Team Squad
-
షోయబ్ మాలిక్, సర్ఫరాజ్‌లకు నో చాన్స్; పాక్ టీ20 జట్టు ఇదే
Pakistan T20 World Cup Squad 2021.. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సోమవారం ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించారు. ఊహించనట్టుగానే యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్దిల్ షాలాంటి కొత్త మొహాలు జట్టులో ఉన్నారు. ఇక పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూఫ్ 2లో భాగంగా భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్,అఫ్గానిస్తాన్,బి1 క్వాలిఫయర్, ఏ2 క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్తాన్ టీమిండియాతో అక్టోబర్ 24న తొలి మ్యాచ్ ఆడనుంది. 15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్ చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది' Asif and Khushdil return for ICC Men's T20 World Cup 2021 More details ➡️ https://t.co/vStLml8yKw#PAKvNZ | #PAKvENG | #T20WorldCup pic.twitter.com/9samGbJgDJ — PCB Media (@TheRealPCBMedia) September 6, 2021 -
విండీస్‌తో టీమిండియా జట్టు ఇదే; భూవీకి పిలుపు
కోల్‌కతా : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కోల్‌కతాలో సమావేశమై జట్టును ప్రకటించింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి విండీస్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌శర్మకు ఈ సిరీస్‌కు విశ్రాంతినిస్తారని భావించినా వన్డే, టీ20 జట్లకు ఎంపిక చేశారు. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మరో ఓపెనర్ శిఖర్ ధవన్ మాత్రం తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి వన్డే, టీ20ల్లోకి పునారగమనం చేశాడు. తాజాగా ప్రకటించిన వన్డే, టీ20 జట్టు వివరాలు.. టీమిండియా వన్డే జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియా టీ20 జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జనరల్ విభాగంలో 2,975 మంది విద్యార్థుల గైర్హాజరు విద్యారణ్యపురి : ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదనే నిబంధన విధించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 44,766 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండ గా 41,791 మంది హాజరయ్యూరని, 2,975 మంది పరీక్షకు రాలేదని ఇంటర్ విద్య ఆర్ఐవో షేక్ అహ్మద్ వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరంలో 5,382 మంది విద్యార్థులకు 4,6452 మంది హాజరుకాగా.. 730 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పలు చోట్ల హైస్కూళ్లలో కూడా పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఉదహరణకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హైస్కూల్లోను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో కొంత మంది విద్యార్థులను నేలమీద కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుండగా అక్కడికి వెళ్లి స్క్వాడ్ బృందం ఆర్ఐవో దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫర్నీచర్ సౌకర్యం కల్పించినట్లు ఆర్ఐవో వెల్లడించారు. కాగా, నేడు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నారుు.