india vs srilanka
-
టీ20 సిరీస్‌ను ‘స్వీప్’ చేశారు
కతునాయకే: శ్రీలంక మహిళలతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఓటమి లేకుండా ముగించింది. సోమవారం జరిగిన నాల్గో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళలు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సైతం అదే జోరు కనబర్చారు. కనీసం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న ఆతిథ్య శ్రీలంకకు భారత్ మరోసారి చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, లంక మహిళలు 17.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలారు. పూనమ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్ 51 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-0 తో ‘స్వీప్’ చేసింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా, మిగతా వాటిలో భారత్ విజయ ఢంకా మోగించింది. తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 18.3 ఓవర్లలో 156 పరుగులు చేశారు. ఓపెనర్లు మిథాలీ రాజ్(12), స్మృతీ మంధాన(0) నిరాశపరిచినప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్(46) మరోసారి ఆకట్టుకున్నారు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(63;38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
టీ20 సిరీస్ భారత మహిళలదే
కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే చేజిక్కించుకున్నారు. సోమవారం జరిగిన నాల్గో టీ20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించారు. శ్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింద. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్(52 నాటౌట్;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్(54 నాటౌట్; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రోడ్రిగ్స్ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఈ జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్ 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు ఐదో టీ20 మంగళవారం జరుగనుంది. -
క్రికెట్ చరిత్రలో 19 ఏళ్ల క్రితం..
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు (మే26,1999) క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత రికార్డు నమోదైంది. భారత దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు సంయుక్తంగా ఈ ఘనతను అందుకున్నారు.1999 ప్రపంచకప్‌లో టాంటన్(ఇంగ్లండ్) వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 157 పరుగులతో విజయం సాధించింది. కెరీర్ తొలి దశల్లో ఉన్న భారత దిగ్గజాలు గంగూలీ, ద్రవిడ్‌లు సెంచరీలతో చెలరేగి రెండోవికెట్కు అత్యధికంగా 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఆ సమయంలో వన్డేల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇక అప్పటి వరకు జింబాంబ్వేపై టీమిండియా దిగ్గజాలు ఆజారుద్దీన్, అజయ్ జడేజాలు పేరిట నాలుగో వికెట్‌కు నెలకొల్పిన 275 పరుగుల భాగస్వామ్యమే అత్యుత్తమం. ఈ రికార్డును గంగూలీ-ద్రవిడ్‌లు ఈ మ్యాచ్ ద్వారా అధిగమించారు. అనంతరం ఈ రికార్డును సచిన్, ద్రవిడ్‌లు 1999లోనే 372 పరుగుల భాగస్వామ్యంతో బ్రేక్ చేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు క్రిస్‌గేల్- సామ్యుల్స్ 372 పరుగుల భాగస్వామ్యంతో తొలి స్థానంలో ఉండగా సచిన్- ద్రవిడ్‌లు రెండో స్థానంలో, గంగూలీ-ద్రవిడ్‌లు మూడో స్థానంలో ఉన్నారు. చెలరేగిన గంగూలీ.. 119 బంతుల్లో సెంచరీ సాధించిన గంగూలీ మరో 39 బంతుల్లోనే 183కు చేరుకున్నాడు. మొత్తం 158 బంతులు ఎదుర్కున్న గంగూలీ 17 ఫోర్లు, 7 సిక్స్‌లతో లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా గంగూలీ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 188* పరుగులతో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిరెస్టన్ తొలి స్థానంలో ఉన్నాడు. యునైటెడ్ ఎమిరేట్స్ జట్టుపై 1996 ప్రపంచకప్‌లో గ్యారీ కిరెస్టెన్ ఈ రికార్డును నెలకొల్పాడు. భారత్‌కు ఇదే అత్యధికం గంగూలీ-ద్రవిడ్‌ల భాగస్వామ్యంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఆ సమయంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోర్. అనంతరం 2007లో బెర్ముడాపై 413 పరుగులు సాధించింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రాబిన్ సింగ్ (5 వికెట్లు) దాటికి 216 పరుగులకే కుప్పకూలింది. -
సచిన్‌కు ప్రత్యేక ఆహ్వానం
క్రికెట్ దిగ్గజం సచిన్‌కు టెండూల్కర్‌కు శ్రీలంక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక ఈ ఏడాది 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే భారత్, బంగ్లాదేశ్‌లతో కలిసి నిదహాస్ టీ 20 ముక్కోణపు టోర్నీని జరుపుతోంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో వేడుకల్లో పాల్గొని, మ్యాచ్‌లను వీక్షించాలని లంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సచిన్‌కు లేఖ రాశారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపిన సచిన్.. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న లంక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. శ్రీలంక 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 1998 లో భారత్-శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్(నిదహాన్ టోర్నీ) జరిగింది. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో గంగూలీ, సచిన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 252 పరుగులు జోడించగా.. నిదహాస్ ట్రోఫీ టీమ్ ఇండియా సొంతమైంది. కాగా, ప్రస్తుత టోర్నీలో భాగంగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లొ భారత్, శ్రీలంక తలపడునున్నాయి. -
విజయం పరిపూర్ణం
ఇంకేం మిగల్లేదు లంకకు... ఓడిపోయేందుకు..! మరో మ్యాచ్ లేదు భారత్‌కు... గెలిచేందుకు..! ఫార్మాట్‌కు మూడు మ్యాచ్‌ల చొప్పున ఆడిన పర్యాటక జట్టు... ఒక టెస్టు (కోల్‌కతా)లో వణికించింది. ఒక వన్డే (ధర్మశాల)లో గెలిచింది. కానీ టి20ల్లో పరిపూర్ణంగా ఓడింది. టీమిండియా చేతిలో వైట్‌వాష్ అయ్యింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో కలిపి భారత్ ‘ఆరే’స్తే (1+2+3)... శ్రీలంక మాత్రం ఒక్కటంటే ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది. ముంబై: భారత్... సిరీస్‌ను ముందే గెలుచుకుంది. ఇపుడు చివరి మ్యాచ్‌నూ గెలిచింది. టి20 సిరీస్‌కు క్లీన్‌స్వీప్‌తో ముగింపు పలికింది. మొత్తానికి భారత్‌కు విజయవంతంగా సాగిన 2017 ఏడాది దిగ్విజయంగానే ముగిసింది. ఎందులోనూ కలిసి రాకపోవడంతో శ్రీలంక వైట్‌వాష్‌తో తిరుగుముఖం పట్టింది. ఆఖరి టి20లో బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉనాద్కట్ (2/15), హార్దిక్ పాండ్యా (2/25)... బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (29 బంతుల్లో 32; 4 ఫోర్లు) రాణించారు. వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుణరత్నే (37 బంతుల్లో 36; 3 ఫోర్లు), షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు) లంక తరఫున పోరాడారు. ఉనాద్కట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీయగా... సుందర్, సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. వికెట్లు ఫటాఫట్... టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు డిక్వెలా (1), తరంగ (11) తడబడ్డారు. అరంగేట్రంలోనే మ్యాచ్ తొలి ఓవర్ వేసిన సుందర్ 6 పరుగులిచ్చాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఓవర్‌కు వికెట్ చొప్పున టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రెండో ఓవర్లో డిక్వెలాను ఉనాద్కట్, మూడో ఓవర్లో కుశాల్ పెరీరా (4)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. తిరిగి నాలుగో ఓవర్లో తరంగను ఉనాద్కట్ అవుట్ చేయడంతో లంక 18 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తర్వాత సమరవిక్రమ (17 బంతుల్లో 21; 3 ఫోర్లు), గుణరత్నే కాసేపు ధాటిగా ఆడుతూనే వికెట్ల పతనానికి కళ్లెం వేశారు. దీంతో ఎనిమిదో ఓవర్లో లంక ఫిఫ్టీ పూర్తయింది. పాండ్యా వేసిన అదే ఓవర్లో జోరు మీదున్న సమరవిక్రమ మిడాఫ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత స్కోరుబోర్డులో మరో 20 పరుగులు జతయ్యాయో లేదో భారత బౌలర్లు మరో వికెట్‌ను పడేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గుణతిలక (3) డీప్ మిడ్‌వికెట్ వద్ద పాండ్యా క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు. 72 పరుగుల వద్ద లంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. మరో 13 పరుగుల వ్యవధిలో కెప్టెన్ తిసారా పెరీరా (11; 2 ఫోర్లు) ఆటను సిరాజ్ ముగించాడు. పడుతూ లేస్తూ సాగిన లంక స్కోరు 16వ ఓవర్లో 100కు చేరింది. కుదురుగా ఆడిన గుణరత్నేను పాండ్యా అవుట్ చేశాడు. సిరాజ్ చివరి ఓవర్లో షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), ధనంజయ (11 నాటౌట్; 2 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో 18 పరుగులు వచ్చాయి. రాణించిన శ్రేయస్, పాండే... భారత్ లక్ష్యం 136. తొలి రెండు టి20ల్లో భారత్ సూపర్ హిట్ స్కోర్లకు ఇదేమాత్రం సరిపోలదు. కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ శర్మ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లు కోల్పోవడంతో భారత్ అనవసర ఒత్తిడి కొనితెచ్చుకోవడం ఎందుకనే ధోరణిలో ఆడింది. దీంతో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ 20 (19.2)వ ఓవర్ దాకా ఆడాల్సివచ్చింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే అడపాదడపా బౌండరీలతో స్కోరును 81 పరుగుల దాకా తీసుకొచ్చారు. ఆ స్కోరు వద్దే పాండే బలంగా కొట్టిన షాట్ వేగంగా వెళ్లి నాన్ స్ట్రయిక్ వికెట్లను కూల్చింది. అంతకంటే ముందే ఆ బంతి బౌలర్ ధనంజయ చేతి వేళ్లను తాకడంతో క్రీజులో లేని శ్రేయస్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత పాండ్యా (4) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక మనీశ్ పాండే కూడా నిష్క్రమించడంతో ధోని (10 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 18 నాటౌట్; 1 సిక్స్) మరో వికెట్ చేజారకుండా మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) సిరాజ్ (బి) ఉనాద్కట్ 1; తరంగ (సి) పాండ్యా (బి) ఉనాద్కట్ 11; కుశాల్ పెరీరా (సి అండ్ బి) సుందర్ 4; సమరవిక్రమ (సి) దినేశ్ కార్తీక్ (బి) పాం డ్యా 21; గుణరత్నే (సి) కుల్దీప్ (బి) పాండ్యా 36; గుణతిలక (సి) పాండ్యా (బి) కుల్దీప్ 3; తిసారా పెరీరా (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 11; షనక నాటౌట్ 29; ధనంజయ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–8, 2–14, 3–18, 4–56, 5–72, 6–85, 7–111. బౌలింగ్: సుందర్ 4–0–22–1, ఉనాద్కట్ 4–0–15–2, సిరాజ్ 4–0–45–1, హార్దిక్ పాండ్యా 4–0–25–2, కుల్దీప్ 4–0–26–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కుశాల్ పెరీరా (బి) షనక 27; రాహుల్ ఎల్బీడబ్ల్యూ (బి) చమీర 4; శ్రేయస్ రనౌట్ 30; మనీశ్ పాండే (బి) చమీర 32; పాండ్యా (సి) డిక్వెలా (బి) షనక 4; దినేశ్ కార్తీక్ నాటౌట్ 18; ధోని నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–17, 2–39, 3–81, 4–99, 5–108. బౌలింగ్: ధనంజయ 4–0–27–0, చమీర 4–0–22–2, పెరీరా 3.2–0–22–0, ప్రదీప్ 4–0–36–0, షనక 4–0–27–2. అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా... ముంబైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా... అంతర్జాతీయ టి20 క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్సు టాప్–5 క్రికెటర్లలో సుందర్ తర్వాత రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు; ఇంగ్లండ్‌పై ఫిబ్రవరి 1న, 2017)... ఇషాంత్ (19 ఏళ్ల 152 రోజులు; ఆస్ట్రేలియాపై ఫిబ్రవరి 1న, 2008)... రైనా (20 ఏళ్ల నాలుగు రోజులు; దక్షిణాఫ్రికాపై డిసెంబర్1న, 2006)... రవీంద్ర జడేజా (20 ఏళ్ల 66 రోజులు; శ్రీలంకపై ఫిబ్రవరి 10న, 2009) ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి సొంతగడ్డపై గత 16 సిరీస్‌లలో భారత్‌కు పరాజయం ఎదురుకాలేదు. వాంఖడే స్టేడియంలో టి20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం. గతంలో ఆడిన రెండు మ్యాచుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక ఏడాదిలో అత్యధిక విజయాలు (37) సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా అత్యధి కంగా 38 విజయాలు సాధించింది. -
టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్
సాక్షి, ముంబై : టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్‌నే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. విశ్రాంతి కావాలన్న కోహ్లీ కోరికను మన్నించిన బోర్డు వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి కల్పించింది. ఐపీఎల్ నుంచి కోహ్లీ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. జట్టులో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాస్ మరోసారి టీ20 జట్టులో స్థానం దక్కించుకోగా, కేరళకు చెందిన తంపి, హరియాణాకు చెందిన దీపక్ హుడా తొలిసారి ఎంపికయ్యారు. ఇక శ్రీలంకతో సిరీస్ అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాసింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హూడా, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్. టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, పార్దీవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా. -
13న 'ధోని' రిటైర్మెంట్ !
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే అనంతరం ధోని తన కెరీర్‌కు ముగింపు పలకబోతున్నాడు. మొహాలీలో జరగనున్న రెండో వన్డే అనంతరం రిటైర్ అవబోతున్నాడు. ధోని ఏంటీ రిటైర్మెంట్ ఏంటీ అనుకుంటున్నారా... అవునండీ ధోని రిటైర్ అవబోతున్నాడు. అయితే ఇక్కడ చెప్పేది భారత మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని గురించి కాదు. మొహాలీ పోలీసు భద్రతా జాగిలం ధోని గురించి.. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న జాగిలం ధోని రిటైర్ కాబోతోంది. గత పదేళ్లుగా మొహాలీ జిల్లా పోలీసులకు ఈ స్నిఫర్ డాగ్ విశేష సేవలు అందిస్తోంది. ధోని కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో భద్రత విభాగంలోకి వచ్చిన ఈ జాగిలానికి ధోని పేరుపెట్టుకున్నారు. ధోని గ్రౌండ్లో విజృంభిస్తే ఈ స్నిఫర్ డాగ్ డ్యూటీలో రెచ్చిపోయేదని పోలీసు వర్గాలు తెలిపాయి. మొహాలీలో డిసెంబర్ 13న శ్రీలంకతో జరిగే రెండో వన్డే అనంతరం ఈజాగిలం సేవలకు అధికారులు స్వస్తి పలకనున్నారు. ఇందుకోసం పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 ప్రపంచకప్‌లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు ఇరు దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఈ స్నిఫర్ డాగ్‌తోనే తనిఖీ చేశారు. ఇది రోజుకు ఏడు గంటలే నిద్రపోయేదని, ప్రేలుడు పదార్ధాలు, బాంబులను పసిగట్టడంలో దిట్ట అని పోలీసులు తెలిపారు. ఎవరైన దీనిని దత్తత తీసుకోవాలి అంటే నామమాత్రపు ధర రూ.800లకే ఇస్తామని అధికారులు తెలిపారు. -
షాకింగ్: ఢిల్లీ టెస్టును నిలిపేయాలని కోరిన లంక క్రికెటర్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్నాళ్లు దేశ రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన కాలుష్యం తాజాగా ఢిల్లీ టెస్టుపై కూడా ప్రభావం చూపుతోంది. కాలుష్యం కారణంగా శ్రీలంక ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అయినట్టు కనిపించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ఇద్దరు లంక ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దీంతో రెండోరోజు కొనసాగుతున్న ఆటను అంపైర్లు కాసేపు నిలిపివేశారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులోనూ భారత్ ధాటిగా ఆడుతోంది. భారత్ ధాటిగా ఆడుతున్న సమయంలోనే లంక ఆటగాళ్లు.. కాలుష్య ప్రభావం గురించి అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా లంచ్ తరువాత పలువురు లంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఫీల్డ్‌లోకి దిగారు. కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్‌ను నిలిపివేయాలని పదేపదే అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో ఇరుజట్ల కోచ్‌లు జోక్యం చేసుకోవడంతో మ్యాచ్ కొంతసేపు కొనసాగింది. ఈ క్రమంలో కొంతసేపు ఆట కొనసాగిన అనంతరం మరోసారి మ్యాచ్ కొనసాగింపుపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తో పాటు అంపైర్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు ఆగింది. అదే సమయంలో కోహ్లి స్టేడియం నుంచి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి వచ్చేయాలంటూ ఫీల్డ్‌లో ఉన్న జడేజా, సాహాలకు సంకేతాలిచ్చాడు. దాంతో భారత్ జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు కోహ్లి(243) డబుల్ సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. మబ్బులతో తేమగా వాతావరణం! దేశ రాజధాని ఢిల్లీలో గత నెల తీవ్ర కాలుష్య సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. గత నెలతో పోలిస్తే.. ఈ నెలలో కాలుష్యం తక్కువగానే ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నా నగరంలో వాతావరణం మెరుగ్గా ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే, ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులుపట్టి.. వాతావరణం కొంత స్తబ్దుగా ఉంది. గాలిలో వేగం కూడా లేకపోవడంతో ఆ ప్రభావం మ్యాచ్‌పై పడి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్ ఎయిర్ క్వాలిటీ ఉందంటూ లంక ఆటగాళ్ల ఫిర్యాదుపై ప్రస్తుతం అంపైర్లు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టు తొలి బంతికి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మొహ్మద్ షమీ వేసిన బంతికి కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. -
ఓటమికి మా అసమర్థతే కారణం
నాగ్‌పూర్: భారత్‌తో ఘోర పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమల్ అభిప్రాయపడ్డాడు. ఇర రెండో టెస్టులో ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో శ్రీలంక దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం చండిమల్ మాట్లాడుతూ.. ‘ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయాల్సింది. కానీ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేయలేనప్పుడు ఏ జట్టుతో పోరాడటమైన కష్టం. పైగా మేము ప్రపంచ దిగ్గజ జట్టుతో ఆడుతున్నాం. టాస్ గెలిచినా ఆటగాళ్లు రాణించలేకపోయారు. నా కెప్టెన్సీలో అత్యంత దారుణ ఓటమి నమోదు కావడం చాలా బాధగా ఉంది. పాక్‌తో సిరీస్ అనంతరం గొప్ప లక్ష్యంతో భారత్‌కు వచ్చాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. మాకు మేం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా బౌలర్లు కొంత మేర పర్వాలేదనిపించారు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు. ఫీల్డింగ్‌లో కూడా మేం దారుణంగా విఫలమయ్యాం.’ అని చండిమల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీలంక తాత్కాలిక కోచ్ నిక్ పోథాస్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఘోరపరాభవాన్ని మూటకట్టుకున్నందుకు లంక క్రికెటర్లు సిగ్గుపడాలని చురకలంటించాడు. -
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
నాగ్‌పూర్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 21/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆటప్రారంభించిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జడేజా వేసిన 15 ఓవర్ రెండో బంతికి కరుణరత్నే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తిరిమన్నే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్న లంక బ్యాట్స్‌మెన్‌ను భారత ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్‌తో బెంబేలిత్తిస్తున్నారు. ఇక అంతకు ముందు కోహ్లి డబుల్ సెంచరీ, రోహిత్, పుజారా, విజయ్ సెంచరీలతో భారత్ 405 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. -
కోహ్లి కదం తొక్కగా...
విరాట్ కోహ్లి ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో మళ్లీ పరుగుల వరద పారించాడు. టెస్టుల్లో బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అన్నట్లుగా చూడచక్కటి షాట్లతో మురిపించాడు. గత మ్యాచ్ సెంచరీ జోరును కొనసాగిస్తూ ఈసారి ‘డబుల్’తో అదరగొట్టగా... నేనూ టెస్టు ఆడగలనంటూ మరోవైపు నుంచి రోహిత్ శర్మ శతకంతో అండగా నిలిచాడు. మూడో రోజు వీరిద్దరి దెబ్బకు లంక కుదేలైంది. గతి తప్పిన బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, మైదానంలో ఆటగాళ్లలో అలసట, అసహనం... వెరసి శ్రీలంక ఓటమిని ఆహ్వానిస్తోంది. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బ తీసిన ఇద్దరు పేసర్లు ఈ సారి మన బ్యాటింగ్ జోరుకు పరుగులు ఇవ్వడంలో సెంచరీ దాటగా... కోహ్లితో పోటీ పడిన దిల్రువాన్ పెరీరా ఏకంగా డబుల్ సెంచరీ చేసేశాడు. 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇప్పటికే మ్యాచ్‌ను గుప్పిట బిగించిన టీమిండియా... నాలుగో రోజే నాగ్‌పూర్‌లో ఆట ముగించే అవకాశం ఉంది. నాగ్‌పూర్: తొలి టెస్టులో దురదృష్టవశాత్తూ తమ చేజారిన విజయాన్ని ఈసారి భారత్ ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇక్కడి జామ్తా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి సేన భారీ గెలుపుపై కన్నేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు వెనుకబడిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 384 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీలంక ఫామ్, భారత బౌలర్ల జోరు చూస్తే ఆ జట్టు నాలుగో రోజంతా నిలబడటం కూడా కష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 610 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (267 బంతుల్లో 213; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో ఐదో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇది అతని కెరీర్లో 19వ శతకం కావడం విశేషం. కోహ్లితో పాటు రోహిత్ శర్మ (160 బంతుల్లో 102 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో మూడో సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 173 పరుగులు జోడించడం విశేషం. మొత్తంగా మూడో రోజు 78.1 ఓవర్లు ఆడిన భారత్ 298 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో దిల్రువాన్ పెరీరాకు 3 వికెట్లు దక్కాయి. కొనసాగిన జోరు... మూడో రోజు ఆరంభంలోనే భారత్ ఆట జట్టు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 312/2తో ఆదివారం బరిలోకి దిగిన భారత్ రోజంతా లంకపై తమ ఆధిపత్యం ప్రదర్శించింది. పుజారా తనదైన శైలిలో ఆడుతూ తొలి పరుగు కోసం 23 బంతులు తీసుకోగా... కోహ్లి మాత్రం లక్మల్ ఓవర్లో రెండు బౌండరీలు బాది దూకుడుకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే లక్మల్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా సింగిల్ తీసి విరాట్ 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్‌కు కాస్త ముందు షనక వేసిన యార్కర్‌కు పుజారా (362 బంతుల్లో 143; 14 ఫోర్లు) బౌల్డ్ కావడంతో 183 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 29 ఓవర్ల తొలి సెషన్లో భారత్ 92 పరుగులు జోడించింది. అయితే విరామం తర్వాత వెంటనే రహానే (2) వికెట్ తీయడంలో లంక సఫలమైంది. ఇద్దరూ పోటీగా... కోహ్లి, రోహిత్ జోడి జత కలిసిన తర్వాత భారత్ స్కోరు వేగం మరింత పెరిగింది. వీరిద్దరు వన్డే శైలిలో ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించారు. 13 నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పెరీరా బౌలిం గ్లో ముందుకొచ్చి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదడంతో 193 బంతుల్లోనే కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. మరోవైపు హెరాత్ బౌలింగ్‌లో బౌండరీలతో చెలరేగిన రోహిత్ 98 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. టీ విరామం ముగిసిన తర్వాత కాసేపటికి పెరీరా బౌలింగ్‌లో సిక్సర్‌తో 195కు చేరిన కోహ్లి, అతని తర్వాతి ఓవర్లో లాంగాన్ దిశగా సింగిల్ తీసి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరకు పెరీరా బౌలింగ్‌లోనే కోహ్లి అవుట్ కాగా...అశ్విన్ (5) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో వేగం పెంచిన రోహిత్ షనక బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి సెంచరీని అందుకున్నాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇషాంత్ దెబ్బకు... రెండు రోజుల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత తీవ్రంగా అలసిన లంకకు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇషాంత్ వేసిన రెండో బంతిని ఆడకుండా వదిలేసి సమరవిక్రమ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. అయితే కరుణరత్నే, తిరిమన్నె మిగిలిన 8.4 ఓవర్లను జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 205; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) గమగే 7; విజయ్ (సి) పెరీరా (బి) హెరాత్ 128; పుజారా (బి) షనక 143; కోహ్లి (సి) తిరిమన్నె (బి) పెరీరా 213; రహానే (సి) కరుణరత్నే (బి) పెరీరా 2; రోహిత్ (నాటౌట్) 102; అశ్విన్ (బి) పెరీరా 5; సాహా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (176.1 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 610. వికెట్ల పతనం: 1–7; 2–216; 3–399; 4–410; 5–583; 6–597. బౌలింగ్: లక్మల్ 29–2–111–0; గమగే 35–8–97–1; హెరాత్ 39–11–81–1; షనక 26.1–4–103–1; పెరీరా 45–2–202–3; కరుణరత్నే 2–0–8–0. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సమరవిక్రమ (బి) ఇషాంత్ 0; కరుణరత్నే (బ్యాటింగ్) 11; తిరిమన్నే (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టానికి) 21. వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: ఇషాంత్ 4–1–15–1; అశ్విన్ 4–3–5–0; జడేజా 1–1–0–0. 3 రోహిత్ శర్మ కెరీర్లో (22వ టెస్టు) ఇది మూడో సెంచరీ. 2013లో తన తొలి రెండు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదిన రోహిత్... నాలుగేళ్ల తర్వాత ఈ సెంచరీ చేయడానికి ముందు మిగిలిన 19 టెస్టుల్లో 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. వీర విరాట్... విరాట్ కోహ్లి సెంచరీల మోత మోగించడం కొత్త కాదు. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకోవడం కూడా కొత్త కాదు. అదే జోరు, అదే శైలి, షాట్లు ఆడేటప్పుడు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం, సాధికారత... తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా సాగుతున్న ఆట. కోల్‌కతా టెస్టులో సహచరుల అండ కరువైన కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేయగలిగిన అతను... 216/2 స్కోరుతో అప్పటికే ఆధిక్యం కూడా లభించేసి అంతా బాగున్న స్థితిలో బరిలోకి దిగి స్కోరు చేయకుంటే ఆశ్చర్యపడాలి కానీ ఈ తరహాలో పరుగుల వరద పారించడం అనూహ్యం ఏమీ కాదు! అయితే ఇక్కడ కూడా అతను తనదైన క్లాస్‌ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, అప్పటికే కుంగిపోయిన లంకన్లను మరింత చావు దెబ్బ కొట్టేలా నిర్దాక్షిణ్యంగా సాగింది. చెత్త బంతులను బౌండరీకి తరలించడమే కాదు... ఫీల్డర్ల మధ్య ఖాళీలను సరిగ్గా అంచనా వేస్తూ డీప్‌లోకి కొట్టి సింగిల్స్, డబుల్స్ కూడా అతను చురుగ్గా తీస్తూ పోయాడు. పెరీరా బౌలింగ్‌లో 111 వద్ద వెనక్కి జరిగి మిడాఫ్ మీదుగా కొట్టిన ఫోర్, 188 వద్ద అతని బౌలింగ్‌లోనే ముందుకొచ్చి మిడ్ వికెట్ మీదుగా బాదిన బౌండరీ ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాదాపు 80 స్ట్రైక్‌రేట్‌తో సాగిన కోహ్లి ఇన్నింగ్స్ అతని ప్రత్యేకతను మరోసారి చూపించింది. కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్ ప్లస్ ఎక్స్‌ట్రాలు కలిపి చూస్తే 299 బంతుల్లో 51.51 స్ట్రైక్‌రేట్‌తో 154 పరుగులే వచ్చాయంటే కోహ్లి ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. చివరకు నన్ను అవుట్ చేయడం మీ వల్ల ఏం అవుతుందిలే, నేనే వికెట్ ఇస్తాను అన్నట్లుగా బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఇస్తే గానీ కోహ్లిని ఆపడం లంక వల్ల కాలేదు. పరుగులు చేయడం మాత్రమే కాదు... అవి గెలుపు కోసం ఉపయోగపడాలన్నదే కోహ్లి మంత్రం. జట్టుకు దూకుడు నేర్పిన అతని నాయకత్వంలో భారత్ గత 27 టెస్టుల్లో 20 గెలవగలిగింది. వీటిలో 2201 పరుగులతో కెప్టెన్‌గా కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా అనిపించినా... దిగ్గజం సునీల్ గావస్కర్ 34 సెంచరీల్లో కేవలం 6 మాత్రమే జట్టుకు విజయానికి ఉపయోగపడ్డాయి! గత ఏడాది జులైకి ముందు విరాట్ కోహ్లి ఖాతాలో 11 సెంచరీలు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే 150 పరుగుల స్కోరు దాటగలిగాడు. కానీ వెస్టిండీస్‌తో నార్త్ సౌండ్‌లో జరిగిన టెస్టునుంచి కోహ్లి కొత్త రూపం కనిపించింది. అప్పటి నుంచి చేసిన 8 సెంచరీల్లో 5 డబుల్ సెంచరీలు ఉండటం కోహ్లి గొప్పతనం ఏమిటో చెబుతుంది. గత నాలుగు డబుల్ సెంచరీల్లో భారత్ గెలవగా... ఈసారి కూడా విజయానికి చేరువలో ఉంది. కెరీర్ ఆరంభంలో వివాదాస్పద ప్రవర్తనతో కోహ్లిని చాలా మంది ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో పోల్చారు. ఇప్పుడు జట్టును ముందుం డి నడిపించడంలో అతనికి పాంటింగ్‌తో పోలిక సరిగ్గా సరిపోతుంది. తమ కెప్టెన్సీ కెరీర్లో ఎక్కువ భాగం బ్రియాన్ లారాకు తన స్థాయి బ్యాట్స్‌మెన్ సహచరులు గానీ, సరైన బౌలింగ్ వనరులు గానీ లేకపోగా... సచిన్‌కు అద్భుతమైన బ్యాటింగ్ అండగా ఉన్నా, బౌలర్లు ఉపయోగపడలేకపోయారు. భవిష్యత్తు సంగతి చెప్పలేకపోయినా, ప్రస్తుతానికి కోహ్లికి మాత్రం ఈ రెండు వనరులు అందుబాటులో ఉండటంతో ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా కోహ్లి జైత్రయాత్ర కొనసాగుతోంది. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ అతను ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. 10 టెస్టులు, వన్డేలు కలిపి కోహ్లి 2017లో సాధించిన సెంచరీలు. ఒకే ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా గతంలో పాంటింగ్ (9), గ్రేమ్ స్మిత్ (9) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. 12 కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. గావస్కర్ (11)ను విరాట్ అధిగమించాడు. 5 కోహ్లి కెరీర్లో సాధించిన డబుల్ సెంచరీలు. భారత్ ఆటగాళ్ళలో సచిన్ (6), సెహ్వాగ్ (6) మాత్రమే అతనికంటే ముందున్నారు. ఓవరాల్‌గా కెప్టెన్ హోదాలో ఐదు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లి, బ్రియాన్ లారా (5)తో సమంగా నిలిచాడు. 3 ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది మూడో సారి. కోహ్లి ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడు. గావస్కర్, సచిన్‌ల తర్వాత ఈ తరంలో కోహ్లిదే ఆ స్థానం. విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాలో కూడా శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో విఫలమైన సమయంలో అతను పాత కోహ్లి మాత్రమే. ఈసారి అక్కడ కూడా చెలరేగి తన పరుగుల దాహం తీర్చుకుంటాడని ఆశిస్తున్నా. – సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ -
ఈ ఏడాది అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లి
-
మరో శతకం సాధించిన కోహ్లి
నాగ్‌పూర్: అన్ని ఫార్మట్లలో కలిపి అలవోకగా 50 శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు. శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్ట్ భారత తొలి ఇన్నింగ్స్ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 312/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పుజారా, కోహ్లిలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ.. మూడో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో రోజు రెండు సెంచరీలు( మురళి విజయ్, పుజారా) నమోదుకాగా మూడో రోజు మూడో సెంచరీ నమోదు కావడం విశేషం. కెప్టెన్‌గా కోహ్లి రికార్డు ఈ సెంచరీతో కెప్టెన్‌గా రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్ల పేరిట ఉన్న రికార్డులను కోహ్లి అధిగమించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో పది సెంచరీలతో పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టగా.. భారత కెప్టెన్‌గా 12వ సెంచరీతో గవాస్కర్‌ను వెనక్కి నెట్టాడు. గతంలో ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో ప్రథమ స్థానంలో నిలువగా.. ఇప్పుడు దాన్ని కోహ్లీ అధిగమించాడు. ఈ సెంచరీతో టెస్టు కెరీర్లో ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
168 పరుగులతో భారత్ విజయం
-
ధోనీ-అభిమాని: ఓ అరుదైన ఘటన!
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న ధోనీ.. భారత్-లంక నాలుగో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ లంక అభిమాని అకస్మాత్తుగా మైదానంలో దూసుకొచి.. ధోనీ ప్రాక్టీస్ సెషన్ అడ్డుకున్నాడు. ఎందుకంటే.. ధోనీతో సెల్ఫీ తీసుకోవడానికి.. ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అతను సెల్ఫీ తీసుకోవడం భారత ఆటగాళ్లను విస్మయపరిచింది. గురువారం జరిగే నాలుగో వన్డేతో ధోనీ 300 వన్డేలు ఆడిన ఘనతను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా మంగళవారం ఆయన మైదానంలో బ్యాటింగ్ చేస్తుండగా ఓ లంక అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి.. మైదానంలోకి వచ్చాడు. మొదట రోహిత్ శర్మను చూసి ధోనిగా పొరపడి అతని వద్దకు వెళ్లాడు. దీంతో ధోనీ అక్కడ ఉన్నాడని రోహిత్ చూపించాడు. అభిమాని మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ధోనీ వద్దకు వెళ్లి అడిగి సెల్ఫీ తీయించుకున్నాడు. అభిమానితో హుందాగా ప్రవర్తించిన ధోనీ సెల్ఫీ దిగిన అనంతరం గప్‌చుప్‌గా వెళ్లాలని అతనికి సూచించాడు. ఆ తర్వాత అతను వెళ్లిపోగా.. ఇంతలోనే భద్రతాసిబ్బంది భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మైదానంలో మధ్యలోకి అతను ఎలా వచ్చాడని ఆరా తీయగా.. అతను నాలుగో వన్డే జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియం సిబ్బంది అని, అందుకే ధోనీ వద్దకు రావడంలో అతనికి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదని తెలిసింది. -
ధావన్.. నువ్విలాగే దూసుకుపో..!
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో తన దూకుడేంటో మరోసారి చాటాడు ఓపెనర్ శిఖర్ ధావన్. 90 బంతుల్లో 132 పరుగులతో స్వైరవిహారం చేసిన ధావన్ టీమిండియాకు మరో సునాయస విజయాన్ని అందించాడు. ధావన్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (70 బంతుల్లో 82 పరుగులు) కూడా చెలరేగడంతో 127 బంతులు మిగిలి ఉండగానే భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓ జోడీ అజేయంగా 197 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా.. 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లో ఛేజ్ చేసి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓపెనర్ ధావన్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. ధావన్ తన దూకుడును ఇదేవిధంగా కొనసాగించాలని, ఇదే 'హ్యాపీజోన్'లో ఉంటూ భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని సూచించాడు. 'గత మూడు నెలలుగా ధావన్ గొప్పగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌లో అతని విజయపరంపర కొనసాగుతోంది. ఇదే హ్యాపీజోన్లో అతను కొనసాగుతూ.. జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి అతను దూకుడు మొదలుపెట్టాడంటే అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు' అని మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లి పేర్కొన్నాడు. -
బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మన్ అతనే: కోహ్లి
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన ఛటేశ్వర్ పూజారాపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఉత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో పూజారా ఒకరు. అతని పరుగుల దాహం, అతని మానసిక సామర్థ్యం అతన్ని గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టాయి' అని కితాబిచ్చాడు. రెండో టెస్టులో 133 పరుగులు చేసిన పూజారా.. మరో బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (132)తో కలిసి 217 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 622/9 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌట్ చేసి.. ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ 'ముఖ్యంగా మిడిలార్డర్లో మా జట్టులో ఇద్దరు ఉత్తమ టెస్ట్ ఆటగాళ్లు పూజారా, రహానే. వారు చాలా నిలకడగా ఆడుతున్నారు. నేను పూజారాకే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. టీమిండియా తరఫున కేవలం ఒక ఫార్మెట్‌లోనే అతను ఆడుతున్నాడు. అయినా, ఎంతో పరుగుల దాహంతో ప్రతిసారి రాణిస్తున్నాడు. ఎంతో అకుంఠిత దీక్ష, మానసిక సామర్థ్యం ఉంటే తప్ప ఇలా నిలకడగా రాణించడం సాధ్యం కాదు' అని కోహ్లి అన్నాడు. -
గాలె టెస్ట్ : ఇక్కట్లలో లంక