
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆ జట్టుకు కలిసి రావట్లేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ పాక్‌కు పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నీలోనూ పాక్ ఓటమిపాలైంది. ఇన్ని ఘెర అవమానాల తర్వాత పాక్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌కు బయల్దేరనుంది.
ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మార్చి 16న తొలి టీ20 జరుగనుంది. ఆతర్వాత మార్చి 18, 21, 23, 26 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 29న వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5 తేదీల్లో జరుగనున్నాయి.
పాక్ ఆటగాళ్లకు జరిమానా
ఇదిలా ఉంటే, ఆటగాళ్ల ప్రదర్శనను పెంపొందించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినమైన క్రమశిక్షణా చర్యలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా ఝులిపించినట్లు సమాచారం.
గతేడాది చివర్లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదలుకుని తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రూల్స్ అతిక్రమించిన పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించారని తెలుస్తుంది. జరిమానాల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు దాదాపు 3.3 మిలియన్ రూపాయలు వసూలు చేసిందని సమాచారం.
జరిమానా పడిన ఆటగాళ్లలో సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అమీర్ జమాల్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం.
ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్యాప్‌పై 804 అంకెను ముద్రించుకున్నందుకు అమీర్ జమాల్‌కు 1.4 మిలియన్ రూపాయలు..
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో హోటల్ రూమ్‌కు లేట్‌గా వచ్చినందుకు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌కు 5 లక్షల రూపాయలు..
సౌతాఫ్రికా పర్యటనలో హోటల్‌కు లేట్‌గా వచ్చినందుకు సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదికి 200 డాలర్ల జరిమానాను విధించినట్లు పలు క్రికెట్ వెబ్‌సైట్‌లు వెల్లడించాయి.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీ
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్
పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
న్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..
మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)
మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)
మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)
మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)
మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)
మార్చి 29- తొలి వన్డే (నేపియర్)
ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)
ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్)
Comments
Please login to add a commentAdd a comment