గేల్కు విశ్రాంతి.. పొలార్డ్కు పిలుపు!! | Chris Gayle rested, Pollard recalled to Twenty20 squad | Sakshi
Sakshi News home page

గేల్కు విశ్రాంతి.. పొలార్డ్కు పిలుపు!!

Published Mon, Jun 30 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

గేల్కు విశ్రాంతి.. పొలార్డ్కు పిలుపు!!

గేల్కు విశ్రాంతి.. పొలార్డ్కు పిలుపు!!

టి-20 అంటేనే గుర్తుకొచ్చే విధ్వంస ఓపెనర్ క్రిస్ గేల్కు వెస్టిండీస్ టీమ్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో కీరన్ పొలార్డ్ను మళ్లీ పిలిచింది. వచ్చే వారం డొమినికాలో న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల సిరీస్కు ఈ మార్పు చేశారు. ఇటీవలి కాలంలో గేల్ (34) గాయాలపాలైనా, ప్రస్తుతం జరుగతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

ప్రస్తుత సిరీస్కు ముందు జర్మనీలో చికిత్స పొందాలని భావించినా, ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దాంతో దాదాపు సంవత్సరం తర్వాత కీరన్ పొలార్డ్కు తన దేశం తరఫున మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ అడే అవకాశం దక్కింది. పొలార్డ్ కూడా ఇంతకుముందు గాయపడి, ఈ సంవత్సరం ఏప్రిల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరిగిన టోర్నమెంటుతో మళ్లీ రంగంలోకి వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement