
మంచు బ్రదర్స్, వీళ్ల కుటుంబంలో ఏమేం జరిగిందో తెలుగు ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. దాదాపు కొన్నివారాల పాటు నడిచిన హంగామా ప్రస్తుతానికైతే సైలెంట్ అయినట్లే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి విష్ణు vs మనోజ్ ఉండబోతుందా అనే సందేహం వస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
మంచు విష్ణు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టి, చాన్నాళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. తొలుత వచ్చిన టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి కానీ ఈ మధ్య రిలీజైన టీజర్, పాటలపై మాత్రం కాస్తంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 25న రిలీజ్ కి తగ్గట్లే ప్రమోషన్స్ సాగుతున్నాయి.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)
అసలు విషయానికొస్తే.. మంచు మనోజ్ కూడా సినిమాలు చేయక చాన్నాళ్లయింది. రెండో పెళ్లి, ఫ్యామిలీలో గొడవలు వల్ల కెరీర్ మీద సరిగా దృష్టి పెట్టలేకపోయాడేమో! ఇకపోతే ఇతడు నటించిన 'భైరవం' అనే మూవీ లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజైపోవాలి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు దీన్ని కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచు బ్రదర్స్ పోటీ అన్నట్లు ఉంటుంది. తాజాగా ఓ ఉగాది ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ కూడా.. 'భైరవం' సరైన తేదీకే వస్తుందని చెప్పాడు. మరి ఈ రూమర్స్ లో నిజమెంతో చూడాలి?
(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)

Comments
Please login to add a commentAdd a comment