
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రీట్జ్కీ ఈ ఫీట్‌ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్‌గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు.
బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.
వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..
కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపై
టెంబా బవుమా 2016లో ఐర్లాండ్‌పై
రీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపై
మాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్‌పై
తటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..
ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపై
ఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపై
ఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపై
రహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్‌పై
మాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్‌పై
బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment