Moin Khan
-
‘ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే.. అంతే ఇక’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయాలనైనా కనీసం గౌరవించాలని హితవు పలికాడు.తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి!వన్డే ఫార్మాట్ మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను అక్కడకు పంపించే పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.లాహోర్‌లోనే రోహిత్ సేన మ్యాచ్‌లన్నీ!అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం టీమిండియాకు సైతం తమ దేశంలోనే ఆతిథ్యం ఇస్తామని.. టోర్నీ నిర్వహణలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఐసీసీకి చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతేకాదు.. లాహోర్‌లోనే రోహిత్ సేన మ్యాచ్‌లన్నీ నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం టోర్నీ వేదికను మార్చే ఉద్దేశం లేదని చెప్పడం గమనార్హం.ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతిలోఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ ఐసీసీ ఆదేశాలను తప్పక గౌరవించాలి. ఒకవేళ వాళ్లు అలా చేయనట్లయితే.. ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతి అనుసరిస్తుంది.భవిష్యత్తులో ఇండియాలో జరుగబోయే ఈవెంట్లలో పాల్గొనదు. నిజానికి టీమిండియా క్రికెట్ దిగ్గజాలు బీసీసీఐకి సలహాలు ఇవ్వాలి. ఆటను, రాజకీయాలను వేరుగా చూడమని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఆశపడుతున్నారు. అది కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే కాదు.. ఆటకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి టీమిండియా ఇక్కడికి వస్తేనే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీని నిర్వహించేందుకు వివిధ స్టేడియాల్లో పీసీబీ చేపట్టిన మరమ్మత్తు పనులు ఇంకా పూర్తికానేలేదు.చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్ -
‘నా కుమారుడికి అవకాశాలు ఇవ్వలేదు.. నాశనం చేశారు’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్ కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.రాణించని ఆజం ఖాన్కాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆజం ఖాన్‌కు చోటు దక్కింది.ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆజం ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు.. కనీసం సూపర్-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.బాడీ షేమింగ్.. విమర్శలుఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్‌ను బాడీ షేమింగ్ చేశారు చాలా మంది. మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్ ఖాన్ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?‘‘వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లన్నీ నేను చూశాను. వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఆజం ఖాన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్-2022 సమయంలో రమీజ్ రాజా నా కుమారుడు ఆజం ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాడు.సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్ ఖాన్ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: విఫలమైన సంజూ శాంసన్.. సింగిల్ డిజిట్ స్కోర్ -
అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు: పాక్ ఆటగాడిపై విమర్శలు
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్ బృందంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.పూర్తిగా విఫలంఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్.. నాలుగో టీ20లో డకౌట్ అయ్యాడు.ఇంగ్లండ్ సీనియర్ పేసర్ మార్క్‌వుడ్ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 135.38.అయితే, వరల్డ్‌కప్-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్ఇక ఈ సిరీస్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్‌పై పడింది. వికెట్ కీపర్‌గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆజం ఖాన్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్‌కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడే ఈ ఆజం ఖాన్!!చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుAzam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf— yang goi (@GongR1ght) May 30, 2024Azam Khan is the best example of nepotism in our country. Mediocrity rules here in every department. Shameless people who persisted with him must be charged and sentenced. This is a criminal act not a simple mistake.— Mubasher Lucman (@mubasherlucman) May 30, 2024WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024 -
Ind vs Pak: టీమిండియాను చూస్తేనే మా వాళ్లు వణికిపోతున్నారు: పాక్ మాజీ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్ అంటే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ సారథి మొయిన్ ఖాన్ అన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజంకు జట్టులోని సీనియర్లెవరూ సలహాలు ఇచ్చే సాహసం చేయలేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతో వెనక్కి తగ్గడం సరికాదంటూ పాక్ ఆటగాళ్లకు హితబోధ చేశాడు. భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడేటపుడు వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని.. లేదంటే పరాభవాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ఆసియా వన్డే కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుని విమర్శలపాలైంది. భారత బ్యాటర్లు దంచికొట్టిన పిచ్‌పై పాక్ ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి ఇంటిబాట పట్టిన విషయం విదితమే. ఇదిలా ఉంటే... ఆసియా టోర్నీలో పరాజయం తర్వాత పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్-2023కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భారత్‌కు చేరుకున్న బాబర్ ఆజం బృందం.. హైదరాబాద్‌లో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లంత బాబర్ ఆజంకు సలహాలు ఇవ్వడానికి భయపడ్డారు. నేనీ మాటను బల్లగుద్ది చెప్పగలను. రిజ్వాన్, షాదాబ్.. షాహిన్ వీళ్లంతా బాబర్‌కు సలహాలు ఇవ్వలేకపోయారు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు కనిపించలేదు. అసలు గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో! ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా వాటిని పాటించడం లేదనే అనిపిస్తోంది. ఎందుకో టీమిండియాను చూస్తేనే పాక్ ఆటగాళ్లు వణికిపోతున్నారు. అందుకే తాము ఇచ్చిన సలహాలు పనిచేయకపోతే ఫలితం గురించి చింతించక తప్పదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటి భయాలు సహజమే. కానీ ఆటగాళ్లుగా మనం పూర్తిస్థాయిలో మన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ప్రదర్శించాలి. ప్రతికూల ఫలితం వస్తుందనే భయం ఉన్నా బాడీ లాంగ్వేజ్‌లో దానిని కనిపించనివ్వకూడదు’’ అని మొయిన్ ఖాన్ పాక్ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చాడు. పాకిస్తాన్ డ్రెసింగ్‌రూం వాతావరణం బాగాలేదేమోనన్న సందేహం వ్యక్తం చేసిన ఈ మాజీ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. విభేదాలు పక్కనపెట్టి ముందుకు సాగితేనే మెగా టోర్నీలో రాణించగలరంటూ మొట్టికాయలు వేశాడు. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 14న పాకిస్తాన్ అహ్మదాబాద్‌లో టీమిండియాతో తలపడనుంది. చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం! -
నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్ కొడుకా! పెద్ద ప్రమాదమే! వైరల్
Pakistan Super League, 2023: కడుపున పుట్టిన బిడ్డలు తాము అనుకున్న రంగంలో రాణిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు. అద్భుతమైన ప్రతిభాపాటవాలతో పేరు తెచ్చుకుంటే మురిసిపోతారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్‌కు తన కుమారుడి కారణంగా ఇలాంటి అనుభూతి కలిగింది. తనలాగే బ్యాట్ పట్టి అద్భుత ఇన్నింగ్స్‌తో కొడుకు చెలరేగడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మొయిన్. అయితే, అదే సమయంలో ‘ఎంత పనిజేసినవ్ బిడ్డా’ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కొడుకు ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌ను తనకు అంకిమితమివ్వగానే చప్పట్లతో అతడిని అభినందించిప్పటికీ అతడి విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ఇందుకు కారణమేమిటంటే.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ బ్యాటర్ ఆజం ఖాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ(97 పరుగులు) చేజారినా జట్టుకు విజయం అందించి ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ గా నిలిచాడు. ఈ క్రమంలో మరుపురాని ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చాడు. డగౌట్లో కూర్చున్న తండ్రి మొయిన్ ఖాన్ వైపు చూస్తూ.. ‘‘ఈ ఇన్నింగ్స్ నీకోసమే నాన్నా’’ అన్నట్లు సైగ చేశాడు. దీంతో మొయిన్ ఖాన్ చప్పట్లతో కొడుకుకు శుభాభినందనలు తెలియజేశాడు. కానీ.. తన జట్టుకు పరాభవం ఎదురుకావడంతో కాస్త నిరాశపడ్డాడు. అవును.. ఆజం ఖాన్ కారణంగా క్వెటా గ్లాడియేటర్స్ 63 పరుగుల తేడాతో ఓటమిపాలు కావడంతో మొయిన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. తండ్రి కోచ్‌గా ఉన్న జట్టుపై సునామీ ఇన్నింగ్స్‌తో ఆజం ఖాన్ సునామీ ఇన్నింగ్స్‌తో.. తాజా విజయం కారణంగా ఇస్లామాబాద్ యునైటెడ్ పీఎస్ఎల్-2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఆజం ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ క్వెటా జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆజం ఇన్నింగ్స్ చూసిన మెయిన్ ఖాన్ షాక్‌లో ఉండిపోయాడు. కొడుకు ఆటకు మురిసిపోవాలో.. లేదంటే తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు చేరువైన తరుణంలో బాధపడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు. పెద్ద ప్రమాదమే! క్వెటా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో కొడుకు వల్ల మొయిన్ ఖాన్‌కు పెద్ద ప్రమాదమే వచ్చి పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మొయిన్ 1990- 2004 మధ్య కాలంలో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక తన తండ్రి కోచ్‌గా వ్యవహరిస్తున్న జట్టుపై కొడుకు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం బహుశా పీఎస్ఎల్ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! When you make your dad proud 🥹#SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/9sVWHkOByQ — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్‌కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
Azam Khan: పాక్ క్రికెట్ జట్టులోకి భారీ హిట్టర్..
కరాచీ: పాకిస్థాన్ టీ20 జట్టులోకి భారీ హిట్టర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటన నిమిత్తం ఆ దేశ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కుమారుడు 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఆజమ్ ఖాన్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ మ్యాచ్ ఆడినప్పటికీ.. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో భారీ సిక్సర్లతో చెలరేగుతుండంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయడంపై పాక్ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీకాయంతో అలవోకగా సిక్సర్లు బాదే ఆజమ్ ఖాన్.. ఇప్పటి వరకు 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్), శ్రీలంక ప్రీమియర్ లీగ్(ఎస్పీఎల్)లలో విదేశీ క్రికెటర్ల సహచర్యంలో ఈ భారీ హిట్టర్ రాటుదేలాడు. ఇటీవలి కాలంలో 32 కిలోల బరువు తగ్గిన ఆజమ్ ఖాన్.. ఓ వైపు ఫిట్నెస్ కాపాడుకుంటూనే, తన సహజసిద్ధమైన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే, బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్ బయలుదేరనుంది. జూలై 8 నుంచి 20 వరకు ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అనంతరం విండీస్‌తో అయిదు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు 'నీ చాలెంజ్ ఒప్పుకుంటున్నా.. బైక్ కొనడానికి రెడీగా ఉండు' -
Younis Khan: కుంబ్లే బౌలింగ్‌లో డకౌట్.. మొయిన్ భాయ్ తిట్టాడు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యూనిస్ ఖాన్. ముఖ్యంగా టెస్టు జట్టు మిడిలార్డర్ గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. సంప్రదాయ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతడు... వన్డేల్లో 7 వేల పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన యూనిస్ ఖాన్... ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అతడి శిక్షణలోని పాక్ గత కొన్ని నెలలుగా మంచి విజయాలు నమోదు చేస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన పాక్ జట్టు ఆ దేశాలను ఓడించి వరుస సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇలా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్న యూనిస్ ఖాన్.. కెరీర్ ఆరంభంలో మాత్రం బాగా తిట్లు తిన్నాడట. మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అతడికి చివాట్లు పెట్టాడట. ఈ విషయాల గురించి యూనిస్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ... ‘‘నాకు గుర్తుంది. మొయిన్ ఖాన్ సారథ్యంలోనే నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాను. అయితే, భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేను డకౌట్‌గా వెనుదిరగటంతో భాయ్ నన్ను బాగా తిట్టాడు. తనకు చాలా కోపం వచ్చింది. ఏదేమైనా తనకు ధన్యవాదాలు చెప్పాలి. నిజానికి తన కారణంగానే నా తప్పులు సరిదిద్దుకోగలిగాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. అంతర్జాతీయ క్రికెట్లో నా విజయం వెనుక భాయ్ పాత్ర మరువలేనిది’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2000 సంవత్సరం మార్చిలో షార్జాలో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో యూనిస్ డకౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో దాయాది జట్టుపై ఘన విజయం సాధించింది. మహ్మద్ అజారుద్దీన్(54 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా యూఏఈఓలో నిర్వహించిన కోకా కోలా కప్ మక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. చదవండి: Viral: సిగ్గు పడాలి.. ఇలాగేనా పోరాడేది: భజ్జీ Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! -
సిక్సర్లు కొట్టడం ఓకే.. కోహ్లి, విలియమ్సన్‌ను చూసి నేర్చుకో
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. అయితే అతని బరువు అజమ్‌ను ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. ఇంత బరువు ఉంటే కష్టమని.. ఫిట్నెస్ కాపాడుకోలేవని.. జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అజమ్ ఖాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో అతని ఆటను పూర్తిగా చూడలేకపోయాం. అయితే బారీ కాయంగా కనిపిస్తున్నా అజమ్ ఖాన్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా భారీ సిక్సర్లు బాదడం ఇతనికి అలవాటు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అజమ్ ఖాన్‌ను ప్రశంసిస్తూనే అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ''అజమ్ ఖాన్ ఆటతీరు నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. సిక్సర్లు అలవోకగా బాదుతున్న అజమ్‌కు అదే ప్లస్.. అదే మైనస్ కూడా అవుతుంది. అన్ని సార్లు అతని కొట్టే షాట్లు సిక్సర్లుగా మారుతాయన్న నమ్మకం లేదు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం.. కవర్ డ్రైవ్,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది. కానీ పరిమిత ఓవర్లు క్రికెట్లో ఈ అవసరం రాదు. ప్రతీసారి సిక్స్ కొట్టడం కాదు.. స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లు అవసరం ఉండదు. టైమ్.. షాట్ మూమెంట్స్‌ను కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఆ విషయంలో అజమ్ కాస్త వీక్‌గా ఉన్నాడు. దీనికి కోహ్లి, విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లను పరిశీలించాలి.. వారి ఆటతీరు ఎలా ఉందన్నది గమనించాలి. దీనికి తోడు అతను హెవీ వెయిట్ అతనికి మరో మైనస్. ముందు అతని వెయిట్ తగ్గితే సగం ఒత్తిడి తొలిగిపోయినట్లే. ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఎంపికైతే మాత్రం బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదగడం ఖాయం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అజమ్ ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ పాకిస్తాన్ వికెట్ కీపర్‌గా మంచి పేరు సంపాదించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. 1990-2004 వరకు పాక్ జట్టుకు ఆడిన మొయిన్ ఖాన్ 69 టెస్టుల్లో 2741 పరుగులు.. 219 వన్డేల్లో 3266 పరుగులు సాధించాడు. కొంతకాలం పాటు పాక్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన మొయిన్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్ వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్ మాజీ కెప్టెన్ -
మిస్బా.. నీ ‘ఆట’లు సాగవ్!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్సీ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్ల నుంచి సారథిగా తొలగించడానికి ప్రధాన కారణంగా కొత్తగా కోచ్‌గా వచ్చిన మిస్బావుల్ హక్ కారణమని విమర్శించాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఏదో అద్భుతాలు చేయాలని చూస్తున్న మిస్బా.. సింగిల్‌గా ఏమీ సాధించలేడని విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్లో మిస్బా ఒక శక్తిగా ఎదగాలనుకుంటన్నాడు. అదే పని చేయదనే విషయాన్ని గ్రహించు. అసలు సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా ఎందుకు తీసేయాల్సి వచ్చింది. టీ20 క్రికెట్లో పాకిస్తాన్‌కు 11 వరుస సిరీస్‌లు అందించిన సర్ఫరాజ్‌ను సారథిగా ఎలా తప్పిస్తారు. మిస్బాతో వకార్ యూనస్‌కు సర్ఫరాజ్ అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు. వారి వారి వ్యక్తిగత కారణాలతోనే సర్ఫరాజ్‌ను తొలగించారు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత శక్తిమంతుడిగా ఎదగాలనుకుంటున్నావ్. కానీ సింగిల్ అది వర్క్ ఔట్ కాదు’ అని విమర్శించాడు. ఇటీవల పాకిస్తాన్ టెస్టు, టీ20 క్రికెట్ సారథిగా సర్ఫరాజ్‌ను తప్పించి అజహర్ అలీ, బాబర్ అజామ్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం వన్డే కెప్టెన్సీకి మాత్రమే సర్ఫరాజ్‌ను పరిమితం చేశారు. దాంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని సమర్థిస్తే, మరికొందరు మాత్రం పీసీబీ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యిందంటూ విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మిస్బా-వకార్‌లు తమ స్థానికత కోసం కృషి చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అజహర్ అలీ కూడా పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడే కావడంతో మిస్బాపై విరుచుకుపడుతున్నారు., -
‘పాక్ ప్రదర్శన మరీ అంత చెత్తగా లేదు’
కరాచీ : న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాకిస్తాన్‌కు దాదాపు సెమీస్ దారులు మూసుకపోయాయి. ప్రపంచకప్ లీగ్‌లో భాగంగా చివరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ 316 పరుగుల తేడాతో గెలిస్తేగానీ నాకౌట్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రపంచకప్ నుంచి పాక్ నిష్క్రమించడం ఖాయమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీమిండియాపై ఓడిపోయాక పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్న ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు తాజాగా సెమీస్ ఆశలు గల్లంతవ్వడంతో మరింత విరుచకుపడుతున్నారు. అయితే మాజీ సారథి మొయిన్ ఖాన్ మాత్రం పాక్ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. ‘1992 ప్రపంచకప్ ఫలితాన్ని రిపీట్ చేస్తుందని అందరం భావించాం. కానీ సెమీస్‌కు వెళ్లకుండానే వెనుదిరగడం నిరాశ కలిగించేదే. అయితే ఈ ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ బృందం శక్తి మేర పోరాడింది. స్పూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో మరీ అంత చెత్త ప్రదర్శన చేయలేదు. వారిని నిదించాల్సిన అవసరంలేదు. ఆటగాళ్లను మార్చాలని అందరూ అంటున్నారు. కానీ ఆటగాళ్లను, బాధ్యతలను మార్చినంత మాత్రాన ప్రదర్శన మారదు. టీమిండియాపై ఆస్ట్రేలియా ఓడిపోయినా.. తిరిగి పుంజుకొని పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. కానీ పాక్ మాత్రం అలా చేయలేకపోయంది. ఆటగాళ్లకు, కోచింగ్ బృందానికి ఆటపై మక్కువ, గెలుపు కోసం ఎందాకైనా పోరాడే తెగింపు ఉండాలి’అంటూ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో తమ జట్టు చెత్త ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గత మూడేళ్లుగా పాక్ ప్రదర్శనపై నివేదిక సమర్పించాలని.. అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికలపై కూడా సలహాలు ఇవ్వాలని కమిటీని కోరింది. ఇక సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్‌ను తప్పించాలని పెద్ద మొత్తంలో వాదనలు వినిపిస్తున్నాయి. -
పరువు తీశాడని చంపేశారు!
మెదక్‌రూరల్: పేద, ధనిక తారతమ్యమే ఆ ప్రేమికుడి ప్రాణం తీసింది. సంపన్నుల అమ్మాయిని ప్రాణంగా ప్రేమించడమే అతడు చేసిన తప్పయ్యింది. అమ్మాయిని మరిచిపోయేందుకు డబ్బు ఆశ చూపినా లొంగని ఆ ప్రేమికుడి గుండెను ప్రియురాలి బంధువుల కత్తులు తూట్లు చేశాయి. మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో దారుణ హత్యకు గురైన మోయిన్‌ఖాన్ ఉదంతంలో వారం రోజుల క్రితం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయమై బుధవారం మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ రామకృష్ణ పూర్తి వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మోయిన్‌ఖాన్(20) అనే విద్యార్థి ఈ నెల 2వ తేదీన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణానికి చెందిన ఓ నగల వ్యాపారి కూతురును ప్రేమించినందుకే మోయిన్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మోయిన్ఖాన్ను హత్య చేసేందుకు ఐదుగురు కలిసి కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. అందులో నలుగురు మెదక్ పట్టణానికి చెందిన వారుకాగా ఒకరు ఓల్డ్‌సిటీ యాకుత్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానితులుగా భావించిన మెదక్ పట్టణం అజాంçపురాకు చెందిన మహ్మద్ ఫాజిల్, సయ్యద్ మోజాంబీల్ అహ్మద్, హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ యహియాజాబ్రి అలియాస్ బాండ్లను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను విచారించగా మరో ఇద్దరు మెదక్ పట్టణానికి చెందిన యువకులు సమీర్, షేఖ్ సత్తర్లు హత్యలో పొల్గొన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రియురాలి బావ, సోదరుడు కీలకం.. నగల వ్యాపారి కూతురును మోయిన్ ప్రేమించాడు. డబ్బులు తీసుకొని అమ్మాయిని మరిచిపోవాలని సూచించినా మోయిన్ ప్రేమ డబ్బుకు లొంగలేదు. మరో ఆరు నెలలు అయితే తను ప్రేమించిన అమ్మాయి మేజర్ అవుతుందని అప్పుడు పెళ్లిచేసుకుంటానని మోయిన్ విసిరిన సవాల్ ఆ అమ్మాయి కుటుంబీకులకు మింగుడుపడలేదని, ఫేస్బుక్లో సైతం మోయిన్ చేసిన పోస్టులకు తట్టుకోలేక ఎలాగైనా మోయిన్‌ను హత్య చేయాలని ఆ అమ్మాయి బావ ఫాజిల్, చిన్న అన్న కలిసి మరో ముగ్గురి సహాయం తీసుకున్నారని తెలిపారు. ఓ కేసు విషయంలో ఈ నెల 2న మెదక్ కోర్టుకు çహాజరైన మోయిన్ రాత్రి 8గంటలకు హైదరాబాద్‌కు బస్‌లో బయలుదేరాడు. ఈ విషయం గమనించిన నిందితులు 3320 కారులో జేబీఎస్‌కు వెళ్లి మోయిన్ పై దాడికి పాల్పడి అక్కడే చంపేద్దామనుకున్నారు. కాని ఉన్న ఊర్లో పరువుపోయినందున సొంత ఊర్లోనే చంపాలనుకొని తమ కారులో ఎక్కించుకొని మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో ఉన్న తమ ఫాంహౌస్ వద్ద తీసుకెళ్లారు. అక్కడ మోయిన్ గుండె, వీపు భాగంలో కసిగా కత్తులతో పొడిచి, మర్మాంగాలపై రాళ్లను వేసి, ముఖాన్ని గుర్తుపట్టరాకుండా అతి కిరాతకంగా కొట్టి చంపేసినట్లు వివరించారు. హత్య జరిగిన ప్రదేశంలో మరో పాత ఇండికా కారును ఉంచినట్లు వివరించారు. హత్య చేసేందుకు రెండు కార్లు, కత్తి, చాకు, రెండు బైక్‌లను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయబద్ధంగా విచారణ జరుగుతుందని, బస్ డ్రైవర్, కండక్టర్లతో పాటు మోయిన్ స్నేహితులను సైతం విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ లింబాద్రి, కానిస్టేబుల్ తాహెర్ తదితరులు ఉన్నారు. -
‘మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం’
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) భాగంగా తమ దేశంలో జరగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకర విషయమని ఆవేదన వ్యక్తం చేసిన మొయిన్.. దీనింతటికీ తమ దేశ క్రికెట్ బోర్డు పీసీబీనే కారణమన్నాడు. ఈ సీజన్ పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగగా, ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మాత్రం పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌కు రావడానికి విదేశీ ఆటగాళ్లు నిరాకరించడంపై మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఇలా జరగడానికి పీసీబీ ఉదాసీనతే కారణమని విమర్శలకు దిగాడు. ‘ఇటువంటి బాధాకర పరిస్థితికి మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం. పాకిస్తాన్లో విదేశీ ఆటగాళ్లు ఆడితేనే పీఎస్ఎల్లో ఆడటానికి అనుమతించాలి. మా బోర్డు మాత్రం లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకే పాకిస్తాన్లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు రావడానికి మొగ్గుచూపడం లేదు. మా బోర్డుకు నా మాటలు రుచించకపోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి, పీఎస్ఎల్ పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్లో క్రికెట్‌ను బ్రతికించుకునేందుకు పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి' అని మొయిన్ ఖాన్ తెలిపాడు. పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్ హెడ్ కోచ్‌గా మొయిన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. -
షాహీద్ ఆఫ్రీది కూతురుకు తీవ్ర అస్వస్థత
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ షాహీద్ ఆఫ్రీది కూతురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అబుదాబీలో శ్రీలంకతో శుక్రవారం జరిగే వన్డే మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారులు కూడా ధృవీకరించారు. తన కూతురు ఆరోగ్యం పరిస్థితి బాగా లేకపోవడంతో మేనేజర్ మోయిన్ ఖాన్ ను అనుమతి తీసుకుని కరాచీ బయలు దేరాడు. తన కూతురి ఆరోగ్యం పక్కనే ఉండి చూసుకునేందుకు బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆఫ్రిదీ బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా రాణించడంతో ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ ను పాక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్రిది మ్యాచ్ నుంచి తప్పుకోవడానికి మరో కారణముందని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు యువ క్రీడాకారులకు చోటు దక్కలేదని.. వారికి స్థానం కల్పించేందుకు మ్యాచ్ కు దూరమయ్యాడని బోర్డు సభ్యులు ద్వారా తెలిసింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో పాక్ 3-1 తేడాతో ముందంజలో ఉంది.