స్‌లు పూర్తి చేసుకోనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 399 సిక్స్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ (534 సిక్స్‌లు), షాహిద్ అఫ్రిది (476 సిక్స్‌లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ►టి20 క్రికెట్లో ఆరుగురి బౌలింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎంచుకున్న ఐదుగురు బౌలర్లు అన్ని ఓవర్ల (నాలుగు ఓవర్ల కోటా)ను అద్భుతంగా వేస్తారని ఆశించలేం. అందుకే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలి. ప్రపంచకప్ కోసం జట్టులో పేసర్ల మధ్యే పోటీ నెలకొంది. బుమ్రా, భువనేశ్వర్, షమీలతో పాటు యువ బౌలర్ దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాప్–4లో రోహిత్, రాహుల్, నేను, అయ్యర్ పదిలంగా ఉన్నాం. రిషభ్‌కు మిడిలార్డర్లోనే అవకాశమిస్తాం. అతను ధోనిలా అనుకరించి విఫలమైనంత మాత్రానా ధోని పేరుతో వెక్కిరించడం ధోని స్థాయిని కించపరచడమే అవుతుంది. పంత్‌లో సహజసిద్ధమైన ప్రతిభవుంది. అవకాశాలు ఇస్తే నిలకడైన బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకునే సత్తా అతనిలో ఉంది. –భారత కెప్టెన్ కోహ్లి ►నాకు భారత్‌లో ఆడిన అనుభవముంది. ప్రస్తుతం ఇదే మాకు అక్కరకొస్తుంది. ఆతిథ్య దేశానికి సవాల్ విసిరేందుకు మా కుర్రాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యాం. తప్పకుండా మా వాళ్లు రాణిస్తారు. ప్రపంచ క్రికెట్లో భారత్ మేటి ప్రత్యర్థి. టెస్టుల్లో నంబర్‌వన్ అయిన జట్టును మేం ధీటుగా ఎదుర్కొంటాం. మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం. అందుబాటులో ఉన్న అవకాశాల్ని వినియోగించుకుంటాం. ఒకరిద్దరి ఆటగాళ్ల చుట్టూనే తిరగం. వారిపై ఆధారపడం. జట్టుగా ఏం చేయాలో... ఎలా పోరాడాలో మాకు తెలుసు. –వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ -
నా భార్యకు అంకితం
ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై వీర విజృంభణతో ముంబై గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించిన తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్... తమ గెలుపును భార్యకు అంకితమిస్తున్నానని చెప్పాడు. బుధవారం పొలార్డ్ భార్య జెనా అలీ పుట్టిన రోజు కావడం విశేషం. రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు సారథ్యం వహించిన పొలార్డ్ క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును విజయం వైపు నడిపించాడు. జట్టు గెలుపు అనంతరం అతని కుమారుడు కైడెన్ పొలార్డ్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తనకు బలంగా బాదగలిగే శక్తి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేను భగవంతునితో పాటు నా భార్యకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నా. ఆమె పుట్టిన రోజు నాడే నేను కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాను. చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. వాంఖెడేలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతానన్న పొలార్డ్ ఎక్కువ బంతులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లానని తెలిపాడు. ‘మేం బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలర్ల సహకరించకపోవడం మాకు మేలు చేసింది. దీంతో మా పని సులువైంది. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది’ అని పొలార్డ్ వివరించాడు. తదుపరి గేమ్‌కు తమ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. -
ముంబైని గెలిపించిన పొలార్డ్
భారీ స్కోర్ల మ్యాచ్‌లో బ్యాట్లు శివాలెత్తాయి. బౌలర్లు విలవిల్లాడారు. ప్రేక్షకులేమో పరుగుల విలయానికి కళ్లప్పగించారు. మొదట గేల్ చితగ్గొడితే, రాహుల్ శతక్కొట్టాడు. పంజాబ్‌కు భారీస్కోరు అందించారు. తర్వాత ముంబైని కెప్టెన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయం దిశగా నడిపించాడు. చివర్లో ఉత్కంఠ రేకెత్తినా... ముంబై లక్ష్యాన్ని పూర్తిచేసింది. ముంబై: ప్రత్యర్థి జట్టులో ఇద్దరి మెరుపులపై ఒకే ఒక్కడి (పొలార్డ్) విధ్వంసం పైచేయి సాధించింది. ఐపీఎల్లో బుధవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 100; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిస్ గేల్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసి గెలిచింది. పొలార్డ్ (31 బంతుల్లో 83; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) రాణించాడు. షమీకి 3 వికెట్లు దక్కాయి. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో సిద్ధేశ్ లాడ్ తుది జట్టులోకి రాగా, పంజాబ్ కూడా ఒక మార్పు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో కరుణ్ నాయర్‌కు అవకాశమిచ్చింది. నాయర్‌కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. గేల్ సుడిగాలి ఫిఫ్టీ పంజాబ్ ఆట నెమ్మదిగా మొదలైంది. ఓపెనర్లు గేల్, రాహుల్ బ్యాట్ ఝళిపించేందుకు 4 ఓవర్ల సమయం పట్టింది. బెహ్రెన్‌డార్ఫ్ తొలి ఓవర్లో ఒకటే పరుగొచ్చింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో 3, బెహ్రెన్‌డార్ఫ్ మరుసటి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్‌లో అల్లాడించిన అల్జారి జోసెఫ్ బౌలింగ్‌కు దిగాడు. 4 బంతులు బాగానే వేసినా ఐదో బంతిని రాహుల్ సిక్సర్‌గా మలచడంతో అత్యధికంగా 9 పరుగులు రాగా... నాలుగు ఓవర్లలో పంజాబ్ మొత్తం 20 పరుగులు చేసింది. ఇక ఐదో ఓవరైతే గేల్ శివతాండవంతో నాలుగుసార్లు బంతి బౌండరీని దాటింది. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో మొదట రాహుల్ ఓ పరుగుతీశాడు. తర్వాత గేల్ 6, 6, 0, 4, 6తో ఏకంగా 23 పరుగులొచ్చాయి. జట్టు స్కోరు ఆరుబంతుల వ్యవధిలోనే 43/0కు చేరుకుంది. అల్జారి బౌలింగ్‌నూ రాహుల్ తేలిగ్గా ఎదుర్కొన్నాడు. 6, 4తో జోరుపెంచాడు. ఓపెనింగ్ ఊపుమీదున్న ఈ దశలో లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సుడి‘గేల్’ 6, 4, 4 తాకిడితో పరుగుల హోరు పెరిగింది. తొలి సగం (10) ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోని కింగ్స్ 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గేల్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తయ్యింది. జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే రాహుల్ కూడా 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌండరీలకు తెగబడుతున్న గేల్ విధ్వంసానికి బెహ్రెన్‌డార్ఫ్ చెక్ పెట్టడంతో 116 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ తొలి శతకం గేల్ నిష్క్రమణ తర్వాత పంజాబ్ స్కోరు వేగం తగ్గింది. స్వల్ప వ్యవధిలో మిల్లర్ (7), కరుణ్ నాయర్ (5)లను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 14 నుంచి 17వరకు నాలుగు ఓవర్లలో పంజాబ్ కేవలం 26 పరుగులే చేసింది. మళ్లీ 18వ ఓవర్ నుంచి పంజాబ్ మెరుపులు మొదలయ్యాయి. బుమ్రా వేసిన ఈ ఓవర్లో కరన్ రెండు వరుస ఫోర్లు కొట్టి ఔట్కాగా... రాహుల్ మరో ఔండరీ బాదాడు. 16 పరుగులు లభించడంతో జట్టు స్కోరు 150 దాటింది. ఇక మిగిలింది రెండే ఓవర్లు. రాహుల్ 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ ఆశలైతే లేవు. కానీ హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో రాహుల్ ఒక్కసారిగా చెలరేగాడు. 6, 4, 6, 6, సింగిల్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. 92 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్ తొలి బంతికే రాహుల్ సిక్సర్ బాదాడు. బుమ్రా రెండు బంతుల్ని డాట్‌గా వేశాడు. తర్వాత బంతికి 2 పరుగులు తీసి 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ముంబై తడబాటు తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మెరుపు అరంభాన్నిచ్చే ప్రయత్నం చేశాడు సిద్ధేశ్ లాడ్. డికాక్‌తో కలిసి పరుగులవేటకు దిగిన అతను తొలి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 10 పరుగులు చేశాడు. తర్వాత ఓవర్ వేసిన షమీ కేవలం మూడే పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను షమీ మరింత కట్టుదిట్టంగా వేశాడు. పరుగు మాత్రమే ఇచ్చి సిద్ధేశ్ (15) ఆట ముగించాడు. దీంతో సూర్యకుమార్ జతయ్యాడు. ఇద్దరు పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా సరిగ్గా జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. భారీ లక్ష్యం ముందుండగా... మెరుపుల్లేకుండా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను వరుస ఓవర్లలో కరన్, అశ్విన్ దెబ్బతీశారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సూర్యకుమార్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను కరన్ ఔట్ చేయగా, మరుసటి ఓవర్లో డికాక్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను అశ్విన్ బోల్తాకొట్టించాడు. పొలార్డ్ విధ్వంసం ముంబై తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 65 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో ఇంకా 133 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు 13 పరుగులకు మించి చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పొలార్డ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కరన్ బౌలింగ్‌లో 6, 4, 6తో 18 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి పొలార్డ్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి బౌలర్‌కు సమీపంలో ఉన్నా... లేని పరుగుకు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) రనౌటయ్యాడు. కెప్టెన్‌కు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. ఈ జోడి 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 135/5. ఇక ఆఖరి 30 బంతుల్లో ముంబై విజయానికి 63 పరుగులు కావాలి. ఈ దశలో 16వ ఓవర్ల్లో పాండ్యా బ్రదర్స్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. షమీ తొలి బంతికి హార్దిక్ (19; 2 ఫోర్లు), నాలుగో బంతికి కృనాల్ (1) వెనుతిరిగారు. ఇక ముంబై ఆశలు పొలార్డ్‌పైనే పెట్టుకుంది. అల్జారి జోసెఫ్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతుల్లోనే (1 ఫోర్, 7 సిక్స్‌లు) అర్ధసెంచరీని పూర్తి చేసుకున్న పొలార్డ్... కరన్ వేసిన 19వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి వుండగా... ఈ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో 17 పరుగులు సాధించాడు. ఇక ఆఖరి 6 బంతులకు 15 పరుగులు కావాలి. అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతి నోబాల్ కాగా పొలార్డ్ సిక్సర్‌గా మలిచాడు. మరుసటి బంతి బౌండరీకి వెళ్లింది. దీంతో ఐదు బంతులకు 4 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ దశలో పొలార్డ్ ఔట్ కాగా... ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సివుండగా అల్జారి మిడాన్‌లో షాట్ కొట్టి చకచకా 2 పరుగులు పూర్తి చేయడంతో ముంబై గెలిచింది. రోహిత్ శర్మకు గాయం పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ కుడి కాలి కండరాలు పట్టేశాయి. అతను కోలుకున్నా... ముందు జాగ్రత్తగా ముంబై ఇండియన్స్ అతడికి విశ్రాంతినిస్తూ పంజాబ్‌తో మ్యాచ్‌లో పక్కన పెట్టింది. ఐపీఎల్లో రోహిత్ మ్యాచ్‌కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్ ఆడలేదు. రోహిత్ స్థానంలో ఈ మ్యాచ్ లో సిద్ధేశ్ లాడ్‌కు అవకాశం దక్కింది. సిద్ధేశ్ తండ్రి దినేశ్ లాడ్...రోహిత్‌కు చిన్ననాటి కోచ్ కావడం విశేషం. 2015 ఐపీఎల్‌లోనే సిద్ధేశ్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్ నాలుగేళ్ల పాటు జట్టుతో ఉంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అతనికి ఐపీఎల్లో ఇదే మొదటి మ్యాచ్. -
పొ‘లార్డ్’ ఇన్నింగ్స్
-
పొ‘లార్డ్’ ఇన్నింగ్స్
►ముంబై ఇండియన్స్ సంచలన విజయం ►నాలుగు వికెట్లతో బెంగళూరు ఓటమి ►బద్రీ హ్యాట్రిక్ వృథా ఆఖరి ఐదు, ఆరు ఓవర్లలో కొన్ని షాట్లు కొట్టడం తప్ప సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం పొలార్డ్ వల్ల కాదు... గత మ్యాచ్‌లో విఫలమైన తర్వాత విండీస్ క్రికెటర్ గురించి ముంబైకర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్య ఇది. దానికి ఘాటుగానే జవాబిచ్చిన పొలార్డ్ ఇప్పుడు తన బ్యాట్‌తో మైదానం నుంచి కూడా పంచ్ విసిరాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి తనదైన శైలిలో చెలరేగిన అతను తన విలువేమిటో చూపించాడు. 143 పరుగుల లక్ష్యఛేదనలో... 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి పొలార్డ్, కృనాల్ పాండ్యా మెరుపులతో ముంబై విజయతీరం చేరింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కోహ్లి చెలరేగినా, ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత బౌలింగ్‌లో సామ్యూల్ బద్రీ ‘హ్యాట్రిక్’తో ఆ జట్టులో ఆశలు రేపాడు. కానీ చిన్నస్వామిలో చివరకు ఫలితం ఆర్సీబీకి ప్రతికూలంగానే వచ్చింది. బెంగళూరు: తొలి మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కీరన్ పొలార్డ్ (47 బం తుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో బద్రీ ‘హ్యా ట్రిక్’ సహా 4 వికెట్లతో చెలరేగినా ఫలితం లేకపోయింది. సూపర్ కోహ్లి... గత ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారించిన కోహ్లి ఈ సీజన్లో తాను బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. సౌతీ వేసిన మూడో ఓవర్లో భారీ సిక్సర్‌తో పాటు రెండు వరుస బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో గేల్ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్సర్) తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. గేల్‌ను హార్దిక్ అవుట్ చేయడంతో 63 పరుగుల (56 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో ‘పాండ్యా బ్రదర్స్’ హార్దిక్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 4 ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. 14వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో డివిలియర్స్ (19) సిక్సర్ కొట్టగా... కోహ్లి రెండు వరుస బౌండరీలను బాది 39 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే ఐదు పరుగుల వ్యవధిలో కోహ్లి, డివిలియర్స్ (19; 1 సిక్స్) అవుటైన తర్వాత బెంగళూరు కోలుకోలేకపోయింది. మెరుపు భాగస్వామ్యం... సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను బద్రీ వణికించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బద్రీ ‘హ్యాట్రిక్’ సాధించడంతో ముంబై తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బద్రీ ధాటికి వరుస బంతుల్లో పార్థివ్ (3), మెక్లీనగన్ (0), రోహిత్ (0) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ రాణా (11)ను కూడా అవుట్ చేసి బద్రీ తన ఖాతాలో నాలుగో వికెట్‌ను వేసుకున్నాడు. విజయంపై బెంగళూరు ఆశలు పెట్టుకున్న ఈ దశలో పొలార్డ్, కృనాల్ పాండ్యా భాగస్వామ్యం ముంబైకి మళ్లీ ఊపిరి పోసింది. వీరిద్దరు ఫోర్లు, సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. పొలార్డ్ అవుటయ్యాక కృనాల్‌కు హార్దిక్ (9 నాటౌట్) అండగా నిలవడంతో ముంబై 7 బంతులు ఉండగానే గెలిచింది. ►16 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ సింగ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. -
పొలార్డ్‌ను తీసేయండి: వకార్
షార్జా: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమి ప్రధాన కారణమైన ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డను తదుపరి మ్యాచ్ ల్లో నుంచి తీసేయడమే సరైన చర్యని దిగ్గజ ఆటగాడు వకార్ యూసన్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో విండీస్ విజయానికి ఓవర్ కు 12 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజ్ లో ఉన్న పొలార్డ్ అత్యంత ఉదాసీనతను ప్రదర్శించి ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడన్నాడు. కనీసం గెలుపు కోసం ప్రయత్నించని పొలార్డ్ ను చివరి వన్డే నుంచి తొలగించాలని విండీస్ కు సూచించాడు. టీ 20లో పొలార్డ్ ఇలా ఆడటం ఎప్పుడూ చూడలేదు. కీలకమైన వన్డేలో పొలార్డ్ చాలా అలసత్వం ప్రదర్శించి జట్టు నైతికతను దెబ్బతీశాడు. అతను క్రీజ్ లో ఉండి కొట్టింది కేవలం ఒక ఫోర్ మాత్రమే. ఇది ఉదాసీనత కాకపోతే ఏంటి. ప్రస్తుతం అతనికి బ్రేక్ అవరసం. నేను అనుకుంటున్నట్లే విండీస్ సెలక్షన్ కమిటీ కూడా భావిస్తుందని అనుకుంటున్నా' అని వకార్ యూనస్ తెలిపాడు. -
ప్రపంచ కప్: పొలార్డ్, బ్రావో అవుట్
సెయింట్ జాన్స్: వన్డే ప్రపంచ కప్‌లో పొల్గొనే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో సీనియర్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్‌లకు చోటు దక్కలేదు. విండీస్ సెలక్టర్లు సీనియర్లయిన వీరిద్దరినీ పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. ప్రపంచ కప్‌నకు 15 మందితో కూడిన విండీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. జాసన్ హోల్డర్, మార్టోన్ శామ్యూల్స్‌ను కెప్టెన్, వైఎస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మెగా ఈవెంట్‌కు తాము అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని విండీస్ చీఫ్ సెలెక్టర్ క్లయివ్ లాయిడ్ అన్నాడు. జీతాల విషయంలో బ్రావో, పొలార్డ్.. విండీస్ బోర్డుల మధ్య గతంలో వివాదం ఏర్పడటం, ఇటీవల వీరిద్దరూ వన్డేల్లో అంతగా రాణించకపోవడంతో పక్కనబెట్టినట్టు భావిస్తున్నారు. వచ్చే నెల 14 నుంచి జరిగే ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), మార్లోన్ శామ్యల్స్ (వైఎస్ కెప్టెన్), బెన్, డారెన్ బ్రావో, కార్టెర్, కాట్రెల్, క్రిస్టోఫర్ గేల్, సునీల్ నరైన్, రాందిన్, రోచ్, రసెల్, సమీ, సిమన్స్, డ్వెన్ స్మిత్, జెరోమీ టేలర్, -
గేల్‌కు విశ్రాంతి.. పొలార్డ్‌కు పిలుపు!!
టి-20 అంటేనే గుర్తుకొచ్చే విధ్వంస ఓపెనర్ క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ టీమ్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో కీరన్ పొలార్డ్‌ను మళ్లీ పిలిచింది. వచ్చే వారం డొమినికాలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఈ మార్పు చేశారు. ఇటీవలి కాలంలో గేల్ (34) గాయాలపాలైనా, ప్రస్తుతం జరుగతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ప్రస్తుత సిరీస్‌కు ముందు జర్మనీలో చికిత్స పొందాలని భావించినా, ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దాంతో దాదాపు సంవత్సరం తర్వాత కీరన్ పొలార్డ్‌కు తన దేశం తరఫున మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ అడే అవకాశం దక్కింది. పొలార్డ్ కూడా ఇంతకుముందు గాయపడి, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరిగిన టోర్నమెంటుతో మళ్లీ రంగంలోకి వచ్చాడు. -
రాయల్స్‌కు ముంబై బ్రేక్
పొలార్డ్.. వండర్ క్యాచ్ ముంబై ఆటగాడు పొలార్డ్ ఫీల్డింగ్‌లో అద్భుతం సృష్టించాడు. హర్భజన్ బౌలింగ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ కూపర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద పొలార్డ్ నమ్మశక్యం కాని రీతిలో అందుకున్నాడు. లాంగ్ ఆన్‌లో కూపర్ ఆడిన భారీ షాట్‌కు సిక్సర్ దిశగా అంతెత్తున దూసుకెళ్తున్న బంతిని ఒంటి చేత్తో అందుకున్న పొలార్డ్.. తనను తాను నియంత్రించుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటాడు. అయితే రెండు కాళ్లూ గాల్లో ఉండగానే బంతిని పైకి విసిరి, ఆపై మళ్లీ మైదానంలోకి దూకి బంతిని అందుకున్నాడు. గతంలోనూ పొలార్డ్ ఇలాంటి అద్భుతాలు చేసినా... ఈ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్ నమ్మశక్యం కాని రీతిలో ఉంది. - కీలక మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ - 25 పరుగులతో రోహిత్ సేన అద్భుత విజయం అహ్మదాబాద్: ప్లే ఆఫ్‌కు చేరువయ్యామన్న అతివిశ్వాసమో లేక ఈ సీజన్లో అంతగా రాణించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌ను తక్కువగా అంచనా వేశారో గానీ.. కీలక మ్యాచ్‌లో నలుగురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రాజస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముంబై చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు ఇప్పటికే ‘తుది నాలుగు’లో ఆశలు దాదాపు అడుగంటిన ముంబై.. ఇక పోయేదేమీ లేదన్నట్లుగా పోరాడి రాజస్థాన్ దూకుడుకు బ్రేక్ వేసింది. సోమవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మైక్ హస్సీ (39 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిమ్మన్స్ (51 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు అర్ధసెంచరీలతో శుభారంభాన్నివ్వగా... చివర్లో రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కరుణ్ నాయర్ (24 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టెయిలెండర్లు హాడ్జ్ (30 బంతుల్లో 40; 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (21 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు రాణించినా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎట్టకేలకు హస్సీ... ఏడు మ్యాచ్‌ల తరువాత తిరిగి తుదిజట్టులోకి వచ్చిన ముంబై ఓపెనర్ మైక్ హస్సీ సత్తా చాటాడు. సిమ్మన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో 42 పరుగులు చేసిన ముంబై.. 10 ఓవర్లకు 76 పరుగులు చేసింది. ఆ తరువాత దూకుడు పెంచి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్న హస్సీ, సిమ్మన్స్ ఇద్దరూ ఒకే ఓవర్లో (15వ) అవుటయ్యారు. అయితే ఆ తరువాత పొలార్డ్ సహకారంతో కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. దీంతో చివరి పది ఓవర్లలో 102 పరుగులు రాబట్టుకున్న ముంబై.. రాజస్థాన్‌కు సవాలు విసిరే స్కోరును సాధించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ రనౌటయ్యాడు. వరుస విరామాల్లో వికెట్లు భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ముంబై బౌలర్లు ఆరంభంలోనే ముకుతాడు వేశారు. మూడో ఓవర్లో ఉన్ముక్త్ చంద్ (2)ను అవుట్ చేసిన ప్రజ్ఞాన్ ఓజా.. తన మరుసటి ఓవర్లో వాట్సన్ (5)నూ వెనక్కి పంపాడు. ఆ వెంటనే శామ్సన్ (2)ను సాంటొకీ డగౌట్‌కు చేర్చాడు. అయితే వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు నుంచి కరుణ్ నాయర్ ఏమాత్రం వెరవకుండా ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో 47 పరుగులు వచ్చాయి. హర్భజన్ వేసిన 8వ ఓవర్లో పొలార్డ్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో కూపర్ (5) వెనుదిరగడం, ఆపై గోపాల్ తన వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్ మరింత ఇక్కట్లలో పడింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగి పోతుండడంతో భారీషాట్‌కు యత్నించి నాయర్ కూడా అవుటయ్యాడు. దీంతో 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్.. గెలుపుపై ఆశలు కోల్పోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్‌లు ఎదురుదాడికి దిగి భారీషాట్లు ఆడినా అప్పటికే ఆలస్యమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్: మైక్ హస్సీ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 56; సిమ్మన్స్ (సి) కూపర్ (బి) అంకిత్ శర్మ 62; పొలార్డ్ (నాటౌట్) 14; రోహిత్ శర్మ (రనౌట్) 40; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-120; 2-122; 3-178. బౌలింగ్: అంకిత్ శర్మ 4-0-23-2; కులకర్ణి 4-0-27-0; ఫాల్క్‌నర్ 4-0-47-0; కూపర్ 3-0-27-0; బిన్నీ 1-0-12-0; భాటియా 4-0-39-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: కరుణ్ నాయర్ (సి) సాంటొకీ (బి) హర్భజన్ 48; ఉన్ముక్త్ (సి) హస్సీ (బి) ఓజా 2; వాట్సన్ (సి) రాయుడు (బి) ఓజా 5; శామ్సన్ (సి) రాయుడు (బి) సాంటొకీ 2; కూపర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 5; అంకిత్ శర్మ (సి) రాయుడు (బి) గోపాల్ 4; బిన్నీ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 2; హాడ్జ్ (సి) రోహిత్ (బి) సాంటొకీ 40; ఫాల్క్‌నర్ (నాటౌట్) 31; భాటియా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-38; 3-42; 4-61; 5-66; 6-69; 7-75; 8-144. బౌలింగ్: బుమ్రాహ్ 3-0-23-0; సాంటొకీ 4-0-50-2; ఓజా 4-0-30-2; పొలార్డ్ 1-0-11-0; హర్భజన్ 4-0-13-2; గోపాల్ 4-0-25-2. -
టి20 ప్రపంచకప్‌కు పొలార్డ్ దూరం
అంటిగ్వా: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా పేసర్ కీమర్ రోచ్‌ను కూడా ఎంపిక చేయలేదు. గాయాల నుంచి కోలుకోకపోవడంతోనే వీరిద్దరిని పరిగణనలోకి తీసుకోలేదని విండీస్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 15 మంది సభ్యుల జట్టుకు డారెన్ స్యామీ నాయకత్వం వహించనున్నాడు. వెస్టిండీస్ జట్టు: స్యామీ (కెప్టెన్), శామ్యూల్ బద్రీ, డ్వేన్ బ్రేవో, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, ఆండ్రీ ఫ్లెచర్, గేల్, నరైన్, రామ్‌దిన్, రాంపాల్, రస్సెల్, మార్లోన్ శామ్యూల్స్, కృష్మార్ సంతోకి, లెండిల్ సిమ్మన్స్, డ్వేన్ స్మిత్. -
రోచ్ అవుట్, వన్డేలకు పొలార్డ్ దూరం
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై గాయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పేసర్ కెమర్ రోచ్ గాయంతో సిరీస్ నుంచి పూర్తిగా వైదొలగగా, ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ వన్డేలకు దూరమయ్యాడు. రోచ్ భుజంనొప్పి కారణంగా రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక పొలార్డ్‌కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. భారత పర్యటనలో కరీబియన్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌కు విండీస్ జట్టును ప్రకటించారు. జట్టు: డ్వెన్ బ్రావో (కెప్టెన్), టినో బెస్ట్, డారెన్ బ్రావో, చార్లెస్, డియోనరైన్, క్రిస్ గేల్, హోల్డర్, సునీల్ నరైన్, పెరుమాళ్, పావెల్, రాందిన్, రాంపాల్, డారెన్ సామీ, శామ్యూల్స్, సిమన్స్.