ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. అయితే అతని బరువు అజమ్‌ను ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. ఇంత బరువు ఉంటే కష్టమని.. ఫిట్‌నెస్ కాపాడుకోలేవని.. జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అజమ్ ఖాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో అతని ఆటను పూర్తిగా చూడలేకపోయాం. అయితే బారీ కాయంగా కనిపిస్తున్నా అజమ్ ఖాన్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా భారీ సిక్సర్లు బాదడం ఇతనికి అలవాటు.
ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అజమ్ ఖాన్‌ను ప్రశంసిస్తూనే అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ''అజమ్ ఖాన్ ఆటతీరు నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. సిక్సర్లు అలవోకగా బాదుతున్న అజమ్‌కు అదే ప్లస్.. అదే మైనస్ కూడా అవుతుంది. అన్ని సార్లు అతని కొట్టే షాట్లు సిక్సర్లుగా మారుతాయన్న నమ్మకం లేదు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం.. కవర్ డ్రైవ్,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది.
కానీ పరిమిత ఓవర్లు క్రికెట్‌లో ఈ అవసరం రాదు. ప్రతీసారి సిక్స్ కొట్టడం కాదు.. స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లు అవసరం ఉండదు. టైమ్.. షాట్ మూమెంట్స్‌ను కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఆ విషయంలో అజమ్ కాస్త వీక్‌గా ఉన్నాడు. దీనికి కోహ్లి, విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లను పరిశీలించాలి.. వారి ఆటతీరు ఎలా ఉందన్నది గమనించాలి. దీనికి తోడు అతను హెవీ వెయిట్ అతనికి మరో మైనస్. ముందు అతని వెయిట్ తగ్గితే సగం ఒత్తిడి తొలిగిపోయినట్లే. ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఎంపికైతే మాత్రం బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదగడం ఖాయం.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అజమ్ ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ పాకిస్తాన్ వికెట్ కీపర్‌గా మంచి పేరు సంపాదించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. 1990-2004 వరకు పాక్ జట్టుకు ఆడిన మొయిన్ ఖాన్ 69 టెస్టుల్లో 2741 పరుగులు.. 219 వన్డేల్లో 3266 పరుగులు సాధించాడు. కొంతకాలం పాటు పాక్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన మొయిన్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.
చదవండి: నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్
Comments
Please login to add a commentAdd a comment