t20 team
-
ఇంగ్లండ్ టి20 జట్టులో జోఫ్రా ఆర్చర్
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఏడాది తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును మంగళవారం ప్రకటించారు. ఆర్చర్ పునరాగమనం చేయగా... జోస్ బట్లర్ కెపె్టన్‌గా కొనసాగుతాడు. మొయిన్ అలీ, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, స్యామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లే, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ఐసీసీ టెస్ట్ జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ఇద్దరు!
2023 అత్యుత్తమ టెస్ట్ జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపిక కాగా.. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా, శ్రీలంక ప్లేయర్ దిముత్ కరుణరత్నే ఎంపిక కాగా.. వన్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, ఐదో ప్లేస్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ల కోటాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్, స్పెషలిస్ట్ పేసర్లుగా ఇంగ్లండ్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో రిటైర్డ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు లభించడం అనూహ్యం. జట్ల వారీగా చూస్తే.. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు ఎంపిక కాగా.. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, ఐసీసీ గతేడాది అత్యుత్తమ టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 జట్లను కూడా ప్రకటించింది. ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల జట్లలో చోటు లభించలేదు. 2023 ఐసీసీ టెస్ట్ జట్టు: ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రవిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ 2023 ఐసీసీ వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రవిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), మార్కో జన్సెన్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ 2023 ఐసీసీ టీ20 జట్టు: ఫిలిప్ సాల్ట్, యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, మార్క్ చాప్మన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సికందర్ రజా, అల్పేష్ రంజనీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ నగరవ -
ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య భాయ్
ఐసీసీ 2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఇవాళ (జనవరి 22) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లి, రోహిత్‌లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వికి జతగా ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఆల్‌రౌండర్ల కోటా జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండ ప్లేయర్ అల్పేష్ రంజనీ, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే)లను ఎంపిక చేసింది. ఐసీసీ ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం. -
ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్‌బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్‌లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్‌స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్‌కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత ధోని, ఆల్‌రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్‌లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం
ICC Mens T20I Team Of The Year 2022: 2022 సంవత్సరానికి గానూ ఐసీసీ ఇవాళ (జనవరి 23) తమ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్.. జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్‌ను ఎంపిక చేసింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. మొత్తం 11 మంది సభ్యుల జాబితాను వెల్లడించింది. ఓపెనర్లుగా కెప్టెన్ జోస్ బట్లర్ (ఇంగ్లండ్, వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)లను ఎంపిక చేసిన ఐసీసీ మేనేజ్మెంట్.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి (భారత్), ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (భారత్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), ఆల్‌రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (భారత్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), స్పిన్నర్‌గా వనిందు హసరంగ (శ్రీలంక), పేసర్లుగా హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్)లను ఎంపిక చేసింది. -
ఎంఎస్ ధోనికి అవమానం.. ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్‌లో నో ప్లేస్
భారత్‌ను తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే విజేతగా నిలిపి, పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా తయారు చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఘోర అవమానం ఎదురైంది. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ విజ్డెన్ ఇండియా ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో మహేంద్రుడికి చోటు దక్కలేదు. 2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించి, టీమిండియాకు గతంలో ఎన్నడూ లేనంత వైభవాన్ని అందించిన వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడంతో ధోని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా, బెస్ట్ వికెట్‌కీపర్‌గా, బెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తికి ఆల్‌టైమ్ బెస్ట్ జట్టులో చోటు లభించకపోవడంతో పెదవి విరుస్తున్నారు. ధోని విషయంలో విజ్డెన్ ఇండియా వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. ధోని స్థానంలో వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం హాస్యాస్పదమని అంటున్నారు. అయితే ఈ విషయమై విజ్డెన్.. తమ లెక్కలు తమకున్నాయనట్లు వ్యవహరించింది. వికెట్‌కీపర్‌గా ధోని బెస్టే అయినప్పటికీ 6,7 స్థానాల్లో ధోనితో (121.15) పోలిస్తే డీకే (150.31) యావరేజ్ అత్యుత్తమంగా ఉందని తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఇదిలా ఉంటే, విజ్డెన్ ప్రకటించిన భారత ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టులో స్పిన్నర్ కోటాలో అశ్విన్‌కు, మిడిలార్డర్లో సురేశ్ రైనాకు చోటు దక్కడం విశేషం. పై పేర్కొన్న మూడు ఎంపికలు మినహా విజ్డెన్ ప్రకటించిన జట్టును భారత అభిమానులు స్వాగతిస్తున్నారు. విజ్డెన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియా టీ20 ఎలెవెన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, వీరేంద్ర సెహ్వాగ్ (12వ ఆటగాడు) -
దిగ్గజ క్రికెటర్ టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో వర్చువల్‌గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు. ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్‌తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అతడు చోటిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అత్యుత్తమ టి20 జట్టు ఎంపిక.. సొంత జట్టు ఆటగాళ్లకు నో చాన్స్
శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసార పెరీరా తన 11 మందితో కూడిన అత్యుత్తమ టి20 జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్యర్యంగా తన సొంత జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా పెరీరా చోటు ఇవ్వకపోవడం విశేషం. పెరీరా ప్రకటించిన 11 మందిలో నలుగురు టీమిండియా నుంచి.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున.. అఫ్గానిస్తాన్ నుంచి ఒక ఆటగాడిని ఎంపిక చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా.. వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశాడు. ఇక క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా.. విరాట్ కోహ్లి మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్లకు మిడిలార్డర్లో చోటు కల్పించాడు. ఇక స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లను ఎంపిక చేసిన పెరీరా.. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్లను ఏంచుకున్నాడు. పెరీరా టి20 అత్యుత్తమ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఎంఎస్ ధోని(కెప్టెన్ & వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్ చదవండి: Suranga Lakmal: టీమిండియతో సిరీస్ ఆఖరు.. రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్ కాగా తిసారా పెరీరా శ్రీలంక తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పెరీరా లంక తరపున 166 వన్డేల్లో 2338 పరుగులతో పాటు 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 పరుగులు.. 61 వికెట్లు, 6 టెస్టుల్లో 203 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. 2014 టి20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో పెరీరా సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలు, టి20ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా పెరీరా చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పెరీరా.. సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో ఒక ఓవర్లో 35 పరుగులు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. మే 3, 2021న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పెరీరా 2017-19 మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లకు లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం..!
ICC T20I XI of 2021: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. 2021 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన టీమిండియా.. గతేడాది పొట్టి ఫార్మాట్లో పెద్దగా రాణించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్లో ఏకంగా ముగ్గురు పాక్ ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. అంతేకాకుండా ఆ ముగ్గురిలో ఒకడైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకోవడం మరో విశేషం. బాబర్ ఆజమ్‌తో పాటు గతేడాది టీ20ల్లో విశేషంగా రాణించిన పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదిలు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్‌లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్ ఆజమ్‌ను, నాలుగో ప్లేస్‌కు మార్క్రమ్(దక్షిణాఫ్రికా), ఐదో ప్లేస్‌కు మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), ఆ తరువాత వరుసగా డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్ షంషి(దక్షిణాఫ్రికా), జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), షాహీన్ అఫ్రిది(పాకిస్థాన్)లను ఎంచుకుంది. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో ప్రదర్శన ఆధారంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. చదవండి: స్థిరంగా రోహిత్.. దూసుకెళ్తున్న కోహ్లి -
Azam Khan: పాక్ క్రికెట్ జట్టులోకి భారీ హిట్టర్..
కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టులోకి భారీ హిట్టర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటన నిమిత్తం ఆ దేశ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఆజమ్ ఖాన్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ మ్యాచ్ ఆడినప్పటికీ.. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో భారీ సిక్సర్లతో చెలరేగుతుండంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడంపై పాక్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీకాయంతో అలవోకగా సిక్సర్లు బాదే ఆజమ్ ఖాన్.. ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్)లలో విదేశీ క్రికెటర్ల సహచర్యంలో ఈ భారీ హిట్టర్ రాటుదేలాడు. ఇటీవలి కాలంలో 32 కిలోల బరువు తగ్గిన ఆజమ్ ఖాన్.. ఓ వైపు ఫిట్నెస్ కాపాడుకుంటూనే, తన సహజసిద్ధమైన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే, బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరనుంది. జూలై 8 నుంచి 20 వరకు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అనంతరం విండీస్‌తో అయిదు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు 'నీ చాలెంజ్ ఒప్పుకుంటున్నా.. బైక్ కొనడానికి రెడీగా ఉండు' -
పాపే నా అదృష్టం : గెడ్డం తీసేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టుకు ఎంపికైన మీడియం పేసర్ టీ నటరాజన్ (29) తన కూతురు రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చిందంటూ మురిసి పోతున్నాడు. తనకు పాప పుట్టం అదృష్టమనీ, నెట్‌బౌలర్ గా మాత్రమే ఎంపికైన తాను ప్రస్తుతం ప్రధాన జట్టుకు ఎంపికయ్యానని ఇంతకంటే శుభవార్త ఏమి ఉంటుందని నటరాజన్ తెలిపాడు. పాపాయి ఫోటో కూడా తానింకా చూడలేదని, వీడియోకాల్‌లో మాత్రమే చూశానని నటరాజన్ చెప్పాడు. అలాగే తన భార్య పవిత్ర ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారన్నాడు. మరోరెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు. బిడ్డ పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గడ్డం కత్తిరించుకుంటానని ఈ సందర్భంగా నటరాజన్ వెల్లడించాడు. అలాగే దీనికి ముందు ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉందన్నాడు. అయితే తన బిడ్డను చూసేందుకు మాత్రం నటరాజన్ మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అతను మొత్తం పర్యటన ముగిసే వరకు ఉంటే, అతను జనవరి మూడవ వారంలో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పితృత్వ సెలవు మంజూరు కాగా నటరాజన్ మాత్రం తన ముద్దుల పాపాయిని చూసేందుకు మూడునెలలు ఆగాల్సి వస్తోంది. నవంబరు 7న నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయ సంబరాల్లో ఉండగానే డేవిడ్ వార్నర్ ఈ శుభవార్తను అందరికీ షేర్ చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు పలువురు నటరాజన్‌ను అభినందనలు ముంచెత్తారు. కాగా భుజం గాయం కారణంగా చాన్స్ మిస్ అయిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో నటరాజన్ భారత టీ 2020 జట్టులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!) -
ఈ సారథ్యం నాకొద్దు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి బైబై చెప్పాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో వన్డే జట్టు నాయకత్వం నుంచి డు ప్లెసిస్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ డికాక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా అతను పగ్గాలు వదిలేశాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ... కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పటిలాగే జట్టుకు పూర్తి నిబద్ధతతో సేవలందిస్తాను. కెప్టెన్ డికాక్, కోచ్ మార్క్ బౌచర్‌లకు పూర్తిగా సహకరిస్తాను. సఫారీ జట్టు పునర్నిర్మాణానికి, జట్టు పటిష్టంగా ఎదిగేందుకు ఆటగాడిగా నా వంతు కృషి చేస్తాను’ అని 35 ఏళ్ల డుప్లెసిస్ తెలిపాడు. ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వారసుడిగా 2017 ఆగస్టులో దక్షిణాఫ్రికా పగ్గాలు చేపట్టిన డు ప్లెసిస్‌కు 2019 వన్డే ప్రపంచకప్ పెద్ద గాయమే చేసింది. ఆ మెగా టోర్నీలో సఫారీ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌తో మూడు టి20లు, మరో మూడు వన్డేల సిరీస్‌ల్లో తలపడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. -
ఐర్లాండ్ టి20 జట్టులో భారత సంతతి ఆటగాడు
డబ్లిన్: భారత్‌తో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొనే 14 మంది సభ్యులతో కూడిన ఐర్లాండ్ జట్టును ప్రకటించారు. పంజాబ్‌లో జన్మించి ఐర్లాండ్‌లో స్థిరపడిన భారత సంతతి ఆటగాడు సిమ్రాన్‌జిత్ సింగ్ (సిమీ సింగ్) ఈ జట్టులో చోటు లభించింది. 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సిమీ సింగ్ ఇప్పటికే ఐర్లాండ్ తరఫున ఏడు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
రైనాకు ఛాన్స్.. యువీకి మొండిచేయి
సాక్షి, ముంబై: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సురేశ్ రైనా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన జయదేవ్ ఉనాద్కత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన గత టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధవన్ కూడా టీమ్‌లోకి వచ్చాడు. యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన సీనియర్ ఆల్‌రౌండర్ సురేశ్ రైనాకు మళ్లీ అవకాశం దక్కింది. 31 ఏళ్ల రైనా గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో చివరిసారిగా ఆడాడు. యువరాజ్ సింగ్‌కు మరోసారి మొండిచేయి చూపారు. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ ఛాన్స్ దక్కించుకున్నారు. టీ20 టీమ్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్ -
ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీ20లో స్థానం
ఓ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు ఢిల్లీ టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎలా సాధ్యం అంటే.. అది అంతే. వివరాల్లోకి వెళ్తే మాదేపురా ఎంపీ రాజేష్ రంజన్ (పప్పుయాదవ్) కుమారుడు సర్థాక్ రంజన్ గత ఏడాది ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఢిల్లీ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు . అతుల్ వాసన్, హరి గిద్వానీ, జూనియర్ రాబిన్ సింగ్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న ఇతర ఆటగాళ్లను పక్కన పెట్టీ మరీ సర్థాక్ను టీ20 జట్టుకు ఎంపిక చేసింది. గతంలో కూడా సర్థాక్ ఎంపిక వివాదాస్పదమైంది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు చేశాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలోను ఇదే విధంగా ఎంపిక చేశారు. ఆ తరువాత రంజీ ట్రోఫీ ప్రాబుల్స్లో స్థానం లభించినా సర్థాక్ రంజన్ మాత్రం స్వతంత్రంగానే ఆ రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోతోందంటూ బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారించాడు. అయితే ఆశ్చర్యకరంగా సార్థక్ తల్లి రంజీత్ రాజన్ తన కుమారుడు ఇప్పుడు క్రికెట్ ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్‌కు ఈమెయిల్ రాశారు. దీంతో గత సీజన్ సీకే నాయుడు ట్రోఫీలో 91.58 స్టైక్ రేట్‌తో 468పరుగులు చేసిన హిటెన్ దళాల్ అనే ఆటగాడిని పక్కన పెట్టిమరీ సార్థక్ రంజన్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీకే నాయుడు ట్రోపీలో దళాల్ ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో 468 పరుగులు చేశాడు. సగటు 52 కాగా, స్టైక్ రేటు 91.58 గా ఉంది. -
టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్
సాక్షి, ముంబై : టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌నే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. విశ్రాంతి కావాలన్న కోహ్లీ కోరికను మన్నించిన బోర్డు వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి కల్పించింది. ఐపీఎల్ నుంచి కోహ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. జట్టులో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాస్ మరోసారి టీ20 జట్టులో స్థానం దక్కించుకోగా, కేరళకు చెందిన తంపి, హరియాణాకు చెందిన దీపక్ హుడా తొలిసారి ఎంపికయ్యారు. ఇక శ్రీలంకతో సిరీస్ అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాసింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హూడా, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్. టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, పార్దీవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా. -
గేల్‌కు విశ్రాంతి.. పొలార్డ్‌కు పిలుపు!!
టి-20 అంటేనే గుర్తుకొచ్చే విధ్వంస ఓపెనర్ క్రిస్ గేల్‌కు వెస్టిండీస్ టీమ్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో కీరన్ పొలార్డ్‌ను మళ్లీ పిలిచింది. వచ్చే వారం డొమినికాలో న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఈ మార్పు చేశారు. ఇటీవలి కాలంలో గేల్ (34) గాయాలపాలైనా, ప్రస్తుతం జరుగతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ప్రస్తుత సిరీస్‌కు ముందు జర్మనీలో చికిత్స పొందాలని భావించినా, ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దాంతో దాదాపు సంవత్సరం తర్వాత కీరన్ పొలార్డ్‌కు తన దేశం తరఫున మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ అడే అవకాశం దక్కింది. పొలార్డ్ కూడా ఇంతకుముందు గాయపడి, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరిగిన టోర్నమెంటుతో మళ్లీ రంగంలోకి వచ్చాడు.