క్రికెట్ దిగ్గజం సచిన్‌కు టెండూల్కర్‌కు శ్రీలంక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. శ్రీలంక ఈ ఏడాది 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే భారత్, బంగ్లాదేశ్‌లతో కలిసి నిదహాస్ టీ 20 ముక్కోణపు టోర్నీని జరుపుతోంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో వేడుకల్లో పాల్గొని, మ్యాచ్‌లను వీక్షించాలని లంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సచిన్‌కు లేఖ రాశారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపిన సచిన్.. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న లంక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
శ్రీలంక 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 1998 లో భారత్-శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్(నిదహాన్ టోర్నీ) జరిగింది. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో గంగూలీ, సచిన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 252 పరుగులు జోడించగా.. నిదహాస్ ట్రోఫీ టీమ్ ఇండియా సొంతమైంది. కాగా, ప్రస్తుత టోర్నీలో భాగంగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లొ భారత్, శ్రీలంక తలపడునున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment