పొలార్డ్ను తీసేయండి: వకార్
షార్జా: పాకిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు ఓటమి ప్రధాన కారణమైన ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డను తదుపరి మ్యాచ్ ల్లో నుంచి తీసేయడమే సరైన చర్యని దిగ్గజ ఆటగాడు వకార్ యూసన్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో విండీస్ విజయానికి ఓవర్ కు 12 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజ్ లో ఉన్న పొలార్డ్ అత్యంత ఉదాసీనతను ప్రదర్శించి ఆ జట్టు ఓటమికి కారణమయ్యాడన్నాడు. కనీసం గెలుపు కోసం ప్రయత్నించని పొలార్డ్ ను చివరి వన్డే నుంచి తొలగించాలని విండీస్ కు సూచించాడు.
టీ 20లో పొలార్డ్ ఇలా ఆడటం ఎప్పుడూ చూడలేదు. కీలకమైన వన్డేలో పొలార్డ్ చాలా అలసత్వం ప్రదర్శించి జట్టు నైతికతను దెబ్బతీశాడు. అతను క్రీజ్ లో ఉండి కొట్టింది కేవలం ఒక ఫోర్ మాత్రమే. ఇది ఉదాసీనత కాకపోతే ఏంటి. ప్రస్తుతం అతనికి బ్రేక్ అవరసం. నేను అనుకుంటున్నట్లే విండీస్ సెలక్షన్ కమిటీ కూడా భావిస్తుందని అనుకుంటున్నా' అని వకార్ యూనస్ తెలిపాడు.