T20 World Cup: PCB Announce 15 Men Squad Drop Sarfaraz Ahmed Shoaib Malik - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌లకు నో చాన్స్‌;  పాక్‌ టీ20 జట్టు ఇదే

Published Mon, Sep 6 2021 1:34 PM | Last Updated on Mon, Sep 6 2021 3:16 PM

T20 World Cup: PCB Announce 15 Men Squad Drop Sarfaraz Ahmed Shoaib Malik - Sakshi

Pakistan T20 World Cup Squad 2021.. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) సోమవారం ప్రకటించింది. బాబర్‌ అజమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఉన్నారు. కాగా ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ప్రకటించారు.

ఊహించనట్టుగానే యువ ఆటగాడు అజమ్‌ ఖాన్‌ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షాలాంటి కొత్త మొహాలు జట్టులో ఉన్నారు. ఇక పాక్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌, మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆల్‌రౌండర్‌ షార్జీల్‌ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. 

చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు

ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌, భారత్‌ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూఫ్‌ 2లో భాగంగా భారత్‌,పాకిస్తాన్‌,న్యూజిలాండ్‌,అఫ్గానిస్తాన్‌,బి1 క్వాలిఫయర్‌, ఏ2 క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్తాన్‌ టీమిండియాతో అక్టోబర్‌ 24న తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

15 మందితో పాక్‌ టీ20 ప్రాబబుల్స్‌:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్ 

చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement