టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్‍బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్‌లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్‍స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది.
ఈ ఏఐ టూల్ క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్‌కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా ఎన్నుకుంది.
ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్‌లో మ్యాక్స్‌వెల్, ఆతర్వాత ధోని, ఆల్‌రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్‌లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment