నాగ్‌పూర్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 21/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆటప్రారంభించిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జడేజా వేసిన 15 ఓవర్ రెండో బంతికి కరుణరత్నే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తిరిమన్నే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్న లంక బ్యాట్స్‌మెన్‌ను భారత ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్‌తో బెంబేలిత్తిస్తున్నారు. ఇక అంతకు ముందు కోహ్లి డబుల్ సెంచరీ, రోహిత్, పుజారా, విజయ్ సెంచరీలతో భారత్ 405 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment