కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టులోకి భారీ హిట్టర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటన నిమిత్తం ఆ దేశ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఆజమ్ ఖాన్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ మ్యాచ్ ఆడినప్పటికీ.. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్‌లో భారీ సిక్సర్లతో చెలరేగుతుండంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడంపై పాక్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీకాయంతో అలవోకగా సిక్సర్లు బాదే ఆజమ్ ఖాన్.. ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎస్‌పీఎల్)లలో విదేశీ క్రికెటర్ల సహచర్యంలో ఈ భారీ హిట్టర్ రాటుదేలాడు. ఇటీవలి కాలంలో 32 కిలోల బరువు తగ్గిన ఆజమ్ ఖాన్.. ఓ వైపు ఫిట్‌నెస్ కాపాడుకుంటూనే, తన సహజసిద్ధమైన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే, బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరనుంది. జూలై 8 నుంచి 20 వరకు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అనంతరం విండీస్‌తో అయిదు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
చదవండి:
ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment