జనరల్ విభాగంలో 2,975 మంది విద్యార్థుల గైర్హాజరు
విద్యారణ్యపురి : ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదనే నిబంధన విధించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకున్నారు. కొందరు విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 44,766 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండ గా 41,791 మంది హాజరయ్యూరని, 2,975 మంది పరీక్షకు రాలేదని ఇంటర్ విద్య ఆర్‌ఐవో షేక్ అహ్మద్ వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరంలో 5,382 మంది విద్యార్థులకు 4,6452 మంది హాజరుకాగా.. 730 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పలు చోట్ల హైస్కూళ్లలో కూడా పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
ఉదహరణకు మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ హైస్కూల్‌లోను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో కొంత మంది విద్యార్థులను నేలమీద కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుండగా అక్కడికి వెళ్లి స్క్వాడ్ బృందం ఆర్‌ఐవో దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆ కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫర్నీచర్ సౌకర్యం కల్పించినట్లు ఆర్‌ఐవో వెల్లడించారు. కాగా, నేడు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నారుు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 3 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement