పాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు. ఈ పరిచయంతోనే గిలెస్పీ నీల్సన్ పేరును ప్రతిపాదించాడు. గిలెస్పీ, నీల్సన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌తో బాధ్యతలు చేపడతారు.
ఈనెల 21 నుంచి బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్, పాక్‌లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఆగస్ట్ 21 నుంచి 25 వరకు రావల్పిండి వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..
షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment