సాక్షి, ముంబై : టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌నే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. విశ్రాంతి కావాలన్న కోహ్లీ కోరికను మన్నించిన బోర్డు వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి కల్పించింది. ఐపీఎల్ నుంచి కోహ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే.
జట్టులో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాస్ మరోసారి టీ20 జట్టులో స్థానం దక్కించుకోగా, కేరళకు చెందిన తంపి, హరియాణాకు చెందిన దీపక్ హుడా తొలిసారి ఎంపికయ్యారు. ఇక శ్రీలంకతో సిరీస్ అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాసింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, దీపక్ హూడా, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్.
టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, పార్దీవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా.
Comments
Please login to add a commentAdd a comment