Mohammed Yusuf
-
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పాకిస్తాన్ సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలిగిన మొహమ్మద్ యూసఫ్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ సెలెక్షన్ కమిటీ నుంచి మొహమ్మద్ యూసఫ్ వైదొలిగాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. బోర్డులో ఇతర బాధ్యతలపై ఫోకస్ పెట్టేందుకు సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలిగినట్లు యూసఫ్ తెలిపాడు. యూసఫ్ సెలెక్షన్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. యూసఫ్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ రెండు బాధ్యతలతో పాటు యూసఫ్ మరో కీలక పదవిలోనూ కొనసాగుతున్నాడు. అతను పాకిస్తాస్ అండర్-19 జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అతని ఆథ్వర్యంలో పాక్ ఈ ఏడాది మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్‌లో మూడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ త్వరలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. స్వదేశంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు ముల్తాన్ వేదికగా.. మూడో టెస్ట్ రావల్పిండి వేదికగా జరుగనున్నాయి. పాక్ ఇటీవలి కాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఆ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు పాక్ టీ20 వరల్డ్‌కప్‌లో పసికూన యూఎస్ఏ చేతిలో ఘెర పరాభవాన్ని ఎదుర్కొంది. చదవండి: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్ -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
సిక్సర్లు కొట్టడం ఓకే.. కోహ్లి, విలియమ్సన్‌ను చూసి నేర్చుకో
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు అజమ్ ఖాన్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. అయితే అతని బరువు అజమ్‌ను ఇబ్బందులు పాలయ్యేలా చేస్తుంది. ఇంత బరువు ఉంటే కష్టమని.. ఫిట్నెస్ కాపాడుకోలేవని.. జాతీయ జట్టులోకి రావడం కష్టమేనంటూ పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ అజమ్ ఖాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ 5 మ్యాచ్‌ల్లో 98 పరుగులు సాధించాడు. అయితే కరోనా కారణంగా లీగ్ వాయిదా పడడంతో అతని ఆటను పూర్తిగా చూడలేకపోయాం. అయితే బారీ కాయంగా కనిపిస్తున్నా అజమ్ ఖాన్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం దిట్ట. క్రీజు కదలకుండానే అలవోకగా భారీ సిక్సర్లు బాదడం ఇతనికి అలవాటు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ ఆటగాడు మహ్మద్ యూసఫ్ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అజమ్ ఖాన్‌ను ప్రశంసిస్తూనే అతనికి కొన్ని సలహాలు ఇచ్చాడు. ''అజమ్ ఖాన్ ఆటతీరు నాకు బాగా నచ్చింది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే అతని ఆటతీరును గమనించాను. సిక్సర్లు అలవోకగా బాదుతున్న అజమ్‌కు అదే ప్లస్.. అదే మైనస్ కూడా అవుతుంది. అన్ని సార్లు అతని కొట్టే షాట్లు సిక్సర్లుగా మారుతాయన్న నమ్మకం లేదు. కానీ అతని షాట్ల ఎంపిక విధానం.. కవర్ డ్రైవ్,ఆన్‌డ్రైవ్ షాట్లు బాగున్నాయి. టీ20 అంటేనే బాదుడు ఉంటుంది. కానీ పరిమిత ఓవర్లు క్రికెట్లో ఈ అవసరం రాదు. ప్రతీసారి సిక్స్ కొట్టడం కాదు.. స్కోరు మంచి స్పీడులో ఉంటే సిక్సర్లు అవసరం ఉండదు. టైమ్.. షాట్ మూమెంట్స్‌ను కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఆ విషయంలో అజమ్ కాస్త వీక్‌గా ఉన్నాడు. దీనికి కోహ్లి, విలియమ్సన్, బాబర్ అజమ్, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లను పరిశీలించాలి.. వారి ఆటతీరు ఎలా ఉందన్నది గమనించాలి. దీనికి తోడు అతను హెవీ వెయిట్ అతనికి మరో మైనస్. ముందు అతని వెయిట్ తగ్గితే సగం ఒత్తిడి తొలిగిపోయినట్లే. ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఎంపికైతే మాత్రం బ్యాటింగ్‌లో మంచి స్టార్‌గా ఎదగడం ఖాయం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అజమ్ ఖాన్ తండ్రి మొయిన్ ఖాన్ పాకిస్తాన్ వికెట్ కీపర్‌గా మంచి పేరు సంపాదించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో మొయిన్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. 1990-2004 వరకు పాక్ జట్టుకు ఆడిన మొయిన్ ఖాన్ 69 టెస్టుల్లో 2741 పరుగులు.. 219 వన్డేల్లో 3266 పరుగులు సాధించాడు. కొంతకాలం పాటు పాక్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన మొయిన్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: నోరు మూసుకో అక్తర్.. కలలు కనటం మానేయ్: ఆసిఫ్ వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్ మాజీ కెప్టెన్ -
పాక్ క్రికెటర్ల మూకుమ్మడి రిటైర్మెంట్!
ఎంసీఎల్‌కు అనుమతించకపోవడంపై స్పందన కరాచీ: మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో ఆడేందుకు ఉత్సాహం చూపించిన పలువురు సీనియర్ పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ బోర్డు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయబోమని బోర్డు ప్రకటించింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించి, ఇకపై తాము పాకిస్తాన్‌కు ఆడాలనే ఆసక్తిని ప్రదర్శించమని లేఖ రాసి ఇస్తేనే ఎంసీఎల్లో ఆడవచ్చని స్పష్టం చేసింది. దాంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు గంట వ్యవధిలోనే తమ రిటైర్మెంట్లను ప్రకటించడం విశేషం. ఎంసీఎల్లో ఆడేందుకు వీరు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. వీరంతా ప్రస్తుత పాక్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా... ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అబ్దుల్ రజాక్, మొహమ్మద్ యూసుఫ్, ఇమ్రాన్ ఫర్హత్, తౌఫీక్ ఉమర్, యాసిర్ హమీద్ ఈ జాబితాలో ఉన్నారు.