పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ జాతీయ సెలెక్షన్ కమిటీ నుంచి మొహమ్మద్ యూసఫ్ వైదొలిగాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. బోర్డులో ఇతర బాధ్యతలపై ఫోకస్ పెట్టేందుకు సెలెక్షన్ కమిటీ నుంచి వైదొలిగినట్లు యూసఫ్ తెలిపాడు. యూసఫ్ సెలెక్షన్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
యూసఫ్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ రెండు బాధ్యతలతో పాటు యూసఫ్ మరో కీలక పదవిలోనూ కొనసాగుతున్నాడు. అతను పాకిస్తాస్ అండర్-19 జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అతని ఆథ్వర్యంలో పాక్ ఈ ఏడాది మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్‌లో మూడో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ త్వరలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. స్వదేశంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఇప్పటికే ప్రాక్టీస్ షురూ చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు ముల్తాన్ వేదికగా.. మూడో టెస్ట్ రావల్పిండి వేదికగా జరుగనున్నాయి. పాక్ ఇటీవలి కాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఆ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు పాక్ టీ20 వరల్డ్‌కప్‌లో పసికూన యూఎస్‌ఏ చేతిలో ఘెర పరాభవాన్ని ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment